Meghasandesam Serial Today February 22nd: ‘మేఘసందేశం’ సీరియల్: శరత్ చంద్రకు నిజం చెప్పిన గగన్ – కోపంతో ఊగిపోయిన శరత్
Meghasandesam Today Episode: నక్షత్ర తనను ప్రేమిస్తుందని తన కోసమే చావబోయిందని గగన్, శరత్ చంద్రకు నిజం చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode : ప్రసాద్, భూమి మాట్లాడుకుంటుండగా చెర్రి వెళ్లి సర్‌ప్రైజ్ ఉంది మామయ్య దగ్గరకు రండి అని తీసుకెళ్తాడు. ఏంటా సర్‌ప్రైజ్ అని ప్రసాద్ అడిగితే చెప్తాను రండి అంటూ తీసుకెళ్లి.. మామయ్య మీకో సర్‌ప్రైజ్ అంటాడు చెర్రి. ఏంట్రా మాకు సర్‌ప్రైజ్ మీ మామయ్యకు కూడా సర్‌ప్రైజా అని అడుగుతాడు. మామయ్య సత్యహరిశ్చంద్రుడు అంటాడు. దీంతో ప్రసాద్ మీ మామయ్య సత్యహరిశ్చంద్రుడు కాదు. శరత్చంద్రుడు అంటాడు.
చెర్రి: పేరుకు శరత్ చంద్రుడే అయినా గుణంలో హరిశ్చంద్రుడు అంటున్నాను
ప్రసాద్: నువ్వు ఇలాగే అతి చేశావే అనుకో ఆయన సూర్యుడి లాగా మండిపోతాడు. అప్పుడు నువ్వు ఇక్కడే కాలిపోతావు.
చెర్రి: అంతదూరం ఎందుకులే నాన్నా.. భూమిని మామయ్య దత్తత తీసుకుంటాడని హరిశ్చంద్రుడు అని చెప్పాను. కానీ మీరు ఇంకా ఆ మాటే నిలబెట్టుకోలేదు. ఇదే నేను మీకు చెప్పాలనుకున్నాను.
శరత్: అతి చేస్తే చేశావు కానీ మంచి విషయాన్ని గుర్తు చేశావురా. నక్షత్ర టెన్షన్‌లో అసలు నేను ఈ విషయాన్నే మర్చిపోయాను. కేపీ రేపే భూమిని దత్తత తీసుకుంటున్నాను. ఆ ఏర్పాట్లు చూడు.
ప్రసాద్: అలాగే బావగారు..
అని చెప్పి వెళ్లిపోతాడు..
చెర్రి: భూమి సర్ ప్రైజింగ్ అనిపించిందా.?
భూమి: థాంక్యూ చెర్రి..
అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు అపూర్వ తన కారులో శారదకు ఇంటి దాకా లిఫ్ట్ ఇస్తుంది. ఇల్లు రాగానే.. శారద దిగి వెళ్లిపోతుంది. అయిపోయింది కదా.. ఇక వెళ్దామా..? అని అపూర్వ అనగానే.. నక్షత్ర ఆగమని చెప్తుంది.
నక్షత్ర: ఇక్కడి దాకా వచ్చింది అత్తయ్యకు లిఫ్ట్ ఇచ్చి వెళ్లడానికా..?
అపూర్వ: మరేంటే..?
నక్షత్ర: బావతో నా పెళ్లి చేస్తా అన్నావు కదా..? అత్తయ్య వైపు నుంచి నరుక్కొని రా..?
అపూర్వ: నరకడమేంటే..?
నక్షత్ర: అబ్బా ఇది కూడా చెప్పాలా..? బావతో నా పెళ్లికి అత్తయ్యను ఒప్పించావు అనుకో.. అత్తయ్య చెబితే బావ ఒప్పేసుకుంటాడు మమ్మీ. మమ్మీ అత్తయ్య వెళ్లిపోతుంది పిలువు మమ్మీ..
సుజాత: అబ్బా తలకి దెబ్బ తగిలినప్పటి నుంచి తెలివి బాగా పెరిగిపోయింది.
అపూర్వ: పిన్ని నువ్వు ఆగు..
సుజాత: విసుక్కోకు అమ్మాయి ఇష్టం లేకపోయినా వాడితో పెళ్లి చేస్తానని మాట ఇచ్చావు కదా..? అనుమానం వచ్చిందంటే మళ్లీ చస్తాను అంటుంది మీ అమ్మాయి.
నక్షత్ర: అత్తయ్యా..
అని నక్షత్ర పిలవగానే.. శారద తిరిగి వస్తుంది. ఏంటమ్మా అని అడుగుతుంది. దీంతో నక్షత్ర అమ్మ ఏదో మీతో మాట్లాడాలి అంటుంది అని చెప్పగానే.. అపూర్వ వదిన గారు.. ఇంతదాకా వచ్చాము కదా కనీసం లోపలికి పిలుస్తారని అంటుంది. దీంతో శారద సరే లోపలికి రండి అని పిలుస్తుంది. అందరూ కలిసి లోపలికి వెళ్తారు. శారద కాఫీ తీసుకొస్తానని చెప్పగానే.. నేను వెళ్లి తీసుకొస్తాను అని నక్షత్ర వెళ్తుంది. దీంతో అపూర్వ భయంతో నక్షత్రకు కాఫీ పెట్టడం రాదని సుజాతను కిచెన్ లోకి పంపిస్తుంది. నక్షత్ర కాఫీ తీసుకొచ్చాక ముగ్గురు కలిసి నక్షత్రను గగన్ ఇచ్చి పెళ్లి చేయాలని అందుకు శారదను ఒప్పిస్తారు. శారద కూడా బలవంతంగా భయపడుతూనే ఒప్పుకుంటుంది. తర్వాత నక్షత్ర గగన్ దగ్గరకు వెళ్తుంది.
నక్షత్ర: బావా… నువ్వు ఇక్కడ ఉన్నావని ఎలా కనిపెట్టానో చూశావా..?
గగన్: అవును ఎందుకు వచ్చావు.. ఏదో చెప్పాలని వచ్చినట్టు ఉన్నావు.. ఏంటో త్వరగా చెప్పేసి వెళ్లు..
నక్షత్ర: మన పెళ్లికి అత్తయ్య ఒప్పేసుకున్నారు. మా మమ్మీ మన పెళ్లి గురించి అడగ్గానే సరే అన్నారు.
గగన్: మీ అమ్మా మా అమ్మా ఒప్పేసుకున్నారు అనుకుంటున్నావు కదా..? మరి ఒప్పుకోవాల్సిన వాళ్లు ఇంకొకరు ఉన్నారేమో..?
నక్షత్ర: ఎవరు బావా..?
గగన్: మీ బాబు..
నక్షత్ర: అది మా మమ్మీ చూసుకుంటుంది.
గగన్: ఎందుకు మీ మమ్మీకి అంత టెన్షన్.. మనమే వెళ్లి మీ డాడీని అడిగేద్దాం. ఇక్కడే ఉన్నారు కదా..? వెళ్లి అడుగుదాం.
అని పక్కకు వెళ్లి శరత్ చంద్రను పిలుస్తాడు గగన్. దగ్గరకు వెళ్లి నీ కూతురు నన్ను ప్రేమిస్తుంది అని చెప్తాడు. దీంతో శరత్ చంద్ర నా కూతురు భూమి నిన్ను ప్రేమిస్తుందన్న భ్రమలోనే ఉన్నావా..? ఇంకా అంటాడు శరత్ చంద్ర. దీంతో గగన్ నీ పెంపుడు కూతురు భూమి గురించి కాదు నీ సొంత కూతురు నక్షత్ర అది ప్రేమిస్తుంది. నీ చావబోయింది నా కోసమే.. అని చెప్పడంతో శరత్ చంద్ర కోపంతో ఊగిపోతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















