అన్వేషించండి
Lakshimi Raave Maa Intiki Serial Today March 31th: సీతమ్మవారి మంగళసూత్రం ఎవరు కొట్టేశారు..?సీతారాముల కల్యాణం జరిపించడానికి శ్రీలక్ష్మీ ఏం చేసింది..?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode March 31th:సీతమ్మవారి మంగళసూత్రం ఎవరు కొట్టేశారు..?సీతారాముల కల్యాణం జరిపించడానికి శ్రీలక్ష్మీ ఏం చేసింది..?

లక్ష్మీ రావే మా ఇంటికి టుడే ఏపిసోడ్
Source : ZEE5.com
Lakshimi Raave Maa Intiki Serial Today Episode: ఆంజనేయుడి వేషంలో ఉన్న బాలుడు చెప్పడంతో మ్యాడీ శ్రీలక్ష్మీ కాలికి తగిలిన గాయానికి పసుపు రాస్తాడు. అది చూసి త్రిష, ప్రియంవద కోపంతో రగిలిపోతారు.ఏం చేసినా సరే ఇవాళ వీళ్లతో సీతారాముల కల్యాణం మాత్రం జరగకుండా చేస్తానని ప్రియంవద అంటుంది.అది ఎలా అని మ్యాడీ చెల్లి,తమ్ముడు అడగ్గా...పెళ్లికి అత్యంత ముఖ్యమైన తాళిబొట్టు దొంగలిస్తే పెళ్లి ఎలా జరుగుతుందని అంటుంది.
గుడ్ ఐడియా అని వాళ్లు కూడా సపోర్టు చేస్తారు. ఇంతలో కల్యాణానికి సమయం అవుతుందని శ్రీలక్ష్మీ, మ్యాడీ కల్యాణ మండపం వద్దకు వెళ్తారు.అక్కడ ఆడపెళ్లివారు తరఫున శ్రీలక్ష్మీ నారాయణతోపాటు మిగిలిన వాళ్లు కూర్చుంటారు. పెళ్లికుమారుడు తరఫున మ్యాడీతో పాటు మిగిలిన వాళ్లు కూర్చుంటారు.
అసలు ఈ పెళ్లి ఎందుకు చేస్తున్నారన్న దానిపైన ఇరువురు సంవాదం చేసుకుంటారు. చాలాసేపు రామాయణ గాథల్ని వినిపిస్తారు. ఆ తర్వాత సూర్యనారాయణ కలుగుజేసుకుని శ్రీరాముడు శివధనస్సు విరిచిన నాడే....సీతమ్మ మనసు గెలుచుకున్నారని...ఇప్పుడు మీరు గొడవపడటంలో అర్థం లేదని అంటాడు.కల్యాణానికి సమయం మించిపోతుందని చెప్పడంతో పంతులుగారు పూజా కార్యక్రమం మొదలుపెడతారు.
పూజకు కావాల్సిన సామాన్లు అక్కడ సర్దుతున్న వంకతో ప్రియంవద అక్కడి నుంచి సీతమ్మవారి బంగారు మంగళసూత్రాన్ని ఎవరూ చూడకుండా దొంగిలిస్తుంది. పంతులుగారు మంత్రులు చదువుతూ జీలకర్ర, బెల్లం పెట్టిస్తాడు. మ్యాడీ, శ్రీలక్ష్మీ చేతుల మీదుగా కల్యాణం తంతు సాగుతుంది. కల్యాణ ముహూర్తం రాగా...తాళి కట్టించాలని చూస్తే అక్కడ మంగళసూత్రం కనిపించకపోవడంతో అందరూ షాక్‌కు గురవుతారు.మనిద్దరం కలిసి కల్యాణం చేస్తున్నామంటే ఆ దేవుడికి కూడా ఇష్టం లేదని అందుకే మంగళసూత్రం కనిపించకుండాపోయిందని మ్యాడీ లక్ష్మీతో అంటాడు.
అందుకే నువ్వు ఎలాంటి పిచ్చిపిచ్చి ఆశలు పెట్టుకోవద్దని అంటాడు. అందరూ మంగళసూత్రం కోసం వెతుకుతుండగా...ప్రియంవద కలుగజేసుకుని వీళ్లతో కల్యాణం జరిపించుకోవడం దేవుడికి కూడా ఇష్టంలేనట్లు ఉందని అంటుంది.అందుకే ఈ కల్యాణం ఇక ఆపేసి...వచ్చే ఏడాది ఘనంగా జరిపిద్దామని అంటుంది.ఎట్టిపరిస్థితుల్లోనూ కల్యాణం ఆగకూడదని పంతులుగారు చెబుతారు. అయితే మీరు పూజ కానివ్వండని నేను వెళ్లి తాళిబొట్టు తెస్తానంటూ శ్రీలక్ష్మీ వెళ్తుంది.
శ్రీరామనవమి పండుగని గోపీ సింధూకోసం కొత్త చీర తీసుకుని వచ్చి ఆమెకు ఇస్తాడు. దీంతో ఆమె చిరాకుపడిపోయి....గోపిని గట్టిగా తిడుతుంది. నేను చీర కొనివ్వమని అడిగానా అని అంటుంది.నువ్వు ఇంకా నన్ను భార్యగానే అనుకుంటున్నావా అని అంటుంది.అలాంటిదేమీ లేదని...ఈఇంట్లోకి వచ్చిన తర్వాత కనీసం నీకు ఒక చీర కూడా ఇవ్వలేదని తీసుకొచ్చానని అంటుంది. మనిద్దరితో సీతారాముల కల్యాణం జరిపించాలని అమ్మ అనుకుంటుందని..అందుకే కొత్త చీర కట్టుకుని వస్తే గుడికి వెళ్దామని అంటాడు.
నాకు చీర తీసుకుని ఉద్దేశం గానీ,గుడికి వచ్చే ఉద్దేశం గానీ లేవని సింధూ అంటుంది.మీ అమ్మకు ఏం చెప్పుకుంటావో నువ్వే చెప్పుకోమని అంటుంది. కావాలంటే ఈ చీర తీసుకెళ్లి మీ అమ్మకు ఇచ్చుకో లేకపోతే చీరలు కట్టుకునే అలవాటు ఉంది కాబట్టి నువ్వే ఉంచుకో అని అంటుంది.
అయినా మనం విడాకుల కోసం అప్లై చేశాం కాబట్టి మనం ఇక్కడ ఉండటం కన్నా...హైదరాబాద్ వెళ్లి ఆ పనులు చూసుకుంటే బెటర్‌గా ఉంటుందని అంటుంది. ఇవాళే హైదరాబాద్ వెళ్లడానికి టిక్కెట్లు బుక్‌చేయమని అంటుంది. మంగ కూడా ఊర్లోలేదని...అమ్మను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తామని గోపీ అంటాడు. అయితే నువ్వు ఉండి మీ అమ్మకు సేవలు చేసుకోమని...నాకు మాత్రం టిక్కెట్ బుక్ చేయమని సింధూ అంటుంది.
తాళిబొట్టు కోసం వెళ్లిన శ్రీలక్ష్మీ పసుపుతాడుకు పసుపు కొమ్ము కట్టుకుని తీసుకొస్తుంది.ఇదిగో తాళి వచ్చిందని...ఇక కల్యాణం జరిపించమని అంటుంది. బంగారు మంగళసూత్రం లేకుండా ఈ పసుపుతాడుతో పెళ్లి ఎలా జరిపించాలని ప్రియంవద అనగా....సీతమ్మకు బంగారు ఆభరణాల కన్నా ఈ పసుపుతాడే ముఖ్యమని చెబుతుంది.
Before You Go
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















