Lakshmi Nivasam Serial Today: 'లక్ష్మి నివాసం' సీరియల్: జానుపై జై నిఘా - విశ్వ తననే లవ్ చేశాడని జానుకు తెలుస్తుందా?
Lakshmi Nivasam Today Episode: తులసి ఇంటికి చేరిన ఖుషీని బలవంతంగా తమతో తీసుకెళ్తారు సుపర్ణిక, భార్గవ్. మరోవైపు.. విశ్వ తనతో మాట్లాడడం లేదంటూ జాను బాధ పడుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..

Lakshmi Nivasam Serial Today April 24th Episode: చిన్నారి ఖుషీ.. సుపర్ణిక, భార్గవ్ ఇంటి నుంచి పారిపోయి తులసి వద్దకు వచ్చేందుకు యత్నించగా రౌడీల చేతిలో చిక్కుకుంటుంది. ఇదే సమయంలో ఖుషీని అప్పగించకుంటే జైల్లో పెట్టిస్తామని తులసి ఫ్యామిలీకి వార్నింగ్ ఇస్తుంది సుపర్ణిక. ఖుషీని రౌడీల బారి నుంచి రక్షించిన సిద్ధు పాపను ఇంటికి చేరుస్తుండగా.. లక్ష్మి చూస్తుంది. పాప తమకు కావాల్సిన పాప అంటూ ఖుషీని తీసుకొస్తుంది. ఆ తర్వాత రోజు తులసి ఇంటి నుంచి బలవంతంగా తమతో తీసుకెళ్తారు సుపర్ణిక, భార్గవ్. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..
జానుతో పెళ్లి కలల్లో జై
మరోవైపు.. జానుతో పెళ్లి కలల్లో తేలియాడుతుంటాడు జై. ఓ చీరను అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లి అర్చన చేయిస్తాడు. ఆ తర్వాత పూజారి ఆశీర్వదించి చీరను జైకు ఇస్తాడు. జాను, తన పేరు మీద అన్నదానం చేయించాలని పూజారికి డబ్బిస్తాడు జై. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోబోతుండగా.. గుడికి వచ్చిన ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుకుంటూ జైను ఢీకొట్టగా అతని చేతిలో ఉన్న చీర కింద పడిపోతుంది. దీంతో అతనితో గొడవ పెట్టుకుంటాడు జై.
తనను ఢీ కొట్టిన వ్యక్తిని మాట్లాడుకుంటూ తీసుకెళ్లి కారు డోరులో చెయ్యి పెట్టి గాయపడేలా చేస్తాడు జై. ఆ తర్వాత వార్నింగ్ ఇచ్చి అతన్ని ఆస్పత్రిలో చేరాలంటూ సూచిస్తాడు జై. ఇదే సమయంలో జాను ఆ దారిలో వస్తుంటుంది. గాయపడిన వ్యక్తి వస్తుండగా అది చూసి ఏమైందని అడుగుతుంది జాను. తనను ఓ వ్యక్తి గాయపరిచాడని.. అతను ప్రేమించిన అమ్మాయి కోసం తెచ్చిన చీరను కింద పడేలా చేశానని తనను గాయపరిచాడని జానుకు చెప్తాడు. దీంతో జాను షాక్ అవుతుంది.
ఖుషీకి సుపర్ణిక వార్నింగ్
ఇదే సమయంలో ఖుషీని ఇంటికి తీసుకెళ్లిన సుపర్ణిక, భార్గవ్.. పాపకు వార్నింగ్ ఇస్తారు. ఇంకోసారి ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే కాళ్లు ఇరగ్గొడతామంటూ పాపకు వార్నింగ్ ఇస్తుంది సుపర్ణిక. భాగ్యం కూడా ఖుషీని బెదరగొడుతోంది. దీంతో ఖుషీ ఏడ్చుకుంటూ ఉండిపోతుంది.
విశ్వతో జాను ఫ్రెండ్ షిప్ చూసి జై షాక్
కాలేజీలో విశ్వ డల్‌గా ఉండడం చూసి జాను ప్రశ్నిస్తుంది. సరదాగా మాట్లాడుతుండగా అక్కడకు జై వస్తాడు. ఖుషీని వెతకడానికి వెళ్లిన విషయాన్ని విశ్వతో చెబుతుంది జాను. వాళ్లిద్దరూ క్లోజ్‌గా మూవ్ అవ్వడం చూసి షాక్ అవుతాడు జై. ఇదే టైంలో విశ్వకు వాళ్ల అమ్మ ఫోన్ చేస్తుంది. అతని చేతిలో ఫోన్ తీసుకుని మాట్లాడుతుంది జాను. తన ప్రేమ విషయం ఆ అమ్మాయికి ఇంకా తెలియలేదని జానుతో చెప్తుంది విశ్వ వాళ్ల అమ్మ. ఆ అమ్మాయి ఎవరో తానే కనుక్కొని మీకు చెప్తానంటూ జాను విశాలాక్షితో అంటుంది. విశ్వ ఎవరిని లవ్ చేశాడో తెలుసుకోవలాలని జాను ప్రయత్నిస్తుంది. కానీ విశ్వ ఏదీ రివీల్ చెయ్యడు.
జానుకు స్పై
ఇదే సమయంలో జాను గురించి అక్కడ ఉన్న ఫ్యూన్‌ను అడుగుతాడు జై. జాను, విశ్వ గురించి చెప్పాలంటూ డబ్బులిస్తాడు. నెల రోజులు వాళ్లను అబ్జర్వ్ చేయాలని.. అందుకు డబ్బులిస్తానని ఫ్యూన్‌తో అంటాడు. ఎవరైనా జాను వెంటపడినా.. ఎలాంటి అనుమానం వచ్చినా తనకు చెప్పాలంటూ ఫ్యూన్‌కు చెప్తాడు జై.
మరి విశ్వ తననే లవ్ చేశాడని జాను తెలుసుకుంటుందా?, జై ప్రేమ ఎక్కడికి దారి తీస్తుంది? చిన్నారి ఖుషి పరిస్థితి ఏంటి? వంటివి తెలియాలంటే రేపటి ఎపిసోడ్స్ వరకూ ఆగాల్సిందే.





















