అన్వేషించండి

Lakshmi Nivasam Serial Today: 'లక్ష్మీ నివాసం' సీరియల్: లక్ష్మీ, శ్రీనివాస్‌ల ఇంటికి బసవ - విశ్వ లవ్‌ను జాను యాక్సెప్ట్ చేస్తుందా?, జై ఏం చేస్తాడు!

Lakshmi Nivasam Today Episode: సిద్ధు చేసిన యాక్సిడెంట్ న్యూస్ చూసిన బసవ షాక్ అవుతాడు. తులసి పెళ్లి ఆగిపోవడానికి ఆ ప్రమాదమే కారణమని కీర్తి ద్వారా తెలుసుకుంటాడు బసవ. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..

Lakshmi Nivasam Serial Today Episode: నిరుపేద వృద్ధురాలి ఇంటిని ఎమ్మెల్యే అనుచరులు ఆక్రమించేందుకు యత్నిస్తుండగా సిద్ధు వారిని అడ్డుకుంటాడు. ఇదే సమయంలో తులసి అక్కడకు వస్తుంది. సిద్ధుయే ఆ పని చేస్తున్నాడని భావించి అతన్ని కోపంగా చూస్తూ వెళ్లిపోతుంది. మరోవైపు, స్నేహితుల సలహా మేరకు విశ్వ.. జానుకు ప్రపోజ్ చేసే పనిలో ఉంటాడు. అటు, పేపర్‌లో యాక్సిడెంట్ న్యూస్ చూసి బసవ షాకవుతాడు. ఇంతలో కీర్తి అక్కడకు వచ్చి తులసి పెళ్లి ఆగిపోవడానికి ఆ యాక్సిడెంట్ కారణమని చెప్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ విషయానికొస్తే..

సిద్ధుకు నిజం తెలిసిందా..

తులసి పెళ్లి ఆగిపోయిందని.. పెళ్లి కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని బసవతో చెప్తుంది కీర్తి. కోకాపేట సర్కిల్ వద్ద జరిగిన ప్రమాదం తల్లీ కొడుకులు చనిపోయారని చెప్తుంది. దీంతో బసవ షాక్ అవుతాడు. ఏం జరిగిందంటూ కీర్తి తండ్రిని అడుగుతుంది. ఇదే సమయంలో సిద్ధు అక్కడకు వస్తాడు. యాక్సిడెంట్ విషయాన్ని చెప్పబోతుంటే బసవ అడ్డుకుంటాడు. ఇంతలో తనకు పని ఉందని చెప్పి సిద్ధు బయటకు వెళ్తాడు.

కీర్తి ఇంటికి వచ్చి లక్ష్మీ, నివాస్‌లను పరామర్శిస్తానని బసవ అంటాడు. దీంతో తల్లి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే, ఓట్ల కోసం వెళ్తున్నానంటూ బసవ కవర్ చేస్తాడు. తన కొడుకు సమస్య నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గమని బసవ అనుకుంటాడు. దీంతో తల్లి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది.

జాబ్ పోయిందని ఇంట్లో చెప్పిన తులసి

తాను జాబ్‌కు రిజైన్ చేసినట్లు తులసి ఇంట్లో చెప్తుంది. దీంతో సంతోష్, హరీష్‌లు షాక్ అవుతారు. ఖుషీ బరువును కూడా తమపైనే వేయాలని చూస్తుందని మండిపడతారు. నెలవారీ వాటా ఎక్కువ ఇవ్వాలంటే తమ వల్ల కాదని అంటారు. దీంతో ఎందుకు గొడవ పడతారంటూ శ్రీనివాస్ అంటాడు. తనను ఉద్యోగంలో నుంచి తీసేశారని తల్లితో అంటుంది తులసి. 

ఖర్చులపై ఒకరిపై ఒకరు లెక్కలు వేసుకుంటుంటే.. లక్ష్మీ, శ్రీనివాస్ వారిపై కోపం తెచ్చుకుంటాడు. హరీష్, సంతోష్ తులసిని వెటకారంగా మాట్లాడుతుంటే.. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీంతో జాను తులసిని ఓదారుస్తుంది. తనకు ఖుషీ భవిష్యత్తే ముఖ్యమని.. త్వరలోనే ఉద్యోగం తెచ్చుకుంటానని తులసి వారితో చెప్తుంది. ఖర్చులకు డబ్బులు పెంచాలంటూ లక్ష్మీ కొడుకులను అడగ్గా వారు కాదంటారు. దీంతో శ్రీనివాస్ వారికి నచ్చచెప్పేందుకు యత్నించగా తులసి వద్దంటుంది. 

జానుకు ప్రపోజ్ ట్రైల్స్‌లో విశ్వ

అటు, కాలేజీలో జానుకు ప్రపోజ్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఓ బుట్టలో స్పెషల్ కార్డ్ తీసుకొచ్చి ఆమెకు ఇస్తానని అంటాడు. ఫ్రెండ్స్ అతన్ని ఎంకరేజ్ చేస్తారు. మరోవైపు, కాలేజీలో స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అన్నింటిలోనూ జాను ఫస్ట్ వస్తుంది. విశ్వ ఆమెను బయటి నుంచి ఎంకరేజ్ చేస్తుండగా జై అతన్ని గమనిస్తాడు. సాంగ్స్, రన్నింగ్, ఎడ్యుకేషన్ అన్నింటిలోనూ ఫస్ట్ రావడంపై విశ్వ ఆమెను అభినందిస్తాడు. 

ఈ రోజు స్పెషల్ అని.. నీ కోసం స్పెషల్ గిఫ్ట్ తెచ్చానని జానుతో అంటాడు విశ్వ. తనకు వాటర్ కావాలని అడగ్గా పరిగెత్తుకుంటూ వెళ్లి వాటర్ తెచ్చి ఆమెకు తెచ్చి ఇస్తాడు. ఇంతలో తాను తెచ్చిన గిఫ్ట్ ఆమెకు ఇవ్వబోతాడు. మరి ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడా?, విశ్వకు జై పోటీ వస్తాడా?, బసవ లక్ష్మీ, శ్రీనివాస్ ఇంటికి వెళ్లాడా?, సిద్ధుకు నిజం తెలిసిందా? అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget