అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Promo Today January 6th: 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్: ముకుందకు నలుగు పెట్టిన కృష్ణ, ఆర్టిస్ట్‌ని చంపినవాడు దొరికేశాడన్న మురారి!

Krishna Mukunda Murari Serial Promo Today ముకుందకు కృష్ణ నలుగు పెడుతున్న టైంలో మురారి వచ్చి ఆర్టిస్ట్‌ని చంపిన వ్యక్తి దొరికాడు అని చెప్పడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Promo Today: ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ తాజాగా ఎపిసోడ్స్‌లో.. మురారికి యాక్సిడెంట్ చేయించి ముఖం మార్చిన దేవ్ ఇప్పుడు మురారి ఇంటికి చేరి వాళ్లతో మంచిగా ఉంటున్నాడు. దీంతో దేవ్‌ మీద ఎవరికీ అనుమానం రావడం లేదు. లేటెస్ట్‌గా ఆర్టిస్ట్‌ని చంపేసిన దేవ్.. మరిన్ని కుట్రలకు ప్రయత్నిస్తున్నాడు. ఇక దేవ్ చేతి రింగ్ గుర్తించిన కృష్ణ దేవ్ అలాంటి తప్పు చేయడు అని నమ్మి అతడిని అనుమానించదు. తాజాగా కృష్ణ ముకుంద మురారి ప్రోమో విడుదలైంది. ప్రోమోలో ఏముందంటే..

పెళ్లి కూతురు ముకుందకి గంధం రాయాలని ముత్తయిదువులు చెప్తే.. భవాని తన కూతురు నందూకి ముందు రాయమని చెప్తుంది. దీంతో ముకుంద అడ్డుకొని తన జీవితాన్ని నిలబెట్టింది మీరే అత్తయ్య అందుకే ముందు మీరే నాకు గంధం రాయాలి అని అంటుంది. దీంతో భవాని గంధం రాస్తుంది. మరో వైపు రేవతి తన కొడుకు మురారికి గంధం రాస్తుంది. తర్వాత భవాని కృష్ణతో కృష్ణ నువ్వు పెద్దదానివి నువ్వు కూడా ముకుందకు గంధం రాయు అని చెప్తుంది. దీంతో కృష్ణ ముకుందకు గంధం రాయడానికి వెళ్తుంది. మరోవైపు మురారి హడావుడిగా భవాని దగ్గరకు వచ్చి.. పెద్దమ్మ ఆర్టిస్ట్ శ్రీధర్‌ని చంపిన ముగ్గురు నలుగురిలో ఒకడు దొరికాడు అని డిపార్ట్‌మెంట్‌ నుంచి ఇప్పుడే కాల్ వచ్చిందని మురారి చెప్తాడు. దీంతో ముకంద తెగ టెన్షన్ పడుతుంది

.

నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. 

ప్రసాద్‌తో మురారి, కృష్ణలు ఏ టెన్షన్ లేకుండా సరదాగా మాట్లాడటం చూసి భవాని కోపంతో తన గదిలోకి వెళ్లిపోతుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రమాదాలకు కృష్ణ చిన్నాన్న ప్రభాకరే కారణం అని తాను నమ్ముతుంటే కృష్ణ, మురారిలు ఏ భయం లేకుండా అంత ధైర్యంగా ఎలా ఉన్నారని ఆలోచిస్తుంది భవాని. ఇక ఆ ప్రభాకరే అంతా చేశాడని తాను ఒక్కదాన్నే నమ్ముతున్నట్లు అనిపిస్తుందని.. ఒకవేళ తాను తప్పు చేస్తున్నానా.. వాళ్లు వైపు ఎలాంటి భయం కానీ టెన్షన్ కానీ తనకు కనపడటం లేదని.. అది పైకి కనిపిస్తున్న గాంభీరమా.. అని ఆలోచిస్తుంటుంది. ఇక కృష్ణ దూరం అవుతుందేమో అన్న భయం మురారిలోనూ కనిపించడం లేదు. నేను అనవసరంగా భయపడుతున్నానా.. అని అనుకుంటుంది. ఈలోపు భవాని దగ్గరకు శకుంతల వస్తుంది. శకుంతల ఒప్పించే ప్రయత్నం చేయాలి అనుకునే లోపే భవాని తనని ఇబ్బంది పెట్టొద్దని అక్కడి నుంచి వెళ్లిపోమని దండం పెడుతుంది. దీంతో శకుంతల వెళ్లిపోతుంది.

మరోవైపు మురారి కృష్ణ ఇంటికి వెళ్లి తనకు తలనొప్పి అని చెప్పాడు. దీంతో కృష్ణ మురారికి మసాజ్ చేస్తుంది. ఇక శకుంతల అక్కడికి వస్తుంది. శకుంతల డల్‌గా ఉండటం చూసి మురారి మా ఇంటికి వెళ్లావా అని అడుగుతాడు. దాంతో శకుంతల భవానిని కలిశానని కానీ ఆమె మాట్లాడనివ్వకుండా దండం పెట్టి పంపించేసింది అని చెప్తుంది. దీంతో కృష్ణ పెద్దత్తయ్య కోప్పడకుండా దండం పెట్టి మరీ వెళ్లిపోమని చెప్పింది అంటే తనని తాను ఎంత కంట్రోల్ చేసుకొని మాట్లాడిందో అని అంటుంది. తర్వాత మురారితో తన పిన్ని చాలా బాధపడుతుంది అని అంటుంది.  

మరోవైపు ముకుంద, దేవ్ పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు ముకుంద దేవ్ చేతికి ఉన్న ఉంగరం చూస్తుంది. ఇదేంటి ఇంతకు ముందు లేదు కొత్తదా అని అడుగుతుంది. దాంతో దేవ్ తనకు ముంబైలో ఓ అమ్మాయి పరిచయం అయిందని పెళ్లి చేసుకోవాలి అని కోరి తనకోసం హైదరాబాద్ వచ్చి ఆ రింగ్ గిఫ్ట్‌గా ఇచ్చిందని చెప్తాడు. ఈ విషయం తన దగ్గర ఎందుకు దాచావని ముకుంద అడుగుతుంది. ఇక ఇంట్లో వాళ్లు అందరూ భోజనం చేస్తుంటే దేవ్, ముకుంద కూడా వచ్చి కూర్చొంటారు. కృష్ణ, మురారిలు కూడా కూర్చొంటారు. భోజనం చేస్తున్నప్పుడు కృష్ణ దేవ్ చేతికి ఉన్న రింగును చూసేస్తుంది. ఆర్టిస్ట్ శ్రీధర్ మొఖం మీద ఉన్న రింగ్ మార్క్ అదే అయింటుందని అనుమానపడుతుంది. ఇక ఆ రింగ్ ముద్ర దేవ్ రింగ్ ఒకటి అయిండదని తనకు తాను సర్ది చెప్పుకుంటుంది. 

ఇక అప్పుడే భవాని రేపు మురారి, ముకుందలకు నలుగు పెట్టే కార్యక్రమం ఉందని చెప్తుంది. దీంతో దేవ్ మనసులో తాను ఇప్పుడు పెర్మామెన్స్ చేయకపోతే కృష్ణ, మురారీలకు డౌట్ వస్తుందని అనుకొని మేడం.. ఒక్కసారి ఆలోచించండి.. నా చెల్లి పెళ్లి అవుతుందని మీరు సంతోషిస్తున్నారేమో కానీ నా చెల్లి కృష్ణ జీవితం ఏమవుతుందా అనే బెంగతో నాకు భోజనం కూడా సహించడం లేదని అంటాడు. దానికి భవాని ఏమన్నావ్.. మీ చెల్లి కృష్ణ అన్నావ్ కదూ.. గుడ్ నా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరికిందని అంటుంది. రేపు ముకుంద నలుగు మీ రెండో చెల్లి అదే కృష్ణ ఇంట్లో మా అవుట్ హౌస్‌లో జరుగుతుందని అని చెప్తుంది. కృష్ణ ఈ విషయం మీ చిన్నమ్మకి కూడా చెప్పి ఇద్దరూ రెడీగా ఉండండని కృష్ణకు చెప్తుంది. దీంతో కృష్ణ ఏడూస్తూ భోజనం చేయకుండా చేతులు కడిగేసి వెళ్లిపోతుంది. వెనకాలే మురారి కూడా వెళ్లిపోతాడు.

ఇంటికెళ్లిన కృష్ణ ఏంటి నా మనసు అంతా శూన్యం అయిపోయింది దిగులుగా ఉంది అని.. మనసు ఖాళీ అయిపోయిందని.. ఇలా ఎప్పుడూ కాలేదు. ఎందుకు నేను ఇంత భయపడుతున్నాను. రేపు నలుగు, ఎల్లుండి పెళ్లి. ఈ పెళ్లి ఆగాలి అంటే ఆ ఉంగరం వాడు దొరకాలి. పెద్దత్తయ్య మనసు అయినా లేదంటే ఆదర్శ్ అయినా రావాలి. ఈ మూడింటిలో ఉంగరం వాడు దొరకడమే బెటర్. అని అనుకుంటుంది. ఇక మురారి అక్కడికి రావడంతో ఏసీపీ సార్ నాకు భయం వేస్తుందని చెప్తుంది. దీంతో మురారి కృష్ణకు ధైర్యం చెప్తాడు.

Also Read: ‘మీర్జాపూర్ 3' to 'ఫ్యామిలీ మ్యాన్ 3' - 2024లో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ సీక్వెల్స్ ఇవే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ ఘటన - ఏబీపీ దేశం చొరవతో శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌పై సీపీ, వైద్యుల స్పందన
సంధ్య థియేటర్ ఘటన - ఏబీపీ దేశం చొరవతో శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌పై సీపీ, వైద్యుల స్పందన
Embed widget