అన్వేషించండి

Karthika Deepam 2 Serial july 18th కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్, దీపలు సీక్రెట్‌గా కలుసుకోవడం చూసేసిన జ్యోత్స్న..  కార్తీక్‌కి ప్రామిస్ చేసిన శౌర్య! 

Karthika deepam 2 Serial Today దీప కార్తీక్‌లు శౌర్య గురించి మాట్లాడుకోవడం విన్న జ్యోత్స్న కార్తీక్‌ని దీప గురించి తెలుసా అని అడగటం కార్తీక్ అబద్ధం చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika deepam idi nava vasantham Serial Today కార్తీక్‌తో మాట్లాడటానికి దీప బయటకు వస్తుంది. శౌర్య తనకు బాగా దగ్గరైందని రౌడీకి కూడా తాను బాగా దగ్గరైపోయిందని గోడ మీద పేరు చూడటంతో ఆరోజు హాస్పిటల్ నుంచి వెళ్లకుండా ఉండాల్సిందని అనిపించిందని కార్తీక్ అంటాడు. ఇక జ్యోత్స్న బయట నుంచి ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వినిపించడం లేదని ఇరిటేట్ అవుతుంది. 

కార్తీక్: నేను అక్కడే ఉంటే మిమ్మల్ని వెళ్లనిచ్చే వాడిని కాదు. మరోసారి నర్శింహకు రౌడీని ఎత్తుకుపోయే అవకాశం ఇచ్చేవాడికి కాదు.
దీప: ఏంటి బాబు మీరు చెప్పేది నర్శింహ నా కూతురు కోసం మళ్లీ వచ్చాడా.
కార్తీక్: అవును దీప శౌర్య నా కోసం వెతుక్కుంటూ వస్తుంటే నర్శింహ ఎదురయై వెంటపడ్డాడు. తర్వాత శౌర్య కడియం బాబాయ్‌కి కనిపిస్తే ఆయనకు నాకు ఫోన్ చేస్తే నేను వెళ్లి శౌర్యని తీసుకొచ్చా. పాప మీకు శాశ్వతంగా దూరం అయితే. పక్క వీధికి వచ్చిన నర్శింహ మరోసారి మీ ఇంటి వరకు రాకూడదనే ఆ రోజు తను నా కూతురు అని చెప్పా. అయినా మీరు అర్థం చేసుకోవడం లేదు.
దీప: ఇంక చాలు ఆపండి బాబు. నా కూతుర్ని కాపాడాను అని మీ తప్పు కప్పి పుచ్చుకోకండి. జనం వేసిన నిందని నిజం చేసినట్లు అయింది. వాడు ఏ తప్పు చేశాడని వదిలేశానో నేను అదే తప్పు చేసిన మనిషిలా తలదించుకోవాల్సి వచ్చింది. సుమిత్రమ్మ గారికి ఈ విషయం తెలిస్తే నా కూతురి జీవితంలో నిప్పులు పోస్తావా అంటూ నన్ను మెడ పట్టుకొని బయటకు గెంటేస్తారు. నాకు మొత్తం నరకంగా ఉంది. అదంతా ఓ ఎత్తు అయితే నా కూతురు ప్రవర్తన చూస్తుంటే మీరు అన్న మాటలు అది విన్నట్లు ఉంది. మీరు చూశారు కదా గోడ మీద మీ పేరు రాసుకొని మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తుంది. ఇది వరకు నాన్న ఎప్పుడు వస్తారని అడిగేది. కానీ ఇప్పుడు కార్తీక్ ఎప్పుడొస్తాడని అడుగుతుంది. మీరు నేను ప్రశాంతంగా ఉండేలా చేయలేదు బాబు. నిద్రలో కూడా బయపడేలా చేశారు. చాలు కార్తీక్ బాబు ఇక మమల్ని వదిలేయండి. ఇలా మీరు ఇంటికి రావడం ఎవరైనా చూస్తే. పోనీ నా భర్త చూస్తే ఇప్పటికే వాడి మాటలకు తిండి తినలేకపోతున్నా. ఇక ఊపిరి తీసుకోలేనేమో. మమల్నివదిలేయండి బాబు. మేం మా ఊరు వెళ్లిపోతాం.
కార్తీక్: వెళ్లు దీప ఈరోజే ఆ నరకంలోకి వెళ్లిపో. వాడు వెధవ అని నాకు తెలుసు కానీ. వాడు అన్న మాట మీద నిల్చొంటాడని శౌర్య నా కూతురు అన్నాను. కానీ వాడు మాట మీద నిలబడే మనిషి ఎలా అవుతాడు. నా భర్త ముందు నాకు విలువ లేకుండా చేశాడని అన్నారు. కానీ నర్శింహ నేను అన్నమాట నమ్మలేదు. అందుకే వాడు శౌర్య తన కూతురు అనుకుంటున్నాడు కాబట్టే శౌర్యని తీసుకెళ్లాలి అనుకుంటున్నాడు. మీరు ఇక్కడ ఉన్నారని నర్శింహకు తెలిసిపోయింది. వాడి బలం ఏంటి అంటే పాపకు మీరు తన తండ్రి అని చెప్పలేరు. అది అడ్డం పెట్టుకొని వాడు పాపని ఎత్తుకుపోతారు. ఇవన్నీ నాకు అవసరం లేదు దీప కానీ వదల్లేకపోతున్నాను. దానికి రెండు కారణాలు ఒకటి రౌడీ, రెండు మీ నాన్న. ఆయన నాతో ఏదో చెప్పాలి అనుకున్నారు. నాకు అర్థం కాలేదు. రౌడీని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. రౌడీకి ఏ ప్రమాదం లేదు మీరు బాగున్నారు అనే రోజు నేనే మీకు దూరంగా వెళ్లిపోతా. 
జ్యోత్స్న: ఇంత సేపు ఏం మాట్లాడుకుంటున్నారురా..

కార్తీక్ ఇంటికి రమ్మని చెప్తే దీప రాను అనేస్తుంది. ఇక కార్తీక్ వెళ్లిపోతాను అని అంటాడు. కార్తీక్ వెళ్తుంటే శౌర్య పిలుస్తుంది. కార్తీక్‌ని ఎందుకు వెళ్లిపోతున్నావ్ అని అడుగుతుంది. మళ్లీ వస్తాను అని చెప్పి కార్తీక్ శౌర్యకి జాగ్రత్తలు చెప్పి వెళ్తాడు. ఇక జ్యోత్స్న కార్తీక్‌ని మళ్లీ ఫాలో అవుతుంది. మరోవైపు పారిజాతం జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందని అనుకుంటుంది. సుమిత్ర పారిజాతం దగ్గరకు వచ్చి జ్యోత్స్న గురించి అడుగుతుంది. జ్యోత్స్నకి దూరంగా ఉండమని చెప్పినా మీరు వినరని చెప్తుంది. ఇక పారిజాతం కార్తీక్ నీ కోసం వచ్చాడు ఇద్దరూ కలిసి ఉంటారని అంటుంది.  పారిజాతం కార్తీక్ ఇంటికి ఎందుకు వచ్చాడని టెన్షన్ పడుతుంది. ఇక కార్తీక్ కారుని జ్యో ఫాలో అవుతుంది. ఇద్దరూ ఓ చోట కలుసుకుంటారు. నీకు నా కంటే ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు కదా బావ అని అడుగుతుంది.  

జ్యోత్స్న: ఇంకొకరి అవసరం కోసం నన్ను వదిలేస్తావా. అల్రెడీ నన్ను వదిలేశావ్. నాకంటే ఇంపార్టెంట్ అయిన వాళ్లు ఎవరు బావ. అది ఎవరో నాకు తెలియాలి.
కార్తీక్: మనం ఇలా పరాయి వాళ్లగా రోడ్డు మీద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పాలి అనుకున్న విషయం ఇంట్లో అందరితో చెప్తా.
జ్యోత్స్న: సరే బావ.. నీకు దీప ఇళ్లు ఎక్కడుందో తెలుసా.
కార్తీక్: తెలీదు.
జ్యోత్స్న: నీకు దీప ఇళ్లు ఎక్కడో తెలీదు అంతే కదా. ఇంత పచ్చి నిజాలు ఎప్పుడు నుంచి నేర్చుకున్నావ్ బావ.

కార్తీక్ వెళ్లిపోతాడు. ఎంత అందంగా అబద్ధం  చెప్పావ్ బావ. రోజు వచ్చి కలుస్తున్నావ్ ఎందుకు నిజం చెప్పడం లేదు. హాస్పిటల్‌లో చెప్పిందే నిజం చేయాలి అనుకుంటున్నావా అని జ్యోత్స్న అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతి బతికే ఉందని నమ్ముతున్న సీత, రామ్‌లు, విద్యాదేవిని ప్రశ్నించిన మహాలక్ష్మి!

టాప్ హెడ్ లైన్స్

Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
Nindu Manasulu Serial Today August 21st: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget