అన్వేషించండి

Krishna Mukunda Murari November 18th Today Episode : భవాని మీద విరుచుకుపడ్డ మురారి, కృష్ణను తన ఇంట్లో ఉండమంటూ రిక్వెస్ట్!

Krishna Mukunda Murari Serial Today Episode : కృష్ణ తనకు ఏమవుతుందని మురారి తన ఇంట్లో వాళ్లను అడగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Serial November 18th Episode : నందిని: నటన అయితే కృష్ణ ఎందుకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది అమ్మ.

భవాని: అప్పుడు అయితే మురారికి గతం గుర్తొస్తుంది అని తన ఐడియా. ఎంతైనా డాక్టర్ చదివింది కదా. పైగా వాళ్ల ఫ్యామిలీ ప్రాణాలు తీసే ఫ్యామిలీ అని ప్రూవ్ అయింది కదా.

మధు: పెద్దమ్మ నీతో చెప్పే అంతటోడిని కాదు కానీ ఇంకా వాళ్లు ప్రాణాలు తీశారు అని ప్రూవ్ అవ్వలేదు కదా పెద్దమ్మ. వాళ్లు మౌనంగా ఉండేది వాళ్లు కోర్టు మెట్లు ఎక్కలేక కాదు, వాళ్లకు డబ్బు లేకా కాదు. కానీ మనం కృష్ణను ఏమైనా చేస్తాం అనే భయంతో. ఆడపిల్లను కన్న ప్రతీ తండ్రికి ఉన్న భయమే పెద్దమ్మ.

భవాని: ఏంట్రా అందరూ చెప్పే వాళ్లు అయ్యారు. పెద్ద వాళ్లు అయిపోయారు కదా తోడపుట్టకపోయినా చెల్లి అనుకున్నా కూడా రేవతికీ నచ్చడం లేదు. మీరంతా భ్రమలో ఉన్నారు. ఉండండి కానీ నేను భ్రమలో ఉన్నానని మీరు అంటున్నారు. తొందర్లొనే ఆ భ్రమల్ని, పొరల్ని తొలగిస్తాను. ముకుంద వెళ్లి మురారిని తీసుకొని రా .

మురారి: మనసులో.. ఎందుకు వేణి గారు నాకు బాగా పరిచయంలా అనిపిస్తోంది. ఇంతలో కృష్ణ లేస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది?

కృష్ణ: పర్వాలేదు సార్. నన్ను కాపాడినందుకు థ్యాంక్యూ సార్. ఇంతలో కృష్ణ పిన్ని వచ్చి చీర మార్చుకుందువు లేమ్మా అంటే మురారి బయటకు వెళ్తాడు. మరోవైపు తను ఎందుకు వేణిని కృష్ణ అని పిలిచానా అని ఆలోచిస్తాడు

మురారి: వేణి గారు ఇప్పటికి ఈ ప్రశ్న చాలా సార్లు అడిగాను. మళ్లీ ఇప్పుడు అడుగుతున్నాను. దయచేసి నిజం చెప్పండి. ఎప్పుడూ మిమల్ని వేణి గారు అని పిలిచే నేను మీకు ప్రమాదం జరిగినప్పుడు వేణి గారు అనకుండా కృష్ణ అని ఎందుకు పిలిచాను. చెప్పండి.

కృష్ణ: (మనసులో) ఏం చెప్పమంటారు ఏసీపీ గారు చెప్తే నాకు పర్వాలేదు. కానీ మీరు ఇబ్బంది పడతారనే భయం.

మురారి: వేణి గారు నా గతంలో మీరు ఎవరు. మిమల్ని కృష్ణ అనే అంత చనువు నాకు ఉందా?

కృష్ణ: మీరు నాన్ను చదివించారు సార్. ఆ చనువు ఎక్కడికి పోతుంది చెప్పండి.

మురారి: అంతే అంటారా. ఒకవేళ మీరు చెప్పిందే నిజం అనుకుంటే అప్పుడు కూడా నేను మిమల్ని వేణి గారు అనే పిలవాలి కదా.  నా ప్రమేయం లేకుండా కృష్ణ అని ఎందుకు పిలిచాను. చెప్పు కృష్ణ .

ముకుంద: అక్కడికి వచ్చి.. ఇది ఇప్పుడు ఏం చెప్పుందో అయినా నేనేంటి ఇలా గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్నాను. మురారి.

మురారి: అనుకున్నా. ఏంటి పెద్దమ్మ రమ్మంటున్నారా.. నీతో కబురు పంపారా. ఇక్కడ ఉంటే వాళ్లకు భయం. తన దగ్గర ఉంటే వాళ్లకు ఎందుకు భయం. ఇంతకీ మీరంటే వాళ్లకు కోపం భయం ఎందుకు?

ముకుంద: మురారి ప్లీజ్ అత్తయ్య నిన్ను అర్జెంటుగా రమ్మంటున్నారా రా వెళ్దాం.

మురారి: సరే అయితే అక్కడే తేల్చుకుందాం. ఎంతో కాలం దాచలేరు. మీరు అయినా వీళ్లు అయినా..

ఇక కృష్ణ పిన్ని వచ్చి ఏంటి బిడ్డా నీకు నిజం చెప్పడానికి అవకాశం వచ్చినా చెప్పడంలేదు అని అడుగుతుంది. కృష్ణ అయితే ఇప్పుడు మనం నిజం చెప్పినా దాన్ని అబద్ధం చేయడానికి వాళ్లకి క్షణం పట్టదు. మనం ఒకటి చెప్పి వాళ్లు ఇంకోటి చెప్పడం కంటే వాళ్లే నిజం తెలుసుకునేలా చేయాలి. చిన్నాన్న దగ్గరకు వెళ్తే మొత్తం సాధ్యమవుతుందని చెప్తుంది. ఇక తన భర్తని అడుగుతుంటే ఆయన చెప్పడం లేదని కృష్ణ పిన్ని అంటుంది. ఇక ఆ ఇంట్లో మురారి ఎంత గొడవ చేస్తుంటాడో అని కృష్ణ అనుకుంటుంది.

రేవతి: అక్కా నన్ను క్షమించండి అక్క మీ మనసు కష్టపెట్టాను. మీ మనసు ఏంటో నాకు తెలుసు అక్కా కానీ వద్దొద్దు ఆ కృష్ణని అవుట్ హౌస్‌లోనే ఉంచాం కదా అక్క అక్కడే ఉండనిద్దాం. ఎప్పుడైనా మన మురారికి బాలేకపోతే అప్పుడొచ్చి వెళ్తుందిలే. ఇందాక మీరు అన్నారు కదా ఒకే కడుపున పుట్టకపోయినా నా చెల్లెలు అని మీరు నాకు అంతకంటే ఎక్కువ అక్క. పేరుకే మురారి నా కొడుకు కానీ వాడు పెరిగింది మీ పెంపకంలో కదా అక్క. ఏంటక్కా మాట్లాడరు. 

భవాని: (మురారి అక్కడికి వస్తాడు)ఎలా ఉంది నాన్న ఇప్పుడు. నువ్వు చాలా సాహసం చేసి తన ప్రాణాలు కాపాడావు.

మురారి: ఎవరి ప్రాణాలు?

భవాని: అదేంటి నాన్న డాక్టర్ కృష్ణవేణిని.

మురారి: అదే ఆ డాక్టర్ కృష్ణవేణి ఎవరు పెద్దమ్మ. నేను ఆ వేణి గారిని ఒక్కరినే చదివించానా?

భవాని: లేదు నాన్న నువ్వు చాలా మందిని చదివించావు.

మురారి: మరి వారంతా నాకు ఎందుకు గుర్తు రావడం లేదు. ఈ వేణి ఒక్కరే ఎందుకు పదే పదే గుర్తొస్తున్నారు. మళ్లీ మళ్లీ వెళ్లి కలవాలి అనిపిస్తోంది. చెప్పరు ఎవ్వరూ చెప్పరు. ఆ కృష్ణ వేణిని అడిగినా చెప్పదు. నేను మాత్రం వెర్రివాడిలా అక్కడికి ఇక్కడికి తిరగాలి. నా తల పగిలి పోతుంది. నేను అడిగే ప్రశ్నకు మౌనమే సమాధానంగా ఉంది. నాకు కోపం రాదా. బాధగా అనిపించదా.. ఒక్కరంటే ఒక్కరు చెప్పడం లేదు. 

భవాని: ఏమైనా ఉంటే కదా నాన్న చెప్పడానికి.. చదివించాం అది నిజం.. వాళ్లు మనల్ని దారుణంగా మోసం చేశారు అదీ నిజమే..

మురారి: నాకెందుకో అది నిజం కాదు అనిపిస్తోంది పెద్దమ్మ.

భవాని: అదే నిజం. నువ్వు నమ్మడం లేదు. మేం నమ్మించాలని ప్రయత్నించడం లేదు. నువ్వు నమ్మాలి కానీ నిజానికి మేము నమ్మించాల్సిన అవసరం లేదు.

మురారి: ఉంది చాలా ఉంది. ఏం దారుణం చేశారు మనకి..

భవాని: అవన్నీ ఇప్పుడు చెప్తే నీ ఆరోగ్యం పాడైపోతుంది నాన్న ఎటూ అమెరికా వెళ్తున్నావు కదా అప్పుడు నీ అంతట నీకే తెలుస్తుంది. మురారి.. అబద్దం చెప్పి నిన్ను ఏమార్చాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు....

మురారి: చెప్పండి చెప్తే నేనేం చనిపోను. అదే జరిగినా బాగుండేది.. చెప్పండి నేను నేను తర్వాత ఏంటి

భవాని: నువ్వు చనిపోయావని ఓ అనాథ శవాన్ని తెచ్చి మాకు నమ్మించారు. కానీ నువ్వు బతికే ఉండి ఆ అమ్మాయి వాళ్ల హాస్పిటల్‌లో ఉన్నావు. 

ఈ మాట వినడంతో మురారికి తల విపరీతంగా నొప్పి వచ్చి ఇబ్బంది పడతాడు. ఇక భవాని కృష్ణను పిలుచుకురమ్మని భవానికి చెప్తుంది. ఇక భవాని కృష్ణతో మురారి ఏం అడిగినా అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు అని చెప్తుంది. ఇక కృష్ణ మురారికి చెక్‌అప్‌ చేస్తుంది. ఏం ఆలోచిస్తున్నారు అని మురారిని అడుగుతుంది. ఇక ఆ విషయం గురించి అడిగితే బాగుంటుందా లేదా అని మురారి మనసులో అనుకుంటాడు. వేణి గారు తన ఎదురుగా ఉంటే చాలు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాడు. ఇక నీకు ఓ విషయం అడగాలి అని కృష్ణను అంటాడు. ఇక మురారి కృష్ణను తన ఇంట్లోనే ఉండాలి అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Embed widget