Lakshmi Nivasam Serial Today: 'లక్ష్మి నివాసం' సీరియల్: జైతో పెళ్లికి జాను ఓకే! - ఆనందంలో శ్రీనివాస్ ఫ్యామిలీ.. విశ్వ పరిస్థితి ఏంటి?
Lakshmi Nivasam Today Episode: ఓ వైపు జానుతో తన పెళ్లికి లైన్ క్లియర్ చేసుకుంటుంటాడు జై. మరోవైపు విశ్వ అతనిపై డిటెక్టివ్‌ను పెట్టాలని ప్లాన్ చేస్తాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..

Lakshmi Nivasam Serial Today Episode: తమకు హెల్ప్ చేసింది జై అని తెలుసుకుని లక్ష్మి, శ్రీనివాస్‌లు ఆశ్చర్యానికి లోనవుతారు. జానుతో తన పెళ్లి విషయం ఆలోచించాలని వారికి చెప్తాడు జై. ఫ్యామిలీ అందరి అభిప్రాయం తీసుకుంటామని వారు జైకు చెప్తారు. మరోవైపు.. విశ్వ.. జై అసలు మంచివాడా కాదా?, అతని క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవాలని ఓ డిటెక్టివ్‌ను పెట్టేందుకు యత్నిస్తాడు. ఇంకోవైపు.. తులసి దృష్టిలో మంచి మార్కులు కొట్టేయాలని పాట్లు పడుతుంటాడు సిద్ధు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..
లగ్జరీ కారులో లక్ష్మి, శ్రీనివాస్
జానుతో మాట్లాడి పెళ్లి విషయం చెప్తామని జైతో అంటారు లక్ష్మి, శ్రీనివాస్. అక్కడి నుంచి బయలుదేరబోతుండగా.. తన లగ్జరీ కారులో వారిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇంటికి కారులో వచ్చిన వారిని చూసి ఫ్యామిలీ మొత్తం ఆశ్చర్యపోతారు. షేర్ ఆటోలో రావాల్సిన వాళ్లు లగ్జరీ కారులో ఎలా వచ్చారంటూ కీర్తి షాక్ అవుతుంది.
షాక్ రివీల్ చేసిన లక్ష్మి, శ్రీనివాస్
వాళ్లు సంతోషంగా రావడం చూసి విషయం అడుగుతారు లక్ష్మి, శ్రీనివాస్. తమను జైలు నుంచి విడిపించింది, ఇంటి పత్రాలు తాకట్టు నుంచి విడిపించింది జై అని చెప్తారు. ఎంత ఆస్తిపరుడైనా వినయంతో ఉన్నాడంటూ లక్ష్మి ప్రశంసలు కురిపిస్తుంది. ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సింది జాను అంటూ శ్రీనివాస్ అంటాడు. దీంతో జాను ఆలోచనలో ఉంటూ ఇంటి లోపలికి వెళ్లిపోతుంది.
జాను ఆలోచనలో ఉండడం చూసి విషయం ఏంటని తులసి అడుగుతుంది. జై ఇంట్లో ఆయన తప్ప బంధువులు ఎవరూ లేరని.. ఎందుకు నువ్వు నా గురించే ఆలోచిస్తావ్? అంటూ తులసిని అడుగుతుంది. దీంతో జై గురించి ప్రశంసిస్తూ చెబుతుంది తులసి. అతనితో పెళ్లి విషయంలో పాజిటివ్‌గా ఆలోచించాలంటూ జానుకు నచ్చచెబుతుంది.
నీకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోలేనంటూ తులసితో అంటుంది లక్ష్మి. తన గురించి ఆలోచిస్తూ.. ఎంతో ప్రేమించే జైను వదులుకోవద్దంటూ సలహా ఇస్తుంది తులసి.
బసవ ఇంటికి తులసి
మరోవైపు.. తనను పార్టీ నేషనల్ ప్రెసిడెంట్‌కు పరిచయం చేస్తున్నారంటూ బసవ సంతోషంలో మునిగిపోతాడు. తన భార్య విశాలాక్షితో పాటు వెళ్తాడు. ఇదే సమయంలో జాను తన జాబ్ విషయంలో రికమెండేషన్ లెటర్ కోసం బసవ ఇంటికి వెళ్తుంది. ఆమెను చూసిన బసవ ఆశ్చర్యపోతాడు. విషయం ఏంటని అడగ్గా.. జాబ్ విషయంలో హెల్ప్ చేయాలని అంటుంది. 4 రోజుల్లో జాబ్ ఇప్పిస్తానంటూ తులసికి చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. వెళ్లబోతూ తులసి యాక్సిడెంట్ విషయం కూడా గుర్తు చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
తులసిని సిద్ధు చూశాడా
బసవ ఇంకా బయటకు వెళ్లకుండా వెనక్కు రావడం చూసి ఎందుకు వచ్చావంటూ బసవ అమ్మ అడుగుతుంది. తులసి వచ్చిందని అందుకే వెనక్కు తిరిగి వచ్చేశామని చెప్తాడు బసవ. ఇంతలో సిద్ధు అక్కడకు రావడం చూసి బసవ ఆగిపోతాడు. తులసి రావడంతో సిద్ధుకు మనసులో ఏదో అవుతుంది. దీంతో కిందకు వస్తాడు సిద్ధు. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని అనుకుంటాడు సిద్ధు. బయటకు వచ్చి చూడగా తులసి కనిపిస్తుంది. ఆమెను పలకరించే లోపే ఆటో ఎక్కి వెళ్లిపోతుంది.
మరి తులసిని సిద్ధు కలిశాడా?, జైతో పెళ్లికి జాను ఓకే చెప్పిందా?, జై విషయంలో విశ్వ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్స్ వరకూ ఆగాల్సిందే.





















