Lakshimi Raave Maa Intiki Serial Today February 17th: శ్రీలక్ష్మీని కాలేజీలో చూసి షాక్‌కు గురైన మ్యాడీ...మరి ఆమెకు అడ్మిషన్ దొరక్కుండా మ్యాడీ వేసిన వేషం ఏంటి..?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode February 17 th: శ్రీలక్ష్మీని కాలేజీలో చూసి షాక్‌కు గురైన మ్యాడీ...మరి ఆమెకు అడ్మిషన్ దొరక్కుండా మ్యాడీ వేసిన వేషం ఏంటి..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: శ్రీలక్ష్మీని తీసుకుని నేరుగా కాలేజీకి వచ్చిన సూర్యనారాయణను చూసి మ్యాడీ షాక్‌కు గురవుతాడు. ఇప్పుడు ఈ ఎర్రబస్సును అందరికీ నా భార్యగా పరిచయం చేస్తాడని తెలిసి భయపడిపోతాడు. ఆయన ఎవరికీ చెప్పకుండానే అడ్డుకోవాలని భావించి పరుగెత్తుకుండూ వాళ్ల తాతయ్య దగ్గరకు వస్తాడు. మీరు ఎందుకు తాతయ్య ఇలా వచ్చారని అడుగుతాడు. శ్రీలక్ష్మీ కూడా నీతోపాటు ఈ కాలేజీకి వస్తుందని తెలుసు కదా అలాంటప్పుడు నువ్వు ఆమెను తీసుకురావాలని తెలియదా అంటూ మండిపడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఫ్రొపెసర్‌తో శ్రీలక్ష్మీ గురించి సూర్యనారాయణ చెబుతాడు. ఈ అమ్మాయికి మీ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చిందని కాకపోతే మీరు పంపిన అడ్మిషన్ లెటర్ కాలిపోయిందని చెబుతాడు. అయినా పర్వాలేదని మా దగ్గర రికార్డులు ఉంటాయని అడ్మిషన్ లెటర్ లేకపోయినా ఏం కాదని చెప్పడంతో సూర్యనారాయణ మనసు శాంతిస్తుంది.నేను దగ్గర ఉండి అడ్మిషన్ ఏర్పాట్లు చూసుకుంటానని మీరు వెళ్లండని మ్యాడీ వాళ్ల తాతయ్యను ఇంటికి పంపిస్తాడు. నీ అడ్మిషన్ లెటర్ కాల్చివేస్తే ఇక నువ్వు రావేమో అనుకున్నానని కానీ ఎలా వచ్చావని...ఇంట్లో ఏం జరిగిందని మ్యాడీ శ్రీలక్ష్మీని నిలదీస్తాడు.
మీ అత్తయ్య నా అడ్మిషన్ లెటర్ కాల్చివేసిన తర్వాత శ్రీలక్ష్మీ ఏడుస్తూ అక్కడే ఉంటుంది. గుడి నుంచి వచ్చిన సూర్యనారాయణ ఏం జరిగిందని నిలదీస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియంవద శ్రీలక్ష్మీ హారితి ఇస్తుంటే లెటర్ కాలిపోయిందని ప్రియంవద చెబుతుంది. శ్రీలక్ష్మీ చదువుకోవడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదననుకుంట నాన్న అని అంటుంది. సూర్యనారాయణ మళ్లీ శ్రీలక్ష్మీని ఏం జరిగిందని అడుగుతాడు. హారతి అంటుకుని లెటర్ కాలిపోయిందని చెబుతుంది.ఇంతలో ప్రియంవద కల్పించుకుని పెళ్లయిన అమ్మాయికి చదువులు ఎందుకనిఅంటుంది. ఇలా మన ఇంటి కోడలు కాలేజీకి వెళ్తుంటే మన పరువు ఏం అవుతుందని అంటుంది. దీంతో మండిపడిన సూర్యనారాయణ ఆమె కాలేజీకి వెళ్లితీరుతుందని గట్టిగా చెబుతాడు. నేనే ఆమెను కాలేజీకి తీసుకెళ్తానని అంటాడు.ఇదేవిషయాన్ని శ్రీలక్ష్మీ మ్యాడీకి చెబుతుంది. అయితే నువ్వు ఖచ్చితంగా కాలేజీకి వస్తానంటావు అంటాడు.అవునని అంటుంది శ్రీలక్ష్మి. అయితే నీ మెడలో ఉన్న తాళిబొట్టు వెంటనే తీసిపడేయ్ అని మ్యాడీ గొడవ చేస్తాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ తియ్యనని చెబుతుంది. కనీసం కనిపించకుండా దాచేయమని చెప్పినా ఆమె వినదు. నువ్వు నా భార్య అని సంగతి ఇక్కడ అందరికీ తెలిసిపోతే నా పరువుపోతుందని అంటాడు.ఇందులో తప్పేముందని శ్రీలక్ష్మీ వాదిస్తుంది. ఇప్పుడు నువ్వు తాళి దాచిపెట్టకపోతే...నేను ఈ కాలేజీలో చేరకుండా వెళ్లిపోతానని బెదిరించడంతో శ్రీలక్ష్మీ తాళిని ఎవరికీ కనిపించకుండా దాచిపెడుతుంది. నువ్వు కాలేజీకి వచ్చినన్ని రోజులు ఇలాగే రావాలని ఆమె వద్ద ప్రమాణం చేయించుకుంటాడు మ్యాడీ.
శ్రీలక్ష్మీని తీసుకుని అడ్మిషన్ బ్లాక్ వద్దకు వచ్చిన మ్యాడీని చూసి త్రిష, ప్రెండ్స్ అందరూ నిలదీస్తారు. తాను కాలేజీకి రాకుండా మేం అడ్మిషన్ లెటర్ కాల్చివేశామని..కానీ మా తాతయ్య తీసుకొచ్చాడని మ్యాడీ చెబుతాడు.అప్పుడే త్రిష ఒక ప్లాన్ వేస్తుంది. నువ్వు ప్యూన్ వేషం వేసి శ్రీలక్ష్మీని అడ్మిషన్ కోసం పిలిచినట్లు పిలిచి నీ వెంట తీసుకెళ్లి ఎవరూ లేని గదిలో పెట్టి తాళం వేసి రమ్మని చెబుతుంది. దీంతో మ్యాడీ ప్యూన్ వేషం వేసి శ్రీలక్ష్మీని అడ్మిషన్‌కు పిలుస్తున్నారని చెప్పి పిలుస్తాడు. ఆమె నిజమేననని నమ్మి మ్యాడీ వెంట వెళ్తుంది. ఆమెను ఓ గదిలో పెట్టి బయట గడియపెట్టి వెళ్లిపోతాడు మ్యాడీ.























