అన్వేషించండి

Meghasandesham Serial Today  October 5th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి ఫోన్‌ కొట్టేసిన దొంగ – అపూర్వ ఇంటికి వచ్చిన తల్లికొడుకు

Meghasandesham Today Episode: రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్న భూమి దగ్గరకు దొంగ వచ్చి ఫోన్‌ లాక్కుని వెళ్లి అపూర్వకు ఇవ్వడంతో  ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesham Serial Today Episode:  గగన్‌ కు బాయ్‌ చెప్పి నక్షత్ర వెళ్లిపోతుంది. తర్వాత భూమి కోపంగా కొలతలు  తీసుకుంటుంటే ఏమీ అనరేంటి అని తిడుతుంది. అంతేలే పక్కనున్న వాళ్లకంటే పరాయివాళ్లే ఎక్కువా? అంటూ కోపంగా అన్నం తినిపిస్తుంది. తర్వాత క్యారియర్‌ తీసుకుని ఇంటికి వెళ్తూ పూరికి ఫోన్‌ చేసి మీ అన్నయ్య దగ్గరకు ఆ నక్షత్ర వచ్చిందని కోపంగా చెప్తుంది. ఈ విషయం నీకు ఎవరు చెప్పారు అని పూరి అడగ్గానే నేనే వెళ్లాను అంటుంది. దీంతో పూరి నువ్వు వెళ్లడం ఏంటి..? అడుగుతుంది. ఇంతలో ఒక దొంగ వచ్చి భూమి ఫోన్‌ కొట్టేసి పారిపోతాడు. వాడి వెనకాలే వెళ్తుంది భూమి. వాడు నేరుగా అపూర్వ దగ్గరకు వెళ్లి ఫోన్‌ ఇచ్చి వెళ్లిపోతాడు. భూమి షాక్‌ అవుతుంది. అపూర్వ ఫోన్‌ పగులగొడుతుంది.

అపూర్వ: ఇది అడ్డం పెట్టుకునే కదే ఇన్ని రోజులు నన్ను ఆడించావు. ఏం చేస్తావు. ఈ అపూర్వ పేరు చెప్తేనే భయపడేవాళ్ల ముందు నాతో అడ్డమైన పనుల చేయిస్తావా? ఇప్పుడు తీసుకో ఫోను. అది ఉంది కదా అన్న ధైర్యంతోనే ఇప్పటి వరకు నువ్వు ఆడావు. ఇకపై నేను ఆడతాను. నా ఆట ఎలా ఉంటుందో ఇకపై చూద్దువు కానీ.

అని చెప్పి అపూర్వ వెళ్లిపోతుంది. పగిలిపోయిన ఫోన్‌ తీసుకుని భూమి ఏడుస్తుంది. మరోవైపు ప్రసాద్‌, తన తల్లిని తీసుకుని శారద ఇంటికి వెళ్తాడు.

శారద: మీరా మీరెందుకు వచ్చారు. మీకు ఎన్ని సార్లు చెప్పాలి ఇక్కడికి రావొద్దని

ప్రసాద్‌ వాళ్ల అమ్మ కనిపిస్తుంది. దీంతో శారద ఎమోషనల్‌ అవుతుంది. అత్తయ్యా అంటూ ఆశీర్వాదం తీసుకుంటుంది.

శారద: ఎన్ని ఏళ్లు అయింది అత్తయ్యా మిమ్మల్ని చూసి.

అత్తయ్య: కాలం కక్ష్య కడితే మనుషుల మధ్య ప్రేమలు కూడా దూరమైపోతాయి. రావాలి నా బంగారు కోడలిని చూసుకోవాలని నాకు ఉంటుంది. కానీ ఏం చేయను వాడొస్తున్నందుకే నీ ఇంటి మీద పడి ఎన్ని మాటలు అంటున్నారో..

శారద: అత్తయ్యా ఇందు మాత్రం ఎవరు నా బిడ్డే కదా? నా బిడ్డ పెళ్లి ఆగిపోతుంది అంటే నేను మాత్రం ఎలా ఊరుకుంటాను అత్తయ్యా..

అత్తయ్యా: ఇదే నీ గొప్ప గుణం. ధ్వేషించే మనుషులను కూడా ప్రేమిస్తావు. నీ మంచితనం వాళ్లకు ఎప్పటికి అర్థం అవుతుందో.

శారద: పోనీలేండి అత్తయ్యా ఇందు పెళ్లి బాగా జరిగితే అది చాలు నాకు. అయ్యో నా మతి మండా మిమ్మల్ని గుమ్మం దగ్గరే నిల్చోబెట్టి మాట్లాడుతున్నాను.

అత్తయ్యా: నువ్వు కూడా కూర్చోమ్మా.. నీకు ఇంత గౌరవం ఇచ్చిన దేవుడు నీకు ఇంత దూరాన్ని ఎందుకు ఇచ్చాడే..

శారద: అత్తయ్యా ఉండండి కాఫీ తీసుకొస్తాను.

అత్తయ్య: శారద ఇప్పుడు ఎందుకులే అమ్మా..

శారద: ఇంటి వరకు వచ్చి కాఫీ తాగకుండా వెళ్తారా?

 అంటూ శారద లోపలికి కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది.  గోడకు ఉన్న  గగన్‌, పూరిల  ఫోటో చూసి ప్రసాద్‌, వాళ్ల అమ్మ ఎమోషనల్‌ అవుతారు.  శారద కాఫీ తీసుకొచ్చి ఇద్దరికి ఇస్తుంది. కాఫీ తాగుతూ నిజం చెప్తున్నాను తల్లీ మీకు  దూరమై వాడు ఎంత నరకం అనుభవిస్తున్నాడో నీకు తెలియదు. నాక్కూడా మీ దగ్గరకే వచ్చి ఉండాలని ఉంది కానీ నేను కూడా వచ్చేస్తు ఆ ఇంట్ల వాడు ఒక్కడే  అయిపోతాడని అక్కడే ఉన్నానని చెప్తుంది అత్తయ్య. మరోవైపు శరత్‌చంద్ర కొత్త బట్టలు తీసుకొచ్చి  భూమికి ఇస్తాడు. కొత్త బట్టలు  కట్టుకుని వచ్చిన భూమిని చూసి అందరూ ఎవరీ అమ్మాయి నక్షత్ర కంటే అందంగా ఉంది అంటుంటారు నక్షత్ర విని కుళ్లుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.

Also Read: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం

Also Read: సామంత్‌, అనామికల మధ్య గొడవ – రుద్రాణిని ముసుగేసి కొట్టిన స్వప్న

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 21th:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
Podarillu Serial Today August 21th:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?
పొదరిల్లు:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget