Naga Panchami Serial Promo Today January 23rd: ముట్టుకుంటే ప్రాణం తీసుకుంటానన్న పంచమి.. ఏడుస్తూ వెళ్లిపోయిన మోక్ష!
Naga Panchami Serial Promo Today: మోక్షని తన నుంచి దూరంగా వెళ్లిపోమని తన మీద పంచమి ఒట్టు పెట్టుకోవడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Promo Today: పంచమే పాముగా మారి తన భర్త మోక్షను కాటేయడంతో నాగపంచమి సీరియల్ చాలా ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. పంచమి మోక్షని కాటేసి నాగలోకం వెళ్లాలి అనేలోపు మేఘన ఫణేంద్ర దగ్గర నుంచి మోసం పూరితంగా మంత్రం చెప్పించుకొని నాగలోకం వెళ్తుంది. ఇక అక్కడ నాగమణి దక్కించుకోలేకపోయిన మేఘన నాగ చంద్రకాంత మొక్క తెచ్చి మోక్షని బతికిస్తుంది. ఈ తరుణంతో తాజాగా వచ్చిన నాగపంచమి సీరియల్ ప్రోమో చాలా ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ప్రోమోలో ఏం ఉందంటే..
"మోక్ష లేచి నిల్చొంటాడు. పంచమి తన భార్యగా దొరకడం తన అదృష్టమని మోక్ష తన తల్లితో చెప్తాడు. అందుకు వైదేహి పంచమి నీ అదృష్టం కాదు నీ ఖర్మ అంటుంది. ఈ క్షణం నుంచి తను నీ భార్య కాదు అని మోక్షతో తేల్చి చెప్తుంది. ఇక పంచమితో నా మోక్షని నువ్వే నాతో పంపించాలి అని అంటుంది. దానికి మోక్ష నేను పంచమిని వదిలి ఎక్కడికి రాను అని అంటాడు. పంచమి మనద్దరం కలిసి చనిపోదాం.. నన్ను నీ నుంచి దూరం చేయకు అని మోక్ష అని పంచమి చేతులు పట్టుకుంటాడు. అందుకు పంచమి వదలండి మోక్షాబాబు అని గట్టిగా అరుస్తుంది. దాంతో మోక్ష షాక్ అయిపోతాడు. పంచమిని ఎంత బతిమాలినా పంచమి వినకుండా తనని ముట్టుకోవద్దు అని ఇంకొక్క నిమిషం ఇక్కడున్నా మీ కళ్ల ముందే నేను ప్రాణం తీసుకుంటా మోక్షాబాబు అంటుంది. దానికి మోక్ష అలా అనకు పంచమి కావాలి అంటే నేను నీతో పాటే ప్రాణాలు తీసుకుంటా అని అంటాడు. దానికి పంచమి నిమిషం దగ్గర పడుతుంది నా చావు చూడాలి అనుకుంటే ఇక్కడే ఉండండి అంటుంది. దాంతో మోక్ష ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
"
నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగింది అంటే..
మేఘన నాగ చంద్రకాంత మొక్క పసరును మోక్షకు పడుతుంది. దీంతో మోక్ష ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటాడు. డాక్టర్ చెక్ చేసి ఇదో అద్భుతం అని తానే నమ్మలేకపోతున్నాను అని ఇక మోక్షకి ఏం కాదు అని డాక్టర్ చెప్తాడు. అందరూ ఎంతగానో సంతోషిస్తారు. ఇక మేఘన హమ్మయ్య నేను తీసుకొచ్చిన మూలికల వల్ల మోక్షాబాబు బతికాడు. భగవంతుడా నాకు ఇది చాలు..ఈ పసరు పని చేస్తుంది అని నాకు కూడా తెలీదు. అంతా భగవంతుడి దయ అని అంటుంది. అందరూ మోక్షని లేపే ప్రయత్నం చేస్తారు. తమని గుర్తుపట్టావా మోక్ష అంటూ అందరూ మోక్షని అడుగుతారు. ఇక పంచమి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అది చూసిన ఫణేంద్ర పంచమి దగ్గరకు వెళ్తాడు.
మోక్షని బతికించింది నువ్వే అని నాకు తెలుసు స్వామి.. నువ్వే నా భర్తను కాపాడావు. చాలు స్వామి ఇక నేను ఏమైపోయినా పర్లేదు అని పంచమి సుబ్రహ్మణ్య స్వామిని తలచుకుంటుంది. ఇక ఫణేంద్ర అక్కడికి వచ్చి యువరాణి ఇష్టరూప నాగు విషానికి భూలోకంలో ఔషధం దొరకడం అసాధ్యం. నాగచంద్రకాంత మొక్క తప్ప మరేరకమైన ఔషధం ఈ విశ్వంలో మోక్షని బతికించే అవకాశమే లేదు. ఆ మొక్క నాగలోకంలో తప్ప మరెక్కడా దొరకదు. అలాంటిది మేఘన ఏదో ఆకు పసరు తెచ్చి మోక్షని బతికించడం నేను నమ్మలేకపోతున్నాను అని పంచమితో అంటాడు.
అందుకు పంచమి నేను ఇప్పుడు ఏం ఆలోచించే పరిస్థితిలో లేను ఫణేంద్ర మోక్షాబాబు బతికారు నా కోరిక తీరింది. నా బాధ్యత పూర్తి అయింది అని అంటుంది. అందుకు ఫణేంద్ర నేను నిన్ను మోసం చేసినట్లు మంత్రం చెప్పకుండా అబద్ధం ఆడానని నన్ను నిందించావ్. నీ ముందు నా నీతి నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు ఉంది. నేను ఏం తప్పు చేయకుండా నీ ముందు దోషిగా నిలబడటం నాకు అవమానంగా ఉంది అని అంటాడు. దానికి పంచమి ఇప్పుడు అవన్నీ వదిలేద్దాం ఫణేంద్ర. కారణం ఎవరైనా పర్లేదు. మోక్షాబాబు బతికారు. నాకు ఇప్పుడు ఎవరి మీద కోపం ద్వేషం లేదు అంటుంది.
ఇక ఫణేంద్ర సరే యువరాణి నీ కోరిక మేరకు మోక్షా బతికారు. ఇక నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నాతో నాగలోకం వచ్చి శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలి. నిన్ను నమ్మి ఎలాగైనా నిన్ను తీసుకొస్తానని లేదంటే ఆత్మార్ఫణ చేసుకుంటానని నేను నాగదేవతకు వాగ్దానం ఇచ్చాను. ఇప్పుడు నువ్వు రాకపోతే నాకు మరణమే శరణ్యం అంటాడు. దానికి పంచమి నేను మాట తప్పను యువరాజా. నేను నీతో రావడానికి సిద్ధమే అని చెప్తుంది.
ఇద్దరూ నాగలోకాని వెళ్లిపోవడానికి నాగదేవతకు స్మరించుకోగానే నాగదేవత ప్రత్యక్షమై ఇద్దరూ నాగలోకాన్ని మోసం చేశారు అని కోప్పడుతుంది. మోక్షని బతికించడానికి యువరాణి నాగలోకం వచ్చి దొంగతనంగా నాగచంద్రకాంత మొక్క భూలోకానికి తీసుకొని వచ్చి చాలా పెద్ద తప్పు చేసిందని అంటుంది. అందుకు మీరిద్దరూ నాగలోకం రావడానికి అనర్హులు అని వారి నుంచి శక్తులు తీసుకొని నాగదేవత శాపం పెడుతుంది. ఇద్దరూ ఎంత బతిమాలినా నాగదేవత అంగీకరించదు. తర్వాత ఫణేంద్ర మేఘనను పిలిచి పంచమి రూపంలో నాగలోకం వెళ్లావా అని ప్రశ్నిస్తాడు. దానికి మేఘన కన్నీరు పెట్టుకొని నాటకమాడి పంచమిని తన వైపునకు తిప్పుకుంది.