Naga Panchami Serial Today January 11th Episode - 'నాగ పంచమి' సీరియల్: మోక్షని పగతో కాటేసిన పంచమి పాము - నాగలోకం వెళ్లిన యువరాణి, రాజు!
Naga Panchami Serial Today Episode పాముగా మారిన పంచమి తన భర్త మోక్షని కాటేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode: పంచమి పాము అని తాను మోక్షని బతకనివ్వదని జ్వాల, చిత్రలు ఇంట్లో వాళ్లకి చెప్తారు. ఇక కంగారు పడిన వైదేహి పంచమి, మోక్షని వెతికి మోక్షని ఎలా అయినా తీసుకొచ్చేద్దామని అంటుంది. రేపటి వరకు చూసి రాకపోతే అది పని చేద్దామని మోక్ష తండ్రి అంటారు.
చిత్ర: అక్కా నువ్వు చెప్తే దాని ప్రకారం మోక్ష తిరిగి రావడం కష్టం. వీళ్లకి మాత్రం ఆశ చావడం లేదు.
జ్వాల: ప్రాణం ఉంటుంది అన్న నమ్మకం లేకపోయినా శవం దగ్గర నారాయణ నారాయణ అంటూ పిలవడం తప్పా ఎవరైనా బతికి లేచొచ్చిన దాఖలాలు ఉన్నాయా.. వీళ్ల ఆశలు కూడా అంతే.
చిత్ర: అయితే ఈ ఆస్తి రెండు భాగాలు అని మనం అనుకోవచ్చా..
నాగసాధువు: దంపతులు ఇద్దరూ కలిసి వచ్చారు అంటే ఏదో ముఖ్యమైన కార్యం తలపెట్టే వచ్చుంటారు. నా దగ్గర సంషయించక్కర్లేదు. మీ గురించి పూర్తిగా తెలిసిన వాడిని. సమస్య ఏదైనా మీ శ్రేయాభిలాషిగా నాకు తెలిసిన పరిష్కారం చెప్తాను.
పంచమి: మా ఇద్దరి జీవితాలు చరమాకదశకు చేరుకున్నాయి స్వామి. ఏదో ఒకటి చేసి తీరాల్సిన సమయం వచ్చి తీరింది. ఇక ఏ మాత్రం ఊపిరాడని సమయంలో ఒక కఠినమైన పరిష్కారాని సిద్ధపడ్డాం స్వామి అందుకు మీ సహాయ సహకారాలు చాలా అవసరం స్వామి.
నాగసాధువు: ఒక నాగకన్యను సాయం చేయగలిగితే నాగసాధువుగా అది నా అదృష్టంగా భావిస్తాను.
మోక్ష: నా జాతకంలో ఉన్న నాగగండం మృత్యు రూపంలో నా దగ్గరకు వచ్చేసింది స్వామి. ఇక నేను తప్పించుకోవాల్సిన అవకాశం కానీ.. నా ప్రాణాల మీద నాకు ఆశ కానీ లేవు స్వామి. అందుకే పంచమి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.
నాగసాధువు: మహా మృత్యుంజయ యాగం వలన పోయినసారి గండం నుంచి బయట పడ్డారు. కాచుకొని ఉన్న శత్రువు నుంచి నిర్ణయించబడిన మృత్యువు నుంచి తప్పించుకోవడం అన్ని వేళలా జరగదు.
పంచమి: నాగరూప యువరాజు ఫణేంద్ర రూపంలో ఆ గండం నుంచి బయట పడటానికి నా భర్తకు ఓ అవకాశం వచ్చింది స్వామి. నాగదేవత ఆజ్ఞతో మోక్షాబాబుని కాటేయడానికి వచ్చిన ఫణేంద్ర నేను వేడుకోవడంతో నా భర్తకు తిరిగి ప్రాణం పోయడానికి సాయం చేస్తాను అని ఒప్పుకున్నాడు స్వామి. నేను పాముగా మారి మోక్షాబాబుని కాటేసి తనతో నాగలోకం వెళ్తే అక్కడున్న నాగమణిని తెచ్చి నా భర్తని తిరిగి బతికించొచ్చు అని నమ్మకంగా చెప్తున్నాడు స్వామి.
నాగసాధువు: నాగకన్యలు నాగరాజులు మాట ఇస్తే నమ్మొచ్చు. కానీ నాగమణి విషయంలోనే నాకు సందేహంగా ఉంది. భౌతికకాయం భద్రంగా ఉంటే నాగమణితో బతికించడం అతిశయోక్తి కాదు. నాగమణి శక్తి మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. కానీ నాగలోకం నుంచి నాగమణిని తీసుకురావడం అసంభవం అని నా అభిప్రాయం. నాగమణి చాలా ప్రవిత్రమైనది. నాగలోకాని శక్తిని ప్రసాదించే ఆయువుపట్టు. అంత సులభంగా తీసుకురావడం ఆలోచించాల్సిన విషయం. నిజంగా ఆ ఫణేంద్ర మీకు సాయం చేయాలి అనుకుంటే నాగలోకంలో దొరికే నాగ చంద్రకాంత మొక్క తీసుకొస్తే చాలు. ఇష్టరూప జాతి విషానికి విరుగుడుగా అదొక్కటే పనిచేస్తుంది.
పంచమి: ఆ విషయం కూడా చర్చించాం స్వామి. నాగచంద్రకాంత మొక్క ప్రాణంపోతే బతికించడానికి పనికిరాదు అన్నారు.
నాగసాధువు: నిజమే.. కానీ ఇష్టరూపదారి నాగు విషం తలకెక్కి వెంటనే చనిపోకుండా మూలికలతో కొంత సమయం వరకు కాపాడొచ్చు. ఆలోగా ఆమొక్క తీసుకురాగలిగితే చాలు. నాగమణిని తీసుకురావడం కన్నా నాగచంద్రకాంత మొక్కను తీసుకురాగలగడం చాలా సులభం. మీరే ఆలోచించి ఒక నిర్ణయానికి రండి..
నాగదేవత: ఇచ్చిన మాట తప్పావు యువరాజా.. కార్యం పూర్తి చేసుకొని నిన్నరాత్రి వస్తాను అని వాగ్దానం చేశావు. కానీ కనీసం కారణం కూడా చెప్పలేదు.
ఫణేంద్ర: క్షమించండి మాతా నా శాయశక్తులా ప్రయత్నించాను. చివరి నిమిషంలో కార్యం విఫలం అయింది.
నాగదేవత: నిన్ను నమ్మి యువరాణికి ఇష్టరూప శక్తులు ఇచ్చాను. కార్యం పూర్తికాకపోతే ఆ శక్తులు దుర్వినియోగం అవుతాయి. యువరాణి రాక ఇంకా ఆలస్యం అవుతుంది అనుకుంటే ఆ శక్తులను నేను వెనక్కి తీసుకుంటా యువరాజా.
ఫణేంద్ర: లేదు మాతా ఈ ఒక్కరాత్రికి అవకాశం ఇవ్వండి. ఎలా అయినా యువరాణిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతా.
నాగదేవత: అలా జరగకపోతే యువరాణి శక్తులు వెనక్కి తీసుకుంటా. నిన్ను కూడా కఠినంగా శిక్షిస్తాను.
అడవిలో మోక్ష, పంచమి, నాగసాధువు, ఫణేంద్ర, మేఘన ఓ చోట చేరుతారు. మోక్ష కింద పడుకుంటాడు. పంచమిని కాటేయమని ఫణేంద్ర చెప్తాడు. ఆలస్యం చేయొద్దు అని మోక్షాబాబుని మేం కాపాడుతామని మేఘన చెప్తుంది. ఇక పంచమి దేవుణ్ని దండం పెట్టుకొని పాములా మారుతుంది. మోక్ష కాలిపై గట్టిగా కాటేస్తుంది. మోక్షనొప్పితో విలవిల్లాడిపోతాడు. ఇక పంచమి పాము నుంచి మనిషిగా మారి తన భర్త దగ్గరకు వెళ్లి క్షమించాలి అని ఏడుస్తూ వేడుకుంటుంది. ఇక నాగసాధువు ఏం భయపడకమ్మా మేం అంతా ఉన్నామని ధైర్యం చెప్తారు. ఇక పంచమి, ఫణేంద్రలు పాముగా మారి నాగలోకం బయల్దేరుతారు. మరోవైపు నాగసాధువు మోక్ష కాలికి గట్టిగా కట్టుకడతారు. కళ్లు మూయొద్దని మోక్షకి చెప్తారు. మేఘన మోక్షకి ధైర్యం చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: బైక్‌పై కృష్ణతో మురారి రొమాన్స్ - ప్రామిస్ చేసిన ముకుంద!