అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today January 26th: మ్యాడీని చేసుకోవడానికి శ్రీలక్ష్మీ ఎందుకు అభ్యంతరం చెప్పింది..? మధుసూదన్‌ను సూర్యనారాయణ పెళ్లికి ఎలా ఒప్పించాడు.

Lakshimi Raave Maa Intiki Serial Today Episode January 26th: మ్యాడీని చేసుకోవడానికి శ్రీలక్ష్మీ ఎందుకు అభ్యంతరం చెప్పింది..? మధుసూదన్‌ను సూర్యనారాయణ పెళ్లికి ఎలా ఒప్పించాడు.

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: మహాలక్ష్మీతో మధుసూధన్‌కు పెళ్లి అనగానే ఇంట్లో వాళ్లంతా అభ్యంతరం తెలుపుతారు. దీంతో సూర్యనారాయణ వారందరిపై కోప్పడతాడు.  ఇంతలో శ్రీలక్ష్మీ అక్కడికి వచ్చి నా పెళ్లి ఆగిపోవడానికి నేనే కారణమని...పెళ్లికొడుకుపై తాను చేయి చేసుకుని ఉండాల్సింది కాదని అంటుంది. కాబట్టి ఆ శిక్ష నేనే అనుభవిస్తానని అంటుంది. పాముకాటుకు గురై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వీడిని ప్రాణాలకు తెగించి వాడిని బతికించావని...ఇప్పుడు వాడితో బతుకును కూడా పంచుకోమని సూర్యనారాయణ కోరతాడు. నీ పెళ్లి ఆగిపోయింది కాబట్టి జాలిపడి నిన్ను మా ఇంటి కోడలిగా చేసుకోవడం లేదని...మొదటి నుంచి నీమీద ఉన్న ప్రేమ,అభిమానంతోనే అడుగుతున్నానని అంటాడు.నిన్ను చూసిన వెంటనే మా మ్యాడీకి నిన్నే  ఇచ్చి పెళ్లిచేయాలని కోరుకున్నానే తప్ప...నీ పెళ్లి ఆగిపోవాలని ఎప్పుడూ అనుకోలేదని అంటాడు.కానీ ఇది ఆ దేవుడి లీలే అనుకుని మా మ్యాడీని పెళ్లిచేసుకో తల్లి అని బ్రతిమలాడతాడు.
                 మీరు అంటే ఎంతో గౌరవం, భక్తి ఉన్నాయి పెద్దయ్య...మీరు చెబితే ఈ ఊరిలోఎవరిని చేసుకోమన్నా చేసుకుంటాను గానీ...మీ మనవడినిమాత్రం చేసుకోనని అంటుంది. మీ మనవడిని మాత్రం చేసుకోనని తేల్చిచెబుతుంది.అంందుకు మ్యాడీ కల్పించుకని నువ్వు నన్ను రిజెక్ట్‌చేసేది ఏంటని అంటాడు.అసలు నాతో పెళ్లి సంబంధం మాట్లాడే అర్హతే నీకు లేదని మండిపడతాడు. నాకు అసలు ఈ పల్లెటూరు అన్నా, ఈ శ్రీలక్ష్మీ అన్న పరమ అసహ్యమని అంటాడు. మీరు సిటీలో ఉన్న ఏ అమ్మాయిని అయినా చూపించండి తాళి కడతాను తప్ప...ఈ పల్లెటూరు అమ్మాయిని మాత్రం చేసుకోనని మ్యాడీ తెగేసి చెబుతాడు.

నేను కూడా అంతేనని శ్రీలక్ష్మీ చెబుతుంది. ఈ విషయం ఇంతటితో వదిలేయండని అంటుంది. దీంతో సూర్యనారాయణ నా ఆలోచనల్లోనే తేడా ఉందని అంటాడు.నా నిర్ణయంలోనే ఏదో తప్పు ఉన్నట్లు ఉందని నన్ను క్షమించమని శ్రీలక్ష్మీతో అంటాడు. మధుబాబు నాకు సరైనోడు కాదని చెబుతున్నాను తప్ప...మీ నిర్ణయంలో తప్పులేదని అంటుంది. మధుబాబుకు మనుషులంటే విలువలేదని...బంధాలన్నా విలువలేదని అందుకే వద్దని అంటున్నాను అంటుంది. అయితే నీదగ్గర చదువుకునే అబ్బాయి తప్పు చేస్తే సరైన మార్గంలోకి తీసుకొచ్చినట్లే బంధాలంటే విలువలేని మా మధుబాబును కూడా సరైన మార్గంలో నడిపించమని సూర్యనారాయణ కోరతాడు. వెళ్లిపెళ్లి పీటలపై కూర్చోమని చెబుతాడు. మ్యాడీని వెళ్లి తాళికట్టమని ఆదేశిస్తాడు. 
                   మీరు ఎన్నిచెప్పినా  శ్రీలక్ష్మీని చేసుకోవడానికి నేను అంగీకరించనని మ్యాడీ అంటాడు. ఇంతలో వాళ్ల అమ్మ కలుగజేసుకుని మీరు ఇంటి పెద్దని మీరు చేసే ఏపని అయినా ఇంట్లో అందరికీ సంతోషం కలిగేలా ఉండాలి కానీ...ఇలా బాధపెట్టేలే ఉండకూడదని అంటుంది. పెద్దకొడుకు కూడా ఆమెకు వంతపాడతాడు. మ్యాడీకి ఇష్టమైతే మాకు ఎలాంటి  అభ్యంతరం లేదని...కానీ వాడికి ఇష్టంలేకుండా పెళ్లి చేస్తామంటే మాత్రం మేం ఒప్పుకోలేమని అంటాడు. చిన్నకొడుకు, చిన్నకోడలితోపాటు,ప్రియవద సింధూ కూడా ఈ పెళ్లికి ఒప్పుకోరు. 
అసలు పల్లెటూరు అంటేనే ఇష్టంలేని వాడికి జీవితాంతం ఇక్కడే పడి ఉండేలా శిక్షవేస్తున్నారని అంటారు. వాడికి ఇష్టం లేని పెళ్లి చేసి వాడి జీవితం నాశనం చేయవద్దని అందరూ తలొక విధంగా మాట్లాడేసరికి సూర్యనారాయణకు గుండెనొప్పి వస్తుంది.  అతను కిందపడబోతుండగా అందరూ వచ్చి పట్టుకోవడానికి ట్రై చేస్తారు. తనను ఎవరూ తాకడానికి వీళ్లేదని...నా మాట అంటే గౌరవం లేనివాళ్ల నీడ కూడా నామీద పడటానికి వీల్లేదని అందరినీ దూరంగా పొమ్మంటాడు. ఇంతలో శ్రీలక్ష్మీ వచ్చి సూర్యనారాయణను కుర్చీలో కూర్బోబెడుతుంది. 
                         

తన భర్తను అందరూ నోటికొచ్చినట్లు మాట్లాడటంతో ఇందిరకు కోపం వస్తుంది.మీ  అందరి బాగోగులు చూసిన పెద్దాయనకు అతని మనవడి భవిష్యత్‌ గురించి తెలియదా అని నిలదీస్తుంది. ఆయన మాత్రం మ్యాడీమీద ప్రేమలేదా...అని అంటుంది.వాడి జీవతం చెడిపోవాలని ఎందుకు చూస్తారని అంటుంది. తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వాడిని కాపాడిన శ్రీలక్ష్మీ కన్నా మంచి అమ్మాయి ఇంకెవరు ఉంటారని అంటుంది.

ఈ ఊరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా  శ్రీలక్ష్మి గురించి చెడుగా చెప్పలేదంటే....నువ్వు ఆమెను సరిగా అర్థం చేసుకోలేకపోయావని మనవడితో అంటుంది. దీంతో కోపంతో మ్యాడీ  ఇప్పుడు ఈ అమ్మాయి మెడలో తాళికట్టాలి అంతేకదా కడతానంటూ శ్రీలక్ష్మీని తీసుకుని పెళ్లిపీటల మీద కూర్చుంటాడు.అయితే ముహూర్తం దాటిపోయిందని...రాత్రి ఏడున్నర గంటలకు మంచి ముహూర్తం ఉందని పంతులుగారు చెప్పడంతో సూర్యనారాయణ సరేనంటాడు.

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today July 31st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!
Nuvvu leka Neanu Lenu Serial Today July 31th:రాధ గుడికి వెళ్దామంటే కుదరదన్న విక్కీ...చిట్టిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లడంతో రాధ ఏంచేసింది..?
నువ్వులేక నేను లేను: రాధ గుడికి వెళ్దామంటే కుదరదన్న విక్కీ...చిట్టిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లడంతో రాధ ఏంచేసింది..?
Gundeninda Gudigantalu July31th Episode:రోహిణి,మాణిక్యం ఒకే పెళ్లిలోఉన్నారని తెలుసుకున్న విద్య...ఫ్రెండ్‌ను కాపాడేందుకు పాట్లు
గుండెనిండా గుడిగంటలు: రోహిణి,మాణిక్యం ఒకే పెళ్లిలోఉన్నారని తెలుసుకున్న విద్య...ఫ్రెండ్‌ను కాపాడేందుకు పాట్లు
Podarillu Serial Today July 31th: శైలుని ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చిన కేశవ్‌...కేశవ్‌ బాధ్యతను మెచ్చుకున్న మహాలక్ష్మీ
పొదరిల్లు: శైలుని ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చిన కేశవ్‌...కేశవ్‌ బాధ్యతను మెచ్చుకున్న మహాలక్ష్మీ

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Embed widget