Karthika Deepam 2 Serial Today April 2nd: కార్తీకదీపం 2 సీరియల్: మనస్శాంతిగా ఉండాలి అంటే ఇల్లాలిని మార్చాలంట.. ఇదేం లాజిక్కూ..!
Karthika Deepam 2 Serial Today Episode రమ్య భర్తగా సత్తిపండు ఎంట్రీ ఇచ్చి డబ్బు ఇచ్చి దీప నాటకం ఆడించిందని చెప్పడంతో అందరూ దీపని తిట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప రమ్యని శివనారాయణ ఇంటికి తీసుకొచ్చి నిజం చెప్పమని అంటుంది. రమ్య తడబడుతుంది. నా కడుపులో బిడ్డకు తండ్రి.. నా కడుపులో బిడ్డకు తండ్రీ.. అని రమ్య నీళ్లు నములుతుంటే ఈ సత్తిపండు అని ఓ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. లోపలికి వచ్చి తాను రమ్య భర్త అని అందరికీ చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు.
సత్తిపండు: ఏంటి రమ్యా అలా చూస్తున్నావ్. నేనే నీ భర్తని నీ కడుపులో బిడ్డకు తండ్రి అని చెప్పు.
దీప: ఎవరు నువ్వు ఎందుకు అబద్ధం చెప్తున్నావ్.
సత్తిపండు: నేను అబద్ధం చెప్పడం కాదు నా భార్యతో మీరే అబద్ధం చెప్పిస్తున్నారు. గౌతమ్ లేడు గొట్టం లేడు డబ్బు ఇస్తే మేం ఎంతకైనా దిగజారుతాం అనుకున్నావా. అమ్మా డబ్బులిస్తే ఇలాంటివి చెప్పడానికి మా వీధిలో ఇంటికి ఒక్కరున్నారు.
దీప: రమ్య నువ్వు చెప్పు నీ కడుపులో బిడ్డకు భర్త గౌతమ్ కదా.
సుమిత్ర: ఈ అమ్మాయికి డబ్బులిచ్చి తీసుకొచ్చావా దీపా.
సత్తిపండు: మరి అంతే కదండీ.. ఈవిడ మా పేటకు వచ్చి నా పెళ్లాంతో పది వేలకు బేరం కుదుర్చుకుంది. అబద్ధం చెప్పడానికి ఇక్కడికి తీసుకొచ్చిందని మా చంటి గాడు విని చెప్పాడు.
దీప: రమ్య నీ భార్య అయితే దాని మెడలో తాళి ఏది.
సత్తిపండు: అబ్బబ్బా ఏం నాటకాలు ఆడుతున్నారండీ మీరు. ఈ నాటకం కోసం అది తాళి తీసి పెట్టింది.
రమ్య: మనసులో వీడు మా పేటలోనే పెద్ద రౌడీ నేను నిజం చెప్తే నన్ను మా అమ్మానాన్నల్ని చంపేస్తాడు. రమ్య సత్తిపండుతో వెళ్లిపోతుంది.
శివన్నారాయణ: బుద్ధుందా నీకు నువ్వు అసలు మనిషి వేనా.
దీప: తాతయ్యగారు.
శివన్నారాయణ: చంపేయ్ మమల్ని ఊపిరి తీసుకొనే అవకాశం కూడా లేకుండా గొంతు పిసికి చంపేయ్. నింద వేసి నిశ్చితార్థం ఆపేశావ్ ఇప్పుడు దాన్ని నిజం చేయడానికి ఓ నకిలీ మనిషిని తీసుకొచ్చావ్.
దీప: లేదు తాతయ్య గారు.
దశరథ్: నువ్వు చెప్పిందే నిజం అయితే ఆ సత్తిపండుని ఎందుకు భర్తగా ఒప్పుకుంటుంది.
సుమిత్ర: ఆ అబ్బాయి చెప్పిందే నిజం నువ్వు నిందని డబ్బుతో నిజం చేయాలి అనుకున్నావ్.
పారు: మన కుటుంబం మీద పగ పట్టినట్లుంది.
జ్యోత్స్న: ఇలాంటి నీచమైన ఆలోచనలు నీకు ఎందుకు వస్తున్నాయ్ దీప.
దీప: నేను రమ్య వాళ్ల అమ్మని తీసుకొస్తా.
శివనారాయణ: ఈ సారి ఎంతకు బేరం పెడతావ్. 50 వేలా. నీ భర్త బాగా సంపాదిస్తున్నాడు కదా ప్రతి పైసా నా పతనానికి వాడుతున్నావా. వెళ్తావా మెడ పట్టుకొని గెంటమంటావా.
జ్యోత్స్న: వద్దు తాత ఈవిడను గెంటితే ఈవిడ భర్త బాధ పడతాడు.
సుమిత్ర: దీప ముందు నువ్వు బయటకు పో. ఒకప్పుడు దీప అంటే నా కూతురు లాంటిది అనుకున్నా కానీ ఇప్పుడు దీప అంటే అసహ్యం వేస్తుంది. నువ్వు మాకు దూరంగా ఉండు దీప. నువ్వు నన్ను శారీరకంగా కాపాడి మానసికంగా చంపేశావ్. నువ్వు కాపాడిన ప్రాణం బతికే ఉంది కానీ మనసు చచ్చిపోయింది. మనిషి కూడా చచ్చిపోక ముందే వెళ్లిపో.
దీప ఏడుస్తూ వెళ్లిపోతుంది. జ్యోత్స్న సత్తిపండుకి కాల్ చేసి డబ్బు పంపిస్తుంది. రమ్య నోరు ఎత్తకుండా చూసుకోమని.. దీప కంట్లో పడొద్దని సత్తిపండుతో చెప్తుంది. దీపకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని మీ ఇంట్లో వాళ్లు కూడా నిన్న అసహ్యించుకునేలా చేస్తానని అనుకుంటుంది. దాసు లేచి దీపకి న్యాయం చేయడానికే తాను బతికానని అనుకుంటాడు. తనకు ఏదో అయిందని అది మర్చిపోయేలోపు జ్యోత్స్న అసలైన వారసురాలు కాదని రాసుకోవాలని రాస్తాడు. అన్నయ్యా, వదినలకు ఒక విషయం చెప్పాలి.. ఇంటి అసలైన వారసురాలికి అన్యాయం జరిగింది.. ఇంటి వారసురాలు.. అని రాసే టైంకి కాశీ, స్వప్నలు ఒకర్ని ఒకరు ఢీ కొట్టుకొని స్వప్న గ్లాస్ కింద పడేయడంతో దాసు మొత్తం మర్చిపోతాడు.
కాశీ హెటల్‌లో జరిగిన విషయాన్ని స్వప్నకి చెప్తాడు. కార్తీక్, కాంచనలు దీప కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో దీప ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్లావని కార్తీక్ అడిగితే దానికి సమాధానం దీప చెప్పదు నేను చెప్తా అని శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. కార్తీక్ తండ్రిని తిట్టి ఇళ్లు మారిపోదాం అమ్మ మనస్శాంతిగా ఉంటుందని అంటాడు. దానికి శ్రీధర్ మనస్శాంతి కావాలి అంటే ఇళ్లు మార్చడం కాదు ఇల్లాలిని మార్చాలి అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















