Krishna Mukunda Murari Serial Today February 29th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: మళ్లీ మొదటికొచ్చిన కథ.. మురారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న ముకుంద..
Krishna Mukunda Murari Serial Today Episode ముకుంద మురారితో చాటుగా మాట్లాడిని మాటలను కృష్ణ విని మురారిని ఫాలో అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode : ముకుంద మురారితో తన మనసులో మాట చెప్పేస్తుంది. తప్పు చేస్తున్నాను అని మాత్రం అనుకోవద్దు అని మురారితో అంటుంది. తన ప్రేమను బతికించుకోవడానికి ఆరాటపడుతున్నాను అని పోరాటం చేస్తున్నాను అని అంటుంది. మురారి, ముకుంద మాటలను కృష్ణ దూరం నుంచి చూసి విని షాక్ అవుతుంది.
ముకుంద: ఇంత చెప్తున్నా నీకు అర్థం కావడం లేదా మురారి. నేను ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు నీ బాధ ఏంటి నేను ఆనియన్ దోసెలు వేస్తే అది నీ భార్య చూస్తే ముకుంద తన భర్తకు ఇష్టమైన ఉప్మా పెసరట్టు వేయకుండా నా భర్తకు ఇష్టమైన ఆనియన్ దోస వేస్తుంది ఏంటి ఇంకా నా భర్త మీద ప్రేమ తగ్గలేదా ఏంటి అని బాధ పడుతుంది అనే కదా.. తెలీని మురారి. ఈ రోజు కాకపోతే రేపు అయినా తెలియాల్సిందే కదా. నిన్ను నాకు అప్పగించి ఎలా వచ్చిందో అలా నీ జీవితం నుంచి వెళ్లిపోవాల్సిందే కదా.
మురారి: కలలో కూడా అది జరగదు.
ముకుంద: జరగాలి మురారి మన జీవితంలోకి ఎవరెవరు రావడం వల్ల మనం దూరం అయ్యామో మనం మళ్లీ దగ్గర అవ్వడానికి వాళ్లు దూరం అవ్వాలి.
మురారి: పిచ్చా నీకు ఏం ఆలోచిస్తున్నావ్.
ముకుంద: అరవొద్దు మురారి. చూడు నీ ముందు ఉన్న ఆప్షన్స్ రెండే ఒకటి ఆదర్శ్‌ని ఎలాగోలా ఒప్పించి ఇంట్లో నుంచి బయటకు పంపించి మనం ఒకటి అవ్వడం. రెండు ఇప్పుడే ఇక్కడే గొడవ చేసి ఆ బాధ తట్టుకోలేక ఆదర్శ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం. అప్పుడు మనం ఒకటి కావడం. ఈ రెండింటిలో ఆదర్శ్ వెళ్లిపోవడం కామన్ అనుకుంటున్నావ్ కానీ ఏది ఏమైనా మనిద్దరం ఒకటి అవ్వడం కామన్.
రేవతి: ఏయ్ తింగరి బ్రేక్ ఫాస్ట్ చేయకుండా మొక్కలకు నీరు పోస్తున్నావ్ ఏంటి.
కృష్ణ: ఏదో ఒక పని చేసి డైవర్ట్ అవ్వకపోతే.. ముకుంద చేసే పనులకు మెంటల్ ఎక్కేలా ఉంది. మీకు బ్రెక్ ఫాస్ట్ కావాలా నేను చేయాలి.. ఈ పూట ముకుంద చేస్తుంది. ముకుంద కూడా ఆదర్శ్ ఇష్టాలు తెలుసుకొని చేయాలి కదా అందుకే.. అలావాటు అవుతుంది అని వండమన్నాను.
రేవతి: మనసులో.. ఏం ఇష్టం తెలుసుకోవడమో ఏంటో మధు ఏమో ముకుందకు ఆదర్శ్ అంటే ఇష్టం లేదు శోభనం కూడా వద్దు అంటుంది అని అంటున్నాడు. అదే ఇష్టం లేకపోతే ఇష్టమైనా వంటలు ఏం చేస్తుంది.
కృష్ణ: ఏసీసీ సార్ హడావుడిగా ఎక్కడికి వెళ్లిపోతున్నారు.
మురారి: ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అర్జెంట్‌గా వెళ్లాలి.
రేవతి: రేయ్ టిఫిన్ తినేసి వెళ్లరా.
మురారి: మనసులో.. ఇప్పుడు ఇంట్లో టిఫెన్ చేస్తే తుఫానే.. అంత టైం లేదు వెళ్లాలి.
కృష్ణ: ఏసీపీ సార్ పాపం ముకుంద అంత కష్టపడి బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటే తినకుండా వెళ్తే ఎలా సార్. మీరు ఎందుకు తినకుండా వెళ్తున్నారో. ముకుంద మనసులో ఏముందో మొత్తం తెలిసిపోయింది సార్. ఉన్న అనుమానాలు తొలగిపోయి ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
ముకుంద: (అందర్ని టేబుల్ దగ్గరకి పిలుస్తుంది) ఆది మీరు కూర్చొండి అందరికీ వేడి వేడిగా ఆనియన్ దోశ.
మధు: ఆనియన్ దోశనా అది మురారికి ఇష్టం కదా. మరి ఆదికి ఇష్టమైన ఉప్మా పెసరట్టు చేయలేదా..
ఆదర్శ్: రేయ్ మధు నాకు కూడా ఆనియన్ దోశ ఇష్టమేరా.. ముకుంద మురారికి నాలుగు పెట్టు వాడికి చాలా ఇష్టం.
ముకుంద: చేసిందే నా మురారి కోసం అయితే వేయకుండా ఎలా ఉంటాను.
ఆదర్శ్: అసలు వాడికి ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టం.
ముకుంద: అందుకే కదా మురారికి ఇష్టమైన నన్ను ఇష్టపడి నా కొంప కూల్చారు.
ఆదర్శ్: అవును మురారి, కృష్ణ ఎక్కడ..
రేవతి: అర్జెంట్ పని అని ఆఫీస్‌కు వెళ్లిపోయాడు.
ముకుంద: పనా పాడా నేను దోశ చేయడం ఇష్టం లేదు. ఉంటే ఎక్కడ తినాల్సి వస్తుందో అని వెళ్లిపోయాడు.
మురారి: పూర్తిగా మతి పోయి ప్రవర్తిస్తుంది. ఇంట్లో వాళ్లు ఏం అనుకుంటారు అని కొంచెం కూడా భయం లేదు. తనకి నచ్చిందే చేస్తుంది. పైగా అదే కరెక్ట్ అనుకుంటుంది. గట్టిగా మాట్లాడితే ఇప్పుడే ఎక్కడ తెలిసిపోతుందా అని భయంగా ఉంది. రాత్రివరకే టైం ఉంది ఈ లోపు ఏదో ఒకటి చేయాలి. ముకుందలోని పిచ్చి పిచ్చి ఆలోచనలు పోయేలా ఏదో ఒకటి చేయాలి చేస్తాను.
ముకుంద: మురారి ఎందుకు ఇలా చేశావ్. రాత్రి నువ్వు శోభనం ఆపకపోతే జరిగేది ఇంకొకటి. కృష్ణ నాకు టిఫెన్ చేయమని ఎక్కడికి వెళ్లింది. అంటే నా గురించి మొత్తం తెలిసిపోయిందా. ఇప్పుడు ఇంకా హ్యాపీ అందరికీ తెలిసిపోతుంది శోభనం కూడా ఉండదు.
ముకుంద రేవతి మధులకు దోశలు వేసి ఆదర్శ్‌కి వేయదు. మురారి కోసం ప్రేమతో చేసింది ఆదర్శ్‌కి వేయను అనుకుంటుంది. ఉప్మా పెసరట్టు చేసి తెస్తాను అని వంట మనిషితో వేయమని చెప్పి పంపిస్తాను అనుకొని లోపలికి వెళ్లిపోతుంది. ఆదర్శ్ అదంతా ముకుందకు తన మీద ప్రేమ అని అనుకుంటాడు.
మురారి తన ఫ్రెండ్ గోపి దగ్గరకు వెళ్లి జరిగిందా అంతా చెప్తుంది. కృష్ణ మురారిని ఫాలో అయి చాటుగా అవన్నీ వింటుంది. ముకుంద తిక్క తిక్కగా మాట్లాడుతుంది అని ఆదర్శ్ ముకుంద తనని ప్రేమిస్తుంది అని అనుకుంటున్నాడు అని ఏమైపోతాడో అని అంటాడు. కుటుంబం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది అని అంటాడు. ఇంతలో కృష్ణ మురారి దగ్గరకు వస్తుంది.
మురారి: కృష్ణ ఎప్పుడొచ్చావ్.
కృష్ణ: మీరు గోపీతో నిజం చెప్తున్నప్పుడు. కంగారు పడకండి నేను విన్నాను. నేను ఉన్నాను. ఇద్దరూ కాఫీ షాప్‌కి వెళ్లి కూర్చొంటారు. ముకుంద కాలు బెనకలేదు అని అది నాటకం అని భర్తతో చెప్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.