Karthika Deepam 2 Serial Today April 1st: కార్తీకదీపం 2 సీరియల్: దీప సాక్షిని జ్యోత్స్న కొనేసిందా.. రమ్య నిజం చెప్పకపోవడానికి కారణం ఏంటి?
Karthika Deepam 2 Serial Today Episode గౌతమ్ వల్ల గర్భవతి అయిన రమ్యని దీప శివనారాయణ ఇంటికి తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప రమ్య అడ్రస్ తీసుకొని వెళ్తుంటే శ్రీధర్ ఎదురు పడతాడు. వంటలక్క ఎవరి జీవితం అయినా నాశనం చేయాలా.. ఎవరి పచ్చని జీవితంలోనైనా పెట్రోల్ పోయాలా అని బయల్దేరుతున్నావా? అని అడుగుతాడు. నా జీవితం, నా కొడుకు, కూతురు, చివరకు నా మేనకోడలి జీవితం నాశనం చేసేశావని అంటాడు. దీప నింద నిరూపిస్తానని చెప్పడంతో శ్రీధర్ దీపని ఫాలో అవుతాడు.
దీప కనిపించడం లేదమ్మా..
శౌర్య కాంచనతో నానమ్మ మనం వేసవి సెలవులకు ఎక్కడైనా వెకేషన్‌కి వెళ్దామా అని అడుగుతుంది. కార్తీక్ ఇంటికి వచ్చి దీప గురించి అడిగితే మీ ఇద్దరూ కలిసే వెళ్లారు కదా అని కాంచన అంటుంది. శౌర్యని బయటకు పంపించి కాంచనతో దీప కనిపించడం లేదని కార్తీక్ చెప్తాడు. ఏమైందని కాంచన అడిగితే రెస్టారెంట్ దగ్గర పెద్ద గొడవ అయిందని మనవరాలు ఏడుస్తుందని అందుకే తాత వచ్చి తిట్టి వెళ్లిపోయాడని తర్వాత చూస్తే దీప లేదని చెప్తాడు. కాంచన దీప ఎక్కడికి వెళ్లిందని కంగారు పడుతుంది.
రమ్య అడ్రస్‌లో దీప..
దీప రమ్య అడ్రస్ తీసుకొని స్లమ్ ఏరియాకు వెళ్తుంది. అక్కడ రమ్య మార్కెట్‌కి వెళ్లి వస్తుంటే దీప చూసి రమ్యని పిలుస్తుంది. తనని గుర్తు పట్టావా అని అడిగి గౌతమ్ మంచోడు కాదు కదా వాడు నీలాగే మరో అమ్మాయి జీవితం నాశనం చేయడానికి రెడీ అయ్యాడని చెప్తుంది. వాడు చేసిన తప్పు గురించి అందరికీ తెలియాలి అని రమ్యని తనతో రమ్మని చెప్తుంది. రమ్య రాను అని గౌతమ్ చంపేస్తాడని భయపడుతుంది. దీప ధైర్యం చెప్పి రమ్యని రమ్మని చెప్తుంది. కూరగాయల సంచి పెట్టి వస్తానని రమ్య వెళ్తుంది. దీపని ఫాలో అయిన శ్రీధర్ ఈ అమ్మాయికి నిశ్చితార్థం ఆగడానికి కారణం ఉందని ఈ విషయం పారిజాతానికి చెప్పాలని అనుకుంటాడు.
జ్యోత్స్నకు విషయం చెప్పేసిన శ్రీధర్..
దీపకు మరో స్ట్రాంగ్ దెబ్బ తగలాలి అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇంతలో జ్యోత్స్న గదిలో ఉన్న పారు ఫోన్‌కి శ్రీధర్ కాల్ చేస్తాడు. జ్యోత్స్న కాల్ లిఫ్ట్ చేస్తుంది. దీప ఓ అమ్మాయిని కలిసి ఎక్కడికో తీసుకెళ్తుందని.. నేను తనని ఫాలో అవుతున్నానని చెప్తాడు. తనని చూస్తే గౌతమ్ మోసం చేసిన అమ్మాయిలా ఉందని చెప్తాడు. జ్యోత్స్న శ్రీధర్‌తో థ్యాంక్స్ మామయ్య అంటుంది. జ్యోత్స్న తనతో తాను నేను ప్రిపేర్‌గా ఉంటాను దీప ఈ సారి ఎదురు దెబ్బ నీకు సాలీడ్‌గా ఉంటుంది. నువ్వు ఏమైపోతావో కూడా నాకు తెలీదు.. నాకు గుడ్ టైం స్టార్ట్ అయిందని అనుకుంటుంది.
సాక్షితో శివనారాయణ ఇంటికి దీప..
దీప రమ్యని తీసుకొని శివనారాయణ ఇంటికి వస్తుంది. రావొద్దు అంటే మా ఇంటికి వచ్చావ్ ఎందుకు అని సుమిత్ర అడిగితే సాక్ష్యంతో వచ్చానని దీప చెప్తుంది. గౌతమ్ ఎలాంటి వాడో చెప్పడానికి ఈ అమ్మాయి వచ్చిందని అంటుంది. ఈ అమ్మాయి చెప్పింది మేం నమ్మాలా అని తాత గారు అడిగితే నమ్మాలి అని గౌతమ్ మోసం చేసింది తననే అని చెప్తుంది. తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి 3 నెలల గర్భవతిని చేశాడని దీప చెప్తే తాతగారు క్లాప్స్ కొట్టి బాగానే యాక్టింగ్ చేస్తున్నావ్ అంటుంది. దశరథ్ దీపని, రమ్యని చెప్పమని అంటాడు. రమ్య నోరు తెరిస్తే తాను క్రియేట్ చేసుకున్న సింపతీ పోతుందని ఎలా ఆపాలా అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది.
దీప నిజం చెప్పమని రమ్యతో చెప్తే పారు ఈ అమ్మాయి నిజం చెప్తుందని గ్యారెంటీ ఏంటి అని పారు అంటే తన గర్భమే సాక్ష్యం అని కావాలి అంటే టెస్ట్‌లు కూడా చేయించండి అని దీప అంటుంది. అలా చేస్తే కానీ వాళ్లు మమల్ని కోర్టుకు ఈడ్చరు అని శివనారాయణ అంటారు. ముందు ఈ అమ్మాయి మాటలు విందామని తర్వాత ఏం చేయాలో చూద్దామని తాతగారు అంటారు. రమ్యకి నిజం చెప్పమని దీప చెప్తుంది. రమ్య నిజం చెప్పకుండా చాలా కంగారు పడుతుంది. దీప రమ్యకి నిజం చెప్పమని అడుగుతుంది. నా బిడ్డకు తండ్రి.. నా కడుపులో బిడ్డకు తండ్రి.. అంటూ రమ్య నీళ్లు నములుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: ఉష, చిన్నిలకు డీఎన్‌ఏ టెస్ట్.. ఈసారి కావేరి దొరికిపోవడం ఖాయం.. చేతులెత్తేసిన రాజు!





















