Karthika Deepam 2 Serial Today June 17th: కార్తీకదీపం 2 సీరియల్: దీపకి జ్యోత్స్న వార్నింగ్.. ఐలవ్‌యూ చెప్పి కార్తీక్‌ని కట్టిపడేసిన జ్యో.. బాబోయ్ శ్రీధర్ డబుల్ యాక్షన్ అదుర్స్!
Karthika Deepam 2 Serial Today Episode కార్తీక్ తన భర్త అని జ్యోత్స్న దీపకు ఇన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చి కడియంతో చెప్పడం, జ్యోత్స్న కార్తీక్‌తో మాట్లాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న కార్తీక్‌కు తీసుకొని దీప హోటల్ దగ్గరకు వెళ్తుంది. దీప చేసిన ఉమ్మాకు తాను కూడా అభిమానిని అని దీప చేతిలో ఏదో మ్యాజిక్ ఉందని సెటైర్లు వేస్తుంది. నీ సీక్రెట్ నేను కనిపెడతాను దీప అని జ్యోత్స్న అంటుంది. దానికి దీప నీకు ఏం కావాలి జ్యోత్స్న అని అడుగుతుంది. దానికి జ్యోత్స్న మా బావ అని అంటుంది. ఇంతలోనే మా బావకు ఎంతో ఇష్టమైన స్పెషల్ టీ అని చెప్తుంది.
జ్యోత్స్న: స్యూల్‌లో శౌర్య బాగోగులు చూసుకుంటాను అని చెప్పినట్లే ఇక్కడ కూడా నీ బాగోగులు నేనే చూసుకుంటా. ఇక మా బావకి ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు.
దీప: ఆ పారిజాతం గారు జ్యోత్స్న మనసు పాడు చేసి పంపించినట్లు ఉన్నారు.
కార్తీక్: కావాలనే పారు నా మీద అనుమానంతో జ్యోత్స్నని ఇలా తయారు చేసింది. జ్యోత్స్నకి వార్నింగ్ ఇవ్వాలి.
దీప: నా యోగక్షేమాలు కోసం ఎవరూ రావాల్సిన అవసరం లేదు.
జ్యోత్స్న: మా మమ్మీని కాపాడి నువ్వు నాకు ఆత్మబంధువిని అయ్యావు. మరి నీ యోగక్షేమాలు తెలుసుకోవడం నా బాధ్యత కదా.
కార్తీక్: జ్యోత్స్న మనం బయల్దేరుదామా..
జ్యోత్స్న: కడియం బాబాయ్ ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. నేను మీ కార్తీక్ బాబుకి మరదలినే కాదు. మీ కార్తీక్ బాబుకి భార్యని. కాబోయే భార్యని.జ్యోత్స్న అంటే మీ కార్తీక్ బాబుకి కాబోయే భార్య అని గుర్తు పెట్టుకో. చివరిసారిగా నీతో ఓ మాట చెప్పాలి అనుకున్నాను దీప. పేరెంట్స్ మీటింగ్ బాగా జరిగింది కదా శ్రీవాణి నాకు మెసేజ్ చేసింది. ఈ సారి ఎక్కడ ఏం జరిగినా నాకు తెలుస్తుంది. అదే నీ యోగక్షేమాలు.
మరోవైపు శ్రీధర్ తన కూతురు స్వప్నని కలవడానికి వెళ్తాడు. స్వప్న తండ్రి మీద అలుగుతుంది. కావేరి కూడా అక్కడికి వస్తుంది. స్వప్నని బుజ్జగించమని శ్రీధర్ కావేరికి చెప్తాడు. ఇక కావేరి తండ్రీ కూతుళ్ల మధ్యలో దూరను అని చేతులెత్తేస్తుంది. దానికి శ్రీధర్ ఇద్దరూ నా మీదే అలిగారు కదా నేను వెళ్లిపోతా అంటాడు.
స్వప్న: వెళ్లు వైజాగ్‌లో ఉంటే ఆరు నెలలకు ఒకసారి వస్తావ్ అని మమ్మీతో తిట్టు తిని మరీ హైదరాబాద్‌కి షిఫ్ట్ చేయించా. కానీ నీకు ఫ్రీ టైం ఉందా లేదు. కూతురు హాస్పిటల్ ఉన్నా నీకు బిజీనే. ఈ సారి ఇంటికి ఎప్పుడు వస్తావ్. సంక్రాంతికా.. దసరాకా.. లేక క్రిస్ట్‌మస్‌కా..
కావేరి: నాదీ సేమ్ డైలాగ్.
శ్రీధర్: వదిలి ఉండటానికి అయినా రాకపోవడానికి అయినా నాకు మీరు తప్ప వేరే ఎవరు ఉన్నారురా. అయినా డాడీ రాలేకపోతున్నాడు అంటే అర్థం చేసుకోవాలి కదరా.
స్వప్న: చూడు డాడీ రేపు ఎలా ఉంటుందో నాకు తెలీదు ఈ రోజు హ్యీపీగా ఉండాలి అంతే. మనకు మాత్రం ఎవరు ఉన్నారు నువ్వూ నేను మమ్మీ. మరి మన ముగ్గురం కలిసే ఉండాలి కదా. డాడీ మన లిస్ట్‌లో ఇంకొకరు యాడ్ అయ్యారు. అది ఎవరో కాదు నన్ను కాపాడిన మా బాస్. బాస్ ఎవరో అడుగు డాడీ. బాస్‌కి ఒక్కసారి కనెక్ట్ అయితే చాలు బాస్‌తో కలిసిపోవాల్సిందే. ఇక శ్రీధర్ తర్వాత వస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు.
కార్తీక్: ఏదైనా రెండు సార్లు అడిగితే కానీ మాట్లాడని దావిని ఇప్పుడు నువ్వే మాట్లాడేస్తున్నావ్. నువ్వే మాట్లాడుతున్నావా నీతో ఎవరైనా మాట్లాడిస్తున్నారా.
జ్యోత్స్న: రెస్టారెంట్‌కి వెళ్దాం రెడీగా ఉండు అని చెప్పిన వాడివి స్కూల్‌కి ఎందుకు వెళ్లావు బావ. సరే బావ రేపు మనకు పెళ్లి అయి ఇద్దరం హనీమూన్‌లో ఉంటే శౌర్య కాల్ చేసి పరీక్షలు ఉన్నాయి భయం అంటే ఏం చేస్తావు బావ.
కార్తీక్: అన్ని పరిస్థితులు ఒకేలా ఉండవు జ్యోత్స్న. దీపని నమ్ముకున్న వాళ్లు అంతా మోసం చేశారు. అయినా బతకడానికి ఓ దారి వెతుక్కుంది. తనతో పాటు కూతుర్ని కూడా పనిలో పెట్టకుండా తనలాంటి పరిస్థితి తన కూతురికి రాకూడదు అని స్కూల్‌లో జాయిన్ చేసింది. దీప డబ్బులు లేని మనిషే కానీ క్యారెక్టర్ లేని మనిషి కాదు జ్యోత్స్న. అందుకే నాకు దీప మీద కన్సర్న్ ఉంది.
జ్యోత్స్న: మరి అదే కన్సర్న్ నా మీద ఎందుకు లేదు. దీప అనగానే రెండు పేజీలు చెప్పిన నీకు నా గురించి రెండు డైలాగులు కూడా లేవా.
కార్తీక్: నువ్వు బార్న్ విత్ గోల్డ్ స్పూన్ జ్యోత్స్న. అందరినీ నీతో కంపార్ చేసుకోకు.
జ్యోత్స్న: ఫీలింగ్స్‌కి పుట్టడానికి గోల్డ్ స్పూన్ ఐరన్ స్పూన్ అని ఉండదు కార్తీక్ బాబు. నన్ను రెడీగా ఉండమని చెప్పి రాలేకపోతున్నాను అని కనీసం ఒక మెసేజ్ కూడా చేయలేదు అని బాధ పడ్డాను. రెండు నెలల క్రితం పరిచయం అయిన శౌర్య, దీపలను అర్థం చేసుకున్న బావకు చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతున్న జ్యోత్స్న అర్థం కావడం లేదు.
కార్తీక్: ఇన్ని తెలిసిన జ్యోత్స్నకి ఒక్క మెసేజ్ చేయలేదు అని బావని అపార్థం చేసుకోకూడదు అని తెలీదా.
జ్యోత్స్న: నేను అపార్థం చేసుకోలేదు బావ. బాధ పడుతున్నాను. మా మమ్మీ డాడీ నీ గురించి తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను. అలాంటిది ఆ నర్శింహ గాడు నీకు నా భార్యకు సంబంధం ఏంట్రా అని నిన్ను నిలదీశాడు. వాడు వెళ్లిపోయాడు కానీ వాడి మాటలు అలాగే నాతో ఉండిపోయావి. ఇప్పుడు మళ్లీ నువ్వు సాయం పేరుతో దీప చుట్టూ తిరిగితే వాడేమనుకుంటాడు బావ. వాడు ఏదో అనుకునేలా నువ్వు ఎందుకు అనుకోవాలి.
కార్తీక్: వీళ్లు అందరి గురించి కాదు. నువ్వు ఏమనుకుంటున్నావో అది చెప్పు. ఎవరో ఎక్కించిన మనసుతో కాదు నీకు ఓ మనసు ఉంది కదా దానితో ఆలోచించి నువ్వేమనుకుంటున్నావో అది చెప్పు.
జ్యోత్స్న: ఐ లవ్ యూ బావ. మనసుతో ఆలోచిస్తే నీ మీద నాకు ఉన్న ఫీలింగ్ ఇదే. అక్కడ నీకు తప్ప వేరే ఆలోచనకు చోటు లేదు. నా పక్కన నీకు తప్ప నాకు కూడా చోటు లేదు. నాది ప్రేమ కాదు. అలా అని ఆరాధన కూడా కాదు. ఎందుకో తెలుసా. ప్రేమించుకోవడానికి ఇద్దరు మనుషులు ఉండాలి. కానీ నువ్వు నేను ఒక్కటే అనుకుంటా బావ. ఒక ప్రాణం రెండుగా విడిపోయి ప్రేమించుకోవడానికి రెండుగా పుడితే అది నువ్వు నేను బావ. మన ఇద్దరిదీ ఒకటే ప్రాణం. కానీ చెప్పడానికి వేరే పదం లేక ఐలవ్‌యూ అని చెప్పాను బావ. నేను నిన్ను ప్రేమించినా నన్ను నేను ప్రేమించుకున్నా ఒక్కటే.
కార్తీక్: మనసులో.. ఇంక లేట్ చేయకూడదు. జ్యోత్స్నకి నిజం చెప్పాలి. మనది నువ్వు అనుకున్న బంధం కాదు కేవలం బావమరదల బంధం అని చెప్తేస్తా.
ఇక జ్యోత్స్న ఒక్క సారి తను అంటే ఇష్టం లేదు అని చెప్పి చూడు అని ఇక్కడే చనిపోతా అని అంటుంది. జ్యోత్స్న మాటలకు కార్తీక్ ఇప్పుడు నిజం చెప్పకూడదు అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'కార్తీక దీపం' నటికి చేదు అనుభవం - ఫ్రాడ్ కేసులో ఆమె పేరు!, డీఎస్పీ నుంచి ఫోన్.. చివరికి