Krishna Mukunda Murari Today Episode : కృష్ణ ముకుంద మురారి సీరియల్: కృష్ణ భర్త ఎవరు? ఎంక్వైరీ స్టార్ట్ చేసిన మురారి!
Krishna Mukunda Murari Today Episode కృష్ణ భర్త ఎవరూ.. ఎక్కడ ఉంటారు అంటూ మురారి ముకుందకు అడగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది
Krishna Mukunda Murari Telugu Serial Today Episode :
ముకుంద: స్వామి నా జీవితంలో నేను కోరుకునేది ఒక్కటే. మురారితో నా జీవితం పంచుకోవాలని. మురారి నా వాడు కావాలని.. నేను కోరుకునే మురారి కృష్ణను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మురారి గతం మర్చిపోయేంత వరకు నేనెంత మానసిక సంఘర్షణ అనుభవించానో.. ఎన్ని నిద్ర లేని రాత్రలు గడిపానో నీకు బాగా తెలుసు. అంత నరకాన్ని అనుభవించిన నాపై కనికరించి నా మురారిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యు స్వామి. నీ దయ వల్ల పసుపు కొట్టి పెళ్లి పనులు ప్రారంభించాం. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పెళ్లి కూడా జరిపించు. జీవితంలో మురారికి గతం గుర్తురాకుండా చూడు. తను గతానికి వర్తమానానికి అంచుల మధ్యలో ఉన్నాడు. తనకి గతం గుర్తొస్తే మళ్లీ నానుంచి దూరం అయిపోతాడు. అసలు ఆ విషయం తలచుకుంటేనే నా మనసు తట్టుకోలేకపోతుంది. మురారి నాకు ఇంకోసారి దూరమైతే నేను ప్రాణాలతో ఉండలేను. అందుకే మురారి నా వాడు అయినంత వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నువ్వే చూడు. ఈ ఒక్కటి చేసి పెట్టు ఇంక జీవితంలో నిన్ను ఏమీ అడగను.
మురారి: (తనలో తాను.. కృష్ణతో తాను గడిపిన రోజులు గుర్తుచేసుకొని) అంటే వేణి గారికి ఇదివరకే పెళ్లి అయిందా.. తనతో నేను అంత చనువుగా మాట్లాడుతుంటే పాపం ఎంత ఇబ్బందిగా ఫీలయ్యుంటారో కదా. అయినా నేను ఏంటి పెళ్లి అయిందని తెలిసి కూడా వేణి గారి గురించే ఆలోచిస్తున్నాను. అసలు వేణి గారి భర్త ఎవరో తెలుసుకోవాలి. ఉంటే ఆయన ఇక్కడ ఎందుకు ఉడడం లేదో తెలుసుకోవాలి.
ఇక గౌతమ్ మురారితో మాట్లాడి.. తనకు ఈ పెళ్లి ఇష్టమో లేదో తెలుసుకోవాలని అనుకుంటాడు. మురారి పెళ్లి ఇష్టం లేదు అంటే మరి కొంచెం ఇష్టం లేకుండా చేద్దామని మాట్లాడటానికి వెళ్తాడు. ఇక మధు కూడా అక్కడి వస్తాడు. ముగ్గురు కలిసి టీ తాగటానికి బయటకి వెళ్తారు. మరోవైపు కృష్ణ మురారితో తాను తీసుకున్న ఫొటోల కోసం కంగారుగా ఇళ్లంతా తెగ వెతుకుతుంటుంది.
మురారి: మధు నీకు వేణి గారికి బాగా పరిచయం ఉంది అనుకుంటా
మధు: మనసులో.. ఏది ఏమైనా ఇప్పుడు నిజం చెప్తేస్తా.. ఇక్కడ ఆపటానికి ఎవరూ లేరు కదా.. అవును మురారి బాగా పరిచయం
మురారి: పెద్దమ్మ వేణి గారికి పెళ్లి అయింది అని చెప్పింది కదా తన భర్తను నువ్వు ఎప్పుడైనా చూశావా.. అతను ఎవరు.. ఎక్కడ ఉంటారు. ఏం చేస్తుంటారు. అతని పేరు తెలుసా
ఇక మధు చెప్పబోతుంటే ముకుంద వీడియో కాల్ చేసి మురారికి ఏం చెప్పకుండా ఇంటికి రమ్మని చెప్తుంది. లేదు అంటే భవానితో చెప్తానని అంటుంది. దీంతో మధు మురారిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇక ముకుంద మురారితో మాట్లాడాలని వెయిట్ చేస్తుంటుంది. మరోవైపు నందూ కూడా అక్కడికి రావడంతో ఎలా అయినా నందూని అక్కడి నుంచి పంపించేస్తుంది.
ముకుంద: మురారి నీ మొహంలో పెళ్లి కల లేదేంటి
మురారి: నీకుందా.. నీ మొహంలో టెన్షన్ తప్ప కలే లేదు.
ముకుంద: నీగురించే మహానుభావ ఏ రోజు ఎలా ఉంటావో తెలీదు అందుకే నా టెన్షన్ అంతా నీ గురించే
మురారి: మనసులో .. పెద్దమ్మ నేను ముకుంద ప్రేమించుకున్నాం అన్నది. కానీ నాకు ఆ ఫీలింగే లేదు ఏంటి. ఇప్పుడు ముకుందకు వేణి గారి భర్త గురించి అడుగుతా. సరే.. నేనంటే నీకు ఎంత ఇష్టం..
ముకుంద: చచ్చేంత ఇష్టం నా బతుకు నీతోనే మురారి. మళ్లీ జన్మ ఉన్నా నీ తోనే ఉండాలి అని కోరుకుంటాను
మురారి: సరే ఇప్పుడు నేను నీకు ఒకటి అడుగుతాను. దానికి అబద్ధం చెప్పకుండా నిజం చెప్పాలి. వేణి గారికి పెళ్లి అయిందని పెద్దమ్మ చెప్పింది కదా తన భర్త ఎక్కడ ఉంటారు.
ముకుంద: మనసులో.. ఇలాంటి ప్రశ్న అడుగుతాడు అని ఊహించలేదే. నాకు తెలీదు. ఆవిడ గారి డిటైల్స్ తెలుసుకోవాలి అనే ఇంట్రస్ట్ కూడా నాకు లేదు. అయినా ఆవిడ గారి భర్త గురించి నీకు ఎందుకు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మనేసి పెళ్లి గురించి ఆలోచించు మురారి. నీ మీదే ఆశలు పెట్టుకున్న నాకు అన్యాయం చేయకు.
మురారి తన గదిలో ఆలోచిస్తూ ఉంటాడు. అందరూ తన దగ్గర ఏదో దాస్తున్నారు అని అనుకుంటాడు. ముకుంద కాల్ చేయడంతో అప్పటి వరకు బాగానే ఉన్న మధు ఒక్కసారి టెన్షన్ పడ్డాడని.. ముకుంద కాల్‌కి వేణిగారి భర్తకు ఏదో సంబంధం ఉందని ఆలోచిస్తాడు. ఇక అప్పుడే అక్కడి నుంచి మధు వెళ్లడం చూసి మధుని పిలుస్తాడు. వేణి గారి భర్త తెలుసు అన్నావు కదా ఎవరు అని అడిగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కళ్యాణ్‌కు కనకం, కనకానికి కావ్య.. షాకుల మీద షాకులు