Janaki Kalaganaledu May 23rd: తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయట పెట్టలేని జానకి - మలయాళంకు చుక్కలు చూపించిన మల్లిక
ఇంత కాలానికి ప్రెగ్నెంట్ అయిన జానకి.. ఇంట్లో వాళ్లకి చెప్పకుండా ఉండటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Janaki Kalaganaledu May 23rd: జానకి, రామ ఊరు నుండి రావటంతో అందర్నీ పలకరిస్తారు. ఇక అఖిల్ వెళ్లేటప్పుడు ఖాళీగా వెళ్లారు.. వచ్చేటప్పుడు ఇంత లగేజ్ తీసుకొచ్చారు అనటంతో ఇదంతా పెద్దమ్మ ప్రేమ అని అంటాడు రామ. వెంటనే మల్లిక చూస్తేనే అర్థమవుతుంది దాని కోసమే వెళ్లారు కదా అని అన్నట్లుగా వెటకారంగా మాట్లాడుతుంది. వెంటనే గోవిందరాజులు మల్లికకు కౌంటర్ వేస్తాడు.
ఆ తర్వాత జానకి ఇంట్లో వాళ్ళందరికీ జానమ్మ పంపించిన గిఫ్టులు ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటుంది. జ్ఞానంబ దంపతులకు బట్టలు ఇవ్వగా మల్లికకు కుంకుమపువ్వు, మామిడి కాయలు ఇస్తుంది. ఇక అవేనా అన్నట్లుగా మల్లిక వెటకారంగా కనిపిస్తుంది. ఆ తర్వాత రామ, జానకి బ్యాగు పట్టుకొని లోపలికి వెళ్తుండగా మల్లిక ఆ బ్యాగు అంత బరువు ఉందంటే అందులో ఏముందో అని అనుకుంటుంది.
తర్వాత మలయాళం జ్ఞానంబ మల్లికకు కరక్కాయ జ్యూస్ చేసి ఇవ్వమని అనటంతో ఆ జ్యూస్ తయారు చేస్తాడు. అదేం జ్యూస్ అని మల్లిక అడగటంతో కరక్కాయ జ్యూస్ అని అంటాడు. మీకోసమే అని అనటంతో మల్లిక తాగటానికి ఇష్టపడదు. అమ్మగారు తిడతారు అని మలయాళం అంటున్న కూడా మల్లిక తాగదు. ఆ తర్వాత ఆ గ్లాస్ తీసుకొని అందులో ఉన్న జ్యూస్ ని తన పెదాలపై అంటించుకొని తిరిగి బలవంతంగా మలయాళం కు తాపిస్తుంది. జ్ఞానంబ రావటంతో మల్లిక జ్యూస్ తాగాను అని చెబుతుంది. మలయాళం ఆది తాగినందుకు చుక్కలు చూస్తుంటాడు. ఇక జ్ఞానంబ అక్కడ నుంచి వెళ్లాక మల్లిక మలయాళం కు వార్నింగ్ ఇస్తుంది.
ఇక గదిలోకి వెళ్లిన రామ దంపతులు కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రామ మిఠాయి కొట్టు పనులు మళ్లీ మొదలు పెట్టాలని.. రొటీన్ లైఫ్ అని మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా భార్యతో కాస్త రొమాంటిక్గా కూడా మాట్లాడుతుంటాడు. తర్వాత మిఠాయికి కావలసిన సామాన్లు తేవడానికి వెళ్లాలి అని అంటాడు రామ. ఏం చేస్తాం మిఠాయి ముందున్నా కూడా రుచి చూడలేకపోతున్నాను అంటూ జానకితో అంటాడు. అలా వారి మధ్య కాసేపు రొమాంటిక్ డ్రామా జరుగుతుంది.
తర్వాత జానకి రామను పంపించేస్తుంది. అదే సమయంలో జానకి క్యాలెండర్ వైపు చూడగా తనకు డేటు మిస్సయి 15 రోజులు అయింది అనుకొని వెంటనే మెడికల్ షాప్ కి బయలుదేరుతుంది. అక్కడే ఉన్న జ్ఞానాంబ తన అక్క పంపించిన చీర చూసుకుంటూ ఉండగా హడావుడిగా వెళుతున్న జానకిని చూసి ఎక్కడికి అని అంటుంది.
సోప్ అయిపోయింది తీసుకురావడానికి వెళ్తున్నాను అనటంతో జ్ఞానంబ ఇంట్లో ఉంది అనేసరికి జానకి వెళ్ళిపోతుంది. జానకి మెడికల్ షాప్ లో ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకొని చూడటంతో పాజిటివ్గా వస్తుంది. అది చూసి ఎమోషనల్ అవుతుంది. గతం లో తనను అందరూ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంది. అమ్మవారి ఆశీస్సులు కలిగాయి అని సంతోషపడుతుంది.
వెంటనే డాక్టర్ కి ఫోన్ చేసి అడగటంతో తను ఒక వారం ఆగి టెస్ట్ చేస్తాను అని చెబుతుంది. దీంతో జానకి ఈ విషయం ఇంట్లో వాళ్లకి చెప్పాలా వద్దా అనుకుంటుంది. ఇక ఈ వారం రోజులు ఈ సంతోషాన్ని నా ఒక్కదాని దగ్గరే ఉంచుకుంటాను.. ఎవరికి చెప్పను అని అనుకుంటుంది. ఆ తర్వాత డ్యూటీకి రెడీ అవుతుంది జానకి.
మరోవైపు జ్ఞానంబ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉండగా జానకి కూడా వచ్చి దండం పెట్టుకుంటుంది. ఆ తర్వాత జ్ఞానంబ నువ్వు తల్లి అవ్వాలని కోరుకుంటున్నాను అని తన మనసులో మాటలు బయట పెడుతుంది. దాంతో జానకి మీరేం టెన్షన్ పడకండి అని ధైర్యమిస్తుంది. ఇక జానకి ఇచ్చిన ధైర్యంతో జ్ఞానంబ కాస్త బరువు తగ్గించుకున్నట్లు అనిపిస్తుంది.
Also Read: Madhuranagarilo May 24: రాధ కొడుకు మిస్సింగ్ - చావు బతుకుల మధ్యలో శ్యామ్?