అన్వేషించండి

Naga Panchami Serial Today April 9th: 'నాగ పంచమి' సీరియల్: భార్యకు ప్రేమగా మామిడి కాయలు తినిపించిన మోక్ష.. పంచమి గర్భం తొలగించేస్తానన్న వైదేహి!

Naga Panchami Serial Today Episode పంచమి కడుపులో బిడ్డ వల్ల ఇంట్లో వాళ్లకి ప్రమాదమని భావించిన వైదేహి గర్బం తొలగించేస్తానని భర్తతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode వైదేహి పంచమిని నిలదీస్తుంది. దీంతో పంచమి నాగేశ్వరితో ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్తాననుకుంటుంది. ఇక వైదేహి సోది చెప్పినామె మాటలు నిజమవుతాయేమో అని భయంగా ఉందని.. ఇంట్లో ఎవరికి ఏ హాని జరిగినా అందుకు నీ కడుపులోని బిడ్డే కారణం అవుతుంది అని నేను భావించాల్సి వస్తుందని వైదేహి అంటుంది. అందుకు చివరి అవకాశంగా ఈ ఇంట్లో పాము కనిపించకూడదని వైదేహి అంటుంది. 

మరోవైపు జ్వాల పాములోడిని తీసుకొని వస్తుంది. చిత్రను పిలుస్తుంది. ఇద్దరూ పాములోడి దగ్గరకు వెళ్తారు. ఆయన రెండు పాములను వెంట తీసుకొని వస్తాడు. ఆ పాములు చెప్పినట్లు వింటాయని అంటాడు. వాటిని చూసి ఇద్దరూ భయపడతారు. పని అయిపోయిన తర్వాత పాముల్ని వచ్చి తీసుకెళ్లాలని చెప్తుంది జ్వాల. ఇద్దరు తోటికోడళ్లు ఇంట్లో ఎవరూ చూడకుండా పాముల్ని తీసుకొని వెళ్లి ఓ గదిలో దాచి పెడతారు. 

మరోవైపు మోక్ష పంచమిని తీసుకొని బయటకు వస్తాడు. రోడ్డు పక్కన కారు ఆపి పంచమిని కూర్చొపెడతాడు. పంచమికి సర్‌ఫ్రైజ్ ప్లాన్ చేస్తాడు. పంచమితో నువ్వు ఏం తినాలి అనుకుంటున్నావో అది నేను తీసుకొస్తా అంటాడు. పంచమి చెప్పకుండా మీరే నాకు ఏం ఇష్టమో తెలుసుకోండి అంటుంది. దీంతో మోక్షసరే అని ఓ బుట్ట ప్యాకింగ్ తీసుకొచ్చి పంచమి చేతిలో పెడతాడు. పంచమి ఓపెన్ చేసి అందులో మామిడి కాయలు చూసి షాక్ అయిపోతుంది. సంతోషంగా భర్తను హగ్ చేసుకుంటుంది. మోక్ష దగ్గరుండి పంచమికి మామిడి కాయ కట్ చేసి తినిపిస్తాడు. ఇద్దరూ సంతోషంగా గడుపుతారు. ఆ సీన్స్‌ను మోక్ష ఫొటోలు తీసుకుంటాడు. 

మోక్ష: పంచమి నీకు ఇష్టమైంది తెచ్చాను నాకు ఇష్టమైంది ఇవ్వాలి కదా.
పంచమి: ఇక్కడా..
మోక్ష: హలో మేడం నేను ముద్దు అడుగుతున్నాను అని ఫీలవుతున్నారా.. నాకు కామన్ సెన్స్ ఉంది. నేను అది అడగడం లేదు. నువ్వు నాతో కలిసి డ్యాన్స్ చేయాలి.
పంచమి: నేనా నాకు సిగ్గు చేయను బాబు.
మోక్ష: రోజూ నాతో డ్యాన్స్ చేస్తే నీకు నార్మల్ డెలివరీ అవుతుంది అని డాక్టర్ చెప్పారు. రా అంటూ ఇద్దరూ డ్యాన్స్ చేస్తారు. మోక్ష పంచమిని ఎత్తుకొని తిప్పుతాడు. 

వైదేహి: ఆ సోది చెప్పిన ఆవిడ మాటలు పదే పదే వినిపిస్తున్నాయి అండీ అది తలచుకుంటేనే భయంగా ఉంది. 
రఘురాం: వైదేహి బతుకు తెరువు కోసం ఎవరు ఏవేవో చెప్తారు. అవన్నీ నమ్మకు.
వైదేహి: మన కోడలు గర్భవతి అని ఆ సోదమ్మకు ఎలా తెలుస్తుంది అండి. నేను మాత్రం ఆ మాటలు గట్టిగా నమ్ముతున్నా అండీ. నాకు పంచమి మీద ఎలాంటి కోసం లేదండి. కానీ తనకు పుట్టుబోయే బిడ్డ కారణంగా మన మోక్షకు ప్రాణ గండం ఉంటుంది అంటే నేను జీర్ణించుకోలేకపోతున్నా. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. పంచమికి గర్భం తీయించేస్తానండి. 
రఘురాం: వైదేహి..
వైదేహి: మరో మార్గం కనిపించడం లేదండి. మన మోక్ష క్షేమంగా ఉండాలి అంటే మరో మార్గం కనిపించడం లేదు.
రఘురాం: నువ్వు చాలా దారుణంగా మాట్లాడుతున్నావ్ వైదేహి. గర్భం తీయించడం అంటే ఒక ప్రాణాన్ని భూమ్మీదకు రాకుండా చేయడమే.
వైదేహి: మాకు మా కొడుకు ముఖ్యం.
శబరి: మోక్ష మీద మాకు ఎవ్వరికీ ప్రేమ లేనట్లు మాట్లాడకు వైదేహి.
వైదేహి: ఉంటే మీరు ఇలా మాట్లాడరు. ఆ సోదమ్మ మాటలు విని మీరు ఇలా మాట్లాడటం నాకు నచ్చడం లేదు.
రఘురాం: అవన్నీ మూఢనమ్మకాలు వైదేహి.
వైదేహి: ఒకవేళ నిజం అయితే .. నేను రిస్క్ చేయలేను అండీ. నాకు నా కొడుకు ప్రాణాలే ముఖ్యం. పంచమి గర్భం తీయించుకోవాల్సిందే.
శబరి: అయితే ఒక పని చేద్దాం. ముందు మన కుల గురువును కలిసి అప్పుడు నిర్ణయం తీసుకుందాం . ఆ బిడ్డ వల్ల మన మోక్షకు ప్రాణ గండం ఉందో లేదో కచ్చితంగా చెప్పేస్తారు.
వైదేహి: మన గురువుగారు ఆ బిడ్డ వల్ల ఏదైనా ఇబ్బంది ఉంది అంటే మీరు నా మాట వినాలి. 
శబరి: మనతో పంచమి మోక్ష రావాలి నేను గురువుగారికి చెప్తాను.. కరాళి, ఫణేంద్రలు వీళ్ల మాటలు వింటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: రూ.12 కోట్లు గాయత్రీ దేవి పేరున విత్‌డ్రా చేసి దొరికిపోయిన విశాల్.. నయని నగలు మాయం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget