అన్వేషించండి

Lakshmi Nivasam Serial Today: 'లక్ష్మీ నివాసం' సీరియల్: విశ్వకు జాను దూరం అవుతుందా? - చిన్నారి ఖుషిని తులసి రక్షిస్తుందా?

Lakshmi Nivasam Today Episode: తమను విడిపించింది బసవ కాదని తెలుసుకున్న తులసి ఫ్యామిలీ ఆశ్చర్యానికి గురవుతారు. మరోవైపు, జానుతో పెళ్లి కోసం కలలు కంటుంటాడు జై. ఇక ఈ రోజు ఎపిసోడ్ విషయానికొస్తే..

Lakshmi Nivasam Serial April 14th Today Episode: తమను జైలు నుంచి బయటకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకు బసవ ఇంటికి వెళ్తారు లక్ష్మీ, శ్రీనివాస్, తులసి. అయితే, తాను బయటకు తీసుకు రాలేదని వారితో బసవ చెప్పడంతో వాళ్లు ఆశ్చర్యానికి గురవుతారు. తులసి సిద్ధు ఇంటికి చేరినా అతను కార్యకర్తలతో బిజీగా ఉండడంతో ఆమెను చూడడం మిస్ అవుతుంది. మరోవైపు, జానుతో పెళ్లి కోసం కలలు కంటాడు జై. అటు, చిన్నారి ఖుషీని భార్గవ్ అతని తల్లి భాగ్యం, సుపర్ణిక ఇబ్బందులు పెడుతుంటారు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..

సిద్ధు తులసి కలుస్తారా..

తమను జైలు నుంచి ఎవరు బయటకు తీసుకొచ్చారో తెలియక కన్ఫ్యూజన్‌తోనే బసవ ఇంటి నుంచి బయల్దేరేందుకు సిద్ధమవుతారు లక్ష్మి, శ్రీనివాస్, తులసి. ఇదే సమయంలో సిద్ధు కిందకు వచ్చి వారు వెళ్తుండగా చూస్తాడు. వాళ్లు ఎవరిని బసవను అడుగుతాడు. అయితే, మనోళ్లే అంటూ కవర్ చేస్తాడు బసవ. 

కీర్తి టెన్షన్..

ఓ వైపు లక్ష్మి, శ్రీనివాస్‌లు తన ఇంటికి వెళ్లగా కీర్తి టెన్షన్ పడుతుంది. తన తండ్రి వాళ్లను రిసీవ్ చేసుకుంటారో లేదో అని అనుకుంటుంది. ఇదే సమయంలో హరీష్ ఆమె వద్దకు వచ్చి ఏదో చెప్పబోతుండగా తనకు తలనొప్పిగా ఉందని విసిగించొద్దని అంటుంది. ఫ్యామిలీ అంతా కీర్తిని పొగుడుతుంటారు. ఇదే సమయంలో లక్ష్మి, శ్రీనివాస్‌లు అక్కడకు వస్తారు.

నిజం తెలిసి ఫ్యామిలీ షాక్

కీర్తిని ఎంత పొగిడినా తక్కువే అని.. తమను క్షేమంగా బయటకు తీసుకొచ్చారని లక్ష్మి కీర్తితో అంటుంది. దీంతో కీర్తి టెన్షన్ పడుతుంది. బసవకు అసలు ఏమీ తెలియదని.. తమను విడిపించింది వారు కాదని అందరితో చెప్తారు లక్ష్మి, శ్రీనివాస్. దీంతో అంతా కీర్తిని వెటకారంగా మాట్లాడతారు. అబద్ధం ఎందుకు చెప్పావంటూ జాను.. కీర్తిని నిలదీస్తుంది. ఇంకెప్పుడూ ఇలా చేసి తమను అవమానించొద్దని లక్ష్మి, శ్రీనివాస్ కీర్తితో అంటారు. దీంతో కీర్తి తలదించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

శ్రీ జ్ఞాపకాల్లో తులసి

ఆ తర్వాత తులసి శ్రీ జ్ఞాపకాలతో బాధ పడుతుంది. అతను గిఫ్ట్ ఇచ్చిన డైమండ్ నెక్లెస్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఖుషిని తలుచుకుని వేదనకు గురవుతుంది. ఇదే సమయంలో జాను అక్కడకు వచ్చి తులసిని ఓదారుస్తుంది. ఖుషి.. సుపర్ణిక ఇంట్లో ఇబ్బందులు పడుతుందని చెప్తుంది. ఎవరి గురించి ఆలోచించొద్దని.. పాపను చూసి రావాలని అంటుంది. 

ఆకలితో ఖుషి వేదన

చిన్నారి ఖుషి ఆకలితో ఇబ్బందులు పడుతుంది. ఓవైపు భాగ్యం ఇష్టానుసారం తింటూ.. ప్లేట్లను కడగాలని ఖుషికి చెప్తుంది. దీంతో ఖుషి కాలి నొప్పితోనే పనులు చేస్తుంది. ఇదే సమయంలో తులసి అక్కడకు వెళ్తుంది. ఆమెను చూసిన భార్గవ్, భాగ్యం షాక్‌కు గురవుతారు. ఖుషిని పట్టుకెళ్లిపోతుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తాడు. తులసిని చూసి సుపర్ణిక కోపం తెచ్చుకుంటుంది. తులసిని చూసి ఖుషి సంతోషపడుతుంది.

మరోవైపు, జై.. జానుతో పెళ్లి కోసం ఆరాటపడుతుంటాడు. అసలు వారిద్దరి పెళ్లికి లక్ష్మి, శ్రీనివాస్ ఫ్యామిలీ ఒప్పుకొంటారా?, విశ్వకు జాను దూరమవుతుందా? ఖుషిని భార్గవ్ ఫ్యామిలీ బారి నుంచి తులసి కాపాడుతుందా?, సిద్ధు, తులసిలు కలుస్తారా? ఇవన్నీ తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget