అన్వేషించండి

Naga Panchami Serial Today March 29th Episode: ముత్తయిదువులా పంచమి ఇంటికి చేరుకున్న నాగేశ్వరి.. అమ్మ ప్రేమని మైమరిపిస్తున్న అత్త!

Naga Panchami Serial Today Episode పంచమిని కాలు కింద పెట్టనివ్వకుండా వైదేహి ప్రేమగా చూసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode: తన బిడ్డ గురించి కలలు కంటూ పెద్ద అయితే ఇలా పెంచుదాం అలా పెంచుదాం అని పంచమి, మోక్షలు మాట్లాడుకొని సంతోషంగా నవ్వుకుంటారు. నాగేశ్వరి పాము ఆ మాటలు విని అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంది. 

నాగేశ్వరి: పంచమి, మోక్షలు పుట్టబోయే బిడ్డ మీద ఇప్పటి నుంచే చాలా ఆశలు పెంచుకున్నారు. పుట్టగానే ఆ బిడ్డను నేను నాగలోకం తీసుకెళ్లడానికి ప్రాణం పోయినా ఒప్పుకోరు. అసలు ఆ విషయం వినగానే నన్ను చంపినా ఆశ్చర్యం లేదు. మా మహారాణి కోరిక నెరవేరాలి అంటే ఆ బిడ్డను నాగలోకం చేర్చక తప్పదు. నాగలోకం, నాగదేవత మహారాణి మళ్లీ నాగలోకం రానున్నారు అని చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. పంచమి మోక్షలను వాళ్ల ప్రేమను తలచుకుంటే నేను ఆ బిడ్డను తీసుకెళ్లలేను. కానీ తప్పదు ప్రాణం చంపుకొని అయినా ఆ బిడ్డను తీసుకెళ్లక తప్పదు. మీ పుణ్య దంపతులు నన్ను క్షమించాలి. 

మోక్ష: పంచమి నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి.
పంచమి: మోక్ష బాబు ఒక్కసారి మా అమ్మతో మాట్లాడిస్తారా..
మోక్ష: ఒక్కసారి ఎందుకు నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు మాట్లాడుకో. ఈ ఫోన్ నీ దగ్గరే ఉంచుకో.
పంచమి: నాకు ఈ ఫోన్‌తో పని ఉండదు. మీరే చేసి ఇవ్వండి. 

పంచమి తన తల్లి గౌరితో మాట్లాడుతుంది. తాను చాలా సంతోషంగా ఉన్నాను అని పెళ్లి అయిన తర్వాత మొదటి సారి సంతోషంగా ఉన్నాను అని అంటుంది. ఇక తనలోని విషం పోయిందని చెప్తుంది. తన అత్తామామలు తనని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అని పంచమి తల్లికి చెప్తుంది. తన కష్టం తన బిడ్డకు రాకూడదు అని చెప్తుంది. గౌరి కూతురికి ధైర్యం చెప్తుంది. 

మోక్ష పంచమిని కూర్చొపెట్టి తాగటానికి పాలు తసుకొని వస్తాడు. వైదేహి వచ్చి పాలలో కుంకుమ పువ్వు వేసి తాగిస్తుంది. జ్వాల, చిత్రలు షాక్ అయిపోతారు. 

వైదేహి: చూడు పంచమి ఈరోజు నుంచి నీకు అన్ని నేనే దగ్గరుండి చూసుకుంటా.
మీనాక్షి: ఏంటి వదినా ఈ ప్రేమ అంతా కోడలి మీద పుట్టబోయే బిడ్డ మీదా..
వైదేహి: చూడు నాకు కూతురు ఉంటే ఇలాగే చూసుకునేదాన్ని. ఇప్పుడు ఆ లోటు నాకు నా కోడలు తీర్చుతుంది. 
పంచమి: అత్తయ్య మిమల్ని చూస్తుంటే మా అమ్మ ప్రేమను మర్చిపోయేలా ఉన్నాను. అని హగ్ చేసుకుంటుంది. 
వైదేహి: నీకు ఇక్కడ ఏలోటు రానివ్వకుండా చూసుకుంటాను పంచమి. ఒకవేళ నీకు మీ అమ్మని చూడాలి అనిపించినా ఇక్కడికే పిలిపిస్తాడు. నిన్ను మాత్రం ఎక్కడికీ కాలు కదపనివ్వను.
పంచమి: నాకు ఈ ప్రేమ చాలు అత్తయ్య పండంటి బిడ్డను కని మీ చేతిలో పెడతాను.
రఘురాం: పంచమి మీ అత్తయ్య గారు పుట్టబోయే బిడ్డమీద ప్రేమతో ఇలా మాట్లాడుతున్నారు అని మాత్రం అనుకోవద్దు అమ్మ. నా భార్య నిజంగానే మారిపోయింది. 
మోక్ష: పంచమి మీ దగ్గర నుంచి కోరుకునేది ఈ ప్రేమే అమ్మ. ఆస్తి అంతస్తులు కాదు.  
జ్వాల: క్లైమాక్స్ ఎలా ఉంటుందో తెలీదు కానీ మీ ప్రేమలు చూస్తుంటే మాత్రం మంచి ఫ్యామిలీ మూవీ చూస్తున్నట్లు ఉంది.
మీనాక్షి: అవును మీరే విలన్స్. 
చిత్ర: అవును ఎవరు ఎలా మారుతారో చెప్పలేం. మొన్నటి వరకు పంచమికి వైదేహి అత్తయ్య దెయ్యం ఇప్పుడు  అమ్మలా కనిపిస్తుంది.  
వైదేహి: నా మార్పు పక్కన పెట్టండి మీరు పంచమికి ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. కడుపుతో ఉన్న అమ్మాయిని ఇబ్బంది పెట్టకండి. 

పంచమిని మోక్ష గదికి తీసుకెళ్లి సపర్యలు చేస్తాడు. ఇక పంచమి మోక్షతో మీ అందరి వాలకం చూస్తుంటే నాకు భయం వేస్తుందని అందరూ పుట్టబోయే బిడ్డ మీద చాలా ఆశలు పెంచుకుంటున్నారు అని నాకు సేవలు చేస్తున్నారు అని అంటుంది. మరీ ఇంత ప్రేమను తట్టుకోలేకపోతున్నా అని ఏదైనా జరగరానిది జరిగితే అని పంచమి భయపడుతుంది. మోక్ష పంచమికి ధైర్యం చెప్తాడు.

 మరోవైపు వైదేహి పంచమి, మోక్షలకు ముత్తయిదువులతో దీవించే పూజ ఫంక్షన్ ఏర్పాటు చేయిస్తుంది.  జ్వాల, చిత్రలు పంచమి కడుపు నుంచి పాలు పిల్ల పుడుతుంది అని అంటే నాగేశ్వరి పాము భుసలు కొడుతుంది. ఇద్దరూ భయపడతారు. తర్వాత పామును చూసి పరుగులు తీస్తారు. ఇక ముత్తయిదువులతో పాటు నాగేశ్వరి కూడా ముత్తయిదువులా వాళ్లతో కలిసి పోయి మోక్ష వాళ్ల ఇంట్లోకి వెళ్తుంది. మోక్ష పంచమి కోసం చీర సెలక్ట్ చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: సత్యభామ సీరియల్ మార్చి 29th: దమ్ముంటే టచ్ చేయ్, క్రిష్‌తో ఘోరంగా ప్రవర్తించిన సత్య - కొడుకు మాటలు భైరవి నమ్మేసిందా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి  లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
Lakshmi Arrest: కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
KTR Visits Chilukuru Temple: చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
Vishwaksen: 'మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు' - 'బాయ్ కాట్ లైలా' స్పందించిన మూవీ టీం, సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్
'మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు' - 'బాయ్ కాట్ లైలా' స్పందించిన మూవీ టీం, సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Madhya Pradesh Dhar Gang Arrest | 55కేసులున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు | ABP DesamBaduguvani Lanka Nurseries | గోదావరి తీరంలో ఈ ఊరి పూలతోటల అందాలు చూశారా | ABP DesamElon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP DesamKiran Royal Janasena Issue | వివాదంలో చిక్కుకున్న తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: శ్రీవారి  లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
Lakshmi Arrest: కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
KTR Visits Chilukuru Temple: చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
Vishwaksen: 'మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు' - 'బాయ్ కాట్ లైలా' స్పందించిన మూవీ టీం, సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్
'మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు' - 'బాయ్ కాట్ లైలా' స్పందించిన మూవీ టీం, సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్
Ram Gopal Varma: సీఐడీతోనే గేమ్సా ? - రామ్ గోపాల్ వర్మ పరిస్థితేంటి ?
సీఐడీతోనే గేమ్సా ? - రామ్ గోపాల్ వర్మ పరిస్థితేంటి ?
UK : యూకేలో అక్రమంగా పని చేస్తున్న వారందరికీ  బ్యాడ్ న్యూస్ - అమెరికా తరహాలో గెంటేయాలని ప్రధాని స్టార్మర్ నిర్ణయం
యూకేలో అక్రమంగా పని చేస్తున్న వారందరికీ బ్యాడ్ న్యూస్ - అమెరికా తరహాలో గెంటేయాలని ప్రధాని స్టార్మర్ నిర్ణయం
Junior NTR: పాప్ సింగర్ ఎడ్ షీరన్ నోట 'చుట్టమల్లే' సాంగ్ - ఇది నిజంగా ప్రత్యేకమంటూ స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
పాప్ సింగర్ ఎడ్ షీరన్ నోట 'చుట్టమల్లే' సాంగ్ - ఇది నిజంగా ప్రత్యేకమంటూ స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
Pawan Hindutva Tour: పవన్ కల్యాణ్ మిషన్ దక్షిణాది స్టార్ట్ - ఆలయాల సందర్శన ఎప్పటి నుంచంటే ?
పవన్ కల్యాణ్ మిషన్ దక్షిణాది స్టార్ట్ - ఆలయాల సందర్శన ఎప్పటి నుంచంటే ?
Embed widget