అన్వేషించండి

Karthika Deepam 2 Serial July 5th: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్యకి తండ్రివి నువ్వా, నన్ను చంపేశావ్ కార్తీక్‌బాబు.. దీప నిప్పురా: కొడుకుతో అనసూయ!

Karthika Deepam 2 Serial July Episode నర్శింహ అనసూయ, శోభలతో శౌర్య తన కూతురు కాదని చెప్పడం అనసూయ కొడుకుని కొట్టి దీప ఏ తప్పు చేయదు అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode శౌర్య తన కన్నబిడ్డ అని కార్తీక్ దీప ఎదురుగానే నర్శింహతో చెప్తాడు. దాంతో నర్శింహ అక్కడి నుంచి వెళ్లిపోగా.. చాటుగా ఆ మాటలు విన్న జ్యోత్స్న బావ నన్ను మోసం చేశాడని గుండె పగిలేలా ఏడుస్తుంది. ఇక దీప బయట కార్తీక్ ఉంటే నర్స్‌ దగ్గర నుంచి కత్తెర తీసుకొని ఆవేశంగా కార్తీక్ దగ్గరకు వస్తుంది. కత్తెరను కార్తీక్ మెడ దగ్గర పెట్టి నువ్వా నా బిడ్డకు తండ్రి అని అడుతుంది. 

కార్తీక్: దీప ఏంటి ఈ ఆవేశం.
దీప: ఆవేశం కాదు. నువ్వు అన్నమాట సమ్మెటపోటులా నా తల మీద కొడుతుంటే నరాలు చిట్లి రక్తం కళ్ల నుంచి కారుతున్నంత పని అవుతుంది. 
కార్తీక్: దీప అది..
దీప: నువ్వు మాట్లాడకు బాబు నువ్వు మాట్లాడుతుంటే నా కోపం ఆపుకోవడం నా వల్ల కాదు కార్తీక్ బాబు. మీరు కత్తి తీసుకొని నా గొంతు కోసినా ఇంత బాధ పడేదాన్ని కాదు. చావుకి మించిన బాధ పెట్టారు. అసలు ఎవరు అయ్యా నువ్వు. నీకు నాకు ఏంటి సంబంధం. నా కూతురికి తండ్రిని అని ఎలా చెప్తావ్. చెప్పే ముందు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలీదా. స్ఫృహలోనే ఉండి మాట్లాడుతున్నారా. లేదా నోటికొచ్చినట్లు మాట్లాడొచ్చని అనుకుంటున్నారా. 
కార్తీక్: పాపని కాపాడటానికి..
దీప: తల్లిని నేను ఇంకా బతికే ఉన్నాను కదా. మీరు నా తండ్రిని చంపేశారు అని ఇన్నిరోజులు మిమల్ని ద్వేషించాను. నిజం తెలిసిన తర్వాత ఓ మంచి వ్యక్తిని అపార్థం చేసుకున్నాను అని బాధ పడ్డాను. కానీ మీరు నేను అనుకున్న దాని కంటే మంచోళ్లని ఇప్పుడే అర్థమైంది. ఒక నింద వేసినందుకు తాళి కట్టిన భర్తనే నేను క్షమించలేదు. అలాంటిది ఆ నిందని నిజం చేసిన మిమల్ని నేను ఏం చేయాలి. నాకు ఇప్పుడు కాళ్లూ చేతులు ఆడట్లేదు కార్తీక్ బాబు. పర్యావసానాలు ఆలోచించలేక మీరు అనేసిన మాటలు నా జీవితంలో నా కూతురు జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురానున్నాయో మీకు తెలుస్తుందా. మీరు అన్నది ఎవరి ముందు. నేను ఏ తప్పు చేయకపోయినా నాకు సంబంధం అంటగట్టి నాకు నరకం చూపిస్తున్న నా భర్త ముందు. ఇప్పుడు వాడు వెళ్లి మీ ఇంట్లో చెప్తే వాడు అడిగిన ప్రశ్నలకు మీరు, నేను సమాధానం చెప్పగలరా. నేను చెప్పగలనా. మీ అత్తయ్యకు తెలిస్తే ఏమనుకుంటుంది. మీ అమ్మానాన్న ఏమనుకుంటారు. ఇన్ని రోజులు ఎవరు ఎన్ని నిందలు వేసిన నా మంచితనం చూసి వాళ్లు ఇచ్చిన గౌరవం మర్యాద మీరు అన్న మాటతో పోయింది. మనం కాకుండా మన మాటలు ఇంకెవరో  విన్నారు అన్న అనుమానంతోనే సగం చచ్చిపోయాను. ఈ మాటలు నా బిడ్డ వింటే నా పరిస్థితి ఏంటి బాబు. నాన్న నాన్న అని కలవరించే నా బిడ్డ ఇదే నిజం అనుకుంటే. అది ఈ మాటలు విన్నదో లేదో తెలీడం లేదు. మిమల్ని ఏమైనా అంటే మా శ్రేయాభిలాషి అంటారు. ఇప్పటి వరకు మీరు చేసింది చాలు ఇక నా బిడ్డకు మీరు వద్దు మీ స్నేహం వద్దు దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి జీవితంలో ఎదురు పడకండి. నా కూతురు గురించి ఆలోచిస్తున్నా కానీ లేదంటే పై నుంచి దూకి చచ్చేదాన్ని. వెళ్లిపోండి బాబు...

కార్తీక్ దీప మాటలకు వెళ్లిపోతూ రిసెప్షన్‌లో బిల్ పే చేస్తాడు. మరోవైపు జ్యోత్స్న కార్తీక్ మాటలు తలచుకొని చాలా ఏడుస్తుంది.     

జ్యోత్స్న: నాకు నువ్వు తప్ప వేరే లోకం తెలీదు బావ. అలాంటిది నువ్వు శౌర్యని నీ కూతురు అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నా బావ అలాంటి వాడు కాదు. నా బావ ఏ తప్పు చేయడు. మరి ఏ తప్పు చేయనప్పుడు దీప భర్తతో శౌర్య తండ్రి అని ఎలా చెప్తాడు. చెప్పకూడదు కదా. చెప్పాడు అంటే అది నిజమేనా. దీపని సేవ్ చేయడానికి అలా చెప్పుంటాడా. భర్తతో దీపకు అంత ప్రాబ్లమ్ అయింటే పోలీస్ కంప్లైంట్ పెట్టొచ్చు. కానీ దీప కూతురికి తానే తండ్రి అని చెప్పడం మామూలు విషయం ఎలా అవుతుంది. బావ చెప్పిన దాంట్లో నిజం ఎంత. కానీ నేను ఏమైనా తప్పుగా విన్నానా. లేదు బావ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. అలా చెప్పాడు అంటే నేను ఏమని అర్థం చేసుకోవాలి. అబ్బా.. ఇప్పుడు నేను ఏం చేయాలి. ఈ విషయం ఎవరికి చెప్పాలి. 
అనసూయ: ఏంటే నువ్వు చెప్పేది వాడిని బిడ్డని ఎత్తుకురమ్మని చెప్పావా.
శోభ: అవును అత్తయ్య. ఈ సారి నేను తెగించాను. అదేం చేస్తుందో చేయని. అయినా నా భర్తకి పుట్టిన కూతురి మీద దాని అధికారం ఏంటి అత్తయ్య. అదిగో ఆయన వచ్చారు.  శౌర్య ఏదండి. మీ కూతురు ఎక్కడ.
నర్శింహ: అసలు నాకు కూతురు ఉంటే కదా తీసుకురావడానికి. తీసుకురావడానికి అది అసలు అది నా కూతురు కాదే. దాని తండ్రి చెప్పాడు. అది నాకు పుట్టిన కూతురు కాదు ఆ కార్తీక్‌కి పుట్టిన కూతురు. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే నా పెళ్లానికి ఆ కార్తీక్‌కి పుట్టిన అక్రమ సంబంధం.
అనసూయ: నర్శింహని లాగి పెట్టి ఒక్కటి కొట్టి.. దీప గురించి తప్పుగా మాట్లాడావు అంటే పళ్లు రాలతాయ్.
నర్శింహ: తప్పుగా మాట్లాడటానికి నేను తాగి వచ్చాను అనుకున్నావా. నువ్వు తిట్టినా కొట్టినా ఇదే నిజం. శౌర్య ఆ కార్తీక్‌ గాడి కూతురే.
అనసూయ: నోర్‌ముయ్‌రా.. నువ్వు వెధవ అయినా అది నికార్సు అయిన మనిషిరా.
నర్శింహ: ఆ మనిషి ముందే చెప్పాడు. శౌర్య తండ్రి నేనే అని. 
అనసూయ: అయితే దీప వాడి చెంప పగలగొట్టుంటుంది. 
నర్శింహ: అలా ఏం జరగలేదు. అది నిజం కాకపోతే అంత ధైర్యంగా ఎలా చెప్తాడే.
అనసూయ: బిడ్డను కాపాడుకోవడానికి. ఆ మాట అనబట్టే కదా నువ్వు దాన్ని వదిలేసి వచ్చింది. వాడు తెలివైనవాడురా అందుకే అలా చెప్పాడు. అది నా తమ్ముడి పెంపకంలో పెరిగిందిరా తప్పు చేయదు. కానీ నువ్వు దానికి చేసిన అన్యాయానికి దాని బతుకుకు ఓ తోడు కోసం వాడిని చూసుకుంది. అంతే కానీ నువ్వు నీ పెళ్లాన్ని మోసం చేసినట్లు అది మొగుడిని మోసం చేయదు. ఆ కార్తీక్ లాంటి వాళ్లు 10 మంది వచ్చి చెప్పినా నేను నమ్మను. అది నీ కూతురు. దీప దృష్టిలో గొప్పొడు అయిపోవడానికి వాడు మాట అనొచ్చు అంతే కానీ దీప నిప్పురా. తాళి కట్టిన భర్తతో కాకుండా ఇంకో మగాడితో బిడ్డను కన్నది అంటే దీప గురించి తెలిసిన ఏ ఆడది నమ్మదురా. అది నీ కూతురు. ఏం చేస్తే దీప నీ దారికి వచ్చి నీ బిడ్డను తీసుకెళ్లు అంటుందో అది ఆలోచించు.

దీప శౌర్య దగ్గర కూర్చొని ఏడుస్తుంది. తన మీద అంత నమ్మకం పెట్టుకున్న వాళ్లకి నర్శింహ వచ్చి కార్తీక్ అన్న మాట చెప్తే తన పరిస్థితి ఏంటా అని జ్యోత్స్నకి తెలిస్తే పరిస్థితి ఏంటా అని శౌర్యకి తెలిస్తే ఏం సమాధానం చెప్పాలో అని ఆలోచిస్తుంది. ఇక నర్సు రావడంతో తనకు చిన్న పని ఉందని చెప్పి పాపని చూసుకోమని అంటుంది. కార్తీక్ దీప మాటలు తలచు కొని బాధ పడతాడు. ఇదంతా తాను రౌడీ గురించే చేశాను అని ఈ రోజు తాను అవమానపడిన రేపు దాని భవిష్యత్ బాగుంటుందని అనుకుంటాడు. జ్యోత్స్న ఏడుస్తూ బయట కూర్చొని ఏడుస్తుంటుంది. ఇక దీప ఇంటికి వస్తుంది. జ్యోత్స్న చూసి దీప హాస్పిటల్‌లో ఉంటే అవుట్ హౌస్‌లో లైట్ వెలుగుతుందేంటి అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: గాయత్రీ దేవి పునర్జన్మ రహస్యం బయట పెట్టేసిన హాసిని.. తిలోత్తమను కాటేసిన పెద్దబొట్టమ్మ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Volunteer System: వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన
వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన
Warangal BRS leaders: వరంగల్‌ సభ నుంచి రేవంత్ కౌంట్‌డౌన్ స్టార్ట్- బీఆర్‌ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు
వరంగల్‌ సభ నుంచి రేవంత్ కౌంట్‌డౌన్ స్టార్ట్- బీఆర్‌ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు
Drone Pilot Training: ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత
Shoaib Akhtar Comments: పాకిస్థాన్‌లో ఆడాలా వద్దా అనే నిర్ణయం బీసీసీఐది కాదు బీజేపీ గవర్నమెంట్‌ది- అక్తర్ హాట్‌ కామెంట్స్ 
పాకిస్థాన్‌లో ఆడాలా వద్దా అనే నిర్ణయం బీసీసీఐది కాదు బీజేపీ గవర్నమెంట్‌ది- అక్తర్ హాట్‌ కామెంట్స్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మెగాస్టార్ కోసం..  కలిసిన మమ్ముట్టి-మోహన్ లాల్ టీమ్స్ఏఆర్ రెహమాన్ విడాకులు, 29 ఏళ్ల బంధానికి ముగింపుMarquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Volunteer System: వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన
వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన
Warangal BRS leaders: వరంగల్‌ సభ నుంచి రేవంత్ కౌంట్‌డౌన్ స్టార్ట్- బీఆర్‌ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు
వరంగల్‌ సభ నుంచి రేవంత్ కౌంట్‌డౌన్ స్టార్ట్- బీఆర్‌ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు
Drone Pilot Training: ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత
Shoaib Akhtar Comments: పాకిస్థాన్‌లో ఆడాలా వద్దా అనే నిర్ణయం బీసీసీఐది కాదు బీజేపీ గవర్నమెంట్‌ది- అక్తర్ హాట్‌ కామెంట్స్ 
పాకిస్థాన్‌లో ఆడాలా వద్దా అనే నిర్ణయం బీసీసీఐది కాదు బీజేపీ గవర్నమెంట్‌ది- అక్తర్ హాట్‌ కామెంట్స్ 
Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Gold Rate: బంగారం ధర ఆకాశాన్ని తాకబోతోంది - గ్లోబల్‌ కంపెనీ జోస్యం!
బంగారం ధర ఆకాశాన్ని తాకబోతోంది - గ్లోబల్‌ కంపెనీ జోస్యం!
Maharashtra Assembly Election 2024: మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Embed widget