Karthika Deepam 2 Serial Today July 22nd: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్యకి తండ్రిగానే ఉంటానన్న కార్తీక్, నడి రోడ్డు మీద తండ్రి బాగోతం చూసి కుప్పకూలిపోయాడుగా!
Karthika Deepam 2 Serial Today Episode తన తండ్రి రెండో కుటుంబం గురించి తెలుసుకున్న కార్తీక్ దీపకి ముందే ఆ మ్యాటర్ తెలుసని కుమిలిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Navasantham Serial Today Episode జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదు అని కార్తీక్ దీపకు చెప్తాడు. దాంతో దీప జ్యోత్స్ని పెళ్లి చేసుకోమని లేదంటే తన బిడ్డకు తండ్రి అని చెప్పిన మాట నిజం అవుతుందని కార్తీక్‌తో అంటుంది. జ్యోని పెళ్లి చేసుకోను అని చెప్పడానికి సరైన సమాధానం లేదని మీరు చేసే పనికి నేను కూడా సమాధానం లేని ప్రశ్నలా మిగిలిపోయేలా ఉన్నానని దీప అంటుంది.
దీప: అన్నింటికి ఒకటే సమాధానం మీ పెళ్లి. అందరి అనుమానాలకు ఒకటే సమాధానం మీ పెళ్లి. అందరి నిందలకు ఒకటే సమాధానం మీ పెళ్లి. చూపులతో అడిగే చాలా మంది అడిగే ప్రశ్నలకు నోరు తెరవకుండా ఇచ్చే సమాధానం మీ పెళ్లి. అప్పుడు శౌర్య తల్లి బతికి ఉంటుంది. ఎవరి నిందలకు బలి అవ్వాల్సిన పని ఉండదు. ఈ పెళ్లి జరగాలి కార్తీక్ బాబు.
కార్తీక్: ఈ పెళ్లి జరగదు దీప. నేను అన్న మాట పాప చెవిన పడి ఎక్కడ తాను బాధ పడుతుంది అనే కదా నీ భయం అవసరం అయితే నేను పాప కోసం జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటాను.
దీప: వద్దు కార్తీక్ బాబు మీ మాటల్ని మామూలుగా తీసుకోవడానికి కూడా గుండెకు చాలా కష్టంగా ఉంది. అనవసరంగా తొందర పడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. మీరు తీసుకున్న నిర్ణయం మీద చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. జ్యోత్స్నకి మీరు అంటే ప్రాణం మిమల్ని తప్ప వేరే ఎవర్ని పెళ్లి చేసుకోలేదు. ఈ పెళ్లి వద్దు అనడానికి మీ దగ్గర కారణాలు లేవు. కానీ ఈ పెళ్లి చేసుకోవడానికి జ్యోత్స్నకి వంద కారణాలు ఉన్నాయి. ఇది మీ రెండు కుటుంబాలు కొన్నేళ్లుగా కంటున్న కల. మేనల్లుడిని అల్లుడిగా చేసుకోవాలి అని మీ మామయ్య, మేనకోడలిని కోడలుగా చేసుకోవాలి అని మీ అమ్మగారు ఎంతగా తాపత్రయపడుతున్నారో నాకు తెలుసు బాబు. మీ అమ్మని సంతోషపెట్టడం కొడుకుగా మీ బాధ్యత. ఆవిడ సంతోషం ఈ పెళ్లే కార్తీక్ బాబు. ఈ పెళ్లి జరిగితే ఈ అపర్థాలు అన్ని తొలగిపోయి ఎవర్ని ఎవరు వేలెల్తి చూపించరు అని ఎందుకు ఆలోచించరు. మీరు మరోసారి తప్పు చేయరని నాకు నమ్మకం ఉంది. మీరు తీసుకున్న నిర్ణయం మీద చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కార్తీక్ మౌనంగా వెళ్లిపోతాడు.
పారిజాతం: మనం దీపని తీసుకొని వచ్చుంటే ఒకలా ఉండేది. కానీ దీప తనంతట తానే వచ్చింది అంటే దీని వెనక మనం ఊహించని అంత దూరమైన ఆలోచన మీ బావ మనసులో ఉంటే. హాస్పిటల్‌లో దీప మొగుడితో ఏదైతే తడుముకోకుండా చెప్పాడో ఇప్పుడు అందరి ముందు మరోసారి దాన్ని ఇలా చెప్తే.
జ్యోత్స్న: గ్రానీ.. వాళ్లిద్దరి మధ్య ఏదో ఉంది అని చెప్పేది నువ్వే. ఏం లేదు అని చెప్పేది నువ్వే. శత్రువుని కళ్ల ముందే పెట్టుకోవాలి అన్నావ్. తీరా వస్తే దీని వెనక ఏదో ఉంది అంటున్నావ్. ఓ వైపు నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టారు. నేను పెళ్లి కూతుర్నో పేరంటానికి వచ్చిన చుట్టాన్నో నాకు అర్థం కావడం లేదు. బావ చెప్పింది నిజమే అయిండొచ్చు. దాన్ని అందరి ముందు చెప్పడానికి దీపని తీసుకురావొచ్చు. కానీ బావకి ఎంగేజ్మ్ంట్ జరిగేది నాతోనే. ఇప్పుడు ఆట నేను మొదలు పెడతాను. దీప ఏం చేసినా బావ ఇలాంటి నిజాలు ఇంకో వంద చెప్పినా బావే నా మొగుడు.
జ్యోత్స్న, పారిజాతంల మాటలు శివనారాయణ వింటాడు. జ్యోత్స్న బుద్ధి పాడు చేస్తున్నావ్ అని గట్టిగా తిడతాడు. జ్యోత్స్నని నానమ్మకు దూరంగా ఉండమని చెప్తాడు. జ్యోత్స్న పారుని తాత మాటలు పట్టించుకోవద్దని చెప్పి దీప రావడానికి స్ట్రాంగ్ రీజన్ ఏంటో తెలుసుకోవాలి అంటుంది. మరోవైపు కార్తీక్ కారులో వెళ్తూ దీప మాటలు గురించి ఆలోచిస్తాడు. తాను పెళ్లి చేసుకుంటే జ్యో కూడా ఇబ్బంది పడుతుందని అనుకుంటాడు. ఇక తన తండ్రి ప్రేమ గొప్పదని పొగుడుతాడు. ఇంతలోనే తండ్రిని కావేరితో చూస్తాడు. స్వప్న వాళ్ల అమ్మతో తన తండ్రికి పనేంటని అనుకుంటాడు. ఇంతలో స్వప్న కూడా వాళ్ల దగ్గరకు వస్తుంది. స్వప్న తండ్రి తన తండ్రి ఒక్కరేనా అని కార్తీక్ షాక్ అయిపోతాడు. తండ్రి గురించి అప్పటి వరకు గొప్పగా పొగిడిన కార్తీక్ తలబాదుకొని ఏడ్చే అంత పని చేస్తాడు.
కార్తీక్ ఓ చోట ఆగి అర్జెంటుగా కలవాలి అని స్వప్నని పిలుస్తాడు. స్వప్న వచ్చి మీరు పిలిచారు కాబట్టి వచ్చాను అదే వేరే ఎవరైనా పిలిస్తే వచ్చేదాన్ని కాదు బాస్ అని కార్తీక్‌తో అంటుంది. తన తండ్రి మామూలుగానే దొరకని లేక లేక కలిస్తే నువ్వు పిలిచావ్ అని నీ కోసం వచ్చేశానని స్వప్న అంటుంది. ఇక జాబ్ ఉంది అని కార్తీక్ స్వప్నతో చెప్తాడు. ఇక స్వప్నకి తన ఫ్యామిలీ ఫొటో అడుగుతాడు. స్వప్న ఫొటో చూపిస్తుంది. ఇక కార్తీక్ షాక్ అయిపోతుంది. ఇక కార్తీక్ తన తండ్రి క్యాంపుల పేరుతో తనని తన తల్లిని మోసం చేసి మీ ఇంటికి వచ్చేవాడు అన్నమాట అని అనుకుంటాడు. ఇక స్వప్న కూడా కార్తీక్‌ని ఫ్యామిలీ ఫొటో అడుగుతుంది. దానికి కార్తీక్ తర్వాత డైరెక్ట్‌గా చూపిస్తాను అని అంటాడు. ఇక స్వప్న తన తండ్రి గతంలో ఉన్న ఆవిడ గురించి దీప అడగొద్దని చెప్పిందని హెటల్‌లో మీ నాన్న వచ్చే వరకు ఉంటే తనని తన తల్లిని వెళ్లిపోమని చెప్పిందని ఇక జీవితంలో దీపని కలవను అని స్వప్న అంటుంది. కార్తీక్ దీప మాటల్ని గుర్తు చేసుకుంటాడు. స్వప్న తాను అన్నాచెల్లెలని దీపకి ముందే తెలుసని అందుకే స్వప్న బాధ్యత తనకి అప్పగించిందని అనుకుంటాడు. కార్తీక్ స్వప్నని వెళ్లిపోమని చెప్పి తాను వెళ్లిపోతాడు. కార్తీక్ సీరియస్‌గా ఉన్నాడు ఏదో అయిందని స్వప్న అనుకుంటుంది. ఇక కార్తీక్ ఎంత మోసం చేశావు నాన్న అని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.