Krishna Mukunda Murari Serial Today April 20th: కృష్ణకు గర్భసంచి తీసేయాల్సిందేనా, విలవిల్లాడిపోయిన కృష్ణ.. మీరాతో పెళ్లి చేయమన్న ఆదర్శ్!
Krishna Mukunda Murari Serial Today Episode ట్యాబ్లెట్ వలన కృష్ణ కడుపునొప్పితో బాధపడి చనిపోతాను ఏమో అని భయంగా ఉంది పెద్దత్తయ్య అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode ముకుంద పానకం, ప్రసాదం పట్టుకొని వచ్చి అందరికీ ఇస్తుంది. ట్యాబ్లెట్స్ కలిపిన పానకాన్ని ఇస్తుంది. అందరితో పాటు కృష్ణ కూడా పానకం మొత్తం తాగేస్తుంది. ముకుంద తెగ సంబరపడిపోతుంది. ఇక రేవతి కిచెన్‌లో ఉంటే అక్కడికి ఆదర్శ్ వెళ్తాడు.
ఆదర్శ్: పిన్ని.. మీతో ఒక విషయం మాట్లాడాలి.
రేవతి: ఏంటో చెప్పు నాన్న.
ఆదర్శ్: అంటే పిన్ని ఈ విషయం అమ్మతో చెప్పాలి. కానీ ఎందుకో ధైర్యం సరిపోవడం లేదు. ఇప్పటికే అమ్మకి చెప్పాలి అని చాలా సార్లు ట్రై చేశాను కానీ చెప్పలేకపోతున్నాను. ఇలాగే ఉంటే ఎప్పటికీ చెప్పలేను ఏమో అని ముందు నీతో చెప్తున్నాను. నేను చెప్పింది చెప్పినట్లు నువ్వు అమ్మ దగ్గర చెప్తే చాలు పిన్ని.
రేవతి: సరే ఏంటో చెప్పు.
ఆదర్శ్: పిన్ని నేను ముకుందను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. అదే పిన్ని మన మీరాని. ఈ విషయం నువ్వే ఎలా అయినా సరే అమ్మకు చెప్పి ఒప్పించాలి.
రేవతి: అంతేనా నేను చెప్తాలే నువ్వు వెళ్లు.
ఆదర్శ్: అదేంటి పిన్ని ఇంత సింపుల్‌గా ఒప్పుకున్నావ్.
రేవతి: ఇందులో ఒప్పుకోకపోవడానికి ఏముంది. నువ్వు మీ అమ్మకి చెప్పమన్నావ్ చెప్తా అన్నాను.
ఆదర్శ్: అది కాదు పిన్ని నేను మీరాని పెళ్లి చేసుకుంటాను అంటే నువ్వు ఆశ్చర్యపోయి అదేంట్రా ఎవరూ దొరకనట్లు అనాథ పిల్లని పెళ్లి చేసుకుంటాను అని అడుగుతావు ఏమో అనుకున్నాను.
రేవతి: అనాథ పిల్ల ఏంట్రా నువ్వు మనసిచ్చావ్ అది ముఖ్యం. అయినా మీరా రాగానే నీ ప్రవర్తనలో నీ ఇష్టం నాకు అర్థమైపోయింది.
ఆదర్శ్: నిజమే పిన్ని తనకోసం చాలా ఆరాటపడ్డాను. ఎందుకో తెలీదు తను నా పక్కన ఉంటే ముకుందనే నా పక్కన ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వే ఎలా అయినా అమ్మకు చెప్పి ఒప్పించు పిన్ని.
రేవతి: సరే కానీ ఆ అమ్మాయికి తెలుసా..
ఆదర్శ్: పక్కనున్న మీకే నా ఆరాటం అర్థమైంది. తనకి అర్థం కాకుండా ఉంటుందా.. కానీ తను బయట పడటం లేదు. నాకు నేరుగా ధైర్యం లేదు. ఒప్పించు పిన్ని ఎలా అయినా ఒప్పించు.
రేవతి: సరేరా నా బాధ్యతగా అక్కతో మాట్లాడుతా.. తర్వాత నీ దేవుడి దయ..
రేవతి భవానికి దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది. ఇప్పటికే ఆదర్శ్ జీవితంలో చాలా అనర్ధాలు జరిగిపోయాయని అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి అని భవాని చెప్తుంది.
భవాని: సంగీత కూడా ఆదర్శ్ మీద ఆశలు పెంచుకుంది తన గురించి కూడా ఆలోచించాలి కదా.. అయినా ముకుందని ఇష్టపడ్డాడు కదా ఏమైంది. కలిసి జీవించిందా. మనం ఇష్టపడిని ప్రతీది మనకు మేలు చేస్తుంది అని గ్యారెంటీ లేదు. మేలు చేసిన వారిని ఇష్టపడితేనే మన జీవితం సంతోషంగా ఉంటుంది.
రేవతి: అయితే ఇప్పుడు ఏమంటావ్ అక్క. మీరాని కాదు అంటే ఆదర్శ్ డిసప్పాయింట్ అవుతాడు.
భవాని: అందుకే ఇప్పుడు ఏమీ చెప్పొద్దు. అమ్మ ఆలోచిస్తుంది అని చెప్పు చాలు. అలా అని మీరా అంటే నాకు ఇష్టం లేదు అనికాదు. కానీ కొన్ని నిర్ణయాలు వెంటనే తీసుకోకూడదు.
రేవతి: అర్థమైంది అక్క కాదు అని చెప్పకుండా అవును అని చెప్పకండా ఆదర్శ్‌కి ఏదో ఒకటి చెప్తాను.
మరోవైపు కృష్ణ తనలో తానే నవ్వుకుంటుంది. ఏమైంది అని మురారి అడిగితే తనకి వెంటనే బిడ్డ పుడితే వెంటనే పెద్దత్తయ్య చేతిలో పెట్టేస్తా అంటుంది. పంతులు గారు కూడా ఈ ఏడాదే సీమంతం అవుతుంది. బిడ్డ పుడుతుంది అని చెప్పారని అంటుంది. ఇంతలో సడెన్‌గా కృష్ణ కడుపు నొప్పి అని విలవిల్లాడుతుంది. విపరీతంగా నొప్పి అని తట్టుకోలేకపోతున్నా అని అరుస్తుంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నావని సడెన్‌గా ఏమైందని మురారి అడుగుతాడు. ట్యాబ్లెట్స్ చెప్పు తీసుకొస్తాను అంటే మీరు నాతోనే ఉండండి అని కృష్ణ అని మురారి భుజం మీద వాలిపోతుంది.
కృష్ణ గట్టిగా ఏడుస్తుంది. మురారి మధుని పిలిచి కారు తీయమని చెప్తాడు. కృష్ణ విలవిల్లాడిపోవడం చూసిన ముకుంద తెగ సంతోష పడుతుంది. మరో వైపు ఇంట్లో అందరూ తెగ కంగారు పడతారు.
భవాని: ఇంత సేపు బాగానే ఉంది కదరా.. సడెన్‌గా కడుపునొప్పి ఏంటి.
ముకుంద: మనసులో.. ట్యాబ్లెట్ పని చేయడం ప్రారంభమైంది. నీ కలలు ఆవిరైపోయి నా కలలు మళ్లీ చిగురించబోతున్నాయి కృష్ణ.
భవాని: హాస్పిటల్‌కి తీసుకెళ్దాం పదండి.. కృష్ణ కొంచెం ఓర్చుకోమ్మా...
కృష్ణ: భరించలేకపోతున్నా పెద్దత్తయ్య. చచ్చిపోతానేమో అని భయంగా ఉంది.
భవాని: నోర్ముయ్ చంపేస్తా అలా మాట్లాడానంటే.
రేవతి: కృష్ణ నీకు ఏం కాదు అయినా నువ్వు డాక్టర్‌వి అలా మాట్లాడుతావేంటి.
కృష్ణ: నిజంగానే భయంగా ఉంది అత్తయ్య. నాకేమైనా అయిపోతుందా అని కాదు. పెద్దత్తయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా పోతానేమో అని భయంగా ఉంది. పెద్దత్తయ్య నన్ను క్షమించండి. మీ కోరిక తీర్చకుండానే..
భవాని: నోర్ముయ్‌మన్నానా.. పొద్దున్నుంచి నువ్వు ఏం తినలేదు కదా ఆ పానకం వడపప్పు తినడం వల్ల ఏమైనా..
ముకుంద: అయ్యో ప్రసాదం వల్ల ఏమవుతుంది మేడం. మనం అందరం తిన్నాం కదా.. వేరే ఏమైనా అయింటుంది. కాకపోతే పండగరోజు ఇలా జరగడమే చాలా బాధగా ఉంది.
రజిని: పొద్దున్నుంచి ఉపవాసం కదా వడపప్పు కాస్త ఎక్కువ తినేసుంటుంది. ఉప్పునీళ్లు పడితే ఏ ఇబ్బంది ఉండదు. మొత్తం వాంతి అయిపోతుంది. హాస్పిటల్‌కి కూడా వెళ్లాల్సిన అవసరం ఉండదు.
ముకుంద: ఏంటండి మీరు నొప్పితో అలా విలవిల్లాడిపోతుంటే..
ఇక ముకుంద కారు తాళాలు తీసుకొని నేను డ్రైవింగ్ చేస్తానని వెళ్తుంది. అందరూ కృష్ణకు ధైర్యం చెప్తారు. మధు కూడా వెళ్తాడు. మరోవైపు తన ఫ్రెండ్ ముకుంద చావుకి కారణమైన కృష్ణ మీద ముకుందకు అంత కోపం ఉంది కదా మరి కృష్ణకు ఇలా అవ్వగానే ఎందుకు ఇంత కంగారు పడిపోతుందని ఆదర్శ్ అనుమానిస్తాడు.
కృష్ణను హాస్పిటల్‌కి తీసుకొస్తారు. డాక్టర్ పరిమళ కృష్ణకు ఏమైందని అడిగి చూస్తుంది. ఇక కృష్ణ తనకు ఫుడ్ పాయిజిన్ వల్ల ఏం కాలేదు అని ఇంకేదో అయిందని తనకు ముందు ష్కానింగ్ చేయమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.