Krishna Mukunda Murari Serial Today January 30th: ఆదర్శ్‌ని మోసం చేస్తున్నానన్న ముకుంద.. కృష్ణ కవరింగ్ మామూలుగా లేదుగా!
Krishna Mukunda Murari Serial Today Episode: ఆదర్శ్ ముకుందకు తన తల్లి భవాని అంటే ఎంత ఇష్టమో అందరికీ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode: మురారి, ఆదర్శ్, మధు, ప్రసాద్ కలిసి మందు తాగుతారు. ప్రసాద్ తన భార్యని ఏయ్ సుమలత రావే అంటూ గట్టిగా పిలుస్తాడు. ఇప్పుడు ఎందుకు అని మురారి అంటే మీ అందరి దృష్టిలో నేను చీప్ అయిపోయాను రా.. నేనేంటో ఇప్పుడు మీకు చూపిస్తా అని తన భార్యని తిడుతూ పిలుస్తాడు. ఆమె వచ్చేస్తుంది. ఇక తన కొడుకునే తిడుతుంది. సుమలత రావడంతో మళ్లీ ప్రసాద్ భయపడిపోతాడు. ఇక ఆదర్శ్ రిక్వెస్ట్ చేయడంతో సుమలత తాగడానికి ఓకే చెప్తుంది. మరోవైపు ఆదర్శ్ కోసం ముకుంద వెతుకుతూ ఉంటుంది.
ముకుంద: ఆదర్శ్ ఎక్కడ ఉన్నారు. ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడుతారో జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి.
మధు: మనసులో.. ఎలా అయినా నిజం బయట పెట్టించాలి.. ఆదర్శ్ బ్రో తొండ టాపిక్ మాట్లాడుదామా..
ముకుంద: దూరం నుంచి చూసి.. ఏదైతే జరగకూడదు అని అనుకున్నానో అదే జరగబోతుంది. ఈ మధుకి అన్నీ అనుమానాలే. గట్టిగా అడిగితే తాగిన మత్తులో ఆదర్శ్ నిజం చెప్తేస్తారు ఏమో.. ఇప్పుడేం చేయాలి.
ప్రసాద్: రేయ్ నీకు దండం పెడతాను ఆ తొండ గురించి వదిలేయ్ రా..
ఆదర్శ్: అది కరెక్టేరా వెళ్లిపోయిన దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావ్.
మధు: నా డౌట్ నీకు అర్థం కాలేదు బ్రో. తొండ పడితే ఉలిక్కి పడతారు. పక్కకు జరుగుతారు కానీ భూమి బద్దలయ్యేలా ఎందుకు అరుస్తారు.
మురారి: ఇది నిజమేరా..
ఆదర్శ్: అయితే నాకు ఓ విషయం అర్ధమైంది అక్కడ తొండ పడకుండా ఏదో జరిగింది అని మీ అందరి అనుమానం అంతేనా..
మధు: ఎస్ బ్రో.
ముకుంద: అమ్మో ఆదర్శ్ చెప్పేసేలా ఉన్నారు. వెంటనే కృష్ణని తీసుకొచ్చి వీళ్లని ఆపాలి. కృష్ణ.. అక్కడ కొంపలు అంటుకుపోతున్నాయ్. మురారి, ఆదర్శ్ అందరూ కలిసి మందు కొడుతున్నారు.
కృష్ణ: అంతేనా ఏసీపీ సార్ నాకు ఆల్రెడీ చెప్పేశారు. నేను ఆదర్శ్ మందు తాగుతున్నాం అని.
ముకుంద: అంటే ఏంటి కృష్ణ మా ఆయన్ని చెడగొట్టమని మీ ఆయన్ను పంపించావా..
కృష్ణ: అలా అంటావ్ ఏంటి ముకుంద. ఆదర్శ్‌కి మందు అలవాటు ఉంది కదా.. మిలటరీలో రోజూ తాగుతారు కదా..
ముకుంద: అది మిలటరీలో ఇంట్లో మాత్రం నా భర్త తాగకూడదు అని నేను కోరుకుంటున్నా.. పైగా ఆదర్శ్ తాగడం అత్తయ్య చూశారే అనుకో మేం సరిగాలేం అందుకే మందు తాగుతున్నాడని అపార్థం చేసుకుంటారు. అసలే అత్తయ్యకి నామీద అనుమానంగా ఉంది. అది ఇంకా ఎక్కువ కావాలా చెప్పు.
కృష్ణ: అస్సలు అవ్వకూడదు. ఇప్పుడే వెళ్లి ఆపేద్దాం పద..
మధు: అబ్బా కరెక్ట్ గా చెప్పే టైం కి వచ్చింది.
ముకుంద: తాగింది చాలు అందరూ లేవండి..
ఆదర్శ్: లాస్ట పెగ్ ముకుంద.
ముకుంద: లాస్ట్ లేదు బూస్టూ లేదు లేవండి.. ఆదర్శ్ అందరికీ గుడ్ నైట్ చెప్పి తూగుతూ ఉంటే ముకుంద ఆదర్శ్‌ని తీసుకెళ్లిపోతుంది. ఇక కృష్ణ కూడా మురారిని తీసుకెళ్లిపోతుంది.
ముకుంద: నా మీద తొండ పడలేదు అని మధుకి అనుమానం వచ్చింది. అయినా అనుమానం కాదు నిజమే అనుకుంటున్నాడు. టైంకి వెళ్లాను కాబట్టి సరిపోయింది. లేదంటే తాగిన మత్తులో మేం ఎలా ఉంటామని చెప్పేసేవాడు. అయినా తెలిస్తే ఏం అవుతుంది. కృష్ణ, మురారిలు ఎంత నమ్మకం పెట్టుకున్నారు నా మీద ఆ నమ్మకం ఒమ్ముచేసినట్లు అవుతుంది కదా.. అసలు నా మనసులో ఏముందో తెలిస్తే నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు. ఎవరి అండాదండలు ఉండవు. అప్పుడు మురారికి శాశ్వతంగా దూరంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఆదర్శ్ పడిపోబోతుంటే ముకుంద పట్టుకుంటుంది.
ఆదర్శ్: నాకు తాగాలి అని లేదు ముకుంద.. ఆ మధు పిలిచాడు. మురారి కూడా వస్తాను అంటే సరదాగా అలా..
ముకుంద: కానీ అత్తయ్య అలా అనుకోరు మీరు వచ్చాక ఇంట్లో లేని అలవాట్లు పెట్టారు అనుకుంటారు. ఎందుకు అంటే మురారి తాగడు. ఎప్పుడో ఒకసారి కూడా బయటకు వెళ్లి తాగుతాడు. ఇక మధు అంటారా తనని ఎవరూ లెక్క చేయరు ఏదో డైరెక్టర్ అవుతాను అని అదిఇది వాగుతాడు కాబట్టి ఎవరూ పట్టించుకోరు. కానీ మీకంటూ ఒక విలువ ఉంది కదా.. ప్లీజ్ ఆదర్శ్ ఇంట్లో తాగొద్దు.
ఆదర్శ్: సరే ముకుంద నువ్వు చెప్పావు కదా ఇంకెప్పుడు ఇంట్లో తాగను. అంటూ పడిపోబోతుంటే ముకుంద పట్టుకుంటుంది. సారీ ముకుంద.. ఇందాక నువ్వు అందరి ముందు అలా నన్ను తీసుకొచ్చేసరికి నేను నిజంగా ఫీలయ్యా కానీ ఇప్పుడు నువ్వు కారణం చెప్తే నాకు కంపెనీ ఇస్తాను అన్నావు చూడు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇంతలో మధు వచ్చి ఇద్దరికీ పెద్దపెద్దమ్మ భోజనాలకు పిలుస్తున్నారు అని చెప్తాడు.
ఇక కృష్ణ మురారిలు కిందకి వస్తుంటారు. మురారి తాగిన మైకంలో తూలుతూ మెట్లు దిగుతాడు. దాన్ని కవర్ చేయడానికి కృష్ణ పడుతున్న పాట్లు భలే నవ్వు వస్తుంది. మరోవైపు ఆదర్శ్, ముకుందలు కూడా వస్తారు.
కృష్ణ: ముకుంద ఇందాక నుంచి చూస్తున్నా ఏం ఆలోచిస్తున్నావ్.
నందూ: ఇంకేముంటుంది పెళ్లి అయిన ఇన్నాళ్లు తర్వాత కలిశారు కదా ఎక్కడికి వెళ్లాలి అని ఆలోచిస్తుంది.
ముకుంద: భగవంతుడా ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తయ్యకు నా మీద అనుమానం రాకూడదు. ఆదర్శ్ అంటే నాకు ఇష్టం ఉన్నట్లే నటించాలి. కానీ నా వల్ల కావడం లేదే. మోసం చేస్తున్నా అని ఫీలింగ్ కలుగుతోంది.
మురారి: వాళ్లు ఎప్పటికీ మేడ్ ఫర్ ఈచ్ అదరే..
ముకుంద: మనసులో.. ఎవరు అన్నా పర్లేదు కానీ నువ్వు మాత్రం అలా అనకు మురారి.. నేను పుట్టిందే నీ కోసం అన్న ఫీలింగ్ నాలో ఎప్పటికీ పోదు.
ఆదర్శ్: అమ్మా.. నీకు ముకుంద గురించి ఎంత వరకు తెలుసో నాకు తెలీదు కానీ. ముకుందకు నువ్వేంటే అపారమైన గౌరవం, ప్రేమ. అమ్మా ఎందుకు అని అడగవేంటి..
భవాని: చెప్తున్నావ్ కదా చెప్పు.
ఆదర్శ్: మిలటరీలో ఉన్నాను కదా అమ్మా. రోజూ కొంచెం అలవాటు. ఈ రోజు కూడా చిన్న పెగ్ వేశా.. ఈ భూమి బద్ధలైనట్లు నా మీద సీరియస్ అయిపోయింది. అత్తయ్యగారికి ఇలాంటివి నచ్చవు తాగొద్దు అని నామీద గొడవ చేసింది. చెప్పు ముకుందని అడుగుతాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: సత్యభామ సీరియల్ జనవరి 29th: మాధవ్ తో పెళ్లికి ఒప్పుకున్న సత్య.. జాబ్ పోగొట్టుకున్న హర్ష!