Meghasandesam Serial Weekly Roundup August 11th to 16th : ‘మేఘసందేశం’ సీరియల్: గడచిన వారం మేఘసందేశం సీరియల్‌లో ఏ జరిగిందో మొత్తం ఏపిసోడ్స్ హైలెట్స్ పై ఓ లుక్కేద్దాం.
Meghasandesam serial weekly episode August 11th to 16th: మేఘసందేశం సీరియల్ ఈ వారంలో చాలా ఆసక్తికరంగా జరిగింది. ఆగస్టు 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Meghasandesam Serial weekly Episode: భూమి డాన్స్ అకాడమీ ఓపెనింగ్ కోసం గగన్‌తో కలిసి వెళ్లడానికి శరత్ చంద్ర ఒప్పుకోడు దీంతో భూమి బాధపడుతుంటే ఉదయ్ కల్పించుకుని శరత్‌చంద్రను ఒప్పిస్తాడు. దీంతో భూమి కొంచెం హ్యాపీగా ఫీలవుతుంది. హాస్పిటల్ బిల్ కట్టి వస్తానని శరత్ చంద్ర వెళ్లిపోతాడు. శరత్ చంద్ర వెళ్లిపోయాక ఉదయ్ తాను భూమిని ఎంత ఇష్టపడింది చెప్తాడు. భూమి అయోమయంగా చూస్తుంది.
మరోవైపు గగన్ వర్క్ చేసుకుంటూ భూమిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతాడు. భూమి తనకు ఎదురుగా వచ్చినట్టు ఫీలవుతాడు. ఎలా భూమి నువ్వు నన్ను ఎలా మర్చిపోయావు. మర్చిపోవడానికి నీ దగ్గర ఏదైనా మందు ఉంటే నాకు ఇవ్వు.. నువ్వు అలా నవ్వితే కుదరదు.. నాకు సమాధానం కావాలి. చెప్పు భూమి చెప్పు భూమి ఉలిక్కి పడి ఇదంతా భ్రమా అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంటే సుజాత, కావ్య అపూర్వ ముగ్గురు కలిసి భూమిని ఎలా చంపాలా అని మాట్లాడుకుంటుంటారు. గగన్ విని వెళ్లి వాళ్లకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.
తర్వాత భూమి డాన్స్ అకాడమీ ఓపెనింగ్ గగన్ చేత చేయించాలని ఫోన్ చేసి గగన్‌ను అడుగుతుంది. గగన్ సరే అంటాడు. భూమి మాట్లాడింది మొత్తం విన్న అపూర్వ డాన్స్ అకాడమీ మూతపడే అవకాశం వచ్చిందని వెళ్లిపోతుంది. భూమి గగన్‌ను చూడాలని శివకు ఫోన్ చేసి గగన్ ఫోటో తీసి పంపించు అని చెప్తుంది. శివ ఫోటో పంపించగానే ఫోటో చూస్తూ భూమి తనతో గగన్ మాట్లాడినట్టు ఫాంటసీలోకి వెళ్తుంది. తర్వాత అపూర్వ, శరత్ చంద్ర దగ్గరకు వెళ్లి డాన్స్ అకాడమీ ఉదయ్ చేత ఓపెన్ చేయించమని చెప్తుంది. కానీ అందుకు భూమి ఒప్పుకుంటుందో లేదోనని అనుమానం వ్యక్తం చేస్తుంది. తాను చెబితే భూమి ఒప్పుకుంటుందని శరత్ చంద్ర చెప్తాడు.
తర్వాత గగన్ ఇంట్లో ఉండడని శారద ఒక్కతే ఉంటుందని శారదను చంపేయమని రౌడీలను పంపిస్తుంది అపూర్వ. అయితే శారద్ కోసం కేపీ ఇంటికి వస్తాడు. రౌడీలను కొట్టి తరిమేస్తాడు. తర్వాత నక్షత్ర పుల్లుగా తాగి గగన్ ఇంటికి వెళ్తుంది. రచ్చ రచ్చ చేస్తుంది. దీంతో గగన్, చెర్రికి ఫోన్ చేసి పిలుస్తాడు. చెర్రి వచ్చి నక్షత్రను ఇంటికి తీసుకెళ్తుంటాడు. నక్షత్రను ఓపికతో మార్చుకోమని ఈ ప్రపంచంలో నీ ప్రేమకు ఏదీ సాటి రాదన్న విషయం నక్షత్రకు అర్థం అయ్యేలా చేయమని గగన్ చెప్తాడు.
తర్వాత అకాడమీ ఓపెనింగ్ కు గగన్ వెళ్తాడు. శరత్, ఉదయ్ కలిసి వెళ్తారు. అక్కడ చెర్రి, భూమి నాటకం ఆడి అకాడమీని గగన్ ఓపెన్ చేసేలా చేస్తారు. దీంతో అపూర్వ, శరత్ చంద్ర షాక్ అవుతారు. అకాడమీ ఓపెనింగ్ లోనే కరెంట్ షాక్ తగిలి గగన్ చనిపోయేలా చేయాలనుకుంటుంది అపూర్వ. కానీ అది మిస్ అవుతుంది. గగన్ సేఫ్‌గా ఉంటాడు. అపూర్వ ప్లాన్ తెలిసిన నక్షత్రను అపూర్వను పక్కకు తీసుకెళ్లి తిడుతుంది. కానీ అపూర్వ ఏదో మాటలు చెప్పి తప్పించుకుంటుంది.
గగన్ ఇంట్లో ఉన్న బొమ్మను కొట్టేయడానికి వాళ్ల పనిమనిషిని కొనేస్తుంది శారద. ఎలాగైనా ఆ బొమ్మలోని కెమెరా కొట్టేయాలని వెంటనే తీసుకొచ్చి తనకు ఇవ్వాలని చెప్తుంది. మొదట అందుకు ఒప్పుకోని పనిమనిషి అపూర్వ డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ చూపించడంతో ఒప్పుకుంటుంది. తర్వాత ఇంట్లో పూర్తి క్లీన్ చేస్తుండగా బొమ్మ కింద పడిపోతుంది. అది ఓపెన్ చేసి పూర్తి చూస్తుండగానే ఈ వారం మేఘసందేశం చివరి ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















