Lakshimi Raave Maa Intiki Serial Today January 13th:గోపీతో సింధూ పెళ్లి ఎలా జరిగింది..? కొత్త ఇంట్లో అడుగుపెట్టగానే సింధూ ఏం చేసింది..?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode January 13th: పెళ్లి అయిపోయిన తర్వాత అత్తగారింట కాలుపెట్టిన సింధూజాక్షికి ఎదురైన అనుభవాలేంటి.?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: పెళ్లిమండపంలో పెళ్లికూతురు కనిపించకపోయే సరికి కంగారుపడిన అందరూ...శ్రీలక్ష్మీ సింధూజాక్షిని తీసుకురావడంతో ఊపిరి పీల్చుకుంటారు. ముహూర్తానికి సమయం అవ్వడంతో పంతులుగారు పెళ్లి తంతు పూర్తిచేస్తారు. గోపీ సింధూ మెడలో మూడుముళ్లు వేయడంతో పెళ్లి కార్యక్రమం పూర్తవుతుంది. ఇంతలో పెళ్లిపనుల్లో హడావుడిగా ఉన్న శ్రీలక్ష్మిని ఆపి మ్యాడీ నిలదీస్తాడు. అసలు ఇదంతా ఎలా జరిగిందని అడుగుతాడు.
రాత్రి కారు తాళం మర్చిపోయి తిరిగి ఇవ్వడానికి వెనక్కి వచ్చినప్పుడు మీరు మీ అక్కని ఎలా ఊరి దాటించి పంపించాలో చెబుతుంటే నేను మొత్తం విన్నానని...అప్పుడే మీరు వేసిన పథకానికి రివర్స్ వేశానని చెబుతుంది. నిన్న ఉదయం మీ ప్రెండ్స్ మా ముసలావిడని కారుతో గుద్దేందుకు యత్నించి సారీ కూడా చెప్పకుండా వచ్చేశారని...దీంతో వాళ్లు కారులో వెళ్తున్న విషయం ఆమెకు చేరవేయడంతో ఆవిడ ఊరిలో ఉన్న ముసలాళ్లందరిని వేసుకుని మీ ప్రెండ్స్ వెళ్లే కారును ఆపిందని శ్రీలక్ష్మీ చెబుతుంది. వాళ్ల గొడవపడుతున్న క్రమంలో మీ అక్కకు మత్తుమందు ఇచ్చి స్పృహకోల్పోయేలా చేసి కారులో నుంచి కిందకు దించామని అక్కడ బురఖా వేసుకుని మా ప్రెండ్‌ను ఉంచామని చెబుతుంది. మీరు మీ అక్కకు ఎలాగైతే పెళ్లి చెడగొట్టి పంపిస్తానని మాట ఇచ్చారో...నేను కూడ మా అన్నకు అలాగే ఈ పెళ్లి జరిపించి తీరుతామని మాట ఇచ్చామని శ్రీలక్ష్మీ చెబుతుంది. అలా మీ అక్కను తీసుకొచ్చి పెళ్లిపీటలపై కూర్చోబెట్టినట్లు శ్రీలక్ష్మీ చెబుతుంది. దీంతో మ్యాడీ కోపం రెట్టింపవుతుంది. నీ సంగతి చూస్తానంటూ హెచ్చరిస్తాడు. ఈలోగా పెళ్లి పూర్తవ్వడంతో సూర్యనారాయణ ఊపిరి పీల్చుకుంటాడు. సింధూను ముహూర్తం సమయానికి తీసుకొచ్చినందుకు శ్రీలక్ష్మీకి థ్యాంక్స్ చెబుతాడు. పెళ్లి పూర్తవ‌్వడంతో అప్పగింతలు చేసి సింధూను అత్తారింటికి పంపిస్తారు.
అత్తారింటికి వచ్చిన సింధూకు ధూంధాంగా డ్యాన్స్‌లు వేస్తూ శ్రీలక్ష్మీ గ్యాంగ్ స్వాగతం పలుకుతుంది. కొత్త పెళ్లిజంటకు శ్రీలక్ష్మీ హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. పేర్లు చెప్పి లోపలికి రావాలంటూ శ్రీలక్ష్మీ అడ్డగిస్తుంది. దీంతో గోపి వాళ్లిద్దరి పేర్లు చెప్పినా....సింధూ చెప్పకపోయేసరికి లక్ష్మీ ఎట్టి పరిస్థితుల్లోనూ పేర్లు చెప్పాల్సిందేనని అంటుంది. ఇంతలో తాను గోపి వచ్చామని సింధూ అనడంతో గోపీ వాళ్ల అమ్మ అభ్యంతరం చెబుతుంది. మొగుడిని అలా పేరుపెట్టి పిలుస్తారా అని అంటుంది.అందరి ముందు భర్త పేరు భార్య చెబితే మొగుడి ఆయుషు తగ్గిపోతుందని తిడుతుంది. ఆఅమ్మాయికి అలాంటివి తెలియదులే అని గోపి సర్దిచెబుతాడు. ఇంతలోగుమ్మం మీద ధాన్యం పాత్ర ఉంచి తోసి కుడికాలు లోపల పెట్టి రమ్మని లక్ష్మీ అంటుంది. దీంతో ధాన్యం పాత్రను సింధూ గట్టిగా తన్నుతుంది.అలా ఎందుకు చేశావని నిలదీస్తే...నాకు ఎలా చేయాలో తెలియదంటూ సింధూ చెబుతుంది. కుడికాలు ముందుపెట్టి రమ్మంటే ఎడమకాలు పెట్టి లోపలికి వస్తుంది. ఏంటి వదినా ఇలా చేశావంటే....నాకు రైట్‌లెగ్ అని చెప్పాలి కదా అంటూ సమర్థించుకుంటుంది. లోపలికి వచ్చిన కోడలిని దీపం వెలిగించాలని అత్త కోరుతుంది. దీపం వెలిగించాల్సిందిపోయి...దేవుడి దగ్గర ఉన్న దీపాన్ని సింధూజాక్షి ఆర్పేస్తుంది.





















