అన్వేషించండి

Meghasandesham Serial Today  October 11th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్ టీ షర్ట్‌ వేసుకున్న నక్షత్ర – అపూర్వను కోపంగా చూసిన ప్రసాద్‌

Meghasandesham Today Episode:  భూమి గురించి నిజం తెలుసుకున్న ప్రసాద్‌, శారదకు ఫోన్‌ చేసి భూమిని జాగ్రత్తగా చూసుకోండని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesham Serial Today Episode: గగన్‌ ఫోటో టీ షర్ట్‌ మీద ప్రింట్‌ వేయించుకుని రన్నింగ్‌ చేస్తుంది నక్షత్ర. ఫ్రెండ్స్‌ అందరూ నవ్వుతూ అసలు నీకు ఇంత పిచ్చి ఏంటే అంటారు. మీ ఫ్యామిలీలో తెలిస్తే మీ పరిస్థితి ఏంటని అడుగుతారు. ఇక్కడుంది నక్షత్ర అని నేను ప్రింట్‌ వేసుకుంటేనే ఇలా అయిపోయారు. మా బావ కూడా నా ఫోటో ప్రింటు వేసుకుని తిరుగుతే ఎలా అయిపోతారు అంటూ కారు దగ్గరకు తీసుకెళ్లి తన ఫోటో ప్రింటు వేసిన టీ షర్టు చూపిస్తుంది నక్షత్ర. మరోవైపు గగన్‌ రూంలోకి  కాఫీ తీసుకుని వెళ్లిన భూమి గగన్‌ను నిద్ర లేపుతుంది. నిద్ర లేచిన గగన్‌ ఆశ్చర్యంగా చూస్తుంటాడు.

భూమి: ఎంటలా చూస్తున్నారు. కాఫీ తాగండి.  

గగన్‌: కాఫీ నువ్వు..

భూమి: ఉదయాన్నే బెడ్‌ కాఫీ తాగుతారు కదాని మీకోసమే స్పెషల్‌ గా తీసుకొచ్చాను. తీసుకోండి. కాఫీ తాగమంటే కప్పు తడుతారేంటి..?

గగన్‌: అంటే అది నువ్వు..

భూమి: తలతిక్కగారు ఏం చేస్తున్నారు అరే నా చేతులండి. ఏం చేస్తున్నారు.

పూరి: మా అన్నయ్యేనా.. ఏంటి భూమి చేతులు పట్టుకుని నలిపేస్తున్నాడు.

 అంటూ వెళ్లి శారద దగ్గరకు వెళ్లి అన్నయ్య భూమి చేతులు పట్టుకుని నలిపేస్తున్నాడు అని చెప్తుంది. ఇద్దరూ కలిసి భూమి, గగన్‌ ల గురించి మాట్లాడుకుంటారు. మరోవైపు అపూర్వ ఇంట్లో ఇందుకు శారీ  పంపిస్తారు పెళ్లి వాళ్లు.

ప్రసాద్‌ అమ్మ: ఏమో అనుకున్నాను అబ్బాయి వాళ్లు ప్రధానం చీర చారే ఘనంగానే పంపిచారు.

మీరా: అవును అత్తయ్యా.. ఏమంటావు వదినా..?

బిందు: ఇవన్నీ చూస్తుంటే అక్కకు అత్తగారింట్లో ఏ లోటు లేకుండా చూసుకుంటారు అనిపిస్తుంది.

ఇందు: అత్తయ్య ఉండగా నేను ఇక్కడున్నా అక్కడున్నా ఏ లోటు ఉండదు.

ప్రసాద్‌ అమ్మ: పద్దతిగా పూలు, పండ్లు స్వీట్లు పంపిచారంటే వారికి పద్దతులు బాగా తెలుసు.

మీరా: అవును

ప్రసాద్‌ వచ్చి కోపంగా అపూర్వను చూస్తుంటాడు.

అపూర్వ: ఏంటి కృష్ణప్రసాద్‌ అంత తీక్షణంగా నన్నే చూస్తున్నాడు. కళ్లల్లో భయం కనిపించడం లేదు. నేను చూస్తున్నానన్న తడబాటు కనిపించడం లేదు ఏమై ఉంటుంది.  ( అని మనసులో అనుకుని పక్కకు వెళ్తుంది.)

తర్వాత కృష్ణప్రసాద్‌, శారదకు ఫోన్‌ చేసి భూమిని జాగ్రత్తగా చూసుకోండని చెప్తాడు. భూమికి ఏ విషయంలోనూ తక్కువ చేయడం లేదని చెప్తుంది శారద. తర్వాత భూమితో ఫోన్‌ మాట్లాడిన కృష్ణప్రసాద్‌ నీతో పర్సనల్‌ గా మాట్లాడాలి మనం ఇంతకు ముందు కలిశాం కదా అక్కడికి రామ్మా అంటాడు. సరే అంటుంది భూమి. మరోవైపు కోటు తీసుకుని గగన్‌ ఇంటికి వస్తుంది నక్షత్ర. అప్పుడే బయటకు వెళ్లబోతున్న భూమికి ఎదురవుతుంది.

భూమి: ఎందుకొచ్చావు…?

నక్షత్ర: మా బావ కోసం వచ్చాను.

భూమి: ఆయనతో పనేంటి?

నక్షత్ర: కోటు తీసుకొస్తానని చెప్పాను కదా తెచ్చాను.

భూమి: నువ్వు తెచ్చినా ఆయన తీసుకోవాలి కదా?

నక్షత్ర: ఎందుకు తీసుకోడు. తీసుకుంటాడు. దర్జాగా వేసుకుంటాడు.

భూమి: అది జరిగే పని కాదు. బయలుదేరు.

నక్షత్ర: ఎలా జరగదో నేను చూస్తాను. ఏదో పని మీద వెళ్తున్నట్టున్నావు బయలుదేరు.

భూమి: ఇంత నమ్మకంగా వెళ్తుందేంటి? ఆయినా ఆయనకు మించిన పని నాకేం ఉంటుంది.

 అనుకుంటూ భూమి పరుగెత్తుకెళ్లి నక్షత్రను తిడుతుంది. ఆంటీని అత్తయ్యా అని పిలుస్తావెందుకు అంటుంది. నువ్వు అయితే పరాయిదానివి. మేము బంధువులం ఇలాగే పిలుస్తాను అంటూ పూజ గదిలోకి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుంటుంది నక్షత్ర. తర్వాత శారద కాళ్లు మొక్కి మమ్మీతో మీకు ఎలాంటి ప్రాబ్లమ్‌ రాదు. రాకుండా నేను చూసుకుంటాను అత్తయ్యా అని చెప్తుంది. గగన్‌ కోసం తీసుకొచ్చిన కోటు శారదకు ఇస్తుంది. గగన్‌కు ఇవ్వమని చెప్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.

ALSO READ: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: పెళ్లి మంటపానిక వచ్చిన శంకర్‌ – టెన్షన్‌ పడుతున్న పాండు

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today April 2nd: జగద్ధాత్రి సీరియల్: కౌషికి సైట్‌లో సునీత డెడ్ బాడీ! రమేశ్, కౌషికిలను పోలీసులు అరెస్ట్ చేస్తారా!
జగద్ధాత్రి సీరియల్: కౌషికి సైట్‌లో సునీత డెడ్ బాడీ! రమేశ్, కౌషికిలను పోలీసులు అరెస్ట్ చేస్తారా!
kalavari kodalu kanaka mahalakshmi serial today April 2nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమున గతం విహారి తెలుసుకున్నాడా! లక్ష్మీ ప్రెగ్నెంట్ అని సహస్రకు తెలిసిపోయిందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమున గతం విహారి తెలుసుకున్నాడా! లక్ష్మీ ప్రెగ్నెంట్ అని సహస్రకు తెలిసిపోయిందా!
Nindu Manasulu Serial Today April 2nd: నిండు మనసులు: అదిరిపోయిన చెంచలమ్మ తీర్పు! అగ్నిసాక్షిగా ఒక్కటైన ప్రేరణ, సిద్ధూ! మంజుల షాక్!
నిండు మనసులు: అదిరిపోయిన చెంచలమ్మ తీర్పు! అగ్నిసాక్షిగా ఒక్కటైన ప్రేరణ, సిద్ధూ! మంజుల షాక్!
Gunde Ninda Gudi Gantalu April2nd Episode: 2 లక్షలకి పడిపోయిన ప్రభావతి, ఆనందంలో బాలు మీనా..అసలు ట్విస్ట్‌ బయటపడితే అప్పుడుంటుంది - గుండెనిండా గుడిగంటలు ఏప్రిల్ 2 ఎపిసోడ్
2 లక్షలకి పడిపోయిన ప్రభావతి, ఆనందంలో బాలు మీనా..అసలు ట్విస్ట్‌ బయటపడితే అప్పుడుంటుంది - గుండెనిండా గుడిగంటలు ఏప్రిల్ 2 ఎపిసోడ్

వీడియోలు

Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam
IPL 2026 DC VS LSG Highlights | ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ | ABP Desam
Rishabh Pant LSG vs Delhi Capitals IPL 2026 | లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి కారణం అదేనా | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women Reservation Implementation: లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
Amaravati: అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
Raghav Chadha : ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
Rajya Sabha YSRCP: బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Perni Kittu: పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
Nara Lokesh in Delhi: అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
BRS MLA Sudheer Reddy: దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
Embed widget