Karthika Deepam 2 Serial September 17th: కార్తీకదీపం 2 సీరియల్: కాశీని చంపేస్తానని స్వప్నని బెదిరించిన శ్రీధర్.. జ్యోత్స్న మీద చేయి ఎత్తిన దీప!
Karthika Deepam 2 Serial Episode తన బావకి దగ్గరవ్వాలి అనే మాటిమాటికి ఇంటికి వస్తున్నావ్ నువ్వు నంగనాచిలా కనిపించే జాణవని జ్యోత్స్న దీపని అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Episode పారిజాతం అనసూయ మీద కావాలనే కేకలు వేస్తుంది. శౌర్య పారిజాతాన్ని రెచ్చ గొట్టడంతో ఇంకా రెచ్చిపోయి అరుస్తుంది. మీ దిక్కుమాలిన సంతని భరించలేనని నా ఇళ్లు అని మీకు అంత కష్టంగా ఉంటే నా ఇంటి నుంచి పోండి అని అంటుంది. ఇంతలో శౌర్య అనసూయని చూస్తూ మెంటల్ అని సైగ చేస్తే పారిజాతం అవునే నాకు అదే నాకు అదే మీ అమ్మకి అదే నీకు మీ నానమ్మకి అదే అని అంటుంది. ఇంతలో దీప అక్కడికి వస్తుంది.
శౌర్య: అమ్మ కార్తీక్‌కి ఎలా ఉంది నన్ను తీసుకొని రమ్మని చెప్పాడా.
పారిజాతం: ఆ చెప్పాడే నువ్వు పెద్ద వీఐపీ అని తీసుకొని రమ్మని చెప్పాడు. వాడు నా సొంత మనవడు నన్నే వద్దన్నాడు ఇక నిన్ను ఎందుకు రమ్మని చెప్తాడు. ఇంతలో కాంచన కాల్ చేసి శౌర్యని తీసుకురమ్మని చెప్తుంది.
దీప: కార్తీక్ బాబు వాళ్ల అమ్మ ఫోన్ నిన్ను తీసుకొని సాయంత్రం రమ్మన్నారు.
శౌర్య: పారిజాతం కళ్లద్దాలు తీసుకొని పెట్టుకుంటూ.. చూశావా అమ్మ ఏం చెప్పిందో నా మనవడు నన్నే రమ్మనలేదు నీ ముఖానికి నిన్ను ఎందుకు రమ్మంటాడు అన్నావ్. విన్నావు కదా నన్నే రమ్మన్నాడు. నిన్ను రమ్మనలేదు. మనద్దరిలో కార్తీక్‌కి ఎవరు ఎక్కువ. నేనే ఎక్కువ. శౌర్య వీఐపీ..
పారిజాతం: చెడ్డీలు వేసుకొనే పిల్లు కూడా కౌంటర్ ఇచ్చి వెళ్లిపోతున్నారు. దీనికి రీ కౌంటర్ ఇవ్వడం ఎలాగో నాకు తెలుసుగా.
స్వప్న తండ్రి గుడ్ న్యూస్‌తో వస్తాడని ఆశగా స్వట్స్ పెట్టుకొని రెడీగా ఉంటుంది. తల్లితో తన సంతోషం పంచుకొంటుంది. చిన్న ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవ్వబోతుందని తల్లికి చెప్పి హ్యాపీగా ఫీలవుతుంది. తన ప్రేమని తండ్రి ఒప్పుకుంటాడని వందశాతం నమ్మకం ఉందని అంటుంది. ఇక శ్రీధర్ ఇంటికి వచ్చి కాశీ, పారు, దాసుల రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తండ్రి రాగానే స్వప్న స్వీట్స్ ఇస్తుంది. డాడీ పెళ్లికి ఒప్పుకున్నాడని చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇక శ్రీధర్ కాశీకీ ఫోన్ చేయమని అంటాడు. తల్లీకూతుళ్లు పెళ్లి ముహూర్తం గురించి అనుకుంటారు. ఇక స్వప్న కాశీ కాల్ చేస్తుంది.
శ్రీధర్: కాశీ నేను స్వప్న వాళ్ల నాన్నని. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కాస్త జాగ్రత్తగా విను. నువ్వు హైదరాబాద్‌లో ఉండాలి అంటే బుద్ధిగా ఉద్యోగం చేసుకో ప్రేమ పెళ్లి అని నా కూతురి వెంట పడితే ఇక నువ్వు ఎవరికీ కనపడవు. నీలాంటి అనామకుడిని, స్థాయి లేని వాడిని నా అల్లుడిగా చేసుకోలేను. ఇక నా కూతురి జోలికి రాకు గుర్తు పెట్టుకో.
స్వప్న: ఏమైంది డాడీ ఏం జరిగింది.
శ్రీధర్: ఏం జరిగింది అనేది వదిలేయంది. ఏం జరగనుందో చెప్తా. ముందు అనుకున్నట్లు స్వప్న పెళ్లి శ్రీకాంత్‌తోనే జరుగుతుంది. వీలైనంత త్వరగా కాశీని మర్చిపో.
కావేరి: ఈ సంబంధం వద్దు అనడానికి ఒక బలమైన కారణం చెప్పండి.
శ్రీధర్: నీకు సమాధానం చెప్పాలా అయితే వినండి కాశీ నాకు నచ్చలేదు.
స్వప్న: కాశీని పెళ్లి చేసుకోవడానికి నాకు వంద దారులున్నాయి.
శ్రీధర్: అవన్నింటికంటే ముందు కాశీ బతికుండాలి కదా.
స్వప్న: అంటే చంపుతారా.
శ్రీధర్: నా కూతురి కోసం ఏమైనా చేస్తా ఆ కాశీతో పెళ్లి తప్ప. నువ్వు గడప దాటు ఆ కాశీని చంపేస్తా. ఈ రోజు నుంచి స్వప్న ఫోన్ నా దగ్గరే స్విఛ్ ఆఫ్‌లో ఉంటుంది. ఈ రోజు నుంచి నువ్వు గడప దాటి వాడిని కలిస్తే నేను వాడిని చంపి నేను చస్తా.
స్వప్న చాలా ఏడుస్తుంది. మరోవైపు కార్తీక్ స్వప్న నుంచి ఫోన్ రాలేదని ఏమై ఉంటుందా అని అనుకుంటాడు. ఇక కాంచన గదిలోకి వచ్చి చూస్తుంది. జ్యోత్స్నతో రాత్రికి ఫుడ్ ఏం చేస్తావ్ అని అడుగుతుంది. దానికి కార్తీక్ వెటకారంగా నవ్వుతాడు. ఇక కాంచన దీపని రమ్మని చెప్పాను తను వచ్చాక వండుతుందని చెప్తుంది. జ్యోత్స్న కోపంగా బయటకు వెళ్లి అత్తతో బావ ముందు నాకు రాని విషయాలు గురించి ఎందుకు మాట్లాడుతావు అత్త అని అంటుంది. దానికి కాంచన నువ్వు ఫోన్ చూసుకోకుండా వాడితో మాట్లాడని అంటుంది.
ఇంతలో శౌర్య వస్తుంది. శౌర్య కార్తీక్ దగ్గరకు పరుగులు తీస్తుంది. కార్తీక్ శౌర్యని చూసి హ్యాపీగా ఫీలవుతాడు. కాంచనతో దీపని భజన చేయకు అని జ్యోత్స్న అంటుంది. ఇక దీప కిచెన్లో ఉంటే జ్యోత్స్న వెళ్లి నువ్వు మళ్లీ ఎందుకు వచ్చావ్ అని అంటుంది. అవకాశం దొరికింది కదా అని బావకి దగ్గరైపోవాలని చూస్తున్నావా .. ఏమీ తెలియని దానిలా కనిపిస్తావ్ కానీ నవ్వు పెద్ద జానవని నాకు తెలుసే అని జ్యోత్స్న అంటే దీప జ్యోని కొట్టడానికి చేయి ఎత్తుతుంది. నా మీదే చేయి ఎత్తుతావా అని జ్యో అడగటంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.