Krishna Mukunda Murari Serial Today March 23rd: కృష్ణ ముకుంద మురారి సీరియల్: మురారిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చిన ముకుంద.. బిత్తరపోయిన హీరో, కుప్పకూలిపోయిన కృష్ణ!
Krishna Mukunda Murari Today Episode కృష్ణ ద్వార తన తండ్రి అరెస్ట్ చేయించింది మురారిని అని ముకుంద తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode మురారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో కృష్ణ కుమిలిపోతుంది. అనవసరంగా ఆదర్శ్‌ని తీసుకొచ్చాని అని లేదంటే ఇవేమీ జరిగేవి కాదు అని కృష్ణ తన అత్తకు చెప్పుకొని ఏడుస్తుంది. మరోవైపు భవాని హోం మినిస్టర్‌కి కాల్ చేస్తుంది. మురారిని విడిపించమని భవాని కోరితే.. తన వల్ల కాదు అని మహిళా సంఘాలు ఇన్వాల్వ్ అయ్యాయి అని చేతులెత్తేస్తాడు. హోం మినిస్టర్ భవానితో మాట్లాడుతున్నప్పుడు శ్రీనివాస్ పక్కనే ఉంటాడు. శ్రీనివాస్ మినిస్టర్‌కు థ్యాంక్స్ చెప్తాడు. మరోవైపు ఆదర్శ్ ఫుల్లుగా తాగుతూ ఉంటాడు.
మధు: ఎవరు ఎంత చెప్పినా నువ్వు నీ ప్రవర్తన ఎందుకు మార్చుకోవడం లేదు ఆదర్శ్.
ఆదర్శ్: క్లాస్ పీకడానికి వచ్చావా నీ మాటలు వినడానికి ఎవరికీ ఇంట్రస్ట్ లేదు వెళ్లు.
మధు: వినాలి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చేస్తాను అంటే కుదరదు ఇక్కడ. ఎందుకు నీ మాటలతో కృష్ణని హింసిస్తావు. కోపం వస్తే మనసులో దాచుకో. అంతేకానీ ఎదుటివాళ్లని కష్టపెట్టేలా మాట్లాడకు. అసలు ఇంటి పరిస్థితులు ఏంటి ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుసుకొని మాట్లాడు బ్రో. చెప్పింది చెవికి ఎక్కించుకుంటే మంచిది లేదంటే వేరేలా ఉంటుంది.
ఆదర్శ్: రేయ్ పెగ్ కోసం బెగ్ చేసే నువ్వు కూడా నాకు నీతులు చెప్తున్నావా. కామెడీగా లేదా పోరా బయటకు పోరా..
మధు: బ్రో మాటలకు నీ చేతలకు నీ మీద నాకు ఉన్న కోపానికి ఆ మందు బాటిల్ తో నీ బుర్ర బద్దలకొట్టాలి అని ఉంది.
మరోవైపు మధు తన ఫ్రెండ్ అయిన కమిషనర్ కొడుకుకు కాల్ చేసి మధు గురించి తెలుసుకోమని చెప్తాడు. ఇక భవాని రేవతికి కాల్ చేస్తుంది. హోం మినిస్టర్ చేతులు ఎత్తేసాడు అని చెప్తుంది. రెండు రోజుల్లో వస్తాను వచ్చి చూస్తాను అని భవాని అంటుంది.
కానిస్టేబుల్: మేడం ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని వచ్చాను. ఏసీపీ సార్ చాలా మంచి వారు. ఆయన వెనకు ఏదో కుట్ర జరుగుతుందమ్మ. ఏదో ఒకటి చేసి ఆయన్ను తొందరగా బయటకు తీసుకొని రండి అమ్మ. లేదంటే లాకప్ డెత్ జరిగినా ఆశ్చర్యం లేదు.
కృష్ణ: కుప్పకూలిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు నా కొడుకును లాకప్ డెట్ చేయడం ఏంటి.
కానిస్టేబుల్: అవన్నీ నాకు తెలీవు అమ్మ మా ఇన్‌స్పెక్టర్ పై ఆఫీసర్‌తో మాట్లాడుతుంటే విన్నాను.
కృష్ణ: అత్తయ్య ఎలా అయినా ఏసీపీ సార్‌ని కాపాడండి.. మధు ఏదో ఒకటి చేయు మధు లేకపోతే మనకు ఆయన దక్కరు. కృష్ణ వెక్కివెక్కి ఏడుస్తుంది.
రేవతి: కృష్ణ ఆలోచించు ఎవరు మనల్ని ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తారు.
కృష్ణ: ఉన్నారు అత్తయ్య ఒకరు. శ్రీనివాస్ బాబాయ్.
రేవతి: అరెస్ట్ చేయించిందే ఆయన ఆయన మనల్ని ఈ సమస్య నుంచి కాపాడుతారా..
కృష్ణ: అవసరం అయితే ఆయన కాళ్లు పట్టుకొని అయినా సరే బతిమాలుతాను. వెళ్తాను అత్తయ్య.
ముకుంద: నాన్న ఎప్పుడెప్పుడు మురారిని చూస్తానా.. ఎప్పుడెప్పుడు మురారి దగ్గరకు వెళ్తానా అని ఆశగా ఉంది. సరే నాన్న నేను వెళ్లొస్తాను.
శ్రీనివాస్: ఎక్కడి అమ్మా
ముకుంద: మురారిని కలిసి కృష్ణని బయటకు తీసుకురావడానికి. పాపం మురారి ఇప్పటికే చాలా టెన్షన్ పడుతుంటాడు. ఇంకా ఎక్కువ టెన్షన్ పెట్టడం సరికాదు. అవును ముందు మురారిని కలిసి కృష్ణని విడిపించడం బెటర్ అంటావా లేదా కృష్ణని విడిపించి మురారిని కలవడం బెటర్ అంటావా.
శ్రీనివాస్: మనసులో రేపు పొద్దున్న వరకు ఆగితే అసలు మురారినే ఉండడు. ఇప్పుడే వెళ్తే మురారిని అరెస్ట్ చేయించిన సంగతి ముకుందకు తెలిసిపోతుంది. తెల్లారి వెళ్తే ఏ సమస్య ఉండదు. ఇంతలో కృష్ణ అక్కడికి వస్తుంది.
కృష్ణ శ్రీనివాస్ ఇంటికి వచ్చి కాళ్లు పట్టుకొని తన భర్తని విడిపించమని ఏడుస్తుంది. కృష్ణ మాటలు విన్న ముకుంద షాక్ అయిపోతుంది. శ్రీనివాస్ కృష్ణని వెళ్లిపోమని చెప్తాడు. మరోవైపు ముకుంద తన తండ్రి చేసిన పనికి ఏడుస్తుంది. తండ్రి మీద కోపంతో రగిలిపోతుంది. శ్రీనివాస్ తిట్టి కృష్ణని పంపేస్తాడు.
ముకుంద: నాన్న నేను నీకు చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి. మురారిని అరెస్ట్ చేయిస్తావా..
శ్రీనివాస్: అవును మురారిని నేనే అరెస్ట్ చేయించాను. ఎందుకు అంటే తప్పు చేసిన వాడే శిక్ష అనుభవించాలి. పాపం కృష్ణ అమాయకురాలు.
ముకుంద: నేను ఎందుకు ఇదంతా చేస్తున్నానో క్లియర్‌గా చెప్పినా కూడా నీకు అర్థం కాలేదా.. లాకప్ డెత్ అంటుంది. అంటే నా మురారిని చంపేద్దాం అనుకుంటున్నావా.. నాన్న మురారి నా ప్రాణం తన ప్రేమ కోసమే నా రూపాన్ని మార్చుకొని ఇన్ని పాట్లు పడుతుంటే. మురారి ప్రాణాలు తీయమని చెప్పావా. ముందు మురారి ఎక్కడున్నాడో చెప్పు.
శ్రీనివాస్: నేను చెప్పను అమ్మ. చెప్పకపోతే నన్ను చంపేస్తావా.. చంపేయ్..
ముకుంద: నీప్రాణాలు తీయడం కాదు నా ప్రాణాలే తీసుకుంటాను. చూడు నా మురారికి ఏమైనా జరిగిందో ఈ ముకుంద ప్రాణాలతో ఉండదు.
మరోవైపు కృష్ణ ఇంటికి వెళ్లి శ్రీనివాస్ తిట్టి పంపేశాడు అని ఏడుస్తుంది. ఇక ఆదర్శ్ వచ్చి కూతురు చావుకి కారణమైన వాడిని నువ్వెళ్లి కన్నీళ్లు పెట్టుకోగానే వదిలేస్తాడా అని అంటాడు. ఆయన మంచోడు కాబట్టి వదిలేశాడని లేదంటే చంపేవాడని అంటాడు. ఈ రోజు మనందరం ఏడ్వడానికి మురారే కారణం అని ఆదర్శ్ అంటాడు.
ఆదర్శ్: కృష్ణ ఒక నేరస్తుడి కోసం నువ్వు పడుతున్న కష్టం చూసి తట్టుకోలేక ఇలా మాట్లాడుతున్నాను. వాడి మీద నువ్వు జాలి చూపించొద్దు.
కృష్ణ: ఆపు ఆదర్శ్ ఈ మాటలు వినడం నా వల్ల కాదు. శిక్ష శిక్ష అంటున్నావే కానీ అక్కడ శిక్ష వేయడం లేదు. ఏసీపీ సార్ మీద కక్ష కడుతున్నారు. లాకప్ డెత్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. శ్రీనివాస్ బాబాయ్ ఏసీపీ సార్ అండతో ఏసీపీ సార్ ప్రాణాలు తీయాలి అని చూస్తున్నారు నీకు తెలుసా. నిజంగా ఏసీపీ సార్ తప్పే చేసి ఉంటే. ఏ శిక్ష వేయాలో చట్టానికే వదిలేయొచ్చు కదా. ఆయన ప్రాణాలు తీయాలి అని ఎందుకు అంత తొందర. ముకుంద మరణాన్ని అడ్డు పెట్టుకొని మురారిని చంపాలి అని చూస్తున్నారు అంతే. మురారి తప్పు చేయలేదు అని తేల్చేలోపు ఏదైనా జరగరానిది జరిగితే నష్టపోయేది ఎవరు.
మురారి తనకు జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటాడు. నిన్ను ప్రేమించినందుకు నాకు ఇలా జరగాల్సిందే అని నేను నీకు దక్కలేదు అని నాకు ఈ శిక్ష వేశావని బాధపడతాడు. ఇంతలో ముకుంద అక్కడికి వస్తుంది. మురారి పరిస్థితిని చూసి విలవిల్లాడిపోతుంది. ఏడుస్తుంది. పోలీస్ అధికారిని బతిమలాడి మురారి దగ్గరకు వెళ్తుంది. మురారి ముకుందను చూసి ఎవరా అని షాక్ అవుతాడు. పక్కనే కూర్చొని ముకుంద గాయాలు చూసి ఏడుస్తుంది. మురారిని దగ్గరగా పట్టుకొని మురారి అని ఏమోషనల్ అవుతుంది. తప్పంతా నాదే నన్ను క్షమించు అని ఏడుస్తుంది. తనని తను కొట్టుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: ఆస్థి కోసం అజయ్ కొత్త డ్రామా – అజయ్ కాలర్ పట్టుకున్న నీరజ్