అన్వేషించండి

Naga Panchami Serial Today March 16th: 'నాగ పంచమి' సీరియల్: మహాంకాళి మాటలకు కుప్పకూలిన కరాళి.. పంచమి గర్భంలోకి మహారాణి ఆత్మ ప్రవేశిస్తుందా!

Naga Panchami Today Episode మోక్ష, పంచమి శారీరకంగా కలవడంతో పంచమి గర్భంలోకి మహారాణి ఆత్మ ప్రవేశిస్తాను అని చెప్పడంతో ఇవాళ్లి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode: కరాళికి మహాంకాళి దర్శనం ఇస్తుంది. కరాళి ముఖంలో ఆవేదన కనిపిస్తోంది అని అందుకు కారణం ఏంటని ప్రశ్నిస్తుంది మహాంకాళి. అందుకు కరాళి తనకు అన్యాయం జరిగిపోయింది అని పంచమి, మోక్ష శారీరకంగా కలిసిపోయారు అని మహాంకాళికి చెప్పి బాధపడుతుంది. మరో వైపు వీరి సంభాషణ నాగేశ్వరి పాముగా మారి చాటుగా వింటుంది.

మహాంకాళి: అంటే కఠిన బ్రహ్మచారిగా ఉన్న మోక్ష సంసారిగా మారాడు. అంటే ఇక మోక్ష బలివ్వడానికి పనికిరాడు.
కరాళి: అసలిప్పుడు మోక్ష ప్రాణాలతో లేడు మాతా. పంచమి విష కన్య తనని కలవగానే మోక్ష విషతుల్యం  అయి మరణించాడు. 
మహాంకాళి: మృత్యువుతో నీకు పనిలేదు కరాళి. మోక్ష మరణించినా ప్రాణాలతో ఉన్నా నీకు అనవసరం. నువ్వు తలపెట్టిన బలి కార్యానికి ఇక మోక్ష పనికి రాడు. నీ మాట ప్రకారం నువ్వు బలి ఇవ్వలేకపోయావు కాబట్టీ నేను నీకు శక్తులు ఇవ్వలేను. 
కరాళి: తల్లి నిన్నే నమ్ముకున్నాను. ఆ పంచమి భర్తను బతికించుకుంటాను అని శివయ్య దగ్గర పూజలు చేయాలి అని మోక్ష శరీరాన్ని వాళ్ల గ్రామానికి తీసుకెళ్లింది. పంచమి గెలిచి నేను ఓడిపోతే ఆ బాధ నేను భరించలేను.
మహాంకాళి: పెరుగుట విరుగుట కొరకే కరాళి. నీ అత్యాశే నీ దుఃఖానికి కారణం. నువ్వు సంపాదించుకున్న శక్తులతో సంతృప్తి చెందక ఆ నాగమణిని సంపాదించాలి అనే అత్యాశతో నీ దగ్గర ఉన్న శక్తులు కూడా పోగొట్టుకున్నావ్. 
కరాళి: నాకు మీరే దిక్కు తల్లి నాకు శక్తులు కావాలి అందుకు మీరే ఏదైనా మార్గం చెప్పాలి. 
మహాంకాళి: నువ్వు మీ అన్నని కాపాడుకోవాలి అని నీ శక్తులు పోగొట్టుకున్నావు. వాటిని తిరిగి పొందలేవు. నేను ప్రసాదించలేను. నీ తలరాతకు నువ్వే కారణం కరాళి. నీ భవిష్యత్ నువ్వే నిర్ణయించుకో.. అంటూ మహాంకాళి మాయం అయిపోతుంది.

మరోవైపు పంచమి వాళ్లు మోక్ష శరీరాన్ని నాగులావరంలోని శివయ్య ముందు ఉంచుతారు. మోక్షని బతికించాలి అని అందరూ వేడుకుంటారు. పంచమి శివయ్య ముందు కూర్చొని ఏడుస్తుంది. ఇక పంచమి తల్లి పంచమితో అమ్మా నువ్వు ఏం పాపం చేశావమ్మా నీకే ఇలా జరుగుతుంది అని అంటుంది. ఇక ఏడుస్తూ తన అల్లుడిని కాపాడమని వేడుకుంటుంది. 

పంచమి: పంతులుతో.. స్వామి నేను ఈ గుడిలోనే పుట్టాను. నా శివయ్య నాకు అన్యాయం చేయడు. నా పసుపుకుంకుమలు కాపాడమని పూజలు చేయండి స్వామి. ఇక అందరూ ఓం నమః శివాయ అని స్వామిని వేడుకుంటారు.

భార్గవ్: ఇంటి దగ్గర ఆరుబయట కూర్చొని ఏడుస్తూ.. పాపం అన్నయ్య మోక్ష వాడికే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు.
వరుణ్: ఏడుస్తూ.. వాడిని ఈ పరిస్థితిలో చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది.
భార్గవ్: ఇంట్లో ఇంత మంది ఉన్నాం ఆ దేవుడకి కావాలి అంటే మనల్ని తీసుకెళ్లిపోయినా బాగుండేది. అని గట్టిగా ఇద్దరూ ఏడుస్తారు. 
జ్వాల: ఏంటో చిత్ర వీళ్ల వాలకం చూస్తుంటే శవాన్ని లేపేలానే ఉన్నారు.
వరుణ్‌:  అసలు మీకు సెంటిమెంట్స్ లేవా. 
చిత్ర: ఎందుకు లేవు. పంచమి వెళ్లింది కదా మోక్షని బతికించేస్తా అని ఒకవేళ మోక్ష చనిపోతే బాడీ తీసుకొచ్చిన తర్వాత మేం ఎలా ఏడుస్తామో  మీరే చూడండి. 
భార్గవ్: అంతే కానీ మోక్ష బతికి రావాలి అని మాత్రం కోరుకోరు.
జ్వాల: మీరిద్దరూ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. మోక్ష బతికి తిరిగి వస్తాడు అని మీ ఇద్దరికీ నమ్మకం ఉందా..
చిత్ర: మీకే నమ్మకం లేనప్పుడు మేం ఎలా నమ్ముతాం.
వరుణ్: ఒక్కోసారి మిరాకిల్ జరగొచ్చు. 

నాగేశ్వరి: మహారాణి ఆత్మతో.. మీకు శుభవార్త.. మీ కోరిక నెరవేరే మార్గం దొరికింది. కరాళి ద్వారా నాకు ఈ వార్త తెలిసింది. యువరాణి పంచమి భర్త మోక్ష శారీరకంగా కలిశారు. 
మహారాణి: మరి మోక్షకు ఏం కాలేదా.
నాగేశ్వరి: అనుకున్నట్లే మోక్ష విషపూరితం అయ్యాడు మహారాణి. మీరు జన్మనిచ్చిన శివాలయంలోనే మీ కూతురు పెరిగి పెద్దదయ్యింది. ఆ శివయ్యే తన భర్తను కాపాడుతాడు అని మోక్షని అక్కడికి తీసుకెళ్లింది. 
 మహారాణి: భర్త మరణాన్ని నా కూతురు పంచమి భరించగలదా పంచమి. పంచమి ఆ శివయ్యేనే తన తండ్రిగా భావించుకొని ఆయన్నే నమ్ముకొని పెరిగింది. పంచమికి శివయ్య అంటే అపారమైన నమ్మకం. 
మహారాణి: తన భర్త బతికి నా కూతురు సంతోషంగా ఉండాలి నాగేశ్వరి.
నాగేశ్వరి: ఆ కరాళి నుంచి పంచమికి ముప్పు ఇంకా పోలేదు మహారాణి. కరాళి దగ్గర చాలా శక్తులున్నాయి. ఇప్పుడు కరాళి ఆశ్రమంలోనే ఉంది. అందుకే నేను ఆ గ్రామానికి వెళ్లి పంచమికి రక్షణ కల్పించాలి.
మహారాణి: త్వరగా వెళ్లు నాగేశ్వరి. 
నాగేశ్వరి: అలాగే మహారాణి. ఇప్పుడు మీ ఆత్మను ఆవాహనం చేసుకోవడానికి ఓ ముఖ్యమైన కారణం ఉంది. భార్యభర్తలు శారీరకంగా కలిశారు కాబట్టి మీరు మీ బిడ్డ గర్భంలో ప్రవేశించే అవకాశం ఉంది. 
మహారాణి: చాలా సంతోషకరమైన వార్త చెప్పావు. నాకు ఆ అదృష్టం కల్పించావు. నా బిడ్డను కళ్లారా చూసుకునే అవకాశం కూడా లేకుండా కళ్లు చనిపోయాను. ఒక తల్లిగా నా కూతురు ఆలనాపాలనా చూసుకోలేకపోయాను. కనీసం నా కూతురి ఒడిలో పెరిగే భాగ్యం అయినా నాకు ఇవ్వు. 
నాగేశ్వరి: నేను ఊరు వెళ్లి అక్కడ మిమల్ని ఆవాహనం చేసుకొని మీ కూతురు గర్భంలో మిమల్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తాను. 

మరోవైపు నాగలోకంలో శివుడి పూజలు నాగదేవత హయాంలో జరుగుతాయి. ఇక మోక్షని శివయ్య ఎదురుగా ఉంచి శివుడికి పూజలు చేస్తారు. శివుడికి హారతి ఇచ్చి దాన్ని తీసుకొచ్చి పంచమి మోక్షకు ఇస్తుంది.

రఘురాం: కోపంతో.. పంచమి ఆ శివయ్య మీద భారం వేసి నీ భర్తను నువ్వు కాపాడుకుంటాను అన్నావు. ఆ శివయ్య కాపాడుతాడు అని మమల్ని అందర్ని ఇంత దూరం తీసుకొచ్చావు. నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు పంచమి. నీ భర్త ప్రాణాలు ఎవరూ కాపాడలేవు అని ఆ డాక్టర్‌ చెప్పారు. మోక్ష చనిపోతాడో బతుకుతాడో తెలీని పరిస్థితిలో ఉన్నాం. నాకు ఇంతకు ముందు నీ మీద నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు నువ్వు చేసిన పిచ్చి పని చూస్తేంటే మా మోక్ష మాకు దక్కుతాడు అనే నమ్మకం కలగడం లేదు. 
పంచమి: మామయ్య మీరు అంత మాట అనొద్దు. నన్ను నమ్మండి. నా భర్త ప్రాణాలతో బతుకుతారు అనే నమ్మకంతో తీసుకొచ్చాను.
రఘురాం: ఇప్పుడు దాకా నీ మీద ఉన్న నమ్మకంతో మేం ఓర్పుతోనూ సహనంతోనూ ఉన్నాం. కానీ నువ్వు ఇప్పుడు చేసే పనులు చూస్తుంటే నమ్మకం పోతుంది. నిజంగానే నా కొడుకు బతుకుతాడు అంటావా. ఇక పంచమి తల్లి గౌరి కలగజేసుకొని పంచమి భర్తను ఆ శివయ్యే కాపాడుతాడు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కృతి కర్బంద‌: పెళ్లి పీటలు ఎక్కిన 'తీన్‌మార్‌' హీరోయిన్‌ కృతి కర్బంద‌ - ఫోటోలు వైరల్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election Bill: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
US Latest News: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Tirumala News: వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
Embed widget