Karthika Deepam 2 Serial Today February 3rd: కార్తీకదీపం 2 సీరియల్: కూతుర్ని కాపాడుకోలేక గుండె పగిలేలా ఏడుస్తున్న కార్తీక్, దీపలు.. కావేరి భరోసా.. డబ్బు కట్టింది ఎవరు?
Karthika Deepam Idi Nava Vasantham Today Episode దీప, కార్తీక్లు పాపని కాపాడలేకపోయాం అని పాపని తీసుకొని వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం కావేరి హాస్పిటల్కి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న పారిజాతంతో దీపకి ఇచ్చిన ఆఫర్ ఇచ్చానని చెప్తుంది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే పసిదాని ప్రాణాలతో చెలగాటం ఆడావని తెలిస్తే ఉంచరని అంటుంది. కార్తీక్ కోసం ఏమైనా చేస్తానని జ్యోత్స్న అంటుంది. తనకు బావ, ఆస్తి రెండు మాత్రమే కావాలని.. అంటుంది. దాంతో పారిజాతం జ్యోత్స్నని తిడుతుంది. నీ గొయ్యి నువ్వే తీసుకున్నావని అంటుంది. దీప పాప ప్రాణం కూడా పట్టించుకోకుండా భర్తే కావాలి అనుకుంది అంటే అది ఎంత స్ట్రాంగో చూడు అంటుంది. దానికి జ్యోత్స్న తనకి దీప నుంచి కచ్చితంగా ఫోన్ వస్తుందని అంటుంది.
దీప కూతుర్ని కాపాడటానికి ప్రపంచంలో ఈ జ్యోత్స్న తప్ప ఏ దేవతా రాదని అంటుంది. అప్పుడే డబ్బుతో హాస్పిటల్‌కి ఓ లేడీ ఎంట్రీ ఇస్తుంది. కార్తీక్ చాలా మందికి ఫోన్లు చేస్తూ అందరినీ చాలా బతిమాలుతాడు. పదేళ్లు పని కూడా చేస్తానని కోరుతాడు కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వరు. దాంతో కార్తీక్ దీపతో పేదరికం తల్లిదండ్రులకు కష్టమైనా పిల్లలకు శాపం అని ఏడుస్తాడు. శౌర్య గుండె పట్టుకొని ఏడుస్తుందని ఇంకా 60 నిమిషాలే ఉన్నాయి అని కార్తీక్‌ని రెండు చేతులు జోడించి నా బిడ్డని కాపాడమని వేడుకుంటుంది. ఏం చేయలేక కార్తీక్ కూడా ఏడుస్తాడు.
కార్తీక్: దీప నీకు ఇది ప్రసవ వేదన అయితే నాకు ఉరి శిక్షలా ఉంది. క్షణం క్షణం గడుస్తుంటే ఉరి కంబం ఎక్కుతున్నట్లు ఉంది. పెద్దలు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు కదా ఏ దీవెన అయినా ఫలించదా అని ఎదురు చూస్తున్నాను దీప. పిల్లల్ని కాపాడుకోలేని పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు దీప. నీ ముఖం చూడాలి అంటే భయంగా ఉంది దీప. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేను. నన్ను క్షమించు దీప.
దీప: అలా అనొద్దు బాబు మీరు ఏదో ఒకటి చేసి పాపని రక్షిస్తారని నేను నమ్ముతున్నాను.
కార్తీక్: నీ కన్నీటిని తుడిచే శక్తి ఆ దేవుడు నాకు ఇవ్వలేదు. మన ప్రేమే మన పాపని కాపాడుకోవాలని కోరుకుందాం. నేను ఒకసారి డాక్టర్‌ని కలిసి వస్తాను.
కావేరి: బాధలో ఉన్నప్పుడు ఓదార్చేవే నిజమైన బంధాలు దీప. శివన్నారాయణ గారు ఎందుకు ఇలా పాపని వదిలేశారో అర్థం కావడం లేదు. కనీసం కార్తీక్ కన్న తండ్రికి కూడా ముందుకు వచ్చి ఓదార్పు ఇవ్వడం లేదు. నాకు బంధాల విలువ తెలీదు దీప నిన్ను కార్తీక్‌ని చూసిన తర్వాత తెలిసింది. నా కూతురికి జీవితం ఇచ్చి దగ్గరుండి చూసుకున్నావ్. నాకు ఇప్పుడు ఇంకో వారసత్వం కావాలి దీప. నా మనవరాలి బాధ్యత నువ్వే తీసుకోవాలి. అంటే నా మనవరాలికి ఏం కాదు అనే భరోసా నువ్వే ఇవ్వాలి.
దీప: మీరు మాట్లాడుతున్నది స్వప్నకి పుట్టబోయే బిడ్డ గురించా.
కావేరి: ఏ నీ కూతురు నా మనవరాలు కాదా. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కార్తీక్ చెల్లి అనుకున్నప్పుడు .. ఒక తల్లికి పుట్టకపోయిన నా అల్లుడిని నువ్వు తమ్ముడు అనుకుంటున్నావ్. అలాంటిది నీ కూతురు నా మనవరాలు కదా. అయినా కార్తీక్ నా భర్త కొడుకు. అంటే నా కొడుకు. అక్రమ సంబంధాలు ఉన్నాయి కానీ అక్రమ సంతానాలు ఉన్నాయని ఒకసారి అక్క చెప్పింది నీ మనసులో అలాంటి ఆలోచనలు ఉన్నాయా.
దీప: లేదండి.. కాంచన గారిని పెళ్లి చేసుకున్నట్లే మిమల్ని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. మోస పోయింది మీరు కానీ అక్రమ సంబంధం కాదు.
కావేరి: అంటే నువ్వు నన్ను మా అక్కని చూసినట్లే చూస్తున్నావా.
దీప: అవునండీ.
కావేరి చాలా సంతోషపడుతుంది. నా మనవరాలికి ఏం కాదని నీకు నేను ఉన్నానని భరోసా ఇస్తుంది కావేరి. మరోసారి నా మనవరాలికి ఏం కాదు అని చెప్పి వెళ్లిపోతుంది కావేరి. దాంతో దీప తనతో తాను ధైర్యం ఇచ్చారు కానీ ధైర్యం చనిపోయిందని అనుకుంటుంది. ఇక దీప కార్తీక్ దగ్గరకు వెళ్లి మళ్లీ ఏడుస్తుంది. ఆపరేషన్ టైం అయిపోయింది పడండి బాబు వెళ్లిపోదాం. మనం కనిపించపోతే వదిలేసి వెళ్లిపోయాం అనుకుంటారని వాళ్లు వెళ్లిపోమని చెప్పే లోపు పాపని తీసుకొని వెళ్లిపోదాం అంటుంది. కార్తీక్ తన చాలా ఏడుస్తాడు. పాప ముఖం చూడలేనని ఏడుస్తాడు కార్తీక్. పాప అడిగితే ఏం చెప్పాలి అని కార్తీక్ అడిగితే ఇప్పటి వరకు అబద్ధాలే దానికి చెప్పాం కదా ఇకపై అవే చెప్దాం అని అంటుంది. నీ మాటలతో నన్ను చంపేయొద్దని కార్తీక్ ఏడుస్తాడు. కార్తీక్ దీప ఇద్దరూ పాప దగ్గరకు వెళ్లి చూస్తే పాప ఉండదు. డబ్బులు కట్టలేదని పాపని పంపేసినట్లున్నారని దీప అంటే కార్తీక్ కోపంగా డాక్టర్ల దగ్గరకు పరుగులు తీస్తాడు. కార్తీక్ నర్సుని పాప కోసం అడుగుతారు. నర్స్ వచ్చి శౌర్య వస్తువులు దీప చేతిలో పెడతారు. దీప వాటిని చూసి ఏడుస్తుంది. పాపకి ఏమైందని అంటే ఆపరేషన్ అవుతుందని చెప్తుంది. డబ్బు కట్టేశారని అనడంతో దీప, కార్తీక్ ఇద్దరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: తల్లిదండ్రుల్ని దారుణంగా అవమానించిన సంధ్య.. సంజయ్, బిగ్‌డాడీల కొత్త ఆట షురూ!





















