Naga Panchami Serial Today April 26th: 'నాగ పంచమి' సీరియల్: స్కానింగ్ రిపోర్ట్స్ చూసి బిత్తరపోయిన డాక్టర్, పంచమి గర్భంలో పాము.. గరుడశక్తిగా మారిన ఫణేంద్ర!
Naga Panchami Serial Today Episode పంచమికి స్కానింగ్ చేయగా గర్భంలో వింత ఆకారం గుర్తించిన డాక్టర్ అబార్షన్ చేయించుకోమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode కరాళికి గరుడ రాజు తన శక్తులను ప్రసాదిస్తాడు. దీంతో కరాళి, ఫణేంద్ర సంతోషిస్తారు. కరాళి గరుడ శక్తిని ఫణేంద్రలోకి ప్రవేశ పెడతుంది. దీంతో ఫణేంద్ర గరుడ శక్తిలా మారిపోతాడు.
కరాళి: ఫణేంద్ర నువ్వు ఇప్పుడు గరుడ శక్తివి నిన్ను పంచమి మీదకు ప్రయోగిస్తాను. నీకు వచ్చిన శక్తితో నువ్వు పంచమి గర్భంలోని బిడ్డను విచ్ఛిన్నం చేయాలి.
ఫణేంద్ర: నీ ఇష్ట ప్రకారం నీ ఆదేశం ప్రకారం నేను నడుచుకుంటాను. నీ ఆజ్ఞని శిరసా వహిస్తాను.
కరాళి: అలాగే గరుడ రాజా నీ సూక్ష్మ శక్తిని నాలోనే ఉంచుకొని అవసరం నిమిత్తం ఉపయోగించుకుంటాను.
ఫణేంద్ర: నీ ఇష్టం కరాళి ఇప్పుడు నేను నీ శక్తిని.. కరాళి మళ్లీ ఫణేంద్ర లోని గరుడ శక్తిని తీసుకుంటుంది. తనలో ఐక్యం చేసుకుంటుంది.
కరాళి: సాధించాను ఫణేంద్ర ఇక నాకు తిరుగులేదు.
మరోవైపు మోక్ష, పంచమి, వైదేహి హాస్పిటల్‌కి వస్తారు. పంచమిని స్కానింగ్ చేయడానికి తీసుకెళ్తారు. సోదామో, గురువుగారు చెప్పిన మాటల్ని తలచుకొని వైదేహి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు నర్స్ పంచమికి స్కానింగ్ చేస్తుంది. స్కానింగ్ బేబీ కాకుండా పాములా కనిపించడంతో నర్స్ షాక్ అవుతుంది. మరోవైపు పంచమి కూడా స్కానింగ్ చేస్తుండగా చూస్తుంది. ఇక నర్స్ పంచమిని బయటకు పంపేస్తుంది. స్కానింగ్ రిపోర్ట్స్ చేసిన డాక్టర్ షాక్ అయిపోతుంది. డాక్టర్ మాటల్ని పంచమి వింటుంది.
డాక్టర్: ఓమైగాడ్.. నా జీవితంలో ఎప్పుడూ పిండాన్ని ఈ రూపంలో చూడలేదు. అసలు ఇది ఏ ఆకారమో కూడా తెలీడం లేదు. మనిషి రూపు రేఖలు అస్సలు కనిపించడం లేదు. ఇది పెద్ద ప్రమాదమే. మానవ రూపంలో పుట్టే అవకాశం మాత్రమే. అసలు ఇది ఏ రూపమో నాకే స్పష్టంగా తెలీడం లేదు.
మోక్ష: పంచమి అన్ని టెస్ట్‌లు అయిపోయాయి. ఏమైంది పంచమి అలా ఉన్నావ్. నువ్వు బాగా భయపడుతున్నట్లున్నావ్. ఇలా రా కూర్చో.
పంచమి: మనసులో.. అత్తయ్య గారికి తెలిసిపోతుంది. కచ్చితంగా నా బిడ్డను ఉంచరు. డాక్టర్ పంచమి వాళ్లని లోపలకి పిలుస్తుంది.
డాక్టర్: బేబీ అబ్ నార్మల్‌గా ఉంది. సాధారణంగా ఉండే పిండంలా లేదు. అదేం ప్రాబ్లమో నేను చెప్పలేను. జనరల్‌గా అందరి గర్భంలో ఉండే పిండంలా లేదు. చాలా అసాధారణంగా ఉంది. ఇలాంటి కేసు నేను ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి కండీషన్‌లో ప్రెగ్నెన్సీ వద్దు అనే చెప్తాను. రిస్క్ మాత్రం చాలా ఎక్కువ. మీరే ఆలోచించుకోండి. మోక్ష వాళ్లు ఇంటికి వెళ్లిపోతారు.
శబరి: వచ్చేశారా అంతా సవ్యంగానే జరిగింది కదా.. ఏమిటి అలా ఉన్నారు. మోక్ష మన డాక్టరమ్మ ఏం చెప్పింది.
రఘురాం: వైదేహి ఏంటి ఏమైనా ప్రాబ్లమా..
జ్వాల: చూస్తుంటే ఏదో పెద్ద ప్రాబ్లమ్ లానే ఉంది. లేదంటే ఇంత సైలెంట్‌గా ఉంటారు.
చిత్ర: చెప్పండి అత్తయ్య కడుపులో బిడ్డకు బదులు ఇంకేమైనా కనిపించిందా..
శబరి: మీరు నోరు మూయండి.. వైదేహి నువ్వు చెప్పమ్మా..
వైదేహి: నేను చెప్పలేను మళ్లీ నా మాటను తప్పుగా అనుకుంటారు మోక్ష నువ్వు చెప్పు.
మోక్ష: నేను దాన్ని పెద్ద విషయంగా తీసుకోను అమ్మ. ఏం చేయాలో నేను చూసుకుంటాను.
రఘురాం: అసలు ప్రాబ్లమ్ ఏంటి మోక్ష.
వైదేహి: పిండం అందరిలా సాధారణంగా లేదంట.
వరుణ్: చూశారా హాస్పిటల్‌కి వెళ్లడం ఎంత మంచి పని జరిగిందో..
జ్వాల: ఆ క్రెడిట్ అంతా మాకే దక్కుతుంది. మేమే అత్తయ్యకు స్కానింగ్‌కు తీసుకెళ్లమని చెప్పాం.
చిత్ర: అసలు విషయం బయటపడిపోయింది. గర్భం సాధారణంగా లేదు అంటే మేం అనుమానించింది నిజం. అసలు ఈ పంచమి మనిషికాదు.
మోక్ష: డోంట్ టాక్ రబ్బీష్. అందుకే అమ్మ హాస్పిటల్‌కి వద్దు అనింది. ఏ చిన్న విషయం ఉన్నా ఇలా పెద్దది చేస్తారు అని. ఒకరి జోక్యం మాకు అవసరం లేదు.
వైదేహి: అవన్నీ వదిలేయ్ మోక్ష. డాక్టర్ సలహా పాటించాలి కదా. డాక్టర్ చెప్పింది గర్భం ఉంచుకోవడం కరెక్ట్ కాదు అనే కదా.
రఘురాం: మోక్ష మన ఫ్యామిలీ డాక్టర్ చెప్పింది అంటే ఆలోచించాలి. ఏదైనా తేడా వస్తే మీరే సఫర్ అవుతారు.
జ్వాల: నీ భార్యను నువ్వు కాపాడుకుంటూ వచ్చిన పంచమి గర్భంలో పిండం నిజం చెప్తేసింది. ఇప్పటికైనా నువ్వు నిజం చెప్పు.
శబరి: మనవడా ఆవేశ పడకురా నాన్న. ఇది పిల్లల విషయం జాగ్రత్తగా ఆలోచించు.
వైదేహి: ఇందులో రహస్యం ఏం లేదు అత్తయ్యగారు. మన డాక్టర్ క్లారిటీగా చెప్పింది. పిండం ఉంచుకోవద్దు అని చెప్పింది.
రఘురాం: మోక్ష మరేదైనా హాస్పిటల్‌లో సెకండ్ ఓపీనియన్ తీసుకుందాం.
పంచమి ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది. జ్వాల, చిత్రలు నవ్వుకుంటారు. ఇక వైదేహి మోక్ష దగ్గరకు వెళ్లి తనని శత్రువులా చూడొద్దని.. మీకు మళ్లీ పిల్లలు పుట్టరని తెలిసి తాను కుమిలిపోతున్నాను అని అంటుంది. బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోమని చెప్తుంది. శబరి బాధపడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 200కి వస్తావా అంటే.. ఎందుకో తెలియక సరే అనేదాన్ని - ఎక్కడెక్కడో టచ్ చేసేవారు: నటి కీర్తి భట్