Karthika Deepam 2 Serial Today May 18th: కార్తీకదీపం 2 సీరియల్: దీపకు తెలీకుండా శౌర్యని స్కూల్‌లో జాయిన్ చేసిన కార్తీక్.. రగిలిపోయిన జ్యోత్స్న, నర్శింహ!
Karthika Deepam 2 Serial Today Episode కార్తీక్, దీపలకు సంబంధం ఉందని పారిజాతం బంటుకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode శౌర్య, దీపల దగ్గరకు పారిజాతం వస్తుంది. శౌర్య పారిజాతంతో దీప ఊరిలో జరిగిన సైకిల్ పోటీల్లో పాల్గొందని, అందులో థర్డ్ ఫ్రైజ్ వచ్చిందని చెప్తుంది. ఆ పోటీల్లో కార్తీక్ తమకు సైకిల్ ఇచ్చాడని చెప్తుంది. దీంతో పారిజాతం షాక్ అయిపోతుంది. ఇక దీప శౌర్యని ఆపి లోపలికి వెళ్లిపోమని చెప్తుంది.
పారిజాతం: ఏం దీప నువ్వు అయితే అన్ని నిజాలు చెప్పొచ్చు ఏ నీ కూతురు నిజం చెప్పకూడదా.
దీప: అంత చెప్పకూడని నిజాలు మా దగ్గర ఏం లేవు అమ్మ.
పారిజాతం: అయితే చెప్పనీ మేం కూడా తెలుసుపోవాలి కదా. నువ్వు చెప్పవే బంగారు తల్లి. కార్తీక్ మీ ఊరు వచ్చాడా.
శౌర్య: అవును మా ఊరి జాతరకు వచ్చాడు. పోటీలో గెలిచినందుకు మా అమ్మకి సైకిల్ ఇచ్చాడు.
పారిజాతం: మనసులో అంటే కార్తీక్‌కు దీప ముందే తెలుసు. వీళ్లిద్దరికీ ముందే పరిచయం ఉన్నా ఏమీ తెలీనట్లు మా ముందు ఎందుకు నటిస్తున్నారు.
దీప: శౌర్య ముందు నువ్వు లోపలికి వెళ్లు.
పారిజాతం: ఏం దీప ఇవన్నీ చెప్పకూడదా. ఏం శౌర్య మీ ఫ్రెండ్ ఎప్పుడైనా ఊరిలో ఉన్న మీ ఇంటికి వచ్చాడా.
దీప: పారిజాతం గారు. నేను పోటీలో గెలిచాను. సైకిల్ ఇచ్చారు. మీకు మిగతా విషయాలు కావాలి అంటే ఇచ్చిన వారిని అడగండి.
పారిజాతం: చూసింది చెప్తుంది కదా దీప.
దీప: తీసుకున్న దాన్ని నేను చెప్తున్నా. శౌర్య ముందు మీకు మర్యాద చేస్తే బాగోదు.
పారిజాతం: వెళ్తాను దీప. శౌర్య నువ్వు లోపలికి వెళ్లమ్మ. పాత పరిచయాలు కూడా ఉన్నాయన్న మాట. మరి తెలీనట్లు ఈ తిరగడాలు ఏంటో. ఒకటి అడుగుదాం అని వచ్చాను ఇంకొకటి తెలిసింది. ఇది తెలిసిన తర్వాత అది అడగాల్సిన అవసరం లేదు అని క్లారిటీ వచ్చింది. ఈ జాతరకేనా పోయిన జాతరకు కూడా కార్తీక్ వచ్చాడా.
దీప: మీకు ఏదైనా అడగాలి అనిపిస్తే అడగాల్సిన వారిని అడగండి. ఛా ఈవిడ బుద్ధే వంకర బుద్ధి అందర్ని అలాగే చూస్తుంది.
ఇక రాత్రి పారిజాతం వేరే వ్యక్తి సైకిల్ మీద బంటుని కలవడానికి వస్తుంది. బంటు షాక్ అయిపోతాడు. ఇక పారిజాతం బంటుని దీప ఊరి విశేషాలు అడిగితే బంటు తడబడతాడు. దీంతో బంటు ముత్యాలమ్మగూడెం వెళ్లలేదు అని పారిజాతం బంటుకి నాలుగు తగిలిస్తుంది. కార్తీక్ దీప ఊరు వెళ్లి సైకిల్ ఇచ్చిన విషయం బంటుకి చెప్తుంది. నర్శింహ అన్నట్లు దీపకు కార్తీక్‌కు సంబంధం ఉందని అంటుంది. దీంతో బంటు నోరెళ్లబెడతాడు. కార్తీక్‌కు దీపకు ఇంతకు ముందే పరిచయం ఉందని తెలిస్తే జ్యోత్స్న తట్టుకోలేదని అంటుంది. అది కోపంతో బావను నేను పెళ్లి చేసుకోను అంటే నష్టం నాకేరా అని అంటుంది. ఇక ఈ విషయం ఎవరికీ తెలీకూడదని బంటుని ముత్యాలమ్మగూడెం పంపి దీప, కార్తీక్ సంబంధం గురించి తెలుసుకోమని అంటుంది.
కార్తీక్ శౌర్యని పెద్ద స్కూల్‌కి తీసుకొస్తాడు. దీప తీసుకొస్తే సీటు ఇవ్వను అన్నారని ప్రిన్సిపల్‌ని అడుగుతాడు. అవును అని పిల్లల్ని జాయిన్ చేయాలి అంటే వాళ్ల తల్లిదండ్రులు చదువుకోవాలి అని ప్రిన్సిపల్ చెప్తాడు. దీంతో కార్తీక్ బయటకు వెళ్లి ప్రిన్సిపల్ తండ్రిని లోపలికి తీసుకొని వస్తాడు. ఆయన ఏం చదువుకున్నారని కార్తీక్ ప్రిన్సిపల్‌ని అడిగి మీ తండ్రి చదువుకోలేదు కాబట్టి మీకు ప్రిన్సిపల్‌గా అర్హత లేదు అంటాడు. దీంతో ప్రిన్సిపల్ శౌర్యకు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టమని మరో టీచర్‌కు చెప్తారు. ఆవిడ కార్తీక్‌ను చూసి జ్యోత్స్న వాళ్ల బావ ఈ పాపని తీసుకొని వచ్చారు ఏంటి అని అనుకుంటుంది.
ఇక కార్తీక్ పని ఉందని బయటకు వెళ్లి అరగంట తర్వాత వస్తానని అంటాడు. ఇక శ్రీవాణి జ్యోత్స్నకు కాల్ చేసి శౌర్యకు కార్తీక్ స్కూల్‌కి వచ్చిన సంగతి చెప్తుంది. జ్యోత్స్న కోపంతో పారిజాతం దగ్గరకు వెళ్లి చెప్తుంది. దీంతో పారిజాతం జ్యోత్స్నను తీసుకొని వెళ్తుంది.
దీప హోటల్‌కి వెళ్తుంది. అక్కడ అన్నీ లెక్కలు వేస్తుంది. తన తండ్రి కలెక్టర్ చేస్తానన్నాడని చెప్తుంది. ఆ కోరిక శౌర్య ద్వారా తీర్చుకుంటానని అంటాడు. ఇక కడియానికి దీప కొంచెం డబ్బులు అడుగుతుంది.
ఇక జ్యోత్స్న, పారిజాతం స్కూల్ దగ్గరకు వస్తారు. కార్తీక్‌ని చూస్తారు. కార్తీక్‌కి నిలదీస్తాను అన్న జ్యోత్స్నని పారిజాతం ఆపి ఏం జరుగుతుందో చూద్దామని అంటుంది. ఇంతలో నర్శింహ కూడా అక్కడికి వస్తాడు. కార్తీక్‌ని చూసి వీడు ఇక్కడ ఉన్నాడేంటని అనుకుంటాడు. వీడి గురించి నాకు ఎందుకులే అనుకుంటూ వెళ్లిపోతూ కార్తీక్ దగ్గరకు శౌర్య రావడం చూసి ఆగుతాడు.
శౌర్య టెస్ట్ రాసేశాను అని పాస్ అయ్యానని చెప్తుంది. దీంతో కార్తీక్ శౌర్య నుదిటిపై ముద్దు పెట్టుకుంటాడు. అది చూసి అటు జ్యోత్స్న ఇటు నర్శింహ ఇద్దరూ రగిలిపోతారు.
నర్శింహ: నా పెళ్లానికి నీకు ఉన్న సంబంధం బయట పెట్టానని నా కూతురినే స్కూల్‌లో జాయిన్ చేయడానికి తీసుకొచ్చాడా. ఇక నర్శింహ లోపలికి వెళ్తుంటే ఫ్యూన్ ఆపేస్తాడు. ఫ్యూన్ నర్శింహ స్నేహితులు. దీంతో ఫ్యూన్‌కి నర్శింహ డబ్బులు ఇస్తాడు. లోపల ఏం జరుగుతుందో మొత్తం నాకు తెలియాలి అంటాడు. ఫ్యూన్ సరే అంటాడు. కార్తీక్ ఫ్మార్మాలిటీ పేపర్ ఫిల్ చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.