Meghasandesam Serial Today July 22nd: ‘మేఘసందేశం’ సీరియల్: శారదను అవమానించిన అపూర్వ – నిజం చెప్పాలనుకున్న భూమి
Meghasandesam Today Episode: శరత్ చంద్ర ఇంటికి వచ్చిన శారదను విధవలా మార్చేస్తుంది అపూర్వ. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: గగన్ పరిస్థితి చూసిన శారద, పూరి అసలు భూమి ఇల్లరికం కండీషన్ ఎందుకు పెట్టిందో కనుక్కోవాలని శరత్ చంద్ర ఇంటికి వెళ్తారు. అక్కడ భూమి ఉండదు. పూరి వారిస్తున్న వినకుండా లోపలికి వెళ్తుంది.
అత్త : అమ్మా శారద నువ్వేంటమ్మా ఇక్కడికి వచ్చావు. నా పెద్ద మనవడు ఎలా ఉన్నాడు. పెళ్లి ఆగిపోయినందుకు బాధపడుతున్నాడా..?
శారద: ఆ విషయం మాట్లాడదామనే వచ్చాను.
అత్త: ఆ విషయం మాట్లాడదామని వచ్చావా… కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటావేంటమ్మా..?
బిందు: అవును పెద్దమ్మా అసలే మీ మీద అంత సీరియస్‌గా ఉన్నారు. మిమ్మల్ని ఇక్కడ చూస్తే మరింత సీరియస్ అవుతారు. వచ్చిన వాళ్లను వెళ్లిపోమ్మనడం మంచిది కాదు. మీరు ఇప్పుడు వెళ్లిపోవడమే మంచిది పెద్దమ్మ ఫ్లీజ్ వెళ్లిపోండి పెద్దమ్మ.
అత్త: అవును శారద.. ఒక విధంగా మంచి టైంలోనే వచ్చావు అమ్మ..ఇప్పుడే అల్లుడు గారు బయటకు వెళ్లారు. వాళ్లు రాక ముందే మీరు వెల్లిపోండి.
శారద: ఫోన్ చేస్తే కలవడం లేదు.. భూమిని పిలవండి అత్తయ్యా రెండే రెండు మాటలు అడిగి వెళ్లిపోతాను.
అత్త: భూమి కూడా బయటకు వెళ్లింది శారద. రాగానే ఫోన్ చేయిస్తాను మీరు వెళ్లిపోండి శారద.
పూరి: అమ్మా అయినా భూమి ఇక్కడ లేనట్టుంది వెళ్దాం పద అమ్మ..
అత్త: త్వరగా బయలుదేరండి అమ్మా వెళ్లండి
మీరా: ఏయ్ ఎంత ధైర్యం ఉంటే మా ఇంటి గడవ తొక్కుతావే.. నీ కొడుకే కాకుండా నువ్వు కూడా మా పరువు తీద్దామని వచ్చావా..?
శారద: అదేంటి మీరా అంతలా కోప్పడతావు. నువ్వు అడిగినట్టే విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టాను కదా..? అయినా మేము అనుకున్నట్టు పెళ్లి జరగలేదు కదా..?
మీరా: జరగకపోవడానికి కారణం ఎవరు..? కొవ్వొక్కి నీ కొడుకే మమ్మల్ని అనరాని మాటలు అన్నాడు. పరువు తీసి మరీ పెళ్లి ఆపాడు. అయినా ఈ పెళ్లి ఆగిపోవడం కూడా మా మంచికే అయింది. మొగుడు వదిలేసిన అత్తతో తండ్రి లేని కొడుకుతో మా భూమి నీకు కోడలిగా.. నీ కొడుకుకి భార్యగా బతకడం కంటే పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది.
శారద: మీరా కొంచెం మర్యాదగా మాట్లాడు. భూమిని రెండు మాటలు అడుగుదామని వచ్చాను కానీ నీతో మాటలు పడటానికి రాలేదు.
మీరా: ఇంకా నువ్వు భూమిని అడిగేదేంటి..? పెళ్లి పీటల మీద మా భూమిని ఏడిపించింది చాలదా..? ఇక్కడ కూడా ఏడిపించడానికి వచ్చారా..?
శారద: నేను భూమిని ఏమి అడుగుతానో నిజం ఏంటో.. నెమ్మది నెమ్మదిగా నీకే తెలుస్తుంది.
మీరా: నెమ్మది నెమ్మదిగా తెలియాల్సింది ఏమీ లేదు. కానీ ఇమ్మిడియెట్‌గా తెలియాల్సిందే దాని గురించి చెప్పు.. పెద్ద పతివ్రతా శిరోమణిలా విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టి మళ్లీ ఆ పేపర్స్ ఎందుకు మాయం చేశావు.
శారద: నేను పేపర్స్ మాయం చేయడం ఏంటి..? సంతకం పెట్టి మీకే ఇచ్చాను కదా
మీరా: నంగనాచిలా మాట్లాడకు..
అంటూ కోపంగా శారదను తీసుకెళ్లి రూంలో వేసి లాక్ చేస్తుంది. మా అన్నయ్యను పిలుస్తాను అంటూ శరత్ చంద్రకు కాల్ చేస్తుంది. విషయం తెలసిన శరత్‌చంద్ర, అపూర్వ ఇంటికి వస్తారు.
అపూర్వ: వీరికి డైవర్స్ ఇప్పించినంత మాత్రాన మనం శారద, కేపీ కలవకుండా ఆపగలమా బావ. వీళ్లు ఎప్పుడైనా కలవొచ్చు. అనుకుంటే ఏదో ఒక రోజు వెళ్లిపోవచ్చు. అవేవీ జరగకూడదు అంటే మనం ఈ శారదను ఏం చేయాలో అది చేయాలి
అంటూ భర్త చనిపోయిన స్త్రీని ఎలా అయితే చేస్తారో అలా శారదను చేస్తారు. శారద ఏడుస్తుంది. పూర్ణి ఏం చేయాలో తెలియక బాధపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















