అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today April 6th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: లగేజ్‌ సర్దేసిన కృష్ణ, మురారిలు.. తప్పంతా కృష్ణదే అని ఆదర్శ్‌ మనసు మార్చేసిన మీరా!

Krishna Mukunda Murari Serial Today Episode ఆదర్శ్‌ అన్న మాటలకు మురారి కృష్ణను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని నిర్ణయం తీసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Today Episode సంగీత, ఆదర్శ్‌ ఒక్కటవ్వడానికి తాను సాయం చేస్తాను అని మీరా అంటుంది. ఆదర్శ్‌తో మీ కూతురు బాధ్యత నాది అని మీరా రజినితో చెప్తుంది. అయితే అవసరం బట్టి అప్పుడప్పుడు ఆదర్శ్‌తో చనువుగా ఉంటాను అని ఫీలవ్వొద్దు అని చెప్తుంది. సంగీత తన తల్లితో మీరాని చూస్తే అనుకున్నది చేసేలా ఉంది అంటుంది.

మరోవైపు కృష్ణ మురారిలు బయట నుంచి వస్తారు. ఆదర్శ్‌ తాగుతూ ఉండటం చూస్తారు. ఆదర్శ్‌ చెప్పినా వినడు అని వెళ్లిపోదామని కృష్ణ అంటే నేను మాట్లాడుతా అని మురారి అంటాడు. కృష్ణని లోపలికి వెళ్లిపోమని అంటాడు.

మురారి: ఇంక ఎన్నాళ్లు ఇలా.. సరే నువ్వు నాతో మాట్లాడవు అని నాకు తెలుసు. కనీసం నేను చెప్పేది విను. ఇదిగో నేనేం తప్పు చేయలేదు అని చెప్పడానికి నేను రాలేదు. చెప్పినా నువ్వు వినవు అని తెలుసు. ఆదర్శ్‌ పెద్దమ్మ ప్రతి రోజు నువ్వు ఇలా తాగడం చూస్తే బాధ పడుతుంది. నా కోసం కాకపోయినా పెద్దమ్మ కోసం ఆలోచించు. భవాని పై నుంచి చూస్తుంటుంది. ఇక మీరా కూడా అక్కడికి వస్తుంది.
ఆదర్శ్‌: మందు గ్లాస్ విసిరేసి కోపంతో.. ఆవిడ నీకు పెద్దమ్మ అయితే నాకు అమ్మరా నువ్వు నాకు నీతులు చెప్పొద్దు. 
మురారి: అవునురా నీకు అమ్మ నీకే ఎక్కువ హక్కు ఉంది. నీకే బాధ్యత కూడా ఉంది. ఆ బాధ్యత ఆలోచించి ఇలా అవ్వకు అంటున్నా..
ఆదర్శ్‌: ఏంట్రా ఆలోచించేది నువ్వు కృష్ణ కలిసి నా జీవితం నాశనం చేసేశారు. పోరా ఇక్కడి నుంచి పోరా.
మీరా: మనసులో.. ఆదర్శ్‌ మురారి మీద చాలా కోపం పెంచుకున్నాడు ఎలా అయినా పోగొట్టాలి. 
ఆదర్శ్‌: రేయ్ నువ్వు ఉన్న ఈ ఇంట్లో ఉంటున్నాను చూడు అందుకు నాకు నేనే ఏదో ఒకటి చేసుకోవాలి అని ఉందిరా. అరేయ్ అయినా నాకు ఇంత ద్రోహం చేసి నా ముందుకు నువ్వు ఎలా వస్తున్నావ్ రా.. నీ ప్లేస్‌లో నేను ఉంటే నేను ఉండను. నేను ఉండనురా నీ కోసం నేను ప్రాణాలు ఇస్తా కానీ ఇంత నమ్మక ద్రోహం చేయనురా. కానీ పొరపాటున ఉండాల్సి వస్తే పొరపాటున కూడా నా ముఖం నీకు చూపించేవాడిని కాదురా ఎక్కడికో వెళ్లిపోయేవాడిని. నీకు సిగ్గులేదురా అందుకే నా ముందు నిల్చొంటున్నావ్. రేయ్ నా కళ్ల ముందు తిరగకురా.. నేను నీ ప్లేస్‌లో ఉండి ఉంటే నేను ఈ ఇంట్లోనే ఉండే వాడిని కాదు. గుర్తుపెట్టుకో.
మీరా: బాధ పడకండి మేడం. వాళ్లిద్దరినీ కలిపే బాధ్యత నాది తప్పకుండా చేస్తా మేడం.
భవాని: ప్రయత్నించు కానీ ఎక్కువ కష్టపడకు. వాడి వల్ల మురారి, కృష్ణలకు నష్టం ఏమీ లేదు. వాడు మారితేనే నేను మాట్లాడుతా..
మీరా: కానీ నేను అంత వరకు ఆగలేను. మురారిని మంచిగా చూపించి కృష్ణని మాత్రమే చెడ్డదానిలా చిత్రీకరిస్తా.

మురారి కృష్ణ దగ్గరకు వచ్చి బాధ పడతాడు. ఇక ఆదర్శ్‌కి ముకుంద మీద కోపం ఉండాలి కానీ మన మీద ఎందుకు అని కృష్ణ అడుగుతుంది. మురారి కూడా ముకుంద మీద ఆదర్శ్‌కి అభిప్రాయం ఎలా మారిందా అని ఆలోచిస్తాడు. అయితే కృష్ణ మీరా ముకుంద గురించి ఆదర్శ్‌కి పాజిటివ్‌గా చెప్పి మార్చేసుంటుంది అని అభిప్రాయ పడుతుంది. మీరానే ఆదర్శ్‌ని పొల్యూట్ చేస్తుందని కృష్ణ మురారితో చెప్తుంది. దీంతో మురారి కూడా ఆలోచనలో పడతాడు. 

ఇక మురారి తన బట్టలు సర్దుకొని కృష్ణని కూడా సర్దుకోమంటాడు. మనం ఈ ఇంట్లో ఉండటం లేదు అని వెళ్లిపోతున్నాం అని చెప్తాడు. అందర్ని వదిలి వద్దు అని కృష్ణ అంటుంది. ఎవరి గురించి ఆలోచించకుండా మురారి రమ్మని అంటాడు. కృష్ణ రాను అంటే సీరియస్ అవుతాడు. దీంతో కృష్ణ ఏం మాట్లాడకుండా లగేజ్ సర్దేస్తుంది. 

మరోవైపు మీరా ఆదర్శ్‌తో మాట్లాడుతా అంటుంది. మురారి గురించి అనవసరంగా కోపం పెంచుకున్నావ్ అని మీరా సర్దిచెప్తుంది. ఆదర్శ్‌ మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది. 
మీరా: కృష్ణ పెళ్లి జరిగిన కొన్ని రోజులకే మురారి, ముకుందల ప్రేమ గురించి తెలుసుకుంది. మురారి తన భార్య దగ్గర ఏదీ దాచకూడదు అని చెప్పాడు. కానీ ఆ కృష్ణ దాన్ని అక్కడితో వదిలేయకుండా లాగింది. నువ్వు ముకుంద సంతోషంగా ఉండాలి అన్నది మురారి ఆశ. కానీ విషయం తెలుసుకున్న కృష్ణ ముకుందని అవహేళన చేసింది. నువ్వు ప్రేమలో ఓడిపోయావు లూజర్ అని అవహేళన చేసింది. ఆ సమయంలో మురారి మనసులో కృష్ణ లేదు. కాంట్రాక్ట్ మ్యారేజ్ కదా..  మురారిని మార్చేస్తా అంటూ తన ప్రేమలో పడేస్తా అని ముకుంద అహాన్ని ఇంకా పెంచేసింది. 
ఆదర్శ్‌: అవునా ఇంత టార్చర్ చేసిందా నాకు తెలీదు. 
మీరా: మీకు ఎలా తెలుస్తుంది. పెళ్లి రోజు పారిపోయారు కదా.. మురారి మీకు ఆదర్శ్‌ని కలపాలి అనుకుంటే కృష్ణ చెడగొట్టేది. పెళ్లి చేసుకున్న వాడు ఓ వైపు ప్రేమించిన వాడు మరో వైపు ఎదురుగా ఉంటే ఏ ఆడపిల్ల అయినా ఇలాగే చేస్తుంది. ముకుంద పతనానికి చావుకి అన్నీంటికీ కృష్ణ కారణం. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇందులో నీ తప్పు ఉంది. ఓ సమయంలో ముకుంద మీ కోసమే ఎదురు చూసింది కానీ మీరు రాలేదు. తను ఎప్పుడూ మీరు మురారి కలిసి ఉండాలి అనే చూసేది. నేను చెప్పాల్సింది చెప్పా ఇందులో మీరు ఏం అర్థం చేసుకుంటారో మీ ఇష్టం. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ ఇంట్లో దీప, హారతిచ్చి స్వాగతం పలికిన పారిజాతం.. అమ్మమ్మ తాతయ్యలతో సౌర్య ఆటలు!

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today August 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీ కోసం ఇంటికి వెళ్లిన నందు – నందుకు అబద్దం చెప్పిన లక్ష్మీ
‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీ కోసం ఇంటికి వెళ్లిన నందు – నందుకు అబద్దం చెప్పిన లక్ష్మీ
Illu Illalu Pillalu Serial Today August 1st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో కాపురానికి నో చెప్పేసిన ప్రేమ! త్వరలో రెండో పెళ్లి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో కాపురానికి నో చెప్పేసిన ప్రేమ! త్వరలో రెండో పెళ్లి!
Jagadhatri Serial Today JULY 31th: క్షేమంగా ఇంటికి చేరిన శ్రీవల్లి...పాపారాయుడికి గట్టి వార్నింగ్ ఇచ్చి పంపిన సుధాకర్‌
జగద్ధాత్రి సీరియల్: క్షేమంగా ఇంటికి చేరిన శ్రీవల్లి...పాపారాయుడికి గట్టి వార్నింగ్ ఇచ్చి పంపిన సుధాకర్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Embed widget