![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Krishna Mukunda Murari Serial Today January 19th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఆదర్శ్ రావడం ఇష్టమేనా? ముకుందని ప్రశ్నించిన నందూ
Krishna Mukunda Murari Serial Today Episode ఆదర్శ్ రావడం తనకు ఇష్టమేనని ముకుంద ఇంట్లో వాళ్లకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Krishna Mukunda Murari Serial Today January 19th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఆదర్శ్ రావడం ఇష్టమేనా? ముకుందని ప్రశ్నించిన నందూ krishna mukunda murari serial today january 19th episode written update in telugu Krishna Mukunda Murari Serial Today January 19th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఆదర్శ్ రావడం ఇష్టమేనా? ముకుందని ప్రశ్నించిన నందూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/8361a0accef68949c61bf79ee94e6a5c1705631393075882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Krishna Mukunda Murari Today Episode: కృష్ణ తన శోభనాన్ని వద్దు అన్న మాటలు తలచుకొని రేవతి కృష్ణని తట్టుకుంటుంది. ఇక నందూ వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తే ఫుల్ ఫైర్ అవుతుంది రేవతి. ఆదర్శ్‌ని తీసుకురావడానికి, శోభనాన్ని ఆపడానికి కారణం ఏంటని ఆలోచిస్తారు. ఇక మధు అక్కడికి రావడంతో మధుకి కూడా రేవతి చీవాట్లు పెడుతుంది.
మధు: పెద్దమ్మ కృష్ణ ఇప్పటి సంగతి గురించే కాదు. భవిష్యత్ గురించి కూడా ఆలోచించింది. మనందరం అవుట్ హౌస్ నుంచి రమ్మనిచెప్తే కృష్ణ రాను అని చెప్పింది. ముకుందతో కలిసి ఉంటే బాగోదు అని సున్నితంగా తిరష్కరించింది. ఇలా శోభనం చేసుకుంటే మురారి ఆదర్శ్‌ని వెతకడంలో ఇంట్రస్ట్ చూపించడు. రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తాడు. అప్పుడు ముకుంద ఒంటరిగా తిరుగుతూ హాయిగా ఉన్న వీళ్లిద్దరిని చూసి కుట్ర చేయదు అని గ్యారెంటీ ఏంటి. ఇలా ఎందుకు ఆలోచించరు.
రేవతి: నువ్వు అన్నది నిజమేరా కానీ దాన్నిఇలా వాయిదా వేయడం నాకు నచ్చలేదు.
మధు: లైట్ తీసుకో పెద్దమ్మ ఇంకో రెండు మూడు రోజులు ఓపిక పట్టలేరా..
మురారి లేచే సరికి ఎదురుగా పేపర్ మీద కృష్ణ ఇదిగో ఏబీసీడీల అబ్బాయి నన్ను తిట్టారో బాగోదు చెప్తున్నా అని రాసుంటుంది. దాన్ని చూసి మురారి నవ్వుకుంటాడు. ఇక కృష్ణ అప్పుడే స్నానం చేసి వస్తుంది. మురారిని దగ్గరకు తీసుకొని గుడ్ మార్నింగ్ చెప్తుంది.
మురారి: ఆదర్శ్ వస్తాడు అన్న నమ్మకం నాకు లేదు కృష్ణ.
కృష్ణ: లేదు ఏసీపీ సార్ వస్తాడు. తప్పకుండా వస్తాడు. నాకు నమ్మకం ఉంది.
మురారి: వాడి కోసం మనం ఇలా అన్ని వదిలేసి ఎదురుచూస్తున్నాం అని వాడికి తెలుసా చెప్పు.
కృష్ణ: వెళ్లి చెప్తాం. మన మెహతా గారిని కలిశాం కదా ఆయన మీద నమ్మకం ఉంది.
మురారి: ఇన్నాళ్లు అజ్ఞానంలో ఉన్న వాడు వస్తాడు అనుకోవడం మన అజ్ఞానం.
కృష్ణ: అలా అనకండి ఏసీపీసార్. జీవితంలో మారదు అనుకున్న ముకుందే మారింది. ఆదర్శ్ మారడా చెప్పండి. నేను ఆలోచించేది మన గురించే కాదు ఏసీపీసార్. పెద్దత్తయ్య కోసం కూడా. పైకి గంభీరంగా ఉన్నా ఆదర్శ్ గురించి పెద్దత్తయ్య ఎంత బాధ పడుతుందో నాకు తెలుసు.
మురారి: పెద్దమ్మకే కాదు ఇంట్లో అందరికీ అదే ఆలోచన ఉంది.
రేవతి: మురారి వాళ్లని ఉద్దేశించి.. ఎక్కడికి నందూ ఇంత పొద్దున్నే బయల్దేరారు. ఎందుకు పనికి రాని త్యాగాలు చేసి ఏదో గొప్పపని చేసినట్లు ఫీలైపోతారు.
ముకుంద: సారీ కృష్ణ ఇదంతా నా వల్లే జరిగింది. సారీ.
కృష్ణ: నీకు పిచ్చా ముకుంద. రాత్రి చెప్పాం కదా ఆదర్శ్ ని తీసుకొస్తామని మళ్లీ ఇదంతా ఏంటి.
భవాని: మురారి నాకు ఏం చెప్పొద్దు అన్నీ మీరు అనుకున్నట్లు జరిగితే అది జీవితం కాదు. ఏ నమ్మకంతో వాడు కన్విన్స్ అవుతాడు అనుకుంటున్నారు. జరిగింది ఏమైనా గొప్ప విషయం అనుకుంటున్నావా.. తలచుకుంటేనే చిరకుగా ఉంది. మళ్లీ దాన్ని చెప్పి కన్విన్స్ చేస్తారంట.చెప్పాను కదా కృష్ణ నీదే బాధ్యత.
మురారి: మొన్న దోషి ఎవరో తేలితే మన పెళ్లి జరుగుతుందని లేదంటే నువ్వు ఆదర్శ్‌తో ఉండాలని కండీషన్ పెట్టారు గుర్తుందా..
ముకుంద: గుర్తుంది మురారి.
మురారి: ఆ మాట మీదే ఉండు.
మురారి: కృష్ణ, మురారిలు మెహతాకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో. .అయిపోయింది అంతా అయిపోయింది. వాడు మనకు హ్యాండ్ ఇచ్చాడు. వాడి భరోసాతో నువ్వు చాలా బిల్డప్ ఇచ్చావు. అప్పటికీ పెద్దమ్మ చెప్తూనే ఉంది.
కృష్ణ: ఏసీపీ సార్ ప్లీజ్.. కారణం ఏదైనా అయిండొచ్చు. అందుకే లిఫ్ట్ చేయకపోవచ్చు. వాడు జంటిల్ మేన్ అని మనకు తెలుసు కదా.. అది చాలు.
ముకుంద: అదర్శ్‌ని తెస్తానని కృష్ణ అంత కాన్ఫిడెంట్‌గా చెప్తుంది. ఏం చేయాలి. అయినా ఆదర్శ్ ఎందుకు వస్తాడు. అయినా మగాడి అహం మీద దెబ్బ పడినప్పుడు ఎందుకు వస్తాడు. అనవసరంగా వస్తాడు అని టెన్షన్ పడుతున్నాను. నాకు ఎందుకు ఈ టెన్షన్.
నందూ: ఏంటి ముకుంద ఆలోచిస్తున్నావ్..
ముకుంద: ఏముంది. నందూ నా కోసం కృష్ణ వాళ్లు చేసిన త్యాగం డైజస్ట్ కావడం లేదు. వాళ్లు ఆదర్శ్ వస్తాడు అంటున్నారు. వస్తాడు చెప్పు నందూ. వచ్చేవాడు అయితే ఎప్పుడో వచ్చేవాడు. నా బతుకు ఏదో నేను బతికేదాన్నికదా.. అనవసరంగా వాళ్లు ఇబ్బంది పడుతున్నారు.
నందూ: అది నిజమే. అసలు ఆదర్శ్‌ని వెతకడానికి శోభనం ఆపడానికి సంబంధమే లేదు.
ముకుంద: నందూ చెప్పింది నిజమే మరి ఎందుకు కృష్ణ అలా ఆలోచించలేదు.
నందూ: ముకుంద నీకు మా అన్నయ్య రావడం ఇష్టమేనా..
ముకుంద: కృష్ణ ఆదర్శ్ రావాలి అని నాతో ఉండాలి అని అప్పుడే తనకు సంతోషం అని చెప్పింది నాతో. కృష్ణ ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను. ఆదర్శ్ ఎవరు నా భర్తే కదా. ఆ విషయంలో కృష్ణ నా కళ్లు తెరిపించింది. నందు ఆదర్శ్ రావాలే కానీ హ్యాపీగా ఉంటాం. నాకు ఇప్పుడు అదే అవసరం అనిపిస్తుంది. ఆదర్శ్ నా గతాన్ని మర్చిపోయి ఆదరిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పు.
మధు: నందూ నాకు ముకుంద మాటలు నమ్మాలి అనిలేదు. చూద్దాం ఏమవుతుందో.
ఇక మురారి, కృష్ణలు తమ గదిలో ఆలోచిస్తూ ఉంటారు. ఇక మురారిని కృష్ణ మొగుడిలా కాకుండా ఏసీపీలా ఆలోచించమని కృష్ణ అంటుంది. ఇంతలో బల్లి అరవడంతో కృష్ణ మురారిని పట్టుకుంటుంది. ఇంతలో మెహతా ఫోన్ చేస్తాడు. ఆదర్శ్ గురించి చెప్తాను అని రేపు వాళ్ల ఇంటికి రమ్మని మెహతా చెప్తాడు. దీంతో మురారి, కృష్ణ చాలా సంతోషిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'జగద్ధాత్రి' సీరియల్ జనవరి 19th: తన కుటుంబాన్ని సేవ్ చేసిన యువరాజ్, మీనన్ ఆట కట్టించిన ధాత్రి టీం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)