Karthika Deepam 2 Serial Today April 5th: కార్తీకదీపం 2 సీరియల్: దీప తలపై రాడ్‌తో కొట్టిన రౌడీ, ఇన్నాళ్లకు కన్న తల్లిదండ్రుల చెంతకు దీప.. అక్క అని పిలిచిన జ్యోత్స్న!
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode సుమిత్రను బంటు రౌడీతో కొట్టించబోతే దీప అడ్డుకొని హాస్పిటల్ పాలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam 2 Serial Today Episode దీప, సౌర్యలను కూర్చొపెట్టి సుమతి దగ్గరుండి వడ్డిస్తుంది. సౌర్యతో అమ్మమ్మ అని ప్రేమగా చలాకీగా మాట్లాడుతుంది. మరోవైపు బంటుని సుమిత్ర కొట్టినందుకు ఆమె మీద పగ పట్టిన బంటు హాని తలపెట్టాలని మంచి సమయం కోసం చూస్తుంటాడు. ఇక దీప దిగులుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సౌర్యకు పొలమారితే సుమత్ర కంగారు పడుతుంది.
సుమిత్ర: ఏంటే అమ్మమ్మ కబుర్లు చెప్తావ్ నీకు బువ్వ తినడం కూడా రాదా..
సౌర్య: వచ్చు అమ్మమ్మ.
ఇక బంటు ఓ రౌడీని సుమిత్ర మీదకు పంపిస్తాడు. వాడు రాడ్‌తో సుమిత్రను కొట్టబోతే దీప అడ్డుపడుతుంది. దీంతో ఆ రౌడీ దీప తలమీద కొట్టేస్తాడు. దీప కింది పడిపోతుంది. అందరూ కంగారు పడతారు. తలకు రక్తం వస్తుంది. సుమిత్ర దీపను హాస్పిటల్‌కు తీసుకెళ్తుంది.
ఇక బంటును పారిజాతం కొడుతుంది. తనకు చెప్పకుండా ఈ పని ఎందుకు చేశావని తిడుతుంది. పోలీసులు కొట్టిన వాడిని పట్టుకుంటే నువ్వు కూడా జైలుకి వెళ్తావని.. అంటే నేను జైలుకి వెళ్తే నువ్వు వెళ్తావని అంటాడు. దీంతో పారిజాతం కంగారు పడుతుంది. ఇక దశరథ తండ్రికి జ్యోత్స్నకు ఇంట్లో వాళ్లకి ఆ విషయం చెప్తాడు. పారిజాతం ఏమీ తెలీనట్లు నటిస్తుంది. ఇక శివనారాయణ పోలీసులకు చెప్పమంటాడు. మరోవైపు జ్యోత్స్న తన తల్లిని చూపించమని అడుతుంది. దీంతో దశరథ, జ్యోత్స్న హాస్పిటల్‌కి వెళ్తారు.
కార్తీక్ దీప మాటలను తలచుకొని బాధ పడుతుంటాడు. దీప దగ్గరకు జ్యోత్స్న , దశరథ వస్తారు. స్ఫృహలో లేని దీపను జ్యోత్స్న అక్క అని పిలుస్తుంది.
జ్యోత్స్న: అక్క లే అక్క.. అక్కా నీకు మేం ఉన్నాం. దీప కళ్లు తెరుస్తుంది. నువ్వు ఎవరో కూడా తెలీదు అక్క. కానీ మా అమ్మని బతికించి మా అందరికి ప్రాణాలు పోశారు. నీ ప్లేస్‌లో నేను ఉంటే మా అమ్మని కాపాడుకునేదాన్నో లేదో కూడా తెలీదు. కన్నబిడ్డలాగే మా అమ్మని నువ్వు కాపాడావు.
దీప: సౌర్య.. సౌర్య.. నా బిడ్డ ఏది.
దశరథ: అమ్మా కంగారు పడకు సౌర్య ఇక్కడే ఉంది నేను తీసుకొస్తా.. సౌర్య ఏడుస్తుంటే దశరథ వచ్చి తీసుకెళ్తారు.
సౌర్య: ఏమైంది అమ్మ ఇంత పెద్ద కట్టు కట్టారు ఏంటి. దెబ్బ పెద్దగా కట్టారు ఏంటి. అమ్మా మనం ఊరు వెళ్లిపోదాం అమ్మ. పొద్దున్న వాళ్లు తిట్టారు. రోడ్డు మీద అంకుల్ కారుతో గుద్దబోయాడు. పూజ దగ్గర కొట్టారు. ఈ ఊరు మంచిది కాదు నాకు భయం వేస్తుంది అమ్మ. మనం ఇంటికి వెళ్లిపోదాం అమ్మ.
దీప తన భర్త, అత్త మాటలు తలచుకొని బాధపడుతుంది. సౌర్యకి ధైర్యం చెప్తుంది. ఇక దశరథ ఈ టైంలో నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దు అని అంటాడు. ఇంతలో పోలీస్ అధికారి వచ్చి ఎఫ్‌ఐఆర్ ఫైల్ అయిందని ఎక్కడికీ వెళ్లొద్దు అంటుంది. ఎంక్వైరీ జరుగుతుందని అంటుంది. ఇక పోలీస్ అధికారిణి సుమిత్ర కోటీశ్వరురాలు అని తనకు వందల కోట్ల ఆస్తి ఉందని ఆమె మీద దాడి జరిగింది కాబట్టి ఈ కేసుకు మీ హెల్ప్ కావాలి అని అంటుంది. ఇక దీపకు సెల్టర్ ఇస్తా అని అంటే జ్యోత్స్న పోలీస్ మీద సీరియస్ అవుతుంది.
దీపని అక్క అక్క అంటూ అక్క మా ఇంట్లోనే ఉంటుంది. మేమంతా నీకు ఉన్నాం అక్క. నువ్వు మాతో వచ్చేయ్ అని చెప్తుంది. దీప అది కాదు అండీ ఇది కాదు అండీ అంటే అండీ వద్దు నన్ను నీ చెల్లి అనుకో అంటుంది.
సుమిత్ర: అది నా మీద ప్రేమతో అలా మాట్లాడుతుంది. నాకు ఫ్యామిలీ ఉన్నట్లు నీకు ఫ్యామిలీ ఉంటుంది కదా. మీ ఆయనకు కాల్ చేసి చెప్పు. ఆయన అందుబాటులో లేకపోతే ఎవరో ఒకరికి చెప్పమ్మ. ఫోన్ చేసి పరిస్థితి చెప్పు. నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్లతో నేను మాట్లాడుతాను.
దీప: నేను కష్టంలో ఉన్న ఆడదాన్నమ్మ. ఎవరితో ఏమీ చెప్పుకోలేను. అని ఏడుస్తుంది.
సుమిత్ర: ఒక చేత్తో బ్యాగు మరో చేత్తో పాపని పట్టుకున్నప్పుడే నువ్వు కష్టాల్లో ఉన్నావని నాకు అర్థమైంది మా ఇంటికి వెళ్దాం పద.
దీప: వద్దండి..
దశరథ: అమ్మా దీప నేను రమ్మనేది మా స్వార్థం కోసం కాదమ్మా.. నా భార్యని నువ్వు కాపాడావు ఆ రౌడీలను గుర్తుపట్టగలవని నిన్ను ఏదైనా చేస్తారని మా భయం అందుకే నీ రక్షణ మా బాధ్యత. మా ఇంట్లో ఎలా ఉండాలి అనుకోకు. నా కూతురు నిన్ను ఎప్పుడు అక్క అని పిలిచిందో అప్పుడే నువ్వు నా కూతురు అయిపోయావు.
సౌర్య భయపడి అమ్మ దాక్కుందా అని అంటుంది. దీంతో సుమిత్ర నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా మిమల్ని కాపాడుకుంటాను. మాతో వచ్చేయ్ అంటుంది. సౌర్య సరే అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.