krishna Mukunda Murari Serial November 13th Today Episode : కృష్ణ సెలక్షన్‌కు ఓటేసిన మురారి.. హర్ట్ అయిన ముకుంద!
krishna Mukunda Murari Serial Today Episode: షాపింగ్ మాల్‌లో కృష్ణ మిలటరీ అధికారిని ఆదర్ష్ కోసం అడగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Srerial November 13th Episode : ముకుంద: (షాపింగ్ మాల్‌లో) ఏంటి గెలిచానని సంబరపడిపోతున్నావా.. ఏదో వంకరగా మాట్లాడావని తెగ ఇదైపోతున్నావ్
కృష్ణ: నేనేం ఇదైపోవడం లేదు ముకుంద నువ్వే తెగ రెచ్చిపోతున్నావు. ఇందాక ఏమైంది.
ముకుంద: గతంలో నువ్వు ఉన్నావు. పాపం దాన్ని మురారి పూర్తిగా మర్చిపోయాడు. నీతో సహా మరెందుకు నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు. నేను మురారి వర్తమానంలో ఉన్నాను. అనవసరమైన ఆశలు పెంచుకోకు. మేము అమెరికా వెళ్లిపోయాక ఆ అవుట్ హౌస్‌లో ఉన్న చెట్టుకింద అశోకవనంలోని సీతలా కూర్చొకుండా వెళ్లిపో
కృష్ణ: ఏసీపీ సార్ నన్ను ఇష్టపడుతున్నారు అది నీకు తెలుసు. అనవసరంగా ఆవేశపడుతున్నావు. ఆశపడుతున్నావు.
ముకుంద: నాది ఆవేశమా.. నాది ఆశ.. చూడు కృష్ణ నేను మా పెద్దత్తయ అండతో మురారినీ దక్కించుకుంటా.
కృష్ణ: నాకు ఎవరి అండదండలు అక్కర్లేదు ముకుంద. (తాళిని చూపిస్తూ.. )ఇదే నాకు అండ. సరే నీ మాట నేనెందుకు కాదనాలి. కొందరికి మాటలతో చెప్పలేం చేతులతో చెప్పాలి. ముకుంద అబద్దానికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. నిజానికి కాదు. దాన్నే నేను నమ్ముతాను. ఎప్పుడో ఒకప్పుడు నిజం బయట పడుతుంది. ఏంటి ఇప్పుడు ఏసీపీ సార్ నీ వైపు ఉన్నావ్ అనుకుంటావ్ అంతే కదా.. నేను ఇందాక అన్నా కదా కొందరికి మాటలతో కాదు చేతలతో చూపించాలి అని అదేంటో ఇప్పుడు చూపిస్తా నాతో రా. రా ముకుందని తీసుకెళ్తుంది.
ఇద్దరూ మురారి కోసం షర్ట్ సెలక్ట్ చేస్తారు. తర్వాత ఏసీపీని పిలిచి ఎవరు సెలక్ట్ చేసిన షర్ట్ ఆయన తీస్తారో అని పందెం వేసుకుంటారు. తర్వాత మురారిని పిలుస్తారు. మురారి మనసులో వీళ్లేంటి నన్ను పిలుస్తున్నారు. నేను కొన్న గిఫ్ట్ గానీ చూసేశారా.. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు కదా చూసుండరులే. అంటూ వాళ్ల దగ్గరకు వెళ్తాడు. కృష్ణ, ముకుంద సెలక్ట్ చేసిన షర్ట్‌లలో మురారి కృష్ణ ఎంచుకున్న షర్ట్ బాగుంది అంటాడు. దీంతో కృష్ణ ఆ షర్ట్ ప్యాక్ చేయమని అక్కడినుంచి వెళ్లిపోతుంది. ముకుంద హర్ట్ అయిపోతుంది.
ముకుంద: మనసులో.. ఛ.. అసలు కృష్ణకు ఎవరు చెప్పారు మేము షాపింగ్‌కు వస్తున్నామని.. ముందు నాతో ఎంత చక్కగా ఉన్నాడు. ఇప్పుడు చూడు అసలు పట్టించుకోవడం లేదు. ఏంచేయాలో అర్ధం కావడం లేదు. ఎలా కృష్ణని బయటకు పంపించాలి.
ఇంతలో కృష్ణ, మురారి మాట్లాడుకుంటారు. అక్కడికి వచ్చి కృష్ణను ముకుంద ఇంటికి వెళ్లిపోమంటే అందరం ఒకే చోట ఉన్నాం కదా అందరం షాపింగ్ ముగించుకొని ఇంటికి వెళ్దాం అని మురారి అంటాడు. ఇక కృష్ణ కోసం డ్రింక్ తెప్పించమని ముకుందకు చెప్తాడు. మరోవైపు కృష్ణ దగ్గరకు ఓ మిలటరీ ఆయన వస్తారు. వచ్చి మేడం గుర్తుపట్టారా అని అడుగుతాడు. అతనికి ఆదర్స్ కోసం అడుగుతుంది. ఆ మాటలు వినకుండా మురారిని అక్కడి నుంచి ముకుంద తీసుకొచ్చేసింది.
కృష్ణ మురారికి షర్ట్‌లు సెలక్ట్ చేసి అది బాలేదు. ఇది బాలేదు అని మార్పిస్తుంది. ఇంతలో ఒకరు వచ్చి భార్య భర్తలు అంతే బ్రో అంటూ మాట్లాడుతాడు. అయితే ఆ మాటలకు కృష్ణ ఏమీ అనలేదు ఎందుకని మురారి మనసులో అనుకుంటాడు. ఫైనల్‌గా ఓ షర్ట్ చేసి అది ఫిక్స్ అవ్వండి అంటుంది. ఇక అక్కడికి వచ్చిన ముకుందకు అడుగుతుంది షర్ట్ ఎలాఉంది అని ముకుంద అయిష్టంగానే బాగుంది అంటుంది.
షాపింగ్‌మాల్‌లో ముకుంద కృష్ణని అవమానిస్తుందేమో అని వాళ్ల అత్తయ్య బాధ పడుతుంది. అప్పుడు అక్కడికి నందిని వస్తుంది. కృష్ణ గురించి కృష్ణ, ముకుంద గురించి యాక్సిడెంట్ గురించి అమ్మ చెప్పింది నిజమేనా పిన్ని అని నందిని అడుగుతుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
తరువాయిభాగంలో: మురారి రాత్రి ఎవరూ లేనిటైంలో కృష్ణని బయటకు తీసుకొచ్చి ఓ రింగ్‌ను గిఫ్ట్‌గా ఇస్తాడు. ఆ రింగ్‌ను కృష్ణ వేలుకి తనే స్వయంగా తొడగడంతో కృష్ణ షాక్ అవుతుంది. ఇదంతా ముకుంద చాటుగా చూస్తుంది.