అన్వేషించండి

Naga Panchami Serial Promo Today April 2nd: 'నాగ పంచమి' సీరియల్ ప్రోమో: టెన్షన్ పెట్టేస్తున్న ప్రోమో.. ఫణేంద్ర పాముగా మారిన వీడియోతో పంచమి, మోక్షల గుట్టు ఇంట్లో వాళ్లకి తెలిసిపోతుందా!

Naga Panchami Serial Promo Today మోక్ష ఫణేంద్రలు మాట్లాడుకోవడం ఫణేంద్ర పాముగా మారడం వీడియో తీసి చిత్ర ఇంట్లో అందరికీ ఆ విషయం చెప్పడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Promo Today  మోక్ష, పంచమిలు కలిసిపోవడం పంచమి తల్లి కావడంతో పంచమిని ఫణేంద్ర నాగలోకం తీసుకెళ్లలేకపోతాడు. ఇక మోక్ష బ్రహ్మచర్యం పోవడంతో మోక్షని బలిచ్చి తన శక్తులను తిరిగి పొందాలి అనుకున్న కరాళి ఆశలు ఆవిరైపోతాయి. దీంతో కరాళి, ఫణేంద్రలు ఒక్కటై పంచమి, మోక్ష సంతోషాన్ని దూరం చేయాలని కుట్రలు పన్నుతారు. పంచమికి నాగేశ్వరి పాము మనిషిగా మారి అండగా నిలుస్తుంది. మరోవైపు మోక్ష అన్నలు వదినలు పంచమిని పాము అని నిరూపించి ఇంట్లో నుంచి తరిమేయాలి అని పన్నాగాలు చేస్తుంటారు. ఇందుకు తగ్గట్టు ఫంక్షన్‌కి ముందు మోక్ష ఫణేంద్రతో మాట్లాడటం అప్పుడే ఫణేంద్ర పాముగా మారడం చూసిన చిత్ర దాన్ని రికార్డ్ చేస్తుంది. ఈ తరుణంలో తాజాగా వచ్చిన ప్రోమో చాలా ఆసక్తికరంగా సాగింది. ఇంతకీ ప్రోమోలో ఏం ఉంది అంటే..

పంచమి మనిషి కాదు కచ్చితంగా తను పామే అని భార్గవ్ ఇంట్లో అందరితో చెప్తాడు. దీంతో మోక్ష నువ్వు చూశావా పాముని చూశావా చెప్పు అని అన్న మీదకు వెళ్లి కాలర్ పట్టుకుంటాడు. ఇంట్లో అందరూ మోక్షని ఆపడానికి ప్రయత్నిస్తారు. అయినా మోక్ష ఆగడు. ఇంకోసారి తన భార్యని పాము అన్నారు అంటే మీరు ప్రాణాలతో ఉండరు అని వార్నింగ్ ఇస్తాడు. దీంతో జ్వాల ఇప్పుడే నీ కళ్ల ముందే నిరూపిస్తాం అప్పుడేం చేస్తావ్ అని అడుగుతుంది. మోక్ష, పంచమిలతో పాటు అందరూ షాక్ అవుతారు. ఇక చిత్ర అయితే పంచమి ఫ్రెండ్ పాముగా మారడం నేను చూశాను అని దాన్ని వీడియో తీశానని చెప్తుంది. పంచమి, మోక్ష షాక్ అవుతారు. ఆ వీడియోలో మోక్ష కూడా ఉన్నాడని భార్గవ్ చెప్తాడు. దీంతో వైదేహి ఏంటి మోక్ష వీళ్లు చెప్పేదని కొడుకుని అడుగుతుంది. ఇక చిత్ర నువ్వు పంచమి బంధువు అని చెప్పిన వ్యక్తి మాట్లాడుకోవడం నేను వీడియో తీశానని.. నీ కళ్ల ముందే తను పాముగా మారి వెళ్లిపోయాడు అని చెప్తుంది. భార్గవ్ ఆ వీడియోని టీవీలో వేయమని అప్పుడే సీన్ ఇంకా బాగా కనబడుతుందని అంటాడు. చిత్ర తన ఫోన్‌ను టీవీకి కనెక్ట్ చేస్తుంది. మోక్ష తెగ కంగారు పడతాడు. దీంతో ప్రోమో పూర్తవుతుంది. 

తన భార్య పాము అని నిరూపించడానికి తన అన్నవదినలు తీసుకొచ్చిన సాక్ష్యాన్ని తన తల్లిదండ్రులు చూడకుండా మోక్షఆపగలడా లేదా అనేది తెలుసుకోవాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. చిత్ర ఆ వీడియోని టీవీకి కనెన్ట్ చేసి ఇంట్లో వాళ్లకి చూపిస్తే అప్పటి వరకు పంచమిని ప్రేమగా చూసుకుంటున్న వైదేహి మారిపోవడం ఖాయం. ఇక పంచమికి సపోర్ట్ చేసే శబరి, మీనాక్షిలు కూడా ఎదురు తిరగొచ్చు. దీంతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న పంచమి కథ మళ్లీ మొదటికి వస్తుంది. మోక్ష, పంచమిలను కుటుంబ సభ్యులు విడదీసేస్తారు. మోక్షకు మరో పెళ్లి చేస్తానని వైదేహి పట్టుపట్టొచ్చు. 

నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగింది అంటే..

కరాళి పంచమికి మంత్రించిన నల్ల గాజులు వేస్తుంది. వాటి ఎఫెక్ట్‌కు పంచమి కడుపు నొప్పితో బాధ పడుతుంది. ఇక పంచమికి రక్షణగా వచ్చిన నాగేశ్వరి దిష్టి తీయాలి అని పంచమికి గదికి తీసుకెళ్లి తాను నాగేశ్వరి అని చెప్పి పంచమి చేతి నుంచి కరాళి వేసిన గాజులు తీసేస్తుంది. పంచమి నాగేశ్వరిని హత్తుకుని సంతోషంగా ఫీలవుతుంది. పంచమికి ఏం కాలేదు అని జాగ్రత్తగా చూసుకోమని ఇంట్లో వాళ్లకు నాగేశ్వరి చెప్తుంది. 
 
ఇక పంచమి నిద్రలో తన తల్లి మామిడి కాయలు ఇచ్చినట్లు తాను ఇష్టంగా తింటున్నట్లు నిద్రలో కలవరిస్తుంది. మోక్ష పంచమి నిద్ర లేపగా తనకు వచ్చిన కల గురించి చెప్తుంది. తర్వాత పంచమి,మోక్ష ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటారు. దాన్ని కరాళి తన దివ్య దృష్టితో చూస్తుంది. పంచమి, మోక్షలు ప్రేమగా మాట్లాడుకోవడం, కరాళి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనుకోవడం వింటుంది. దీంతో కరాళి మీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా నా నుంచి తప్పించుకోలేరు అని అనుకుంటుంది.   

ఇక కరాళి దగ్గరకు ఫణేంద్ర వస్తాడు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ నాగేశ్వరి మనల్ని అడ్డుకుంటుంది. ఆ నాగేశ్వరి లేకుంటే ఈ పాటికి ఆ ఇళ్లు రోధనతో కుమిలి కుమిలి ఏడుస్తుండే వారని కరాళి ఫణేంద్రకు చెప్తుంది. దీంతో ఫణేంద్ర మనం ముందు ఆ నాగేశ్వరి అడ్డు తొలగించుకోవాలి అని అంటాడు. దీంతో కరాళి తన దగ్గర ఇప్పుడు పెద్ద పెద్ద శక్తులు లేవని నాగేశ్వరి నాగ శక్తిని అడ్డుకోవాలి అంటే ఇప్పుడు తనకున్న శక్తులు సరిపోవని అంటుంది. అయితే తన దగ్గర ఉన్న వశీకరణ శక్తితో ముంగిసలను నాగేశ్వరి పాము మీదకు విడిచిపెడుతుంది. దీంతో అవి పామును వెంబడిస్తాయి. నాగేశ్వరి పాము పంచమి ఇంట్లోకి దూరడంతో ముంగిసలు కూడా వెళ్తాయి. ఇంట్లో అందరూ వాటిని చూసి చాలా భయపడతారు. నాగేశ్వరి పాము వాటికి లొంగి పోతుంది. మరి పంచమి తనకు రక్షణగా ఉన్న నాగేశ్వరి పామును కాపాడిందా లేదా అనేది ఇవాళ్లి ఎపిసోడ్‌లో చూడాలి. 

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: కృష్ణ, ముకుందలకు పోటీగా మరో క్యారెక్టర్ ఎంట్రీ.. రావడం రావడమే రచ్చ చేసేసిన రజినీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Embed widget