అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today March 30th: గోపీ చీరకట్టుకుని పిండి ఎందుకు రుబ్బాడు..?ఆ వేషంలో ఉన్న గోపీని చూసి వాళ్ల అమ్మ ఏం అనుకుంది..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode March 30th: గోపీ చీరకట్టుకుని పిండి ఎందుకు రుబ్బాడు..?ఆ వేషంలో ఉన్న గోపీని చూసి వాళ్ల అమ్మ ఏం అనుకుంది..?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: సీతాదేవీ విగ్రహం తీసుకొస్తూ కిందపడబోయిన శ్రీలక్ష్మీని, ఆమె చేతిలో ఉన్న సీతాదేవీ విగ్రహాన్ని మధుసూదన్ పట్టుకుంటాడు. దీంతో వాళ్ల తాతయ్య సూర్యనారాయణ మధుసూధన్‌ను అభినందిస్తాడు. శ్రీరామనవమిరోజు సీతారాముల కల్యాణం జరిపించడానికి ఏర్పాట్లు చేస్తుండగా...సీతాదేవి విగ్రహం కిందపడిపోయి ఉంటే ఎంతో అపచారం జరిగేదని అలా  కాకుండా నీ భార్యను, సీతమ్మను నువ్వే కాపాడావని పొగుడుతాడు. 

ఆ విగ్రహాలను కల్యాణ మండపంలో ఉంచమని చెప్పగా..శ్రీలక్ష్మీ, మ్యాడీ ఇద్దరూ వెళ్లి వాటిని అక్కడే ఉంచుతారు. సీతారాముల వారి గొప్పతనం వివరించిన సూర్యనారాయణ.. వారి జీవితం మాదిరిగానే మీ ఇరువురి జీవితాలు ఎంతో ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ సీతారాముల కల్యాణం మీ చేతుల మీదుగా జరిపించబోతున్నట్లు తెలపడంతో శ్రీలక్ష్మీ ఎంతో సంతోషిస్తుంది. ఆ మాటలు విన్న  ప్రియంవద కోపంతో రగిలిపోతుంటుంది.

శ్రీరామనవమి కావడంతో  గోపీ తల్లి సావిత్రి హడావుడిపడుతుంటుంది.కోడలు సింధూని పిలిచి నేను షాపుకు వెళ్లి పూజకు కావాల్సిన సరుకులు తీసుకొస్తానని ఇంతలో నువ్వు పానకం తయారు చేయమని చెబుతుంది.అలాగే ఈ పిండి రుబ్బి ఉంచితే నేను రాగానే గారెలు వేస్తానని అంటుంది. అయితే మిక్సీ ఎక్కడ ఉందని సింధూ అడగ్గా...ఈ ఇంట్లో మిక్సీలు ఉండవని రోట్లో పిండి రుబ్బాలని చెబుతుంది. అలాంటి పనులు నాకు రావని చెప్పినా వినకుండా....రాకపోతే నేర్చుకోవాలని అప్పుడే వస్తాయని చెబుతుంది. పానకం తయారు చేయడం కూడా రాదని చెప్పినా...అదేమీ పెద్ద బ్రహ్మవిద్య కాదని నేర్చుకుంటే వస్తుందని చెప్పి హడావుడిగా వెళ్లిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన గోపిని చూపి సింధూ మండిపడుతుంది. మీ అమ్మ ఈ అడ్డమైన పనులన్నీ నాకు చెబుతుందని... నాకు రావని చెప్పినా వినిపించుకోవడం లేదని సింధూ అంటుంది. ఈ పిండి రుబ్బాలంటే వెంటనే మిక్సీ తీసుకుని రమ్మని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది.

సీతారాముల కల్యాణం కోసం ఏర్పాట్లు జరుగుతుండగా....శ్రీలక్ష్మీ అరికాల్లో రక్తం రావడం చూసి సూర్యనారాయణ ఏమైందని అడుగుతాడు. ఇందాక కిందపడబోయే ముందు దేనిపైనా కాలు వేసినట్లు ఉన్నానని గుచ్చుకుందని చెబుతుంది. అయితే వెంటనే మ్యాడీని పిలిచి నీ భార్యను తీసుకెళ్లి పసుపు రాసుకుని తీసుకురమ్మని ఆదేశిస్తాడు. శ్రీలక్ష్మీ దగ్గరకు వెళ్లిన మ్యాడీ...ఇప్పుడు నిన్ను ఎత్తుకుని తీసుకెళ్తానని ఆశపడొద్దని మర్యాదగా నడుచుకుంటూ రా అని అంటాడు. దీంతో శ్రీలక్ష్మీ నడిచి వెళ్తుండగా సూర్యనారాయణ మనవడిపై మండిపడతాడు. తను నడవలేకపోతుంటే....ఎత్తుకుని తీసుకెళ్లాలని తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

దీంతో కోపంతోనే ఆమెను ఎత్తుకుని కిందకు తీసుకెళ్తాడు.అక్కడ కిందపడేసి ఇంకోసారి ఇలాంటి పిచ్చిపిచ్చి నాటకాలు వేయవద్దని శ్రీలక్ష్మిని తిడతాడు. నిన్ను ముట్టుకోవాలంటేనే కంపరం పుడుతుందని అంటాడు. ఇలాంటి నాటకాలు వేసినా నేను నీకు దక్కనని అంటాడు. ఆ మాటలు విన్న త్రిష...నా మ్యాడీ చాలా స్ట్రాంగ్‌గానే ఉన్నాడని అనుకుంటుంది. ప్రియంవద కూడా మ్యాడీ ప్రవర్తన చూసి సంతోషపడుతుంది. పసుపు నువ్వే రాసుకోమని చెప్పి అక్కడ పెడతాడు.ఇంతలో ఆంజనేయస్వామి వేషధారణలో ఉన్న ఓ బాలుడు వచ్చి చెప్పడంతో చేసేదిలేక శ్రీలక్ష్మీకాలు పట్టుకుని పసుపు రాస్తాడు.

దుకాణం నుంచి ఇంటికి వచ్చిన సావిత్రి..చీరకట్టుకుని పిండిరుబ్బుతున్న కొడుకుని చూసి కోడలు అనుకుని సంతోషంతో లోపలికి వెళ్తుంది.లోపల సింధూ కనిపించడంతో మరి పిండి రుబ్బుతోంది ఏవరని వచ్చి చూడగా...గోపీ ఉంటాడు.ఇక అంతే ఆమె గట్టిగా అరుస్తూ ఇలాంటి ఆడపిల్లల పనులు ఎప్పుటి నుంచి చేస్తున్నావురా అని మండిపడుతుంది. అంటే ఉదయం కళ్లాపి చల్లి, ముగ్గులు పెట్టేది కూడా నువ్వేనా అని నిలదీస్తుంది. 

మగాడిలా బతికిని నా కొడుకుని ఇలా ఆడోళ్ల పనులు చేసేలా దిగజార్చావు కదే అంటూ సింధూపై మండిపడుతుంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత సింధూ కూడా గోపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పిండి రుబ్బాలంటే చీర కట్టుకోకుండా కూడా రుబ్బవచ్చు కదా అని అంటుంది. నువ్వు ఇలాంటి పనులు చేసి మీ అమ్మతో తిట్టులు తినిపిస్తావా అని రుసరుసలాడుతూ లోపలికి వెళ్లిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Nindu Manasulu Serial Today August 12th: నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
Jabardasth Venky Warning : వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
Illu Illalu Pillalu Serial Today August 12th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌కి ప్రమాదం..! అంతలోనే ప్రేమ జాకెట్ చింపేసి పరువు పొగొట్టిన ధీరజ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌కి ప్రమాదం..! అంతలోనే ప్రేమ జాకెట్ చింపేసి పరువు పొగొట్టిన ధీరజ్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Embed widget