Karthika Deepam 2 Serial Today November 18th: కార్తీకదీపం 2 సీరియల్: పేపర్‌లో ఫొటోతో జ్యోత్స్న ఇంట్లో రచ్చ.. రెస్టారెంట్‌లో కార్తీక్, దీపలు.. ఉప్మా బిర్యానీ చేస్తుందా ఏంటి?
Karthika Deepam 2 Serial Today Episode దీపని తీసుకొని కార్తీక్ రెస్టారెంట్‌కి వెళ్లడం అక్కడ ఉప్మా బిర్యానీని చేయమని కార్తీక్ కిచెన్‌లోకి దీపని తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode శివన్నారాయణకు తన ఫ్రెండ్ విశ్వనాథం ఫోన్ చేసి కార్తీక్, దీపల పెళ్లి గురించి చెప్పి నీ మనవరాలికి మరో సంబంధం చూసుకో పరువు తక్కువ సంబంధం మాకు వద్దని చెప్తాడు. ఏమైందని దశరథ్, సుమిత్ర అడిగితే పేపర్ చూపించి నీ మేనల్లుడు కొత్తగా పెళ్లి అయిన తమ దంపతుల్ని ఆశీర్వదించమని ఫొటో పేపర్‌లో వేయించాడని అందుకే జ్యోత్స్నని తమ ఇంటి కోడల్ని చేసుకోమని చెప్పారని అంటాడు. దాంతో అందరూ షాక్ అయిపోతారు.
శివనారాయణ: వాడికి అంత సరదాగా ఉంటే వాళ్ల ఫోటో వేయించుకోవాలి అంతే కానీ జ్యోత్స్న రెస్టారెంట్స్ సీఈవో అని ఎలా రాస్తాడు. వాడికి ఆ అర్హత ఎవరు ఇచ్చారు. పైగా బంధువుల పేరులో నా కోడలు సుమిత్ర పేరు రాశాడు. పరువు తక్కువ కుటుంబం అని నా ఫ్రెండ్ జ్యోత్స్నని ఇంటి కోడలిని చేసుకోను మరో సంబంధం చూసుకో అన్నాడు. ఇంతకంటే అవమానం ఇంకేముంటుంది.
పారిజాతం: అవునండీ మిమల్ని తలదించుకునేలా వాడిని వలదకూడదు.
శివనారాయణ: ఏం చేయాలో నువ్వు నాకు చెప్పకు. తప్పు చేసిన వాడితోనే క్షమాపణ చెప్పిస్తా.
దశరథ్: కార్తీక్‌కి ఏమైంది సుమిత్రా ఇంత స్టూపిడ్‌లా ప్రవర్తిస్తున్నాడు. ఎవరినీ ప్రశాంతంగా ఉండనివ్వడా ఛా.
జ్యోత్స్న: ఇది తాత పరువు తీయడానికి కాదు గ్రానీ నా అహం మీద దెబ్బకొట్టడానికి దీప బావతో చేయించిన పనిలా ఉంది. నేను నిన్నే దాన్ని కలిశాను. పొగరుగా సమాధానం చెప్పి వెళ్లిపోయింది. తాత కోసం చూస్తుంటే బావ కచ్చితంగా అడుగుతాడు అంతకంటే ముందు బావతో నేను మాట్లాడుతా.
పారిజాతం: ఇంటికి వెళ్తావా.
జ్యోత్స్న: కాదు ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటా.
దీప కిచెన్‌లో వంట చేస్తుంటే కార్తీక్ అక్కడికి వెళ్తాడు. పేపర్లో ఫొటో గురించి చెప్తే దీప ఏం అనుకుంటుందో అనుకుంటాడు. ఇక దీప కార్తీక్‌ని చూసి ఎందుకు వచ్చారని అడుగుతుంది. దీప కార్తీక్‌లను అనసూయ, కాంచన చూసి భార్యభర్తలు ఇద్దరూ వంట గదిలోనే ఉన్నారని అనుకుంటారు. ఇక కార్తీక్ రావడంతో కాంచన గుడికి వెళ్తానని అంటుంది. ఇక కార్తీక్‌తో అందరం ఎక్కడికైనా వెళ్దామని అడుగుతుంది దాంతో కార్తీక్ సాయంత్రం వెళ్దామంటాడు. ఇక పేపర్‌లో ఫొటో చూస్తారని ప్రతీ ఒక్కరికీ పేపర్ చూడమని అంటాడు. ఎవరూ చూడము అనేస్తారు. ఇంతలో స్వప్న, కాశీ పేపర్ పట్టుకొని వస్తారు. మార్నింగ్ మార్నింగ్ సర్‌ఫ్రైజ్ ఇచ్చావ్ అన్నయ్యా అని స్వప్న అంటుంది. ఇక స్వప్న దీపని తీసుకొచ్చి కార్తీక్ పక్కన కూర్చొపెడుతుంది. కాశీ దీప చేతిలో పేపర్ పెడతాడు. దీపతో పాటు అందరూ పేపర్ చూసి హ్యాపీగా ఫీలవుతారు. కార్తీక్ ముసి ముసి నవ్వులు నవ్వుతాడు. పేపర్‌లో అమ్మానాన్నల ఫొటో ఎలా వచ్చిందని శౌర్య అడిగితే దానికి కాశీ మీ నాన్న అమ్మ మీద ప్రేమతో వేయించారని అంటాడు. ఇక కార్తీక్ రెస్టారెంట్‌కి వెళ్తానని అంటాడు. దాంతో శౌర్య కూడా వెళ్తానని అంటుంది.
దీపని కూడా వెళ్లమని కాంచన వాళ్లు చెప్తారు. దాంతో దీప కార్తీక్, శౌర్యలు రెస్టారెంట్‌కి వెళ్తారు. రెస్టారెంట్‌లో అందరూ దీప, కార్తీక్‌లను మేడం సార్ అని మర్యాదగా ఇస్తారు. ఇక కార్తీక్ ఉప్మా బిర్యానీ కూడా స్పెషల్ లిస్ట్‌లో యాడ్ చేయమని చెప్తాడు. మేనేజర్ బోర్డు మీద రాస్తాడు. ఇక ముగ్గురు మొత్తం రెస్టారెంట్ తిరిగి ఓ స్పెషల్ టేబుల్ దగ్గర కూర్చొంటారు. వచ్చిన కస్టమర్లు ఉప్మా బిర్యాని తినాలని అనుకుంటారు. ఇక శౌర్య కార్తీక్‌ని నాన్న నుంచి డాడీ డాడీ రెస్టారెంట్‌లో పిలుస్తుంటుంది. ఉప్మా బిర్యానీ అర్డర్ వస్తుంది కానీ చేయడాని ఎవరూ రావడం లేదని అంటే కార్తీక్ ఉప్మా స్పెషలిస్ట్ ఇక్కడే ఉందని కార్తీక్ దీపని తీసుకొని కిచెన్‌లోకి వెళ్తాడు. దీపని ఓ చెఫ్‌కి చూపించి ఉప్మా బిర్యానీ ఎలా చేయాలో చెప్తే తాను చేస్తాడని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: ఒకర్ని ఒకరు కాల్చుకున్న క్రిష్, సంజయ్.. కొడుకుల కోసం మహదేవయ్య, చక్రవర్తిల మాటల యుద్ధం!