అన్వేషించండి

Satyabhama Serial January 29th: మాధవ్ తో పెళ్లికి ఒప్పుకున్న సత్య.. జాబ్ పోగొట్టుకున్న హర్ష!

Satyabhama Serial Today Episode: సత్యతో శంకర్ పంపించిన గిఫ్ట్ తీసుకోకపోతే నేరుగా సత్య తండ్రికి ఇస్తాను అంటాడు గిఫ్ట్ తీసుకొచ్చిన వ్యక్తి.దాంతో కోప్పడిన సత్య ఏం చేస్తుందో అనే క్యూరియాసిటీ కథలో ఏర్పడుతుంది. 

Satyabhama Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో హర్షని క్రిష్ మనుషులు కొడుతూ ఉంటారు.

క్రిష్: వాడు నా బావమరిది లాగా ఉన్నాడు, వాడిని సేవ్ చేయకపోతే నా లవ్ ఇక్కడే ఆగిపోతుంది వాడ్ని ఎలాగైనా సేవ్ చేయాలి అని చెప్పి రౌడీల దగ్గరికి వెళ్తాడు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకన్నా నేను వాడి సంగతి చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్లని పంపించేస్తాడు. తర్వాత హర్ష వైపు తిరిగి ఎవరితోనైనా పెట్టుకునే ముందు ఎవరో ఏంటో తెలుసుకోవాలి కదా అంటాడు.

హర్ష: ఎవర్రా మీరంతా ఎందుకు నా లైఫ్ తో ఆడుకుంటున్నారు అని చెప్పి క్రిష్ కాలర్ పెట్టుకుంటాడు.

మా అన్న కాలరే పట్టుకుంటావా అని పక్కనే ఉన్న వ్యక్తి హర్ష కాలర్ పట్టుకుంటాడు. అప్పుడే ఆటోలో నుంచి వెళ్తున్న సత్య ఇవన్నీ చూస్తుంది. ఆటో ఆపమని కిందికి దిగి  ఈ రౌడీ వెధవలు అన్నయ్యతో ఎందుకు గొడవకి దిగుతున్నారు. వీళ్ళకి దూరంగా ఉండమని అన్నయ్యకు చెప్పాలి ఈ విషయం సంధ్య కి చెప్పకూడదు లేదంటే ఇంట్లో చెప్పేస్తుంది అనుకుంటుంది తర్వాత ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోతుంది.

అప్పటికే ఇంట్లో వాళ్ళు సత్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే వచ్చిన సత్య వాళ్ళని చూసి అతను ఎందుకు పిలిచాడు నీతో ఏం మాట్లాడాడు అని సత్యని అడుగుతుంది వాళ్ళ నానమ్మ.

సత్య తండ్రి : అబ్బాయి నచ్చినట్లేనా, నీకు ఈ సంబంధం ఓకేనా అని అడుగుతాడు.

సత్య : మాధవిని వద్దు అనుకోవటానికి కారణాలేవీ కనిపించలేదు. అయినా మీకు ఇష్టమైతే ఈ పెళ్లి నాకు ఇష్టమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

సత్య తల్లిదండ్రులు ఆనందపడతారు ఈ విషయం వెంటనే వాళ్లకు ఫోన్ చేసి చెప్పు  అని కొడుక్కి చెప్తుంది సత్య నానమ్మ.

ఇంటికి వచ్చిన క్రిష్ ని గర్ల్ ఫ్రెండ్ తో షికారుకు పోయి వస్తున్నావా అని  క్రిష్ బామ్మ తరపున ఆమె దగ్గర ఉన్న వ్యక్తి అడుగుతాడు.

 క్రిష్: నాకు సంపంగికి ఇంకా ఫేస్ టు ఫేస్ మీటింగే జరగలేదు అంటాడు.

 క్రిష్ బామ్మ వెనక ఉండే మనిషి : బామ్మర్ది ని లైన్ లో పెడితే వాళ్ళ ఫ్యామిలీ లైన్లోకి వస్తుంది అని చెప్తాడు. నీకు తనంటే ఎంత ఇష్టమో తెలిసేలాగా తనకి ఒక బహుమతి ఇవ్వు అని గంట శబ్దం ద్వారా సలహా ఇస్తుంది బామ్మ.

శంకర్: నువ్వు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను దూసుకుపోతూ ఉంటాను తనకి ఏదంటే ఇష్టమో నాకు బాగా తెలుసు అని షాపింగ్ మాల్ లో తను చూసిన చీరని గుర్తు చేసుకుంటాడు.

మరోవైపు ఆలోచనలో ఉన్న మాధవ్ దగ్గరికి వచ్చి సత్య ఏమంటుంది తను ఎందుకు పెళ్లికి ఒప్పుకోవటం లేదు అంటుంది అతని తల్లి.

మాధవ్ తండ్రి : వీడు నచ్చలేదేమో అంటాడు.

మాధవ్: నచ్చకపోతే రెస్టారెంట్ వరకు ఎందుకు వస్తుంది తనకి చిన్న కన్ఫ్యూజన్ ఉంది నేను క్లారిటీ ఇచ్చాను వెంటనే పెళ్లికి ఒప్పుకుంది అంటాడు.

మాధవ తల్లిదండ్రులు ఆనందపడతారు. నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టించేయొచ్చా అని అడుగుతారు.

మాధవ్: నాకు ఎలాంటి అభ్యంతరము లేదు మీరు, మీరు ఆ విషయాలు చూసుకోండి నేను మాత్రం సత్యకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

మరోవైపు  అన్న ఒంటికి తగిలిన దెబ్బలను చూసి ఏం జరిగింది అని అడుగుతుంది సత్య.

హర్ష : ముందు నిజం చెప్పకుండా దాస్తాడు కానీ సత్య బలవంతం పెట్టడంతో జరిగిందంతా చెప్తాడు. ఇంతలో మేనేజర్ ఫోన్ చేసి నీకు లోన్ రికవరీ కి నీకు ఇచ్చే టైం అయిపోయింది అంటూ తనను సస్పెండ్ చేస్తాడు. నీ మీద చీటింగ్ కేసు వేస్తున్నాను ఏమైనా చెప్పుకోవాలనుకుంటే అక్కడ చెప్పుకో అంటాడు.

హర్ష: ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది అని బాధపడతాడు.

సత్య కోపంతో రగిలిపోతూ ఇదంతా రౌడీ గాడివల్లే వాడి సంగతి చూద్దాం పద అని అన్నతో అంటుంది.

హర్ష: వద్దు ఇప్పుడే గొడవలు సర్దుమణిగి ఇప్పుడు వెళ్లి గొడవపడితేవాళ్లు మన ఇంటి వరకు వస్తారు నీ పెళ్లికి ముందు ఇదంతా అవసరమా అని చెప్పి సత్య ని కూల్ చేస్తాడు.

ఆ తర్వాత సత్య తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ ఉండగా కొరియర్ వస్తుంది. కొరియర్ అందుకోవడానికి వెళ్లిన సత్య ఏంటి ఈ గిఫ్ట్ అని అడుగుతుంది.

క్రిష్ ఫ్రెండ్ : మా అన్న నీకు ప్రేమతో పంపించాడు అని చెప్పడంతో కోపంతో రగిలిపోతుంది గిఫ్ట్ తీసుకోను అంటుంది సత్య . అయితే నేరుగా వెళ్లి ఈ గిఫ్ట్ మీ ఫాదర్ కి ఇస్తాను అంటాడు. దాంతో భయపడి ఆ గిఫ్ట్ తీసుకొని లోపలికి వస్తుంది. సంధ్య ఓపెన్ చేయమనటంతో గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. అందులో ఉన్న చీరను చూసి షాక్ అవుతుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Also Read: సికింద్రాబాద్ లో దారుణం - యాచకులపై కత్తులతో దాడి, ఒకరు మృతి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KCR: దివంగత నేత కుటుంబాన్ని మర్చిపోని కేసీఆర్ - పిలిచి మరీ చదువుకు ఆర్థిక సాయం
దివంగత నేత కుటుంబాన్ని మర్చిపోని కేసీఆర్ - పిలిచి మరీ చదువుకు ఆర్థిక సాయం
Chandrababu SLBC: కుటుంబానికో పారిశ్రామికవేత్త రావాలంటే బ్యాంకర్లు సహకరించాలి - ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో చంద్రబాబు విజ్ఞప్తి
కుటుంబానికో పారిశ్రామికవేత్త రావాలంటే బ్యాంకర్లు సహకరించాలి - ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో చంద్రబాబు విజ్ఞప్తి
WEATHER UPDATE: వణికించే చలిలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు! ఉత్తరాదిలో భిన్నమైన వాతావరణం! 
వణికించే చలిలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు! ఉత్తరాదిలో భిన్నమైన వాతావరణం! 
Karnataka: స్నేహితుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్తే ఖర్చవుతాయని బావిలో పడేసి చంపేశారు - ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారా?
స్నేహితుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్తే ఖర్చవుతాయని బావిలో పడేసి చంపేశారు - ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారా?

వీడియోలు

Abhishek Sharma in Ind vs NZ T20 | అభిషేక్ శర్మ అభిషేక్ పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్
Sindhu in Indonesia Masters Quarterfinals | చరిత్ర సృష్టించిన PV సింధు
All Rounder Axar Patel Injury | 2026 టీ20 ప్రపంచ కప్ నుంచ అక్షర్ అవుట్ ?
Bangladesh Out of T20 World Cup | T20 వరల్డ్ కప్‌లోకి స్కాట్లాండ్ ఎంట్రీ?
Trump on Greenland | గ్రీన్‌ లాండ్ కోసం ట్రంప్ ఎందుకు పట్టుబుతున్నాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దివంగత నేత కుటుంబాన్ని మర్చిపోని కేసీఆర్ - పిలిచి మరీ చదువుకు ఆర్థిక సాయం
దివంగత నేత కుటుంబాన్ని మర్చిపోని కేసీఆర్ - పిలిచి మరీ చదువుకు ఆర్థిక సాయం
Chandrababu SLBC: కుటుంబానికో పారిశ్రామికవేత్త రావాలంటే బ్యాంకర్లు సహకరించాలి - ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో చంద్రబాబు విజ్ఞప్తి
కుటుంబానికో పారిశ్రామికవేత్త రావాలంటే బ్యాంకర్లు సహకరించాలి - ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో చంద్రబాబు విజ్ఞప్తి
WEATHER UPDATE: వణికించే చలిలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు! ఉత్తరాదిలో భిన్నమైన వాతావరణం! 
వణికించే చలిలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు! ఉత్తరాదిలో భిన్నమైన వాతావరణం! 
Karnataka: స్నేహితుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్తే ఖర్చవుతాయని బావిలో పడేసి చంపేశారు - ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారా?
స్నేహితుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్తే ఖర్చవుతాయని బావిలో పడేసి చంపేశారు - ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారా?
Andaman Jagruthi: అండమాన్ దీవుల పేర్లు మార్చాలని కవిత డిమాండ్ - ప్రధాని మోదీకి లేఖ
అండమాన్ దీవుల పేర్లు మార్చాలని కవిత డిమాండ్ - ప్రధాని మోదీకి లేఖ
YSRCP MP Midhun Reddy: లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు 
లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు 
Border 2 OTT: థియేటర్లలో ఇవాళే రిలీజ్... మరి ఓటీటీలో ఎప్పుడు? సన్నీ డియోల్ 'బోర్డర్ 2' స్ట్రీమింగ్ ఎందులోనంటే?
థియేటర్లలో ఇవాళే రిలీజ్... మరి ఓటీటీలో ఎప్పుడు? సన్నీ డియోల్ 'బోర్డర్ 2' స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ABP Exclusive: సంగీత ప్రపంచంలో తొలి అడుగు నా తండ్రితోనే మొదలైంది: డాక్టర్ ఎల్ సుబ్రమణ్యం
ABP Exclusive: సంగీత ప్రపంచంలో తొలి అడుగు నా తండ్రితోనే మొదలైంది: డాక్టర్ ఎల్ సుబ్రమణ్యం
Embed widget