అన్వేషించండి

Kiraak Boys Khiladi Girls Promo: అనసూయకు కోపం వచ్చింది - అబ్బాయిలపై సీరియస్, సరాసాలతో షాకిచ్చిన ‘బ్రహ్మముడి’ దీపిక

Kiraak Boys Khiladi Girls: సెమీ ఫైనల్స్‌లోకి ఎంటర్ అవ్వడంతో ‘కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్’ మధ్య పోటీ మరింత రసవత్తరంగా సాగనుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది.

Kiraak Boys Khiladi Girls Latest Promo: ప్రతీ వీకెండ్ వచ్చి అమ్మాయిలు, అబ్బాయిల మధ్య పోటీ పెట్టి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న ‘కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్’ సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. మొదట్లో బ్యాక్ టు బ్యాక్ ఓటమిని చూసిన అమ్మాయిలు.. సెమీ ఫైనల్స్ వచ్చేసరికి అబ్బాయిలకంటే ఎక్కువ క్యాష్‌తో లీడ్‌లో ఉన్నారు. తాజాగా ఈ సెమీ ఫైనల్స్‌కు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. సెమీ ఫైనల్స్‌లో ‘కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్’ పవర్ థీమ్‌తో పోటీపడనున్నారు.

పవర్‌ఫుల్ ఎంట్రీ..

‘కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్’లో గేమ్ ఛేంజర్స్‌గా, జడ్జిలుగా వ్యవహరించే శేఖర్ మాస్టర్, అనసూయ ఎప్పుడూ కలిసే ఎంట్రీ ఇస్తారు. కానీ ఈసారి అలా జరగలేదు. ఖిలాడి గర్ల్స్‌తో కలిసి పవర్‌ఫుల్‌గా ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఎందుకిలా జరిగింది అని శ్రీముఖి అడగగా.. ‘‘అబ్బాయిల అకౌంట్‌లో రూ.9,80,000 ఉంది. అమ్మాయిల అకౌంట్‌లో రూ.10,20,000 ఉంది. అకౌంట్‌లో రేంజ్ మారినప్పుడు ఎంట్రీలో ఛేంజ్ ఉండాలి కదా’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది అనసూయ. ఆ తర్వాత కిరాక్ బాయ్స్‌తో ఎంట్రీ ఇచ్చిన శేఖర్ మాస్టర్.. ‘‘వాళ్లకు డబ్బులొస్తే యాటిట్యూడ్ వస్తుందేమో.. మాకు డబ్బులు వచ్చినా అబ్బాయిలంటే ప్యూర్ హార్ట్‌తో ఉంటాం’’ అని డైలాగ్ కొట్టారు.

డైలాగ్ వార్..

పవర్ థీమ్‌తో పోటీ మొదలయ్యే ముందు అమ్మాయిలు, అబ్బాయిల మధ్య డైలాగ్ వార్ జరిగింది. ‘‘ఈ పవర్ థీమ్ ఆడాలంటే మీ ముందున్న పోడియం దాటితే సరిపోతుందేమో. అదే ఈ పవర్ థీమ్‌లో మాతో పోటీపడాలంటే మాలో ఉన్న పవర్ దాటాలి’’ అని డైలాగ్ కొట్టాడు అర్జున్. ‘‘మీకు పవర్ పుట్టిన తర్వాత ట్రై చేస్తే వస్తుందేమో.. మా అమ్మాయిలకు పుట్టినప్పటి నుండే టన్నుల టన్నుల పవర్ ఉంటుంది’’ అని బాలయ్య స్టైల్‌లో కౌంటర్ ఇచ్చింది విష్ణుప్రియా. పవర్ టెస్ట్ అంటూ ఆయేషా, కిరణ్ హ్యాండ్ రెజ్లింగ్ పోటీకి దిగారు. కిరణ్‌ను డైవర్ట్ చేయడం కోసం తనతో సరసాలు మొదలుపెట్టింది దీపికా. వెంటనే కిరణ్.. తాను ఓడిపోయినట్టుగా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత శేఖర్ మాస్టర్, అనసూయ పోటీకి దిగగా.. శేఖర్ మాస్టర్‌ను డైవర్ట్ చేయడం కోసం అమ్మాయిలంతా రంగంలోకి దిగారు.

అనసూయ సీరియస్..

ఆయేషాను ఎత్తుకొని చైతూ డ్యాన్స్ చేయగా.. దమ్ముంటే వేరేవాళ్లను ఎత్తుకొని డ్యాన్స్ చేయమని రీతూ ఛాలెంజ్ విసిరింది. ఆ క్రమంలో విష్ణుప్రియాను ఎత్తుకోబోయి కిందపడేశాడు. టాస్క్ పేరుతో అమర్‌దీప్‌ను గట్టిగా కొట్టి పగ తీర్చుకుంది రీతూ. ఆ తర్వాత అసలు టాస్కులు మొదలు. విష్ణుప్రియా బాగా ఆడడంతో చీటింగ్ చేశారని శ్రీకర్‌కు డౌట్ వచ్చింది. దీంతో అనసూయకు కోపమొచ్చింది. ‘‘అమ్మాయిలు బాగా ఆడుతున్నారన్నది మీకు నమ్మశక్యంగా ఎందుకు ఉండదు. తను ఎలా చెప్పగలుగుతుంది అంటే ఏంటి అర్థం. దీనికి సారాంశం ఏంటంటే అమ్మాయిలు బాగా ఆడలేరని వీళ్లంతా ఫిక్స్ అయిపోయారు’’ అని అనసూయ అసహనం వ్యక్తం చేసింది. తన డౌట్ ఏంటో శ్రీకర్ చెప్తుండగానే తనను ఎప్పుడూ మాట్లాడనివ్వడం లేదంటూ వారిపై సీరియస్ అయ్యాడు.

Also Read: పవన్ కల్యాణ్‌తో లిఫ్ట్‌లో అలా.. భాగ్యశ్రీ బోర్సే కోరిక పెద్దదే - వామ్మో, ఆమె నోట పచ్చి బూతు మాట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget