Kalavari Kodalu Kanaka Mahalakshmi September 19th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: దేవుడి గదిలో కనకం మీద విరుచుకుపడ్డ పద్మాక్షి.. విహారి ఫొటో పట్టుకొని కనకం ఎమోషనల్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకం ఇంట్లో దీపం వెలిగించడం అది చూసిన పద్మాక్షి కనకంతో పాటు యమున మీద కూడా సీరియస్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకం కిచెన్‌లో పాత్రలు తుడుస్తూ తన తండ్రి కేంద్ర మంత్రి దగ్గర నుంచి అవార్డు తీసుకుంటానని ఆ టైంలో వీడియో కాల్ చేయమని సంతోష పడిన విషయం గుర్తు చేసుకొని బాధపడుతుంది. ఒకప్పుడు మీ సంతోషంలో పక్కనే ఉండే నేను ఇప్పుడు ఇంత గొప్ప విషయంలో ఇంత సంతోషంలో మీ పక్కన ఉండే అవకాశం లేని దురదృష్టవంతురాలినని ఫీలవుతుంది.
ఇక కనక మహాలక్ష్మీ ఇంట్లో నడుచుకుంటూ వెళ్తూ ఓ మూలన విహారి ఫొటో పడి ఉండటం చూసి అది తీసి దుమ్ము పట్టిన ఫొటో పట్టుకొని తుడుస్తుంది. అందినంత దూరంలో ఉన్నా మీకు కనిపించకుండా తిరుగుతున్నాను. ఈ జన్మకి మీ రూపాన్ని నా మనసులో మీరు కట్టిన తాళిని నా గుండెల్లో దాచుకొని బతకడం తప్పు నాకు వేరే దారి లేదని కనకం ఏడుస్తుంది. ఇంతలో వసుధ రావడంతో ఫొటో దాచేస్తుంది.
వసుధ: లక్ష్మీ ఈ రోజు నేను దేవుడి గదికి వెళ్లను బారెడు పొద్దెక్కింది. వెళ్లి దేవుడికి దీపం పెట్టవా.
లక్ష్మీ: సరే అమ్మ. అమ్మ ఒక్కమాట మీ బంగారు గాజులు నేను తీయలేదమ్మా.
వసుధ: నువ్వు తీసుండకపోతే సంతోషమే. తీయడం నిజం అయితే ఆ పై వాడే చూసుకుంటాడులే లక్ష్మీ. ముందు వెళ్లి దీపం పెట్టు.
లక్ష్మీ: విహారి గారు ఎక్కడున్నారో ఏంటో ఆయన కంట మాత్రం నేను కనపడకుండా చూడు తండ్రీ. కనక మహాలక్ష్మీ దేవుడి గదికి వెళ్లి దీపం పెడుతుంది. అటుగా వచ్చిన పద్మాక్షి అది చూసి కోపంగా వస్తుంది.
పద్మాక్షి: ఏయ్ లక్ష్మీ అని లాగేస్తుంది. ఈ ఇంట్లో వాళ్లు చచ్చారు అనుకున్నావా లేకపోతే ఈ ఇంటికి నువ్వే యజమానురాలు అనుకున్నావా. ఏమనుకొని మా దేవుడి గదిలో దీపం పెడుతున్నావ్. (అందరూ వస్తారు) నవ్వు ఎవరో ఏంటో తెలీదు. నన్ను లోపలికి రానివ్వడమే మేం చేసిన తప్పు. అలాంటిది మా ఇంటి దేవుడి దగ్గర అడుగుపెడతావా. మా ఇంటి దేవుడికి నువ్వు దీపం పెడతావా. అసలు ఎంత ధైర్యం నీకు.
పెద్దాయన: దీపమే కదా పెట్టింది ఏదో దారుణం చేసినట్లు అలా మాట్లాడుతావ్.
పద్మాక్షి: దారుణం కాక మరేంటి నాన్న. లక్ష్మీ నువ్వు నీ హద్దులు తెలుసుకొని మసులుకుంటే మంచిది.
లక్ష్మీ: మనసులో ఈ కేకలు విని ఆయన ఇటు వస్తారో ఏంటో.
పద్మాక్షి: యమునతో.. అమ్మా మహాతల్లి నువ్వు చేసిన దరిద్రాలు నీ వల్ల ఈ ఇంటికి వచ్చిన తలనొప్పులు చాలు. ఇలాంటి వాళ్లందరినీ తీసుకొచ్చి ఇంట్లో మనస్శాంతి ఎందుకు చెడగొడుతున్నావో నాకు తెలీదు.
యమున: తను దీపం పెట్టినంత మాత్రానా దరిద్రాలు అంటుకుంటాయా వదిన.
పద్మాక్షి: అంటుకుంటాయ్ ముమ్మాటికీ అంటుకుంటాయ్. ఈ ఇంట్లో దీపం పెట్టాలి అంటే ఓ అర్హత ఉండాలి. ఆచేయి అదృష్టం చేసుకోవాలి. అసలు ఏ అర్హత ఉందని తను దీపం పెడుతుంది.
సహస్ర: చూడు లక్ష్మీ నువ్వు మా తాతయ్యని కాపాడావు అన్న కృతజ్ఞతతో నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాం. లేదంటే మా పిన్ని గాజులు దొంగతనం చేసినందుకు నిన్ను ఎప్పుడో పంపేసేవాళ్లం.
వసుధ: సహస్ర ఇంక ఆపుతావా దేవుడి గదిలో నేను దీపం వెలిగించమన్నా దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు.
పద్మాక్షి: వసుధ ముందు నీకు బుద్ధి లేదా. ఇదిగో లక్ష్మీ వసుధ ఏదో మతి లేక అలా చెప్పింది నీకు బుద్ధి లేదా.
లక్ష్మీ: తప్పు అయిపోయింది అండీ ఇంకోసారి ఇలా చేయను.
అంబిక: ఆగు లక్ష్మీ. ఈవిడ గారు నిన్న రాత్రి బ్యాగ్ తీసుకొని ఎక్కడికో వెళ్లిపోయారు. విహారి, వాళ్ల అమ్మా వెళ్లి కాళ్లు పట్టుకొని తీసుకొచ్చారు.
కాదాంబరి: యమున ఏంటి ఇది అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమైందా. పోయిన దాన్ని మళ్లీ కాళ్లు పట్టుకొని ఇంటికి తీసుకురావడం ఏంటి. ఏయ్ లక్ష్మీ పోయేదానివి పోకుండా ఎందుకు మళ్లీ వచ్చావ్.
పెద్దాయన: ఏయ్ కాదాంబరి ఆగుతావా. తను ఆత్మాభిమానం కలది కాబట్టి వెళ్లిపోవాలి అనుకుంది.
యమున: లక్ష్మీకి ఎవరూ లేరు ఉన్న వాళ్లు కూడా తనని సరిగా చూసుకోవడం లేదు. దయచేసి కొన్నాళ్లు తనని ఇక్కడ ఉండనివ్వండి.
పెద్దాయన: యమున ఎవరు ఎన్ని చెప్పినా లక్ష్మీని నేను నమ్ముతాను. నాకు పునర్జనమ్మ ఇచ్చిన అమ్మాయి కష్టాల్లో ఉంటే నేను ఎందుకు వదిలేస్తాను అమ్మా లక్ష్మీ లోపలికి వెళ్లు.
అందరూ వెళ్లిపోతారు. సహస్ర దేవుడి దగ్గరకు వెళ్లి లక్ష్మీ పెట్టిన దీపం ఆపేసి తాను వెలిగిస్తుంది. మరోవైపు ఆదికేశవ్, గౌరిలు కేంద్ర మంత్రి ఇంటికి చేరుకుంటారు. మీడియా మొత్తం ఆయన్ను చుట్టు ముట్టి అవార్డు తీసుకుంటున్నారు కదా మీ ఫీలింగ్ ఏంటి అని అడుగుతారు. ఇక కనకం తల్లిదండ్రులు లోపలికి వెళ్తారు. ఆదికేశవ్ కనకానికి వీడియో కాల్ చేయమంటాడు. గౌరీ చేస్తుంది. కనకం లిఫ్ట్ చేయకపోతే విహారికి చేస్తారు. విహారి కూడా కాల్ లిఫ్ట్ చేయడు. ఇంతలో మినిస్టర్ వచ్చి ఆదికేశవ్‌కి సన్మానించి అవార్డు ఇస్తారు. ఇక మినిస్టర్‌తో తన కూతురికి అమెరికా సంబంధం చేశానని అంటాడు. మినిస్టర్ చాలా సంతోషంతో ఆదికేశవ్‌తో మాట్లాడుతాడు. ఆదికేశవ్ మాత్రం తన కూతురు లేదని చాలా ఫీలవుతాడు. గౌరి ఓదార్చుతుంది. ఇంతలో కనకం ఫోన్ చేస్తే ఆదికేశవ్ తన సంతోషం కనకంతో పంచుకుంటాడు. కనకం మాత్రం తల్లిదండ్రులను మోసం చేస్తున్నాను అని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.