అన్వేషించండి

Janaki Kalaganaledhu August 11th: 'జానకి కలగనలేదు' సీరియల్: ఉగ్రవాదిని ఇంటి అల్లుడుగా చేసుకుంటున్న జ్ఞానంబ కుటుంబం.. స్కూల్ పిల్లలను టార్గెట్ చేసిన కిషోర్?

కిషోర్ 2000 మంది పిల్లలతో ఉన్న స్కూల్ పై బాంబు దాడి చేయటానికి ప్లాన్ చేయటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Janaki Kalaganaledhu August 11th: జానకి ఒంటరిగా కూర్చొని సంబంధం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సంబంధం విషయంలో వెన్నెల ఏమాత్రం వెనక్కి తగ్గదని.. అలా అని సమయం తీసుకుందామనుకుంటే.. అత్తయ్య వాళ్ళు వెన్నెల విషయంలో మరింత తొందర పడుతున్నారని అనుకుంటుంది. ఇక రామకు ఈ విషయం చెబితే ఎలా రియాక్ట్ అవుతాడో అని అనుకుంటుంది.

అదే సమయంలో అక్కడికి రామ రావడంతో మీతో మాట్లాడాలంటూ.. ఇది రెండు జీవితాలకు సంబంధించిన సమస్య అని.. ఆవేశ పడకుండా ప్రశాంతంగా వినమని అంటుంది. దాంతో రామ ఆశ్చర్యంగా ఎవరి గురించి మాట్లాడుతున్నారని అడగటంతో వెన్నెల సంబంధం గురించని అంటుంది జానకి. దాంతో రామ ఆ సంబంధం గురించి మీరు మర్చిపోండని అంటాడు.

కానీ జానకి పెళ్లిచూపులు జరిగిపోయాయి ఒకరికొకరు నచ్చుకున్నారని కూడా అంటుంది. దాంతో అబ్బాయి నచ్చకపోయినా కూడా పెళ్లి చేసేయాలా అని రామా అనడంతో.. నచ్చకపోవటానికి అతని మీద ఏమైనా క్రిమినల్ కేసు ఉన్నాయా.. అతడు ఏమైనా రౌడీయా, ఉగ్రవాదియా అని అంటుంది జానకి. కేవలం చిన్న యాక్సిడెంట్ మాత్రమే చేశాడని అంటుంది జానకి.

దాంతో రామ యాక్సిడెంట్ గురించి కాదు యాక్సిడెంట్ జరిగాక ఆ పెద్దాయనని పట్టించుకోకుండా పోవడమని అంటాడు. దాంతో జానకి ఆ అబ్బాయి ఇందాకే ఫోన్ చేసి.. తన నాన్నకు గుండె నొప్పిని కంగారులో అలా జరిగిందని అంటాడు. మరి ఈ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు తీరిగ్గా ఇంటికి వెళ్లి కథలు అల్లుతున్నాడా అని రామ అంటాడు. ఆ సంబంధం ఒప్పుకోకగాక ఒప్పుకోనని అంటాడు.

ఎందుకు ఆ సంబంధం గురించి అంత ఆరాటపడుతున్నారని రామ అడగటంతో ఎందుకంటే వెన్నెల అతడిని ప్రేమించింది కాబట్టి అని అంటుంది జానకి. వెంటనే రామ ఆవేశంగా వెన్నెల దగ్గరికి బయలుదేరుతుండగా జానకి ఆపుతుంది. రామ మాత్రం వెన్నెలపై కోపాన్ని చూపిస్తూ ఉంటాడు. జానకి కూడా.. వెన్నెలను ఆ విషయంలో సమర్ధించటం లేదు అని అనటంతో మరెందుకు ఆ సంబంధాన్ని ఒప్పుకున్నారని రామ అడుగుతాడు.

వెన్నెల అతడిని మర్చిపోలేక పోతుందని.. ఒకవేళ ఇతడిని కాదంటే జీవితాంతం పెళ్లి చేసుకోనని అన్నదని అంటుంది. ఆయన మీ తమ్ముడు విషయంలో ఒక న్యాయం వెన్నెల విషయంలో ఒక న్యాయమా అని అడుగుతుంది. అంతేకాకుండా సమస్యను పెద్దదిగా చేయకుండా మీరే అర్థం చేసుకొని ఈ పెళ్లి జరిగేటట్టు చేయమని అంటుంది. దాంతో రామ వెన్నెల కోసం ఒప్పుకుంటాడు.

కానీ వాళ్లను అనరాని మాటలు అన్నానని బాధపడటంతో వెంటనే జానకి కిషోర్ కి ఫోన్ చేసి రామతో మాట్లాడిస్తుంది. ఇక రామ తప్పు తెలుసుకున్నాను అని క్షమాపణలు చెప్తాడు. ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత కిషోర్ క్రూరంగా నవ్వుకుంటాడు. ఇక వెన్నెల విషయాన్ని మీరే వెళ్లి అత్త మామయ్యలతో చెప్పండని అంటుంది జానకి. మరోవైపు జ్ఞానంబ గోవిందరాజులపై.. ఆయన తీసుకొచ్చిన సంబంధం గురించి కోపంగా మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది.

అప్పుడే రామ అక్కడికి వెళ్లి తను పొరపాటు పడ్డానని.. కిషోర్ తన తండ్రికి బాలేదని కంగారులో అలా వెళ్ళాడని.. నిజానికి అతనిది ఏమీ తప్పులేదని.. ఈ సంబంధం ఒప్పుకుంటున్నాను అని అనటంతో గోవిందరాజులు దంపతులు సంతోషపడతారు. అంతేకాకుండా రేపు ఉదయానే నిశ్చితార్థం పెట్టుకుందామని కూడా అనుకుంటారు. ఇక వీరి మాటలు విని జానకి, వెన్నెల కూడా సంతోషపడుతారు.

ఆ తర్వాత వెన్నెల తన అన్నయ్యకు థాంక్స్ చెబుతుంది. దాంతో రామ నీ సంతోషం కోసం ఏమైనా చేస్తానని అంటాడు. అప్పుడే గోవిందరాజులు పంతులు గారితో మాట్లాడేసానని సంతోషంగా చెబుతాడు. ఇక జానకి వాళ్లకి ఫోన్ చేసి మాట్లాడమని రామతో అనడంతో గోవిందరాజులు నేను మాట్లాడుతానని అంటాడు. ఆ తర్వాత గోవిందరాజులు వాళ్లతో ఫోన్ చేసి సంబంధం గురించి మాట్లాడటంతో కిషోర్ తండ్రి మొదట ఒప్పుకోనట్లు మాట్లాడుతూ ఉంటాడు.

ఇక కిషోర్ ఒప్పుకోమని బెదిరించడంతో సరే మీరు ఇంతలా మాట్లాడుతున్నారు కదా ఒప్పుకున్నాంలే అని అంటాడు. రేపు ఉదయాన్నే నిశ్చితార్థం అని కూడా అంటాడు. ఇక వెన్నెల తండ్రి దగ్గరికి వచ్చి థాంక్స్ అని చెబుతుంది.  మరోవైపు మల్లిక తల పీక్కుంటుంది. పోలేరమ్మ చూసిన సంబంధాన్ని అందరూ ఎందుకు వద్దన్నారని.. ఇప్పుడొచ్చిన సంబంధాన్ని కాదని మళ్ళీ ఎందుకు ఒప్పుకున్నారు అని తెగ ఆలోచనలో పడుతుంది.

ఈ సంబంధం విషయంలో వెన్నెల ఎందుకు అంత సంతోషంగా ఉందని అనుకుంటుంది. వీటి అన్నింటి వెనుక ఏదో జరుగుతుందని ఎలాగైనా తెలుసుకోవాలని అనుకుంటుంది. మరోవైపు పెళ్లి ఫిక్స్ అయిందని ఇక ప్లాన్ సక్సెస్ అయినట్లే అని తన తల్లిదండ్రులతో అంటాడు ఈశ్వర్. అంతేకాకుండా కట్నం విషయంలో ఎక్కువ డిమాండ్ చేయొద్దు అని వాళ్లకు గట్టిగా హెచ్చరిస్తాడు. అప్పుడే మస్తాన్ ఫోన్ చేయగా స్కూల్లో బాంబ్ పెట్టమని.. 2000 మంది పిల్లల గురి తప్పకూడదు అని అంటాడు.

ఆ తర్వాత రామ దగ్గరికి జానకి సంతోషంగా వచ్చి వెనకాల నుండి హగ్ చేసుకుని.. థాంక్స్ చెబుతుంది. మీ వల్లే ఇంట్లో వాళ్లంతా ఈరోజు సంతోషంగా ఉన్నారని అంటుంది. నిజం తెలుసుకొని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని అంటుంది. దాంతో రామ ఒకవేళ నా మనసు మార్చుకోలేక పోతే జరిగే అనర్ధాలు ఏంటో అర్థం అవుతుందని అందుకే రెండు అడుగులు వెనక్కి వేశానని అంటాడు. ప్రేమించిన వ్యక్తి దక్కకపోతే వెన్నెల ఎంత బాధ పడుతుందో ఊహించుకుంటే చాలా బాధగా ఉంటుందని అంటాడు.

ఇక రామ ఏదేమైనా అన్నల కంటే వదినమ్మనే వెన్నెల మనసు తెలుసుకుందని అంటాడు రామ. దాంతో జానకి పెద్దవాళ్ళు తెలియకుండా వెన్నెలకు సంబంధం కుదర్చటం తప్పే అని కానీ సమస్య వాళ్ల వరకు వెళ్తే పరిష్కారం మరోలా ఉంటుందని అంటుంది. ఇక వెన్నెల నా వైపు బాధగా చూస్తుంటే.. మార్గం లేక బాధ్యతలు నా నెత్తి మీద వేసుకున్నాను అని అంటుంది. దాంతో రామ వదిన తల్లితో సమానం అనడంతో.. వెంటనే జానకి పోనీలెండి ఇలాగైన తల్లిని అయ్యాను అని బాధపడుతుంది. ఇక రామ తన చేతులు ఈ పుణ్యమైనా మనకి వచ్చే జన్మలో అమ్మానాన్నలను చేస్తుందేమో అని అంటాడు. ఆ తర్వాత నిశ్చితార్థం ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

also read it : Madhuranagarilo August 10th: 'మధురానగరిలో' సీరియల్: రాధను రౌడీలతో కిడ్నాప్ చేయించిన సంయుక్త, అనుమానంలో శ్యామ్?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Class To MLAs: బూతులు మాట్లాడారో! మీ కెరీర్ ఖతం : ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
బూతులు మాట్లాడారో! మీ కెరీర్ ఖతం : ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
Telangana News: త్వరలో రేవంత్, పొంగులేటి పదవులు పోతాయి- ఢిల్లీలో కేటీఆర్ సంచలన కామెంట్స్
త్వరలో రేవంత్, పొంగులేటి పదవులు పోతాయి- ఢిల్లీలో కేటీఆర్ సంచలన కామెంట్స్
Skoda Kylaq vs Tata Nexon: స్కోడా కైలాక్ వర్సెస్ టాటా నెక్సాన్ - రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?
స్కోడా కైలాక్ వర్సెస్ టాటా నెక్సాన్ - రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?
YS Sharmila: ఆ ప్రచారం వెనుక ఉన్నది జగనే -  షర్మిల  సంచలన ఆరోపణలు
ఆ ప్రచారం వెనుక ఉన్నది జగనే - షర్మిల సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ ఇలాకాలో ఇంటర్నెట్ బంద్, ఆ ఊర్లో ఉద్రిక్తతలుఅసభ్య పోస్ట్‌ల వెనక అవినాష్ రెడ్డి! ఆయనదే కీలక పాత్ర - డీఐజీSri Lankan Airlines Ramayana Ad | రామాయణంపై శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ యాడ్ | ABP DesamKhalistani Terrorist Threatens Attack On Ram Mandir | రామ మందిరంపై దాడికి కుట్ర | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Class To MLAs: బూతులు మాట్లాడారో! మీ కెరీర్ ఖతం : ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
బూతులు మాట్లాడారో! మీ కెరీర్ ఖతం : ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
Telangana News: త్వరలో రేవంత్, పొంగులేటి పదవులు పోతాయి- ఢిల్లీలో కేటీఆర్ సంచలన కామెంట్స్
త్వరలో రేవంత్, పొంగులేటి పదవులు పోతాయి- ఢిల్లీలో కేటీఆర్ సంచలన కామెంట్స్
Skoda Kylaq vs Tata Nexon: స్కోడా కైలాక్ వర్సెస్ టాటా నెక్సాన్ - రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?
స్కోడా కైలాక్ వర్సెస్ టాటా నెక్సాన్ - రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?
YS Sharmila: ఆ ప్రచారం వెనుక ఉన్నది జగనే -  షర్మిల  సంచలన ఆరోపణలు
ఆ ప్రచారం వెనుక ఉన్నది జగనే - షర్మిల సంచలన ఆరోపణలు
Amaran OTT: ఓటీటీలోకి మరింత ఆలస్యంగా ‘అమరన్’... అసలు కారణం ఏమిటో తెలుసా?
ఓటీటీలోకి మరింత ఆలస్యంగా ‘అమరన్’... అసలు కారణం ఏమిటో తెలుసా?
Disha Patani Fitness Routine : దిశా పటానీ టోన్డ్ లుక్​ వెనుక ఇంత కష్టం ఉందా? కంగువ హీరోయిన్​ ఫిట్​నెస్ పాఠాలు ఇవే
దిశా పటానీ టోన్డ్ లుక్​ వెనుక ఇంత కష్టం ఉందా? కంగువ హీరోయిన్​ ఫిట్​నెస్ పాఠాలు ఇవే
AP Assembly: ఎమ్మెల్యేలకు పెట్టే ఫుడ్‌లోనే అక్రమాలు - అసెంబ్లీ కాంట్రాక్టర్‌కు శిక్ష వేసిన స్పీకర్ అయ్యన్న
ఎమ్మెల్యేలకు పెట్టే ఫుడ్‌లోనే అక్రమాలు - అసెంబ్లీ కాంట్రాక్టర్‌కు శిక్ష వేసిన స్పీకర్ అయ్యన్న
Janwada Farm House Case: జన్వాడ ఫాం హౌస్ కేసులో కీలక పరిణామం, విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ
జన్వాడ ఫాం హౌస్ కేసులో కీలక పరిణామం, విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ
Embed widget