Lakshimi Raave Maa Intiki Serial Today December 23 rd: సింధూకు తాతయ్య ఇచ్చిన సర్‌ప్రైజ్ ఏంటి..? లక్ష్మీ పై చదువులకు ఎక్కడికి వెళ్లాలని అనుకుంటుంది...?
Lakshimi Raave Maa Intiki : ఆస్ట్రేలియా వెళ్లలనుకుంటున్న సింధూకు తాతయ్య సూర్యనారాయణ పెళ్లి సంబంధం తీసుకురావడంతో షాక్‌కు గురవుతుంది. అటు లక్ష్మీ పై చదువులకు తల్లి నూకాలు అడ్డుపడుతుంది.

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: తాతయ్య భయంతో మ్యాడీ పరీక్షలు రాసేందుకు వెళ్లగా...క్వచ్చన్ పేపర్ చూసిన తనకు ఏం రాయాలో ఏం అర్థం కాదు.తనకు మాత్రం షూటింగ్‌లో సీన్ పేపర్, డైలాగ్‌లు గుర్తుకు వస్తాయి. ఇంతలో పక్కనే ఉన్న తన ప్రెండ్ త్రిష పేపర్ లాక్కుని అందులో ఉన్న ఆన్సర్లు మొత్తం రాసేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత తనకు పరీక్షల్లో హెల్ప్ చేసినందుకు గిప్ట్ ఇస్తానంటూ మ్యాడీ రాఖీ తీస్తాడు. దీంతో త్రిష భయపడుతుంది. తనను కట్టమంటాడేమోనని కంగారుపడుతుంది. దీంతో అక్కడి నుంచి త్రిష మాయమవుతుంది.
ఇంట్లో సింధూజ మాత్రం ఏంతో సంతోషంగా ఉల్లాసంగా గడుపుతుంది. తాను ఆస్ట్రేలియా వెళ్లడానికి తాతయ్య తప్పకుండా ఒప్పుకుంటారని సంబరపడిపోతుంటుంది. ఇంతలో సూర్యనారాయణ వచ్చేసమయం అయ్యిందని వాళ్లావిడ ఇందిర హడావుడి చేస్తుండగా...అక్కడికి వచ్చిన వాళ్ల కుమార్తె ప్రియం వద వచ్చి మొగుడికి ఇంత భయపడాలా అని నిలదీస్తుంది. భయానికి గౌరవానికి తేడా తెలిస్తే నువ్వు మొగుడిని వదిలేసి వచ్చి పుట్టింట్లో ఉండేదానివి కాదని హెచ్చరిస్తుంది. ఇంతలో సూర్యనారాయణ ఇంట్లోకి అడుగుపెట్టడంతో ఎక్కడివాళ్లు అక్కడ సర్దుకుంటారు. ఆయన ఇంట్లోకి వస్తూనే సింధూని పిలిచి చీర ఇస్తారు. దీనికి ఆస్ట్రేలియాలో చీరలు కట్టుకోరు తాతయ్య అని అంటుంది. నేను ఇస్తుంది నువ్వు ఆస్ట్రేలియాలో కట్టుకోవడానికి కాదని... ఇప్పుడు కట్టుకుని రా అని అంటాడు. ఎందుకు అని అడిగినా...తర్వాత చెబుతాలే గానీ ముందు వెళ్లి చీర కట్టుకుని రా అని అంటాడు. ఇంట్లో వాళ్లందరికీ ఏం జరుగుతుందో అర్థం కాదు.
లక్ష్మీకి వాళ్ల నాన్న రిజిస్టర్ పోస్టు వచ్చిందని చెప్పి...ఇస్తాడు. అది తెరిచి చూసిన లక్ష్మీ తనకు హైదరాబాద్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చిందని ఆనందంతో గెంతులేస్తుంది. ఇంతలో వాళ్ల అమ్మ అక్కడికి వచ్చి ఇన్నాళ్లు దీని చదువుకు తగలేసింది చాలు...ఏదో ఒక సంబంధం చూసి పెళ్లిచేసి పంపించేద్దామని అంటుంది. ఇప్పుడు దాని పెళ్లికి ఏం తొందరొచ్చిందని వాళ్ల నాన్న అంటాడు. ఇంట్లో ఇంకా చదివించాల్సిన వాళ్లు ఇద్దరు ఉన్నారని వాళ్ల అమ్మ చెప్పగా...చదువు ఫ్రీగా చెప్పినా హాస్టల్ ఫీజు, బట్టలు, పుస్తకాలకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయని నూకాలు అంటుంది.
సింధూకు చీరకట్టించి వాళ్లఅమ్మ, పిన్ని కిందకు తీసుకొస్తారు. బుగ్గన చుక్కకూడా పెట్టాలని సూర్యనారాయణ కోడలిని ఆదేశిస్తాడు. ఆయన చర్యలకు అక్కడ ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోతుంటారు. బుగ్గన చుక్కపెట్టగాని ఇప్పుడు పెళ్లికళ వచ్చేసిందని సూర్య నారాయణ అనగా...సింధూజకు ఏం అర్థం కాదు. తనకు పెళ్లిచేయబోతున్నారని తెలిసి ఇంట్లో అందరూ షాక్‌కు గురవుతారు. మన సింధూజాకు పెళ్లి చేయబోతున్నామని సూర్య నారాయణ చెబుతాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన మ్యాడీ ఈ మాటలు విని ఆశ్చర్యపోతారు. ఆస్ట్రేలియా పోదామని ఆనందంలో మునిగిపోతున్న సింధూజా ఈ మాటలు విని కుప్పకూలిపోతుంది. మంచి పెళ్లి సంబంధం వచ్చిందని...వాళ్లు పంపించేందే ఈ చీర అని సూర్యనారాయణ చెబుతాడు. నా ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ నీకు చెప్పాను కదా తాతయ్య....ఇప్పుడు పెళ్లి ఏంటని సింధూ అడుగుతుంది. నీ జీవితం ఎలా ఉంటే బాగుంటుందో నాకు తెలుసమ్మాఅని తాతయ్య బదులిస్తాడు. అబ్బాయిది ఏ ఊరని ఇంట్లో వాళ్లు అడగ్గా...మన గ్రామం శ్రీముఖలింగమని సూర్య నారాయణ బదులిస్తాడు. పేరు గోపీ అని చెబుతాడు.అబ్బాయి వ్యవసాయం చేస్తుంటాడని వివరిస్తాడు.
తల్లి నూకాలు మాటలకు బాధపడుతున్న శ్రీలక్ష్మిని తండ్రి ఓదారుస్తాడు. నేను అన్నీ చూసుకుంటానని...నువ్వు పై చదువులకు హైదరాబాద్ వెళ్లే బాధ్యత తనదని అంటాడు. ఇంతలో గోపికి రాఖీ కట్టి వస్తానని శ్రీలక్ష్మీ వెళ్తుంది. ఇంతలో సూర్యనారాయణ చెప్పిన మాటలకుఇంట్లో వాళ్లు అభ్యంతరం చెబుతారు. ఏం చదువుకోకుండా పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే వాడికి సింధూను ఎలా ఇస్తామని కూతురు ప్రియంవద అడుగుతుంది. ప్రపంచ దేశాలన్నీ అతని సేవలు కొనుక్కోనేంత గొప్ప చదువులు చదువుకున్నాడని సూర్యనారాయణ వాళ్లకు చెబుతాడు. ఆ పల్లెటూరు సంబంధం ఎందుకని మ్యాడీ తాతయ్యను అడుగుతాడు. అటు మ్యాడీతల్లి కూడా ఈ పల్లెటూరు సంబంధం ఎందుకు ఖాయం చేశారని అడుగుతుంది. మీరందరూ కలిసి సింధూని గారాబం చేసి పెంచారని నాకు తెలుసంటాడు. తనపనులు కూడా తాను చేసుకోలేదన్న సంగతి నాకు తెలుసంటాడు. గోపీ కాకుండా ఇంకో వ్యక్తి అయితే సింధూను ఒక్కరోజు కూడా భరించలేడని చెబుతాడు. గోపీ ఈకాలం కుర్రాళ్లలాంటి వాడు కాదని...నెమ్మదస్తుడని,అర్థం చేసుకుని సర్దుకుపోయేవాడని అందిరికీ అర్థమయ్యేలా వివరిస్తాడు. నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని....వాళ్లను తాను మాటిచ్చానని సూర్యనారాయణ అంటాడు. మనం అందరూ బయలుదేరి శ్రీముఖలింగం వెళ్లాలని...పెళ్లి అక్కడే మన బంగ్లాలో జరుగుతుందని తేల్చి చెబుతాడు.





















