Naga Panchami Serial Today February 5th: మేఘనను కాటేసిన ఫణేంద్ర పాము.. మోక్షని కరాళి చేతిలో పెట్టిన పంచమి!
Naga Panchami Serial Today Episode మేఘననే కరాళి అని గుర్తించని పంచమి మోక్షని పెళ్లి చేసుకోమని మాట తీసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారంది.
Naga Panchami Today Episode మేఘన ఏడుస్తూ కరాళి తనని కిడ్నాప్ చేసిందని పంచమి, ఫణేంద్రలను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. తనని అడ్డుపెట్టుకొని తన తల్లిదండ్రులను తన కళ్లముందే రాళ్లుగా మార్చేసింది అని చెప్తుంది. మేఘన మాటలు నమ్మని ఫణేంద్ర అంతా అబద్ధమని అంటాడు. మనల్ని నమ్మంచాలి అని మేఘన ఏదో కట్టుకథలు చెప్తుంది అంటాడు.
పంచమి: ఆ కరాళి గురించి నాకు తెలుసు ఫణేంద్ర. మన నాగేశ్వర్‌ని కూడా రాయిగానే మార్చేసింది.
మేఘన: మనసులో.. పంచమి నమ్మేసింది ఇంకేం పర్లేదు..
పంచమి: రాళ్లుగా ఎక్కడ మార్చేసింది.
మేఘన: ఆ ప్రదేశం ఎక్కడో తెలీదు కానీ అడవి మధ్యలో ఉంటుంది. అక్కడ పెద్ద కాళికా ఉండటం చూశాను.
పంచమి: అర్థమైంది మేఘన.. కానీ నువ్వు మా మధ్యకు ఎందుకు వచ్చావ్.
మేఘన: తాను చెప్పినట్లు చేయకపోతే నా తల్లిదండ్రులను చంపేస్తాను అంది. మీ గురించి నాకు మొత్తం చెప్పి నాగకన్యగా మీ దగ్గరకు పంపించింది. మోక్షకి పాము కాటేసినప్పుడు కూడా కరాళినే నాకు ఓ మొక్క తీసుకొని వచ్చి ఇచ్చింది. నేను ఆ ఆకుల పసురు తీసుకొచ్చి మోక్షని బతికించాను. ఇప్పుడు నేను మోక్షని పెళ్లి చేసుకొని ఆ రోజే కరాళికి అప్పగించాలి అంట.
పంచమి: ఇప్పుడు కరాళి ఎక్కడ ఉంది.
మేఘన: ఇంతకు ముందు వరకు ఆశ్రమంలో నా దగ్గరే ఉంది. వెళ్లి మోక్షని పెళ్లి చేసుకొని తీసుకొని రా అని వెళ్లిపోయింది.
ఫణేంద్ర: అయితే నువ్వు నాగకన్యవి కాదు అంటావ్..
మేఘన: అలాంటి వాళ్లు ఉంటారు అని కూడా నాకు తెలీదు.
ఫణేంద్ర: అయితే ఒక చిన్న పరీక్ష పెడతాను. నాగకన్యలకు పాముల విషం ఎక్కదు. నేను పాముగా మారి నిన్ను కాటేస్తా.. నువ్వు బతికితే నాగకన్యవి.
పంచమి: వద్దు ఫణేంద్ర తను నాగకన్య కాకపోతే చనిపోతుంది కదా..
మేఘన: పర్వాలేదు పంచమి.. నేను ఎలాగూ చనిపోవాలి అనుకుంటున్నాను. ఫణేంద్ర నేను సిద్ధమే.. మనసులో.. పంచమి నన్ను పూర్తిగా నమ్మేసింది ఫణేంద్ర నన్ను కాటేస్తా అంటే ఒప్పుకోదు.
ఫణేంద్ర: నాకు ఇంకా అనుమానంగానే ఉంది పంచమి. ఒక పని చేస్తాను విషం ఎక్కవ లేకుండా చిన్నగా కాటేస్తా.. తనకు విషం రక్తంలోకి వెళ్తుంది అని తెలిస్తే నేను ఆ విషం లాగేస్తా ప్రాణాలు పోవు. భయపడకు పంచమి మన అనుమానం తీరాలి అంటే తప్పదు.
మేఘన: మనసులో.. నమ్మించాలి అంటే కొన్ని పరీక్షలు ఎదుర్కొక తప్పదు.
ఫణేంద్ర పాములా మారి మేఘన చేతిపై కాటేస్తాడు. మేఘన నొప్పి అని ఏడుస్తుంది. చేయి మొత్తం నీలంగా మారుతుంది. దీంతో ఫణేంద్ర పాము మళ్లీ విషాన్ని లాగేస్తాడు. దీంతో మేఘన నాగకన్య కాదు అని ఫణేంద్ర అంటాడు.
పంచమి: ఆ కరాళి గురించి నాకు పూర్తిగా తెలుసు. దాన్ని నేను చూసుకంటా.. నువ్వు మోక్షాబాబుని పెళ్లి చేసుకోవాలి మేఘన.
మేఘన: ఇది మరీ దారుణం పంచమి.. నీ భర్తని నేను పెళ్లి చేసుకోవాలా..
పంచమి: అవును మేఘన నేను నాగకన్య అని నీకు తెలుసు. మేం కలిసి ఉండలేం. మా గురించి నీకు బాగా తెలుసు. మోక్ష బాబుకి నువ్వు అయితే బాగా చూసుకుంటావ్. నువ్వు మోక్షని పెళ్లి చేసుకుంటే మా ఇద్దరికీ మేలు చేసిన దానివి అవుతావ్. మీ అమ్మనాన్నలను కాపాడే బాధ్యత నాది.
మేఘన: ఒక్కటి మాత్రం చేయగలను పంచమి. నువ్వు మోక్ష కలవాలి అన్నదే నా ఆశ. మీ ఇద్దరూ కలిసేంత వరకు వాళ్ల అమ్మగారు మోక్షకి ఎవ్వరితోనూ పెళ్లి చేయకుండా తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మాత్రం ఆపగలను. ప్రస్తుతం నేను తనకి అదే ఆలోచన చెప్పి వాళ్ల అమ్మగారిని నమ్మించాను.
పంచమి: అదే నిజం చేయాలి మేఘన. లేదంటే మోక్షాబాబు నన్ను మర్చిపోలేక పిచ్చివాడైపోతాడు. మోక్షని నువ్వే కాపాడగలవు. దయచేసి ఈ సాయం చేయు మేఘన.
మోక్ష: ఎన్ని చేసినా ఎంత చెప్పినా పంచమి వచ్చేలా లేదు. నిశ్చితార్థం అయిన తర్వాత పరిస్థితి నా చేతులో ఉండదు. చావడానికి సిద్ధపడి అయినా సరే మమ్మీ నా పెళ్లి చేస్తుంది. మేఘనా ఒక్క నిమిషం.. నీతో అర్జెంట్‌గా మాట్లాడాలి మేఘన. పరిస్థితి అంతవరకు రానివ్వకూడదు వెంటనే నిశ్చితార్థం ఆపేయాలి.
మేఘన: ఎలా.. చెప్పు మోక్ష ఎలా ఆపగలం..
మోక్ష: ఈపెళ్లి ఇష్టం లేదు అని మా అమ్మకి చెప్పు.
మేఘన: తర్వాత.. నిశ్చితార్థం ఆగిపోతుంది మోక్ష కానీ నీ పెళ్లి ఆగదు కదా.. నేను కాకపోతే మరొకరితో జరిపిస్తారు మీ అమ్మగారు. నిశ్చితార్థం అవ్వగానే పెళ్లి అయిపోయినట్లు కాదు మోక్ష. పంచమిని ఒప్పించడానికి నీకు పెళ్లి వరకు టైం ఉంటుంది.
మోక్ష: అంటే నీ ఉద్దేశం ఏంటి మేఘన మన పెళ్లి జరగాలి అని కోరుకుంటున్నావా..
మేఘన: నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది.
మోక్ష: పంచమి మనసు మార్చకోకుండా పెళ్లి వరకు రాకపోతే అప్పుడు నేను నీకు పెళ్లి చేసుకోక తప్పదు కదా. అదే నీ ఆశనా..
మేఘన: నన్ను నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్ మోక్ష. నేను కేవలం పంచమిని నిన్ను కాపాడటం కోసం నా పరువుని పణంగా పెట్టి ఈ పెళ్లికి ఒప్పుకున్నా. పీటల మీద పెళ్లి ఆగిపోతే తిరిగి నన్ను ఎవరూ పెళ్లి చేసుకోరు అనే భయం కూడా నీకు అక్కర్లేదు. నా ఫ్రెండ్ పంచమి కోసం నేను ఆ త్యాగానికి సిద్ధంగా ఉన్నాను. మీ అమ్మని నేను ఒప్పిస్తా మోక్ష. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తే ఎవరూ బలవంతంగా నా మెడలో తాళి కట్టించే సాహసం చేయలేరు. ఇంకేం ఆలోచించకు మోక్ష నన్ను నమ్ము.
మోక్ష: పంచమి వస్తుందని నమ్మకం రోజు రోజుకూ తగ్గిపోతుంది మేఘన. మరోవైపు మోక్ష తనకు దూరం కాకుండా చూసుకోవాలి అని మేఘన అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 5th: మురారికి ప్రమాదమని భయపడుతున్న కృష్ణ.. గుడికి పరుగులు!