అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today April 5th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: మీరాను ముకుందగా మార్చేసిన ఆదర్శ్‌.. కుప్పకూలిపోయిన మీరా.. రజిని రచ్చ లేపేసిందిగా!

Krishna Mukunda Murari Serial Today Episode మీరాను ఆదర్శ్‌ ముకుంద అని పిలవమని ఇంట్లో వాళ్లకు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.  

Krishna Mukunda Murari Today Episode శ్రీనివాస్ అయిష్టంగా బతికే ఉన్న కూతురుకి పిండం పెడతాడు. మీరా తండ్రి గుండెల మీద వాలి బాధపడుతుంది. దీంతో ముందు మీరాని తిట్టిన శ్రీనివాస్ తర్వాత ఓదార్చుతాడు. ఇకపై నీలో నా కూతురు ముకుందని చూసుకుంటా అని తండ్రి అనగానే కొత్త ఐడియా మీరాకు వచ్చేస్తుంది. ఇకపై దీన్ని ఎలా వాడుకుంటానో చూడు అని అనుకుంటుంది.

రజిని: తనలో తాను.. ఇలా ఇంట్లో ఎన్నాళ్లు కూర్చొన్నా చుట్టాన్నే అవుతాను. తొందరగా నా కూతురిని ఈ ఇంటి కోడలిని చేయాలి. ఈరోజుతో ముకుంద పెద్ద ఖర్మ కూడా అయిపోయింది కాబట్టి మెళ్లగా భవాని దగ్గర ప్రస్తావన తేవాలి. వదినను ఒప్పిస్తే తనే ఆదర్శ్‌ని ఒప్పిస్తుంది.. ఇంతలో కృష్ణ అటుగా వెళ్లడం చూసి.. ఏ అమ్మాయ్ ముకుంద ఎలా చనిపోయింది.
కృష్ణ: అందరూ ఎలా చనిపోతారో అలాగే చనిపోయింది. ప్రాణం గాలిలో కలిసిపోయింది అందుకే చనిపోయింది.
రజిని: బాగా వెటకారం అయిపోయింది నీకు నీ పని చెప్తా ఆగు.. వదినా వదినా.. ఏంటి వదినా ఇది నీ కోడలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. నేను పడి ఉండాలా.
రేవతి: ఇప్పుడేమైంది.
రజిని: వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నేను రావడం నీ కోడలికి ఇష్టం లేదు. పెడసరంగా మాట్లాడుతుంది. మమల్ని పట్టించుకోవడం లేదు. ఇంట్లో మనుషులుగా చూడటం లేదు.
భవాని: అందుకు నేను ఒప్పుకోను రజిని. ఇంట్లో అందరి బాగోగులు చూసేది ఎవరైనా ఉన్నారు అంటే అది కృష్ణ మాత్రమే. తను ఎవర్నీ తక్కువగా చూడదు నిన్ను కూడా..
రజిని: అంటే నేను అబద్ధం చెప్పానా..
మురారి: తన మాటే అంత. నీ మాటలు కూడా కటినం మనసు మాత్రం మంచిది కదా.. 
భవాని: రజిని చాలు ఇప్పుడే మేం ముకుంద పిండం పెట్టాము. దాని పిండం ఒక్క కాకీ ముట్టలేదు. ఆ బాధలో మేం ఉంటే ఇప్పుడు మీ గొడవ ఏంటి.

మరోవైపు మీరా కూలబడి ఏడుస్తుంది. ఏమైందని ఆదర్శ్ అడిగితే ముకుంద గుర్తొచ్చిందని చెప్తుంది. 
మీరా: ఇందాక ముకుందకు పిండం పెడుతూ వాళ్ల నాన్న ఓ మాట అన్నారు. నా కూతురు చనిపోలేదమ్మా నీలోనే ఉంది అన్నారు. నాలోనే ముకుందని చూసుకుంటా అన్నారు. మరి నేను ముకంద అని ఎవర్ని పిలివాలి ఆదర్శ్‌ గారు. ముకుంద అనే మాట ఎక్కడ వినిపిస్తుంది. ఈ బాధ నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. 
భవాని: మీరా ఊరుకో మనకు కావాల్సిన వారు ఇన్నాళ్లు మనతో కలిసి ఉంటే వారు ఒక్కసారి కనిపించకపోతే ఆ జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతాయి. ఆ జ్ఞాపకాలు మరుగున పడితే మనం వారిని మర్చిపోతాం. 
ఆదర్శ్‌: అవసరం లేదమ్మ. ఏదీ మర్చిపోవాల్సిన అవసరంలేదు. ఏ బాధ లేకుండా ఎప్పటికీ గుర్తించుకునే దారి ఉంది. ఏమన్నావ్ మీరా ముకుంద పేరు ఎప్పుడు వింటాం. ఎక్కడ వింటాం అన్నావ్ కదా.. ఇప్పుడే ఇక్కడే వింటావ్. అమ్మా అందరూ వినండి ఈ క్షణం నుంచి తన పేరు మీరా కాదు ముకుంద. అవును మీరా.. సారీ సారీ.. అవును ముకుంద. 
రేవతి: ఆదర్శ్‌ ఏం ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావ్.
ఆదర్శ్‌: అంతా ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నా.
మధు: అది కాదు బ్రో. అన్ని ఇబ్బందులు ఫేస్ చేసి మళ్లీ ముకుంద పేరు ఎందుకు.
ఆదర్శ్‌: అయినా తన తండ్రే మీరాలో ముకుందను చూసుకుంటా అన్నాడు. మీకు ఏంటి ప్రాబ్లమ్. అయినా మీకు మీరా అంటే ఇష్టమే కదా.. మనకు ఇష్టమైన వారి కోసం ఇష్టమైన పని చేయడంలో తప్పులేదు కదా. నువ్వేమంటావ్ అమ్మ. ప్లీజ్ అమ్మా ఈ ఒక్కదానికి అయినా ఒప్పుకో. మౌనంగా ఉన్నావంటే ఒప్పుకున్నట్లే కదా.. ఇప్పుడు నువ్వు చెప్పు మీరా నీకు ఇష్టమే కదా. 
మీరా: ఇష్టం కాదు ఇది నా అదృష్టం. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను ఆదర్శ్ గారు అని రెండు చేతులెత్తి దండం పెడుతుంది. మీరు చెప్పినట్లు ఈ క్షణం నుంచి నన్ను ముకుంద అనే పిలవండి ఆనందంగా పలుకుతాను. 

మురారి: ఎందుకు ఆదర్శ్‌ ఇవన్నీ చేస్తున్నాడో ఏం ఆలోచించి ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు.
కృష్ణ: నాకు అర్థమైంది సార్. మన మీద పగ తీర్చుకుంటున్నాడు. రాత్రి మనం పెద్ద అత్తయ్యతో ముకుంద పేరు గుర్తొస్తే చాలు గతం గుర్తొస్తుంది అని మాట్లాడుకున్నాం కదా అది విన్న ఆదర్శ్‌ ఇలా చేశాడు. ఆదర్శ్‌ని మనం నమ్మించాలి సార్ ముకుంద చావుకి మనం కారణం కాదు అని తెలిసేలా చేయాలి. మీరాతో చెప్పిద్దాం. ఆదర్శ్‌ మీరా ఏం చెప్తే అది వింటున్నాడు. 
మురారి: సరే ఒకసారి చెప్తాను. అయినా వినకపోతే ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. 

మీరా మురారి షర్ట్‌ పట్టుకొని తన సంతోషాన్ని పంచుకుంటుంది. మురారి మురారి అని షర్ట్‌తో మాట్లాడుతుంది. ముకుంద ఇన్ కృష్ణ అవుట్ అని అనుకుంటుంది.

ఇక రజిని కూతుర్ని తిడుతుంది. బయట అమ్మాయిలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారని నువ్వు కనీసం నీ బావని కూడా వలలో వేసుకోలేకపోతున్నావని తిడుతుంది. ఇంతలో మీరా అక్కడికి వస్తుంది. మగాడు మారిపోవడం మర్చిపోవడం ఎంత సేపు పిన్నిగారు.. ఇప్పుడే మీరు నిరుత్సాహా పడితే ఎలా అని మీరా ఎంట్రీ ఇస్తుంది. ఇక రజిని చచ్చిపోయిన భార్య పేరు నీకు పెట్టాడు మరి నీ మనసులో ఏముందో.. ఈరోజు వాడి పెళ్లం పేరు పెట్టిన వాడు రేపు నీలో వాడి పెళ్లాన్ని చూసుకుంటే అని అడుగుతుంది. దానికి మనసులో మీరా అలా చూడకూడదు అనే కదా నీ కూతుర్ని అంటగట్టాలి అని చూస్తున్నా అనుకుంటుంది. ఆదర్శ్‌తో సంగీత పెళ్లి చేసే బాధ్యత నాది అని మీరా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీప తలపై రాడ్‌తో కొట్టిన రౌడీ, ఇన్నాళ్లకు కన్న తల్లిదండ్రుల చెంతకు దీప.. అక్క అని పిలిచిన జ్యోత్స్న!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
Siddharth - Pushpa 2: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
Chinmoy Krishna Das News: బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
RC 16 Update: బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
Embed widget